సాధారణంగా ఇతరులు మన పట్ల ప్రవర్తించే తీరు మారాలని మనం కోరుకుంటూ ఉంటాము, కానీ మనుషులు ఎవరి కర్మకి అణుగుణంగా వారు ప్రవర్తిస్తూ ఉంటారు, దాని ఫలితం కూడా అలాగే పొందుతూ ఉంటారు. మనం వారిని ఎదుర్కోగలిగే సామర్థ్యాన్ని ప్రసాదించమని మాత్రమే కోరుకోవాలి మరియు దానికి తగినంత సాధన చేయాలి.
History will be kinder to me” he said.
అక్కడ వినిపించిన నవ్వులతో నా గొంతు కూడా కలిపా అప్పుడు .. I have no qualms in accepting that i was foolish/ignorant then(ఒక యేడు కె అది అర్ధం అయ్యింది). That great man was right . Thank you for your services sir.🙏🏽🙏🏽 A true patriot. #సద్గతి
జీవితం లో వందలాది పాడ్‌కాస్ట్‌లు చూస్తుంటాం, లెక్కలేనన్ని పుస్తకాలు చదువుతుంటాం, ఫోన్ లో కొన్ని వందల కొటేషన్స్ సేవ్ చేస్కుంటాం, కానీ ఒక్క నిరాశ ఎదురైతే చాలు, ప్రపంచమంతా కుప్ప కూలిన భావన కలుగుతుంది. అప్పటి వరకు విన్న మాటలు, చదివిన రాతలు ఏమైపోతాయో…. బహుశా అదేనేమో, తెలుసుకోవడానికి, ఉండటానికి మధ్య ఉన్న దూరం. జ్ఞానానికి అనుగుణంగా జీవించగలిగేంతవరకు మనం అన్నీ తెలుసుకున్న అన్వేషకులం మాత్రమే.