తిరుమల లడ్డూ లో జంతువుల కొవ్వు లేదు అని తేలిన తర్వాత ఏపీ ప్రభుత్వ పెద్దలు వివరణ ఇచ్చారా?
ఇప్పుడు నన్ను BJYCP అని ముద��ర వేసి తప్పించుకోవచ్చు, కానీ,
నెయ్యి లో జంతువుల కొవ్వు కలవడం వేరు , వనస్పతి కలవడం వేరు.
శ్రీవారి ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీ క్షమించరాని నేరం. అయితే ప్రస్తుతం వాడే నెయ్యి 100% స్వచ్ఛమైనది అని ఇప్పటి ప్రభుత్వం, టీటీడీ గారంటీ ఇస్తుందా?
టీవీల ముందు యావత్ భారతానికి తెలిసేలాగా ఇంగ్లీష్ లో " అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం కోసం పంపిన లడ్డూల్లో ఆవు, పంది, చేప కొవ్వు కలిసింది" అని ఊగిపోతూ చెప్పి కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసి, శ్రీ వారి లడ్డూ పైన అనుమానాలు రే��ెత్తించిన నాయకులు ఇప్పుడు క్షమార్పణ చెప్తారా? లేదా ఏదీ తెలీనట్టు నటిస్తారా?
మీ రాజకీయ అవసరాలకోసం వెంకన్న ను కూడా వాడుకుంటారా?
ఈరోజు మా ఊళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామి తిరు మంజనం సందర్భంగా పనిచేసిన స్వచ్ఛంద సేవకులకు తిరుమల ��ుండి తెప్పించిన లడ్డూ ప్రసాదం ఇచ్చారు.
ఇంటికొచ్చిన తర్వాత మా ఆవిడ ప్రసాదం తీసుకుని అడిగిన మొదటి ప్రశ్న - "ఈ లడ్డూలో జంతు కొవ్వు కలిసిందా" అని.
ఈ దుస్థితికి ఎవరు కారణం? ఎవరు బాధ్యత వహిస్తారు??
@kktpaty మన పార్టీ ఊట బావి లాంటిది… తోడే కొద్దీ కొత్త నాయకులు వస్తూనే ఉంటారు!
సాయి రెడ్డి, బాలినేని, మోపిదేవి, చిన్న సీను… లిస్ట్ ఇంకా పెరుగుతూనే ఉంది! 😎
కానీ స్పీడ్ మాత్రం తగ్గలేదు! 💪💪