✅️ కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాం కేంద్రాన్ని సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిశీలించారు.
✅️ ఈ సందర్భంగా గోదాంలో నిర్వహిస్తున్న అన్ని రిజిస్టర్లను తనిఖీ చేసి, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. గోదాం భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదని సూచించిన కలెక్టర్, పోలీసు సిబ్బంది నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ చేపట్టి మెరుగైన భద్రతా చర్యలు అమలు చేయాలని ఆదేశించారు.
✅️ ఈ తనిఖీలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, అధికారులు సర్ఫరాజ్, రాజశ్రీ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్రవణ్, మజార్, హైదర్, మహేష్ రెడ్డి, రమేష్, సుశీల్ కుమార్, నరేష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
@ECISVEEP@SpokespersonECI@CEO_Telangana@TelanganaCS@bhaveshmishra01@IPRTelangana@CPRO_TGCM@airnewsalerts@DDNewslive@PIB_India@PIBHindi@PTI_News@MIB_India@ddyadagirinews@ANI@PIBHyderabad
✅️ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్–2026) కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి. సుధర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
✅️ శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎస్ఐఆర్–2026 పురోగతిపై సమీక్షించారు.
✅️ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్నకళ్యాణి, ఏఈఆర్వోలు (అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు), ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
@ECISVEEP@SpokespersonECI@CEO_Telangana@TelanganaCS@bhaveshmishra01@IPRTelangana@CPRO_TGCM@airnewsalerts@DDNewslive@PIB_India@PIBHindi@PTI_News@MIB_India@ddyadagirinews@ANI@PIBHyderabad