మాన్యశ్రీ గౌరవ ఎనుముల రేవంత్ రెడ్డి గారు
ముఖ్యమంత్రివర్యులు
తెలంగాణ రాష్ట్రం
అయ్యా ....నమస్కారం
గత నవంబర్ నెల26వ జరిగిన క్యాబినెట్ సమావేశంలో 317 జీవో లోని స్పౌజ్ మరియు మెడికల్ మ్యూచువల్ 13 జిల్లాలకు సంబంధించినవి బదిలీ చేయుటకు నిర్ణయం తీసుకున్నారు ఈ విషయంగా గౌరవ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మరియు పొన్నం ప్రభాకర్ గారు స్వయంగా విలేకరుల సమావేశంలో తెలిపారు కానీ అధికారుల ఈ బదిలీలను చేయలేదు అసలు అధికారులు ఇంతవరకు ఇలాంటి జీవో జారీ చేయలేదు.
ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడంలో అధికారులు తాత్సారం చేస్తున్నారు దీనివల్ల ప్రభుత్వ క్రెడిబిలిటీ చాలా దెబ్బతింటుందని తమరికి తెలియజేయుచున్నాను క్యాబినెట్ నిర్ణయం వెలువడిన వెంటనే రెండు మూడు రోజుల్లో అట్టి నిర్ణయాలు అమలు జరగాలి .గత ప్రభుత్వం ప్రగతిభవన్ నుంచి మౌఖిక ఆదేశాలు జారీ చేసిన కూడా ఆగమేఘాల మీద అమలు చేశారు మరి ప్రస్తుతం అధికారులు ఎందుకు నిర్లిప్తంగా ఉంట��న్నారు (నిర్లిప్తంగా ఉంటున్నారు అనేది వాస్తవం )దయచేసి ఆలోచించగలరు, క్యాబినెట్ నిర్ణయం తరువాత రెండు లేదా మూడు రోజుల్లో రావాల్సిన GO ఇప్పటీకీ రాకపోవడం చాలా బాధాకరం , దయచేసి ఈ విషయాన్ని సమస్యను త్వరగా పరిష్కరించాలని మనవి
# S.VIVEK
“SPOUSE FORUM”
9676589777
7799995523
మ్యూచువల్ , స్పౌ జ్ మెడికల్ వారి బదిలీలు తక్షణమే చెయ్యాలని కాబినెట్ లో నిర్ణయం జరిగి పది రోజులైనా ఇంకా ఎలాంటి కదలిక లేదు , ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి , సవినయంగా వేడుకుంటున్నాం మీరే చొరవ తీసుకుని ఏ జిల్లా కూడా ఆగకుండా మొత్తం 13 జిల్లాలో ఉన్న 1266 మంది నిల���చిపోయిన spouse బదిలీలు జరిపించాలని మనవి .🙏🏻