అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2.
అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి... 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం జూన్ 2.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన పర్వదినం జూన్ 2.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పడిన చారిత్రక సందర్భం జూన్ 2.
కేసీఆర్ దళం 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో కానీ, తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి హోరులో కానీ తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసింది.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో, ప్రజల గొంతుకుగా నిలవడంలో కేసీఆర్ దళం ఇప్పుడు పనిచేస్తుంది.. మున్ముందూ పనిచేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ..
ప్రజలకు సేవ చేయడానికి మరొక్కసారి పునరంకితమవుదామని కేసీఆర్ దళమంతా ప్రతినబూనుదాం..
విద్రోహ శక్తుల నుండి
మన తెలంగాణను కాపాడుకుందాం.
తెలంగాణ అమరవీరులకు జోహార్లు 💐
జై కేసీఆర్ ✊
జై తెలంగాణ ✊
సింగరేణిలో బొగ్గు దోపిడీ చేసి రూ. 1600 కోట్ల గోల్మాల్ చేశారు.
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇంత పెద్ద కుంభకోణం జరుగుతున్నా స్పందించడం లేదు.
మాకు జైలు కొత్త కాదు, కేసులు కొత్త కాదు..
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, అన్యాయాలను సింగరేణి కార్మికుల తరఫున నిలదీస్తాం.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ పాటు, పార్టీ నాయకులపై కాంగ్రెస్ గుండాల రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా..
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీని BRS కైవసం చేసుకున్నా, కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకొని వాయిదా వేయడం దుర్మార్గమైన చర్య.
కొందరు పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా మారి, అన్యాయాన్ని ప్రశ్నించిన BRS నాయకులపైనే లాఠీచార్జీకి దిగడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే.
న్యాయం కోసం నిరసనకు దిగిన ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పైనే కేసులు బనాయిస్తామని బెదిరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించం.
అటు జనగామలోనూ మున్సిపల్ ఛైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ చేయి ఎత్తిన దళిత మహిళా కౌన్సిలర్ పట్ల కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించడం చాలా దారుణం.
పంచాయతీ ఎన్నికల నాటి నుంచి మున్సిపల్ ఎలక్షన్స్ దాకా ముఖ్యమంత్రి రేవంత్ డైరెక్షన్ లో అడుగడుగునా అరాచక పర్వాన్ని సాగిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.
జై తెలంగాణ
Thank you, Telangana, for reposing your unwavering faith in KCR garu Ji by turning out in unprecedented numbers
The #BRSat25 meeting, one of the largest political gatherings in the country's history, was meticulously planned and flawlessly executed
The sheer strength of the @BRSparty was on full display at the meeting, even as lakhs of people couldn't reach the venue due to traffic mismanagement by the state police
Heartfelt thanks to the people of Telangana, the organisers, BRS leaders, cadre, and social media warriors for making the event a truly historic and resounding success. Thanks to the media fraternity for the wonderful coverage
The BRS Party's Silver Jubilee meeting reaffirmed that the party is all set to make a roaring comeback in Telangana
#JaiTelangana
#BRS25
#BRS25Years
క్యాతనపల్లిలో కాంగ్రెస్ అప్రజాస్వామిక, అహంకార చర్యలను అడ్డుకున్నందుకు మాజీ శాసనసభ్యులు, దళిత నాయకుడు బాల్క సుమన్ ను అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
క్యాతన్ పల్లిలో @BRSparty కి పూర్తి మెజారిటీ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని పరిహసించిన తీరు చూసి యావత్ తెలంగాణ అసహ్యించుకుంటున్నది.
అధికార బలం, పోలీసు బలం, ధన బలంతో చట్టాలను తుంగలో తొక్కడం కాంగ్రెస్ అరాచక వైఖరికి పరాకాష్ట.
రాష్ట్రమంతా కాంగ్రెస్ మార్కు గూండాగిరి రాజ్యమేలుతున్నది. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ మురుగు రాజకీయాల వాసన కమ్ముకున్నది.
హంగ్ వచ్చిన చోటల్లా ప్రతిపక్ష నాయకులను సంత భేరం చేస్తూ, కిడ్నాపులకు తెగబడుతూ ప్రజా తీర్పును కాలరాస్తున్న తీరుకు నిదర్శనాలు ఎన్నో.
జనగాంలో దళిత మహిళా కౌన్సిలర్ బీఆర్ఎస్ కు మద్దతుగా చెయ్యి ఎత్తితే రిటర్నింగ్ ఆఫీసర్ సాక్షిగా కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని సమాజం కళ్లారా చూసింది.
తమ కళ్ళెదుట ఒక దళిత మహిళా నాయకురాలిపై కాంగ్రెస్ నాయకులు దాడికి తెగబడితే అధికారులు, పోలీసులు కళ్లప్పగించి చోద్యం చూశారే తప్ప అడ్డుకోలేదు.
రక్షణ కల్పించక పోగా నిస్సిగ్గుగా కాంగ్రెస్ గూండాలకు కొమ్ముకాయడం కాంగ్రెస్ పాలనలో ప్రజస్వామ్య వ్యవస్థలు పతనమైపోతున్న తీరుకు నిదర్శనం.
ఒక్క క్యాతనపల్లే కాదు తొర్రూరు, జనగాం, ఇబ్రహీంపట్నం, జహీరాబాద్ సహా హంగ్ వచ్చిన ప్రతి చోటా ప్రజా తీర్పును గౌరవించకుండా చైర్మన్ పీఠాలను అడ్డదారుల్లో దక్కించుకుంటున్నారు.
రాష్ట్రంలో భూములను కబ్జా చేసినట్లే, రాజకీయ పీఠాలను కూడా కబ్జా చేస్తున్నారు.
బాల్క సుమన్ ను భేషరతుగా విడుదల చేయాలని, ప్రజాస్వామిక వాతావరణంలో క్యాతన్ పల్లి చైర్మన్ ఎన్నిక జరిగేలా బాధ్యత వహించాలని ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేస్తున్నాం.
#CongressFailedTelangana
పోరాటల గడ్డపై ఉద్భవించిన వీర పుత్రుడు ✊
స్వరాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు 💪
జన హృదయనేత..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ జాతిపిత బాపు కెసిఆర్ సార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
@TSwithKCR@balkasumantrs@BRSparty
తెలంగాణ స్వప్నాన్ని రాష్ట్రంగా మలిచిన నాయకుడు, పోరాటం నుంచి పాలన వరకు సంకల్పాన్ని శాసనంగా నిలబెట్టిన మహాసాధకుడు!
గులాబీ దళపతి కేసీఆర్ గారికి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు! 💐
Adv #HappyBirthdayKCR Sir
1 day to go - February 17
చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద ఘనంగా కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు 💐
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్వర్యంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ప్రధాత, ఉద్యమ రథసారధి శ్రీ కేసీఆర్ గారి 72వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద నుండి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలపడం సంతోషంగా ఉందని ఎన్నారై బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాబుపేట్, రవి రేటినేని, సత్యమూర్తి చిలుముల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, తెలంగాణ ప్రజల్ని కాపాడే క్రమంలో భగవంతుడు వారికి అన్ని సందర్భాల్లో మనోధైర్యాన్ని, ఆశీస్సులను అందించి ముందుకు నడిపించాలని, రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తెలంగాణను మరింత అభివృద్ధి చేయాలని కోరుకున్నారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎలాగైతే ఉద్యమ సమయం నుండి నేటి వరకు కేసీఆర్ గారి వెంట ఉన్నామో, భవిష్యత్తులో కూడా వారి వెంటే ఉంటామని, ఖండాంతరాల్లో ఉంటూ భారాస జెండా మోసే అవకాశం కల్పించిన కేసీఆర్ గారికి, అన్ని సందర్భాల్లో మా వెంటే ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ మాజీ చైర్మన్, ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం మరియు ఇతర నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపి ఇలా వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని, హాజరైన కార్యవర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నారై బీఆర్ఎస్ యూకే కార్యదర్శి - ఐటీ, మీడియా & పీఆర్ రవి ప్రదీప్ పులుసు మాట్లాడుతూ.. కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రభుత్వమైనా, ప్రతిపక్షమైనా క్రమశిక్షణ కలిగిన క్రియాశీలక కార్యకర్తలుగా పార్టీకి ఎల్లప్పుడూ అండగా ఉంటూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే రోజుల్లో పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షులు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాబుపేట్, రవి రేటినేని, సత్య మూర్తి చిలుముల, మాజీ అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, కార్యదర్శి - ఐటీ, మీడియా & పీఆర్ రవి ప్రదీప్ పులుసు, ఈవెంట్స్ ఇంచార్జ్ తరుణ్ లూనావత్ మరియు ముఖ్య సభ్యులు అబ్దుల్ ఖుద్దూస్, ఇమ్రాన్, హరీష్ రెడ్డి, జనార్దన్, అస్లాం, సాయి కిరణ్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
#HappyBirthdayKCR Sir
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు.
Hon’ble Chief Minister A. Revanth Reddy extended his warm birthday greetings to Shri K. Chandrashekar Rao, former Chief Minister and Leader of the Opposition.
The Chief Minister wished him good health, happiness, and a long life. He also conveyed his best wishes on the occasion and prayed for his well-being.
#TelanganaRising2047
తెలంగాణ అస్తిత్వ శిఖరం.. స్వరాష్ట్ర సాధకుడు!
ఉద్యమ కెరటమై ఎగిసి, పరిపాలనలో మేటిగా నిలిచి..
తెలంగాణ ఆత్మగౌరవ జెండాను ఢిల్లీ కోటపై ఎగరేసిన ధీశాలి.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి
శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు! 💐
#HappyBirthdayKCR
పోరాటల గడ్డపై ఉద్భవించిన వీర పుత్రుడు ✊
స్వరాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు 💪
జన హృదయనేత..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు మన తెలంగాణ జాతిపిత బాపు కెసిఆర్ సార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBirthdayKCR