పర్యావరణ పరిరక్షణకు ట్రీ బ్యాంక్
• గుంటూరు కృషి విజ్ఞాన కేంద్రంలో నర్సరీ ఏర్పాటుకు ప్రతిపాదన
• ఆధునిక వ్యవసాయంతో గ్రామీణ యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు
• గుంటూరు లామ్ లోని కె.వి.కె.లో మొక్కలు నాటి, ప్రసంగించిన ఏపీ గ్రీన్ ఛైర్మన్ శ్రీ నాగబాబు గారు
వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ యువతకు సుస్థిరమైన జీవనోపాధి అవకాశాల కల్పనపై సమగ్రంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఏపీ గ్రీన్ ఛైర్మన్ శ్రీ నాగబాబు గారు పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవా 2026 భాగంగా గుంటూరు లామ్‌లోని కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వృక్షారోపణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ... “వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలే భవిష్యత్‌లో గ్రామీణ ప్రాంతాలకు కీలకమైన ఉపాధి ఆధారాలుగా నిలుస్తాయి. గ్రామీణ యువత ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రకృతి ఆధారిత జీవనోపాధులు, నైపుణ్య ఆధారిత కార్యక్రమాలను ఉపాధి అవకాశాలుగా మలుచుకోవాలి.
• ట్రీ బ్యాంక్, నర్సరీ ఏర్పాటుకు ప్రతిపాదన
పర్యావరణ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేయడంలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం, లామ్‌తో ఏపీ గ్రీన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకునే దిశగా చర్యలు చేపట్టాం. కృషి విజ్ఞాన కేంద్రం పరిధిలో భూమిని ఏపీ గ్రీన్ కు అందుబాటులోకి తీసుకువచ్చి ట్రీ బ్యాంక్, నర్సరీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. ఈ నర్సరీ ద్వారా ఏపీ గ్రీన్ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టే వృక్షారోపణ కార్యక్రమాలకు అవసరమైన నాణ్యమైన మొక్కలను పెంచడం, సంరక్షించడం, అందుబాటులో ఉంచడం సాధ్యమవుతుంది. కృషి విజ్ఞాన కేంద్రంలో అందుబాటులో ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానం, వ్యవసాయ సాంకేతికత, నర్సరీ నిర్వహణ నైపుణ్యాలను ఏపీ గ్రీన్ పర్యావరణ కార్యక్రమాలతో అనుసంధానం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.
• స్టింగ్లెస్ బీ పెంపకంపై శిక్షణ
కార్యక్రమంలో భాగంగా గ్రామీణ యువతకు అందిస్తున్న స్టింగ్లెస్ బీ పెంపకం, తేనెటీగల పెంపకం శిక్షణ కార్యక్రమాలను శ్రీ నాగబాబు గారు పరిశీలించారు. శిక్షణ పొందుతున్న యువతతో మాట్లాడి, వారికి అందుతున్న శిక్షణ, ఉపాధి అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు. తేనెటీగల పెంపకం వంటి వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు గ్రామీణ యువతకు స్వయం ఉపాధి, అదనపు ఆదాయం, సుస్థిర జీవనోపాధి కల్పించడంలో ఉపయోగపడతాయి. రైతులు, యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించడంలో కృషి విజ్ఞాన కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఏపీ గ్రీన్ సీఈవో శ్రీ బి.ఎన్.ఎన్. మూర్తి, అటవీ శాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, గుంటూరు డి.ఎఫ్.ఓ. శ్రీమతి ఎం. హిమ శైలజ, కృషి విజ్ఞాన కేంద్రం డైరెక్టర్ డా. ఎం. యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
చెట్టికులంగర భగవతి అమ్మవారి సేవలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• ఆలయంలో పుష్పాంజలి సేవ.. అమ్మవారికి ప్రత్యేక పూజలు
• దసరా శరన్నవరాత్రులకు వచ్చే వేలాది మంది భక్తుల అన్నదానానికి విరాళం
కేరళం రాష్ట్రంలోని అలప్పుజ జిల్లా పరిధిలో చారిత్రక ఆలయంగా పేరున్న చెట్టికులంగర శ్రీ భగవతి అమ్మవారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం పుష్పాంజలి సేవలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరోగ్య ప్రదాయినిగా పేరున్న శ్రీ భగవతి అమ్మవారికి పుష్పాంజలి సమర్పణ సర్వదోష నివారణ నిమిత్తంచేస్తారని ప్రతీతి. దసరా శరన్నవరాత్రుల తొమ్మిది రోజులు శ్రీ భగవతి అమ్మవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు అన్నదానానికి అయ్యే వ్యయం మొత్తాన్ని దేవస్థానం బోర్డుకు విరాళంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందజేశారు. త్రిశక్తి స్వరూపిణి అయిన అమ్మవారి దర్శనానికి దసరా నవరాత్రుల రోజుల్లో వేలాదిగా భక్తులు తరలివస్తారు.
అంతకు ముందు అమ్మవారి దర్శనానికి విచ్చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అధికారులు, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా బాలశివుని దర్శించుకుని అర్చనలు చేశారు. అమ్మవారి దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న వినాయకుడు, నాగదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మేల్ శాంతి ఉప ముఖ్యమంత్రివర్యులతో పూజలు చేయించారు.
చెట్టికులంగర భగవతి అమ్మవారి ఆలయానికి 1200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. రాక్షస సంహారం కోసం శివుడి మూడో కన్ను నుంచి అమ్మవారు జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ భగవతీ అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. (1/3)
ॐ श्री महाकालेश्वराय नमः 🙏🏻
दिनांक 13 सितंबर 2026 को ज्योतिर्लिंग भगवान श्री महाकालेश्वर जी का प्रातः कालीन भस्म आरती श्रृंगार दर्शन
#mahakal#ujjain#ujjainlive#harharmahadev
మామ్మియూర్ మహాదేవుడి సేవలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు గురువాయూర్ సమీపంలోని మామ్మియూర్ మహాదేవ ఆలయాన్ని దర్శించారు. శనివారం వేకువజామున పరమ శివుని పూజలో పాల్గొన్నారు. ప్రత్యేక అర్చనలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గురువాయూర్ దర్శనం ముగిసిన తర్వాత మామ్మియార్ శివాలయంకి వెళ్లడం ఆనవాయితీగా ఉంది. పురాణ కథ ప్రకారం గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంతో మామ్మియూర్ మహాదేవుని ఆలయానికి ప్రత్యేక అనుబంధం ఉంది. విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్ట కోసం రుద్రతీర్థంలో శివుడు తపస్సు చేసిన స్థలాన్ని ఇచ్చినట్టు స్థలపురాణం చెబుతోంది. ఆ కారణం చేత గురువాయూర్ శ్రీ కృష్ణుని దర్శనానంతరం మమ్మియూర్ లోని మహాదేవుని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఆలయంలో పార్వతీపరమేశ్వరులతో పాటు శ్రీ మహావిష్ణువు, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, అయ్యప్ప, భగవతి అమ్మవారు, నాగదేవతలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం గోడలపై చిత్రించిన కళా ఖండాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు ఉదయం గురువాయూర్ దర్శనానంతరం శ్రీ మహాదేవ్ ఆలయానికి వెళ్లిన ఆయనకు మలబార్ దేవస్థానం బోర్డు సభ్యులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. (1/2)
ఏఎస్ఆర్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలపై ప్రజల్ని అప్రమత్తం చేయండి
•వాగులు పొంగుతున్న వేళ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించండి
•అవసరం ఉన్న చోట తక్షణం పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాలి
•జిల్లా యంత్రాంగం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు శ్రీ @PawanKalyan గారు సూచనలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న క్రమంలో ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఆదేశించారు.
భారీ వర్షాల నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్‌తోపాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమీక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని, కొన్ని గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు వివరించారు. అధికారులు అందించిన సమాచారం ప్రకారం, జీకే వీధి మండలం గంగవరం సమీపంలో ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక వంతెన వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో సుమారు 15 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, ఆ ప్రాంతంలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రివర్యులు దిశా నిర్దేశం చేశారు.
వర్షాలు తగ్గే వరకు ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా బయటకు రావద్దని విస్తృతంగా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అవసరం ఉన్న చోట తక్షణమే పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని, అత్యవసర సేవల సిబ్బంది సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. ప్రజలు కూడా అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి భారీ వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల అధికారులను కూడా అప్రమత్తం చేశారు.
A tree is not merely a part of our landscape; it is a living legacy. It gives shade, sustains biodiversity, enriches the soil and silently witnesses the passage of generations. A mature tree that has stood for decades carries an ecological and historical value that cannot simply be replaced by planting a new sapling.
Science continues to reveal the remarkable ways in which trees communicate and interact through their roots, chemical signals and fungal networks. With advances in Artificial Intelligence, the future may even enable humanity to understand communication between humans and other living species, including plants. Until then, our inability to understand their language must never diminish our respect for their life.
Andhra Pradesh is advancing rapidly in infrastructure and development. Such progress is necessary, but it must move hand in hand with environmental responsibility. Wherever a mature tree can be retained, it should be protected. Where removal becomes unavoidable, scientifically planned translocation should be considered wherever technically feasible.
Translocating a mature tree requires careful assessment, specialised equipment, skilled expertise and sustained care after relocation. Every tree may not survive the process, but the possibility of preserving a living tree that has served its surroundings for decades should never be dismissed without a genuine scientific effort.
Every old tree carries a story. It may have witnessed generations, changing landscapes and the history of the community around it. Such trees are not merely timber or obstacles to development; they are part of our natural heritage and a legacy we have a duty to pass on.
This Tree Translocation Manual provides a systematic approach to preserving that legacy through scientific assessment, planning and implementation. I hope it will guide all concerned departments, officers, experts and agencies towards responsible and consistent tree conservation.
Our progress should be measured not only by what we build, but also by what we preserve for those who come after us.
Konidela Nagendra Rao
Chairman, Executive Committee, AP-GREEN
జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా మన అడవులను, వన్య ప్రాణులను కాపాడుతూ అసువులు బాసిన అటవీ సిబ్బందిని స్మరించుకుంటూ ఘన నివాళులు.
వారి త్యాగం, ధైర్యం రాబోయే తరాలకు ప్రకృతిని కాపాడుకోవాలనే స్ఫూర్తినిస్తుంది.
#NationalForestMartyrsDay
ॐ श्री महाकालेश्वराय नमः 🙏🏻
दिनांक 08 सितंबर 2026 को ज्योतिर्लिंग भगवान श्री महाकालेश्वर जी का प्रातः कालीन भस्म आरती श्रृंगार दर्शन
#mahakal#ujjain#ujjainlive#harharmahadev
ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభం
•ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక పర్యవేక్షణలో సర్వే ప్రారంభించిన ఐఐటీ మద్రాస్
•తీర ప్రాంతం వెంబడి ఐదుగురు సభ్యుల నిపుణుల బృందం డ్రోన్ సర్వే
•అత్యాధునిక సాంకేతికతతో బీచ్ ప్రొఫైల్, తీరాల మ్యాపింగ్ చేస్తున్న బృందం
•తీరం వెంబడి ఇసుక, మట్టి అవశేషాల నమూనాల సేకరణ, పరీక్షలు
•అధ్యయనం పూర్తయిన అనంతరం రక్షణ గోడ అలైన్‌మెంట్‌పై కసరత్తులు
•డిజైన్, డీపీఆర్ తో పాటు సమాంతరంగా పర్యావరణ అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని శ్రీ @PawanKalyan గారు ఆదేశం
పిఠాపురం నియోజక వర్గంలోని ఉప్పాడ తీర ప్రాంతవాసుల దశాబ్దాల కల సాకారం దిశగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణం దిశగా కీలక అడుగులు ప్రారంభమయ్యాయి. రక్షణ గోడ నిర్మాణానికి సాంకేతిక సహకారం అందించేందుకు ఒప్పందం చేసుకున్న ఐఐటీ- మద్రాస్ పనిని ప్రారంభించింది. రూ. 323 కోట్లనేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్‌తో నిర్మితమవుతున్న ఈ రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి డిజైన్, డీపీఆర్ రూపకల్పన కోసం ఐదుగురు సభ్యులతో కూడిన ఐఐటీ మద్రాస్ ప్రతినిధి బృందం అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో సముద్ర గర్భంలోనూ, తీర ప్రాంతం వెంబడి సర్వే చేపట్టింది.
తీర ప్రాంత ఇంజినీరింగ్, సముద్ర పరిశోధనల్లో విశేష అనుభవం కలిగిన ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం గత వారం రోజులుగా ఉప్పాడ తీర ప్రాంతంలో క్షేత్రస్థాయి సర్వేలు చేపట్టింది. అధునాతన డ్రోన్లతోపాటు బీచ్ ప్రొఫైలింగ్, తీర ప్రాంతాల మ్యాపింగ్ కోసం ట్రింబుల్ ఆర్980 జీఎన్ఎస్ఎస్ ఆర్టీకే సాంకేతికతను వినియోగిస్తున్నారు. తీర ప్రాంత భౌగోళిక పరిస్థితులు, సముద్ర అలల ప్రభావం, తీర కోత తీవ్రత, భూభాగ మార్పులు, సముద్ర ప్రవాహాల దిశలు వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేస్తున్నారు. నీటి అడుగు భాగం నుంచి బీచ్ వరకు ఇసుక కణాల సేకరణ, సమగ్ర అధ్యయనం సాగుతోంది. వీటితోపాటు ఉప్పాడ తీర ప్రాంతం వెంబడి ఇసుక, మట్టి అవశేషాల నమూనాలు సేకరించి, శాస్త్రీయ అధ్యయన ప్రక్రియ కొనసాగిస్తున్నారు. బాతిమెట్రిక్ సర్వే ద్వారా సముద్రపు లోతు, సీ బెడ్ స్థాయిలు, వాటి మార్పులను గుర్తిస్తున్నారు. బీచ్ ఆకృతి, వాలు, ఎత్తుపై అధ్యయనం కొనసాగుతోంది. షోర్లైన్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. తీర ప్రాంత కోతను అంచనా వేయడంలో ఈ అధ్యయనం కీలక పాత్ర పోషిస్తుంది.
ఉప్పాడ సముద్ర తీరం వెంబడి ప్రతిపాదిత రక్షణ గోడ నిర్మాణానికి అనువైన అలైన్‌మెంట్‌ను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. భవిష్యత్తులో సముద్ర కోత ప్రభావాన్ని సమర్థవంతంగా, సుదీర్ఘకాలం ఎదుర్కొనే విధంగా డిజైన్ రూపకల్పనకు ఈ సర్వే ఉపయోగపడుతుంది. ఈ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐఐటీ మద్రాస్ ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించి డిజైన్, డీపీఆర్ తదితర సాంకేతిక అంశాలపై దృష్టి సారించనుంది.
గత నాలుగు దశాబ్దాలుగా ఉప్పాడ తీర ప్రాంత ప్రజలు సముద్ర కోత సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వందల ఎకరాలు, పలు గ్రామాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. ఎంతో మంది నిర్వాసితులు కాగా, రైతులు వందల ఎకరాల పంట భూములను సైతం కోల్పోయారు. ఈ సమస్య పరిష్కారానికి నడుం బిగించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు చేపట్టారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) ప్రతిపాదన మేరకు సీ ప్రోటెక్షన్ వాల్ , గ్రోయిన్ ఫీల్డ్, హోప్ ఐలాండ్ పరిసరాల్లో ప్రకృతి ఆధారిత తీర రక్షణ చర్యలు చేపట్టేందుకు ఆమోదం లభించింది. అందుకు అనుగుణంగా డీపీఆర్ రూపకల్పన పనులు ప్రారంభమయ్యాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పిఠాపురం పర్యటన సందర్భంగా డిజైన్, డీపీఆర్ పై ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందంతో చర్చించనున్నారు. నిర్ణీత గడువు లోపు నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా డిజైన్, డీపీఆర్ రూపకల్పన సమాంతరంగా పర్యావరణ, తదితర అనుమతుల ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కాలుష్యం చేస్తూ కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టడంపై ఉపముఖ్యమంత్రి @PawanKalyan గారు సీరియస్.
బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్న ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కి రూ.21.01 కోట్ల ఫైన్ విధించిన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి.
दिनांक 05.09.2026, भगवान् श्री विश्वेश्वर की मध्यान्ह भोग आरती में श्री विश्वेश्वर के दिव्य स्वरूप संग भगवान् लड्डू गोपाल के मनोहारी दर्शन । 🙏✨
।। जय श्री शम्भु, जय श्री कृष्ण ।।
#kashivishwanath#janmastamispecial#kashi#sanatan
హరే కృష్ణ! జై శ్రీ కృష్ణ!
లోకానికి భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు. ఆ పరమాత్ముని ఆశీస్సులు మనందరిపై ఉండాలని, శాంతి సౌభాగ్యాలతో ప్రతి కుటుంబం వెల్లివిరియాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
#HappyJanmashtami
పిఠాపురం పట్టణం అభివృద్ధికి రూ.308.24 కోట్లు
•ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో అభివృద్ధి పనులు
•రూ. 200 కోట్లతో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ
•ఏలేశ్వరం నుంచి పిఠాపురానికి తాగునీరు
•రూ. 59.52 కోట్లతో కొత్త పైప్‌లైన్, ట్యాంకుల నిర్మాణం
•పిఠాపురం పట్టణంలో దాదాపు 5 వేల కొత్త తాగునీటి కనెక్షన్లు
•త్వరలోనే సిద్ధం కానున్న తడి చెత్త ప్లాంట్
•కోట్లాది రూపాయలతో రహదారులు, కాలువల నిర్మాణం
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో పిఠాపురం పట్టణ అభివృద్ధి కొత్త దిశగా పయనిస్తోంది. పట్టణ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చే లక్ష్యంతో భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, పారిశుద్ధ్య సదుపాయాలు, మురుగు నీటి శుద్ధి కేంద్రాలు, రహదారులు, కాలువలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, పార్కుల అభివృద్ధి, తాగునీటి సరఫరా వంటి కీలక మౌలిక వసతుల కోసం మొత్తం రూ.308.24 కోట్ల విలువైన అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఈ భారీ నిధులు, సమగ్ర ప్రణాళికలతో పిఠాపురాన్ని ఆధునిక సదుపాయాలతో కూడిన ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దే దిశగా అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.
*మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం*
పిఠాపురం ప్రజల చిరకాల కోరిక అయిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రత్యేక చొరవతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 120 కిలోమీటర్ల మేర భూగర్భ మురుగునీటి పైప్లైన్లను నిర్మించనున్నారు. అలాగే, పట్టణంలోని ప్రధాన చెరుకుల కాలువకు ఇరువైపులా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ లైన్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, పిఠాపురం పట్టణంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. దోమల నివారణకు తోడ్పడటంతోపాటు పట్టణ పరిశుభ్రత మెరుగుపడి, ప్రజారోగ్య పరిరక్షణలోనూ గణనీయమైన మార్పు చోటు చేసుకోనుంది. పిఠాపురం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఈ ప్రతిష్టాత్మక అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుకు రూ.200 కోట్ల నిధులను కేటాయించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సహకరించిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
*రోజుకు రెండు పూటలా సురక్షితమైన తాగు నీరు*
పిఠాపురం పట్టణంలో తాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు రూ. 59.52 కోట్ల భారీ బడ్జెట్‌తో పనులను వేగవంతంగా జరుగుతున్నాయి. అమృత్ 2.0లో భాగంగా రూ. 57.37 కోట్లు, టిడ్కో గృహ నిర్మాణ పథకం ఇళ్లకు నీటి సరఫరా కోసం రూ. 2.15 కోట్లను కేటాయించారు. పట్టణానికి మొత్తం 120.19 కి.మీ. పైప్‌లైన్ అవసరం కాగా, ప్రస్తుతం ఉన్న 72.90 కి.మీ. లైన్లో 35 కి.మీ. దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీని కోసం కొత్తగా, అదనంగా 82.29 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులను ప్రతిపాదించారు. పట్టణంలో 600 కిలోలీటర్ల సామర్థ్యం గల భారీ ఎత్తైన నీటి నిల్వ ట్యాంకు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో 400 కిలోలీటర్ల సామర్థ్యం గల నీటి నిల్వ ట్యాంకు నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది. పట్టణ ప్రజల కోసం కొత్తగా దాదాపు 5 వేల తాగునీటి కొళాయి కనెక్షన్లు ఇవ్వనున్నారు. పిఠాపురం పట్టణానికి రోజువారీ నీటి కొరత లేకుండా ఏలేశ్వరం జలాశయం నుంచి రోజుకు 55 లక్షల లీటర్ల నీటిని తరలించేందుకు ఒక ప్రధాన పైప్‌లైన్ ఏర్పాటు జరుగుతోంది. పిఠాపురం పట్టణ ప్రజల రోజువారీ నీటి అవసరమైన 80 లక్షల లీటర్లను దృష్టిలో ఉంచుకుని, రోజుకు రెండు పూటలా సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
శాస్త్రీయంగా వ్యర్థాల నిర్వహణకు ఏర్పాట్లు*
పిఠాపురం పురపాలక సంఘం పరిధిలో పట్టణ పరిశుభ్రత, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశ కింద పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రూ. 4 కోట్లతో తడి చెత్త నిర్వహణ కేంద్రం, రూ.1.43 కోట్లతో మల వ్యర్థాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. తడి చెత్త నిర్వహణ కేంద్రం పనులు మరో రెండు నెలల్లో పూర్తికానున్నాయి. పట్టణంలోని 18,468 ఇళ్ల నుంచి ప్రతిరోజూ 25 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. తడి చెత్త నిర్వహణ కేంద్రం పనులు వేగవంతం అవుతున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే రోజుకు వచ్చే 25 టన్నుల చెత్తను పూర్తిస్థాయిలో శాస్త్రీయంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. అలాగే పట్టణంలో గతంలో పేరుకుపోయిన భారీ మొత్తంలో ఘన వ్యర్థాలను కూడా గణనీయంగా తగ్గిస్తున్నారు. ఈ పనులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చెత్త సమస్య తగ్గడంతోపాటు పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య పరిస్థితులు మెరుగుపడనున్నాయి.