“A stronger democracy is built when every citizen is heard, every region is represented and every state moves forward with confidence.”
Under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, and with the active role of Hon’ble Union Home Minister Shri @AmitShah Ji and Hon’ble Union Parliamentary Affairs Minister Shri @KirenRijiju Ji, the NDA government continues to advance significant reforms to strengthen India's democratic institutions and make parliamentary representation more inclusive.
The proposed Delimitation reform, ahead of the November 30 special Parliament session, marks an important step towards expanding and strengthening India's democratic representation. The proposed 50% increase in Lok Sabha seats across all states, while maintaining their existing proportional representation until 2051, will create greater opportunities for representation and ensure that every region's voice is heard.
Importantly, this framework recognises the achievements of Southern States in population stabilisation while safeguarding their proportional share of parliamentary representation. It reflects the spirit of cooperative federalism, ensuring that every state's progress and contribution are respected.
The proposed 33% reservation for women in the Lok Sabha and State Legislative Assemblies further strengthens this democratic reform by creating greater opportunities for women's participation in legislative institutions and decision-making.
@JanaSenaParty stands in support of this important national reform. I urge all political parties, elected representatives and stakeholders to rise above political differences, come together and extend their support to this initiative in the larger interest of our democracy.
Let us move forward towards a stronger, more representative and inclusive Parliament, where every state has a respected voice and every section of society has an opportunity to participate.
- @PawanKalyan@PMOIndia@HMOIndia@mpa_india@AndhraPradeshCM@PIB_India@IPR_AP@pibvijayawada
ఆధారాలు ఉంటే నాగార్జున యాదవ్ కి రెండు వారాల గడువు ఎందుకు ?
పనికిరాని సాక్షి పేపర్ లాంటి చిత్తు కాగితాలు చేతిలో పెట్టుకుని ఆడవారిపై నోటికొచ్చినట్టు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు?
ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేశారు, ఇప్పుడు జనసేన పార్టీలో పని చేసే మహిళలపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. కానీ మేము ఏనాడు మీ నాయకుడి సతీమణి, తల్లి, చెల్లిపై తప్పుడు మాటలు మాట్లాడలేదు.
సమాజానికి పట్టిన చీడపురుగు వైఎస్సార్సీపీ. 11 వచ్చినా వైసీపీకి బుద్ధి రాలేదు, 24 గంటలు పవన్ కళ్యాణ్ గారిపై పడి ఏడవటమే.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ధరణి కృష్ణ అనే వ్యక్తిపై �� తరహా వ్యవహారాలపైనే నాలుగు FIR లు నమోదైనా ఒక్కసారీ చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే వైసీపీ నేరస్థులకు మద్దతిచ్చే పార్టీ.
- శ్రీమతి శివపార్వతి, జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి.
తప్పు జరుగుతుంది, విచారణ అవసరం అని అసలు విషయాన్ని బయట పెట్టిందే మేము.
కేసు పెట్టినవారి మీదే మీడియా ట్రయల్స్ చేసి నేరాన్ని ఆపాదించేస్తున్నారు. ఇవన్నీటితో పాటు వ్యక్తిగత హననం.
కోట రుక్మిణి గారిపై నాగార్జున యాదవ్ అనే వైసీపీ వ్యక్తి నోటి��ొచ్చిన నిరాధార ఆరోపణలు చేసినందుకు వారికి ఆధారాలు ��ూపమని 48 గంటల సమయం ఇస్తూ లీగల్ నోటీస్ ఇచ్చారు.
దానికి వారు సమాధానం ఇస్తూ 2 వారాల గడువు కోరారు. పోనీ దానికైన కట్టుబడి ఆధారాలు చూపించి మాట్లాడటం లేకుండా ఈలోపు సాక్షి, ఇతర వైసీపీ అనుకూల చానెళ్లలో కూర్చుని ఒక మహిళపై దిగజారుడు విమర్శలు చేయడంపై ఈరోజు మహిళా కమీషన్ చైర్మన్ శ్రీమతి రాయపాటి శైలజ గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.
- కోట శిరీష, హైకోర్ట్ అడ్వకేట్.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని నిలబెట్టిన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును సంవిధాన్ దివస్ గా జరుపుకుంటాం.
ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలు, రాజ్యాంగ సభ స���్యుల దూర దృష్టి, జ్ఞానానికి జనసేన పార్టీ తరపున ఘన నివాళులు.
#ConstitutionDay #SamvidhanDivas #IndianConstitution
ఒకవైపు రాజకీయాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలి అని చట్టసభల్లో బిల్లులు పెట్టి రాజకీయ అవకాశాలు కల్పించే ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు మహిళలను ఉన్నత స్థానాల్లో ఎదగనివ్వకుండా వ్యక్తిత్వ హననం చేస్తూ క్రిందకు లాగాలని @YSRCParty నాయకులు చూస్తున్నారు - కాకినాడ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమ���ి బుర్రా దివ్య రాజ్ గారు.
ఆధారాలు ఉన్నాయని తప్పుడు ఆరోపణలు చేసిన నీకు, ఆధారాలు చూపించి, తప్పు చేశారని నిరూపించమని రుక్మిణి కోట గారు లీగల్ నోటీస్ ఇస్తే, నిరూపించడానికి 2 వారాల సమయం ఎందుకు @ImYanamala - శ్రీమతి @RayapatiAruna గారు.
మంగళగిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
మంగళగిరి - తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన ఓటు హక్కును వినియోగించుకున��నారు. గురువారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో మంగళగిరిలోని శ్రీలక్ష్మీనరసింహ కాలనీలో ఉన్న 34వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఎన్నికల నిబంధనలను అనుసరిస్తూ ఓటర్లతో కలసి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో బాధ్యతగా ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
రాష్ట్రంలో ఇటీవల ఫేక్ జాబ్ ముఠా వ్యవహారాన్ని బయటపెట్టి, మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జనసేన పార్టీ ప్రెసిడెంట్ సెక్రటేరియట్లో చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీమతి @kotarukmini గారిపై వైసీపీ అధికార ప్రతినిధి @ImYanamala, @SakshiNews సంస్థ, మరికొందరు సోషల్ మీడియా కార్యకర్తలు వ్యక్తిగతంగా, వ్యాపారపరంగా కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ, ఆమె ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని, మహిళలను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు మధ్యాహ్నం మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి @SailajaRayapati గారికి పలువురు న్యాయవాదులు, జనసేన మహిళా నాయకులు ఫిర్యాదు అందజేశారు.
ఈ ఫిర్యాదు చేసిన వారిలో హైకోర్టు న్యాయవాదులు శ్రీమతి పొన్నూరు సాయి శిరీష, శ్రీమతి నాగలత, జనసేన పార్టీ మహిళా నాయకులు, కాకినాడ ZP చైర్పర్సన్ శ్రీమతి బుర్ర దివ్యా రాజ్, శ్రీమతి పెద్దిశెట్టి ఉషశ్రీ, శ్రీమతి తుమ్మి లక్ష్మీ రాజ్, రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్రీమతి పగడాల శివపార్వతి, శ్రీమతి రాయపాటి అరుణ, అలాగే శ్రీమతి నాగలక్ష్మి, కస్తూరి తేజస్వి, శ్రీమతి దామచర్ల స్వాతి లక్ష్మీ, శ్రీమతి తిరగతి ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా పోటీ చేస్త���న్న NDA కూటమి బలపరచిన అభ్యర్థి శ్రీమతి ఆకుల భవాని గారి కొరకు బ్యాలెట్ నం.1 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం.
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ���ా పోటీ చేస్తున్న NDA కూటమి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్ధి శ్రీమతి ఆకుల భవాని గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ, మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాసు గుర్తుపై వేసి కాకినాడ నగర అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నాము.
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా NDA కూటమి బలపరచి�� జనసేన పార్టీ అభ్యర్థి శ్రీమతి దానేటి రాధారాణి గారు పోటీ చేస్తున్నారు.
శ్రీకాకుళం నగర అభివృద్ధి కోసం, ప్రజల జీవనాభివృద్ధి కోసం "గాజు గ్లాసు" గుర్తుకు ఓటు వేద్దాం.
#VoteForGlass #VoteForNDA
#APLocalBodyElections
కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం నాగులగుట్టపల్లి గ్రామ సర్పంచ్ నామినేషన్ స్క్రూటినీ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలో జనసైనికుడు ముంతల వీరాంజనేయులు గారు మృతిచెందడం అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలచివేసింది. వారి మృతికి సంతాపం తెలియజేస్తూ, శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు KK ఈ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5 లక్షలు అందజేశారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి జనసేన పార్టీ అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
శ్రీకాకుళం ప్రజల మెప్పు పొందాలి
* స్థానిక సమస్యలు తీర్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలి
* ప్రతి ఒక్క ఓటరును కలవడం ప్రధానం
* కూటమి పార్టీల ఐక్యత, సఖ్యతతో మంచి ఫలితాలు
* శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన రాష్ట్ర ఆహార పౌ���సరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ @mnadendla గారు
ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేన పార్టీ పునాదులు బలంగా నిర్మించుకోవాలి. ఇక్కడి ప్రజలు, వారి తెగువ, పోరాటం, శ్రమ అన్నా, ఈ ప్రాంతం తాలూకా కళలు, సంస్కృతి, సంప్రదాయాలు అంటే ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అమితమైన అభిమానం. ఉత్తరాంధ్రకు కీలకమైన శ్రీకాకుళం నగర పాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో కూటమి సాధించే గెలుప�� బలంగా ఉండాలని, దాని కోసం పార్టీ లోని ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేసి, కూటమి పార్టీ నాయకులనూ కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. ఈ నెల 26న జరగనున్న శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఎన్నికల పార్టీ సమన్వయ కమిటీ సమావేశం, ఎన్నికల్లో తలపడుతున్న అభ్యర్థులతో స్నేహపూర్వక సమావేశం ఆదివారం శ్రీకాకుళం లో జరిగింది. ఈ సమావేశంలో శ్రీ మనోహర్ గారు పాల్గొని కమిటీ నాయకులకు, అభ్యర్థులకు గెలుపుపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ "శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న డివిజన్లపై అక్కడ ప్రధానంగా సమస్యలు, ఇబ్బందుల మీద దృష్టి పెట్టాలి. సమయం తక్కువగా ఉన్న దృష్ట్యా పార్టీ నాయకులు అందరిని ఎన్నికల క్రతువులు భాగస్వామ్యం చేయాలి. ప్రతి ఒక్కరికి తగిన బాధ్యతలను అప్పగించాలి. ప్రచారం జరుగుతున్న తీరును, ఎన్నికల సరళని నిత్యం గమనిస్తూ శ్రేణులను సమాయత్తం చేయాలి. జనసేన ���ార్టీ పోటీ చేస్తున్న డివిజన్ అభ్యర్థులతోపాటు కూటమి పార్టీలు పోటీ చేస్తున్న చోట్ల కూడా పార్టీ శ్రేణులను యాక్టివ్ చేసి ప్రచారంలో తిరిగేలా చూడాలి. ప్రతి ఒక్కరి గెలుపు ప్రధానం అన్న విషయాన్ని మర్చిపోవద్దు.
*కూటమి ఐక్యత ప్రధానం*
శ్రీకాకుళం నగరపాలక సంస్థ గెలుపు మనకు ప్రధానం. దీనికి ప్రతి జన సైనికుడు, వీర మహిళ కష్టపడాలి. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో గెలుపొందిన వారు కూడా శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఎన్నికలపై దృష్టి పెట్టాలి. కూటమిలోని తెలుగుదేశం, బిజెపి నాయకులతో పూర్తిస్థాయి సఖ్యతతో ముందుకు వెళ్లాలి. క్షేత్రస్థాయిలో ఉండే చిన్న చిన్న ఇబ్బందులను కూర్చుని పరిష్కరించుకునేలా చూడండి. అధినాయకత్వం దృష్టికి తీసుకురావాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే గ��ర్తించి మా దృష్టికి తీసుకురండి. కేవలం గెలుపు సమీకరణాలు, లెక్కలు మాత్రమే పనికిరావు. క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరును కలిసి వారి ఇబ్బందులు, సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తే మంచి ఫలితం ఉంటుంది. వెంటనే పరిష్కరించే సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కరించే ఏర్పాట్లు చేయండి. ఓటర్లు నమ్మకాన్ని నిలబెట్టుకోవడం స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా ముఖ్యం. కూటమి ప్రభుత్వం రెండేళ్లపాటు సాగి��చిన పాలన విజయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించండి. అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని ఎక్కడ లోటు లేకుండా చేస్తున్న ప్రభుత్వ విధానాన్ని ప్రజలకు తెలియజేయండి.
జన సైనికులకు, వీర మహిళలకు పోరాటం కొత్త కాదు. వారి పోరాట ఫలితం శ్రీకాకుళంలో ప్రస్ఫుటించాలి. గెలిచిన తర్వాత చేయాల్సిన పనులపై ప్రజలకు పూర్తి స్పష్టత, హామీ ఇవ్వాలి. నగర సమస్యలను ప్రత్యేకంగా గుర్తించి దానిపై ప్రణాళిక రూపొందించుకోవాలి. మూడు పార్టీల నాయకుల ఐక్యతతోపాటు కార్యకర్తలను కూడా తగిన విధంగా సమాయత్తం చేసి ముందుగా వెళ్ళాలి. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సమన్వయ కమిటీ దృష్టికి తీసుకురండి. వారు మీ సమస్యలను వెంటనే పరిష్కరించే ఏర్పాటు చేస్తారు. శ్రీకాకుళం అభివృద్ధికి ఉన్నత విద్యావంతురాలు అయిన డాక్టర్ దానేటి రాధారాణి గారి గెలుపుతో నగరం రూపురేఖలు మారతాయి. ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. అనే విషయాన్నీ తెలియజేయండి " అన్నారు.
*హోరెత్తిన ప్రచార ర్యాలీ*
స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీకాకుళంలో జరిగిన కూటమి నాయకుల ర్యాలీ ���ొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారితో కలిసి, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రచారంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ప్రధాన రహదారుల మీదుగా సాగిన ర్యాలీలో కూటమి ఐక్యత వర్ధిల్లాలి అంటూ పెద్దపెట్టున కార్యకర్తలు నినదించారు. రాష్ట్ర ప్రగతి కోసం.. అభ్యున్నతి కోసం కూటమి ఐక్యత కొనసాగాలి అని ఆకాంక్షించారు.
నాగులగుట్టపల్లి ఘటనపై నిష్పక్షపాత విచారణకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు దిశా నిర్దేశం
• నామినేషన్ల పరిశీలన సందర్భంలో జనసైనికుడు శ్రీ ముంతల రామాంజులు మృతి ఘటనపై ఆరా
• శ్రీ రామాంజులు కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా
పులివెందుల నియోజకవర్గం, చక్రాయపేట మండలం, సురభి గ్రామ పంచాయతీ పరిధిలోని నాగులగుట్టపల్లి వద్ద నామినేషన్ల పరిశీలన సందర్భంగా చోటుచేసుకున్న వివాదంలో జనసేన మద్దతుతో సర్పంచ్ గా పోటీ చేస్తున్న అభ్యర్థి బంధువు, జనసేన కార్యకర్త శ్రీ ముంతల రామాంజులు గుండెపోటుతో మరణించిన ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గార��� తీవ్రంగా స్పందించారు. ఘటనపై జిల్లా యంత్రాంగం, పార్టీ శ్రేణుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల పరిశీలన సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆ సమయంలో అక్కడ నెలకొన్న పరిస్థితులపై సమగ్ర వివరాలు సేకరించాలని కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరపాలన్నారు. మృతుడు శ్రీ ముంతల రామాంజులు కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను నమోదు చేసి, ఘటనకు ��ంబంధించిన అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని దిశానిర్దేశం చేశారు. విచారణలో ఎవరైనా బాధ్యులుగా తేలితే, వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
•విచారణ ప్రక్రియపై మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ప్రత్యేక పర్యవేక్షణ
పులివెందుల జనసైనికుడి మృతి, క్షేత్ర స్థాయిలో చోటు చేసుకున్న పరిస్థితులపై విచారించాలని పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి సూచించారు. విచారణ ప్రక్రియను సమన్వయం చేస్తూ, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు. శ్రీ రామాంజులు కుటుంబానికి పార్టీ తరఫన భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్��ొరేషన్ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్ ను పులివెందులకు పంపారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ శ్రీ ముంతల రామాంజులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉప ముఖ్యమంత్రివర్యులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని పార్టీ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు.