*" కాఫీ ప్రియులకు అంకితం"*
*ఫిల్టర్ కాఫీ బుక్ - మొదటి భాగం*
లేవగానే కాఫీ తాగేవారు కొంతమంది ... కాఫీ తాగడం కోసమే లేచేవారు కొంతమంది .. ఆ రెండో రకానికి చెందిన వారిలో మొదటి వరసలో ఉండే నేను ఈ రోజు మూడో కాఫీ తాగుతుంటే కాఫీకి సంబంధించిన అనేక అనుభవాలు గుర్తొచ్చాయి. అవన్నీ పూస గుచ్చితే ఇలా వచ్చింది.
ముందు మాట లాగా ముందు మా *బామ్మ* *మాట*: టీ ఎవరైనా పెట్టగలరు. కాఫీ కొంతమందే పెట్టగలరు. ఫిల్టర్ కాఫీ కొందరు మాత్రమే పెట్టగలరు. ఫిల్టర్ కాఫీకి ఓ గ్లామర్ ఉంది. ఫిల్టర్ వేయడానికి ఓ గ్రామర్ ఉంది. ఫిల్టర్ కాఫీ పెట్టడానికి ఓ ఛందస్సు ఉంది. వ్యాకరణయుక్తంగా ఫిల్టర్ వేసి చందోబద్దంగా కలిపితేనే అది ఫిల్టర్ కాఫీ. చింత పిక్క వేస్తే మునక్కుండా ఉంటే అది నెంబర్ 1 ఫిల్టర్ కాఫీ.
పాలు మరగ పెట్టాలి.. అందులో డికాషన్ కలపాలి.. ఎంత డికాషన్.. ఒక్క స్పూన్ డికాషన్ తో ఒక కాఫీ గ్లాస్డు కాఫీ అవ్వాలి ..పాలు / డికాషన్ రెండూ మిక్స్ చేస్తున్నప్పుడు నురగ తన్నుకు రావాలి ...నురగ రాలేదంటే డికాషన్ /పాలు .. ఈ రెండూ గానీ లేక రెండిట్లో ఒకటి గానీ చిక్కగా లేవన్న మాట.
నురగలు కక్కని కాఫీ కాఫీయే కాదని... నురగలు కక్కే టీ టీయే కాదని తేల్చి పారేసింది మా బామ్మ. కాఫీ ఎప్పుడూ కూడా రెండో సారి వెచ్చ పెట్టకూడదుట. మరీ అవసరం అయితే తప్ప. కాఫీ కలిపాక ఎప్పుడూ వేడి చేయకూడదుట. రుచి పోతుందిట. టీ అలా కాదుట ఎన్నిసార్లయినా వేడి చెయ్యొచ్చుట. కాఫీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకోవాలిట. ఫ్లాస్కులో పోసిన కాఫీ తప్పనిసరి అయితేనే తాగాలిట ... ఉదాహరణకి హాస్పిటల్లో patients కోసం. ఫ్లాస్క్ కాఫీలో నురగ ఉండదు కాబట్టి అది కాఫీయేకాదు (మా బామ్మ ఉవాచ). కాఫీ టేస్ట్ కూడా మారిపోతుందిట.
ఇందులో ఇంకో సైకలాజికల్ పాయింట్ కూడా ఉందిట ....ఫ్లాస్క్ లో ఉన్న కాఫీ తాగడం వల్ల తనకంటూ ఎవరూ లేరే...కనీసం కాఫీకాచి ఇచ్చే మనిషి కూడా లేకపోయారే అనే ఫీలింగ్ తెప్పిస్తుందిట... అందుకే ఎవరన్నా చూస్తున్నపుడు ఫ్లాస్క్ లో కాఫీ కప్పులో పోసేది కాదు... చాలా నామర్దాగా ఉండేదిట ఆవిడకి. కానీ టీ అలా కాదుట.. ఫ్లాస్క్‌లో పోసిన టీ తాగొచ్చుట..(పెద్దగా taste కూడా మారదుట ... మీరూ try చేసి చూడండి).
ఖాళీ కప్పు వేపు చూసి తాగినట్టేలేదు….అప్పుడే అయిపోయిందా...అనిపించేదే ఫిల్టర్ కాఫీట (మహేష్ బాబు లాగా చెప్పాలంటే వాడే పండు గాడు). ఇందాకటనుండీ తాగుతున్నాం ఇంకా కప్పు ఖాళీ అవలేదే అనిపిస్తే అది కాఫీయే కాదుట. కమ్మగా ఉండడం, ఘుమ ఘుమ లాడడం ఇలాంటి పదాలు ఫిల్టర్ కాఫీకి తప్ప వేరే చోట వాడితే మా బామ్మ ఫెళ ఫెళ లాడిపోయేది.
కాఫీ ఎప్పుడు తాగాలి.. ఎన్ని సార్లు తాగాలి .. రెండు కాఫీల మధ్య గ్యాప్ ఎంత ఉండాలి. ఓ లుక్కేద్దాం. ఉదయం మొహం కడుక్కునే లోపు ఎన్ని సార్లయినా తాగొచ్చు (మొహం కడుక్కున్నాక తాగితే అంత రుచి ఉండదు). ఒకసారి కాఫీ తాగిన గ్లాస్ తడి ఆరక ముందే ఇంకో గ్లాస్ వచ్చేయాలి. అది కాఫీ రూల్. సమయానికి తిండి పెట్టక పోయినా.. కూరల్లో ఉప్పు కారాలు ఎక్కువ తక్కువ అయినా మా బామ్మ పట్టించుకునేది కాదు.. కానీ కాఫీ గ్లాస్ తడి ఆరేలోపు ఇంకో కాఫీ రాకపోతే మాత్రం .. ఇంట్లో నేను చులకన అయిపోయాను.. నన్నెవరూ పట్టించుకోవడంలేదు అంటూ వూరూ వాడా ఏకం చేసేసేది. అలాగే సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ కాఫీ తాగితే బాగుంటుందిట... అంటే ఆఫీసు నుండి వచ్చి అలా కుర్చీలో కూర్చుని అలా…అలా.. అలా …అన్నమాట. ఇంకో అడుగు ముందుకు వేయగలిగి.. పడుకునే ముందు ఫిల్టర్ కాఫీ తాగి పడుకోగల యోగమే ఉంటే ఇక అది జీవిత సాఫల్యమేట.
మా బామ్మ ఇత్తడి ఫిల్టరేసి డికాషన్ తీసిన తర్వాత పారేసిన కాఫీపొడితో మా పనిమనిషి వారం రోజులు కాఫీ పెట్టుకునేదిట. అలాగే ఒకసారి డికాషన్ తీసాక ఫిల్టర్‌లో రెండోసారి నీళ్ళు పోసి తీసిన డికాషన్‌తో మా ఇంట్లో ఉండే నలుగురు పనివాళ్ళకి కాఫీ ఇస్తే .. కాఫీ మరీ ఇంత స్ట్రాంగ్‌గా ఉందేమిటి అమ్మగారూ అనేవాళ్లుట వాళ్ళు. మా తాత కాఫీ తాగిన గ్లాస్‌ని తర్వాత రోజుల్లో లోటాగా పిలిచేవారుట. నా పెళ్ళయిన కొత్తలో మాఆవిడకి ఈ విషయాలు చెబితే... నోరెళ్ళబెట్టి .. అలాగా మరి నా చిన్నప్పుడు మాఇంటికి వచ్చే పిట్టలదొర ఈ విషయాలు ఎప్పుడూ చెప్పలేదే అనేసింది పుసుక్కున. పెళ్ళయిన కొత్త కాబట్టి ఏమీ అనకుండా వదిలేశాను .. ఆఫ్ కోర్సు పెళ్లి పాతబడిపోయింది కాబట్టి ఇప్పుడు అసలు అలాంటి విషయాలు ఆవిడకి చెప్పడమే మానేశాననుకోండి. (తరువాత కాఫీ... అదే తరువాత భాగం.. కొన్నాళ్ళల్లో)
@NeverSayYesDude కుక్కల ఓనర్స్.... రోడ్డుమీదకి కుక్కని తెస్తారు.... నాలాంటి వాళ్ళు భయపడుతుంటే అది ఏం చెయ్యదు.... భయపడక్కర్లేదు అంటారు....సివిక్ సెన్స్ ఉండదు.... లిఫ్ట్స్ లో కూడా అంతే.....దాన్ని గట్టిగా కట్టేసి పట్టుకోడం కూడా చెయ్యరు.... కరిచాక సారీ చెప్తారు అంతే...
@shivsun తత్వం బోధపడుతుంది అంతే..... పైసలు పెద్దగా రావు.....M A (Astrology) చేసి ఖాళీగా ఉన్నారు నాలాంటి చాలామంది మార్కెట్లో.... డబ్బు కోసమైతే కాషాయం మంచి వ్యాపారం... ఓపాలి ఆలోచించండి
@Vairagya13 నాకర్థం కాక అడుగుతున్నా.
భగవంతుడిని కష్టాలు ఇవ్వొద్దని ఎప్పుడూ అడగను... కష్టాల్ని ఎదుర్కొనే ధైర్యం ఇమ్మని మాత్రమే కోరుకుంటాను... అంటారు కదా.... భగవంతుడిని అడిగేటపుడు డైరెక్ట్‌గా కష్టాలు ఇవ్వొద్దనే అడగొచ్చుగా...
@BapujiTelugu నాకర్థం కాక అడుగుతున్నా.
భగవంతుడిని కష్టాలు ఇవ్వొద్దని ఎప్పుడూ అడగను... కష్టాల్ని ఎదుర్కొనే ధైర్యం ఇమ్మని మాత్రమే కోరుకుంటాను... అంటారు కదా.... భగవంతుడిని అడిగేటపుడు డైరెక్ట్‌గా కష్టాలు ఇవ్వొద్దనే అడగొచ్చుగా...
@thiru7773 నాకర్థం కాక అడుగుతున్నా.
భగవంతుడిని కష్టాలు ఇవ్వొద్దని ఎప్పుడూ అడగను... కష్టాల్ని ఎదుర్కొనే ధైర్యం ఇమ్మని మాత్రమే కోరుకుంటాను... అంటారు కదా.... భగవంతుడిని అడిగేటపుడు డైరెక్ట్‌గా కష్టాలు ఇవ్వొద్దనే అడగొచ్చుగా...
@deva__gangula నాకర్థం కాక అడుగుతున్నా.
భగవంతుడిని కష్టాలు ఇవ్వొద్దని ఎప్పుడూ అడగను... కష్టాల్ని ఎదుర్కొనే ధైర్యం ఇమ్మని మాత్రమే కోరుకుంటాను... అంటారు కదా.... భగవంతుడిని అడిగేటపుడు డైరెక్ట్‌గా కష్టాలు ఇవ్వొద్దనే అడగొచ్చుగా...
@kslathaa నాకర్థం కాక అడుగుతున్నా.
భగవంతుడిని కష్టాలు ఇవ్వొద్దని ఎప్పుడూ అడగను... కష్టాల్ని ఎదుర్కొనే ధైర్యం ఇమ్మని మాత్రమే కోరుకుంటాను... అంటారు కదా.... భగవంతుడిని అడిగేటపుడు డైరెక్ట్‌గా కష్టాలు ఇవ్వొద్దనే అడగొచ్చుగా...
నాకర్థం కాక అడుగుతున్నా.
భగవంతుడిని కష్టాలు ఇవ్వొద్దని ఎప్పుడూ అడగను... కష్టాల్ని ఎదుర్కొనే ధైర్యం ఇమ్మని మాత్రమే కోరుకుంటాను... అంటారు కదా.... భగవంతుడిని అడిగేటపుడు డైరెక్ట్‌గా కష్టాలు ఇవ్వొద్దనే అడగొచ్చుగా...