గౌరవనీయులు శ్రీ KTR గారు NHM ఉద్యోగుల సమస్యలపై స్పందించి, వారి సమస్యను ప్రస్తావించినందుకు ధన్యవాదాలు. 🙏
తెలంగాణ NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్ ఒక్కటే — ఉద్యోగ భద్రత, న్యాయమైన వేతనాలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్!
#NHMStrike#KTR #Telangana
రక్తాన్ని ఇస్తున్నాం… ప్రాణాలను నిలుపుతున్నాం!
ప్రజల ప్రాణాలు కాపాడుతూ… మా హక్కుల కోసం పోరాడుతున్నాం!
NHM ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ కల్పించండి
#nhmstrike#nhmregularisation#Telangana
సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ఆరోగ్య ప్రదాతలు సంతోషంగా ఉండాలి. 13 రోజులుగా రోడ్డెక్కి సమ్మె చేస్తున్న వేలాది మంది NHM కాంట్రాక్ట్ సిబ్బంది కన్నీళ్లు ప్రభుత్వానికి మంచివి కావు. ఇతర రాష్ట్రాల మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి మానవీయ దృక్పథంతో వీరి డిమాండ్లను పరిష్కరించాలి.@NHMJACTelangana@TelanganaCMO@TelanganaHealth@DamodarCilarapu@revanth_anumula
🚨 తెల్లకోటు వెనుక నల్లటి బతుకులు: తెలంగాణ NHM ఉద్యోగుల ఆక్రందన! 🚨
కోవిడ్ లో ప్రాణాలకు తెగించి పోరాడిన తెలంగాణ NHM కాంట్రాక్ట్ ఉద్యోగులు నేడు రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నారు. కారణం.. 20 ఏళ్లుగా మారని దయనీయమైన బతుకులు!
📊 దేశవ్యాప్తంగా మారుతున్న గాలి:
ఒడిశా, రాజస్థాన్, పంజాబ్, ఏపీ, మధ్యప్రదేశ్ సహా 14 రాష్ట్రాలు NHM సిబ్బందికి ఆసరాగా నిలిచాయి. రెగ్యులరైజేషన్, 60 ఏళ్ల ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం (MTS), హెల్త్ కార్డులు, చనిపోతే ఎక్స్-గ్రేషియా ఇస్తూ ఆదర్శంగా నిలిచాయి.
💔 తెలంగాణలో వాస్తవ పరిస్థితి:
కేంద్రం నిధులు (60:40) దేశమంతా ఒకటే. కానీ తెలంగాణలో మాత్రం వివక్ష!
❌ ఇంకా "11 నెలల కాంట్రాక్ట్" (ఉద్యోగ భద్రత శూన్యం)
❌ సమాన పనికి సమాన వేతనం లేదు (DA, HRA లేవు)
❌ జబ్బు చేస్తే కనీస హెల్త్ కార్డులు (EHS) లేవు
❌ విధి నిర్వహణలో ప్రాణం పోతే పరిహారం/కారుణ్య నియామకం లేదు
❌ రిటైర్ అయితే చిల్లిగవ్వ పెన్షన్ రాదు!
ఇతర రాష్ట్రాల్లో సాధ్యమైనది.. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకు సాధ్యం కాదు?
✊ మా డిమాండ్:
ప్రభుత్వం తక్షణమే ఏపీ, రాజస్థాన్ మోడల్స్ అధ్యయనం చేయాలి. NHM ఉద్యోగులకు 'సమాన పనికి సమాన వేతనం', 60 ఏళ్ల ఉద్యోగ భద్రత కల్పించాలి. క్రమబద్ధీకరణ (Regularization) చేయాలి! ప్రజల ప్రాణాలు కాపాడే ఆరోగ్య ప్రదాతలకు కన్నీళ్లు మిగల్చొద్దు!
తక్షణమే న్యాయం చేయాలి!
#NHMStrike #RegularizeNHM #TelanganaHealth #JusticeForNHM_TS #Telangana #RevanthReddy #DamodarRajaNarasimha
@NHMJACTelangana@TelanganaCMO@revanth_anumula@TelanganaHealth@battivikramarka
గౌరవనీయులైన ప్రభుత్వ పెద్దలకు,
ప్రజారోగ్య సేవలో నిరంతరం పనిచేస్తున్న NHM ఉద్యోగుల సేవలను గుర్తించి, మా దీర్ఘకాలిక సమస్యకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
Service మాది… స్వేదం మాది…
రెగ్యులరైజేషన్ హక్కు కూడా మాదే!
మా సేవకు గుర్తింపు కావాలి…
మా కుటుంబాలకు భద్రత కావాలి
ప్రజల ప్రాణాలను కాపాడే చేతులు… నేడు తమ హక్కుల కోసం పోరాడుతున్నాయి!
సికింద్రాబాద్ హరిహర కళాభవన్ వద్ద 12వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం తెలిపాను.
ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతనం, న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలి!
ప్రజారోగ్య సేవకుల శ్రమకు గౌరవం… వారి హక్కులకు న్యాయం… వారి భవిష్యత్తుకు భరోసా కావాలి!
#DrGSR #NHMEmployees #NHMStrike #Pawanakalyan #JanaSenaTelangana
ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి @JSPTelangana పార్టీ పూర్తిస్థాయి మద్దతునిస్తోంది.
NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై @TelanganaCMO తక్షణమే స్పందించి, వారి సమస్యలను పరిష్కరించే వరకు జనసేన పోరాటం ఆగదు.
అవసరమైతే జనసేన నిరంతర ఉద్యమంతో ఉద్యోగులకు అండగా నిలుస్తుంది.
#PawanKalyan #JanasenaTelangana #DrGSR #NHMEmployees #NHMStrike
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే చేతులకు… ఉద్యోగ భద్రత కల్పించలేమా? ✊
హనుమకొండలో నిరవధిక సమ్మె చేస్తున్న NHM కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కలిసి, వారి సమస్యలను తెలుసుకుని, న్యాయమైన డిమాండ్లకు సంఘీభావం ప్రకటించాను.
ఉద్యోగాల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా, ప్రసూతి సెలవులు వంటి డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, న్యాయమైన పరిష్కారం చూపాలి.
ప్రజారోగ్యానికి వెన్నెముకగా నిలిచే NHM ఉద్యోగులకు భరోసా ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత!
వారి సేవలకు గుర్తింపు కావాలి… వారి శ్రమకు న్యాయం జరగాలి! ✊
#DrGSR #NHMEmployees #NHMStrike #PawanKalyan #JanaSenaTelangana