మాజీ శాసన సభాపతి, మాజీ మంత్రి, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు.
ఇటీవల పార్టీలో చేరిన పోచారం గారిని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు పరిచయం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
ఈ సందర్భంగా ఖర్గే గారిని శాలువాతో సన్మానించిన పోచారం గారు.
న్యూ ఢిల్లీలో AICC అధ్యక్షుడు శ్రీ @kharge, జనరల్ సెక్రటరీ @kcvenugopalmp, కాంగ్రెస్ అగ్రనేత శ్రీ @RahulGandhi, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్శి గార్లను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారితో కలిసి AICC కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన..
ప్రతీ రోజు ప్రజా భవన్ లో ప్రజలను కలుస్తానని చెప్పి..
కేవలం ఫోటోలు, వీడియోల కోసం మాత్రమే ఒక్క రోజు ప్రజా భవన్ లో హంగామా చేసి.. పత్తా లేకుండా పోయిండు సీఎం రేవంత్ రెడ్డి
@BRSHarish 🔥🔥
సర్పంచ్ పదవికి మాత్రమే విరమణ. ప్రజాసేవకు కాదు!
ఐదేళ్ల కాలం తెలంగాణ ప్రజానీకానికి ఇతోధికంగ సేవచేసిన గ్రామ సర్పంచ్లు పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి కృతజ్ఞతాభివందనాలు
కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గ్రామాల్లో నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలు నెలకొల్పడంలో, దేశానికి ఆదర్శంగా నిలిపిన కృషిలో మీ ప���త్ర ఎనలేనిది. మీరు మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని ఆశిస్తూ 🙏
BRS Party Minority Wing meeting was held today at Telangana Bhavan.
BRS Working President @KTRBRS, former Home Minister @mahmoodalibrs, BRS Minority Wing President Mujeebuddin, BRS secretary general K Keshava Rao, former Speaker @PocharamBRS, MP @DrRanjithReddy and other leaders participated in this event.
మైనార్టీల పైన ప్రతీకారం తీర్చుకుంటున్న ఆర్ఎస్ఎస్ మూలాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి - కేటీఆర్
���త ఎన్నికల్లో బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చినందుకే కాంగ్రెస్ మైనార్టీలపై పగ పట్టింది
అందుకే రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్లో మైనార్టీలకు స్థానం ఇవ్వలేదు
1953 తర్వాత రాష్ట్ర క్యాబినెట్లో మైనార్టీలకు స్థానం దక్కకపోవడం ఇదే మొదటిసారి
ఎన్నికల ముందు మైనార్టీ సెంటిమెంట్ కోసం షబ్బీర్ అలీ పేరు వాడుకున్న కాంగ్రెస్ సలహాదారు పదవి ఇచ్చి చేతులు దులుపుకుంది
మైనార్టీలకు మంత్రి పదవి కాకుండా సలహాదారు పదవి ఇవ్వడం వారి ఆత్మ గౌరవాన్ని కించపరచడమే
మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ బిజెపితో పోటీ పడుతుంది
కాంగ్రెస్ - బిజెపిలది ఫెవికాల్ బంధం
గత పార్లమెంట్ ఎన్నికల మాదిరే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోను ��ాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు అవుతాయి
కాంగ్రెస్ బీజేపీల తెరచాటు బంధాన్ని మైనార్టీలు అర్థం చేసుకోవాలి
ఎన్నికల్లో ఓటర్లుగా మాత్రమే మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ చూస్తుందని విషయం మైనార్టీ సోదరులు అర్థం చేసుకోవాలి
హోం శాఖ నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డినే తాజా మత ఘర్షణలకు పూర్తి బాధ్యత
బీఆర్ఎస్ పార్టీపైన కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టిన మైనార్టీ సోదరులకు ధన్యవ��దాలు : తెలంగాణ భవన్ లో మైనార్టీ విభాగం సమావేశంలో కేటీఆర్
తెలంగాణ భవన్ లో జరిగిన ��ీఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం సమావేశం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం అధ్యక్షులు ముజీబొద్దీన్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి మరియు తదితర నాయకులు పాల్గొన్నారు.
ఆర్ఎస్ఎస్ మూలాలున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈరోజు బీఆర్ఎస్ మైనార్టీ విభాగం సమావేశంలో కేటీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోని బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు బుల్డోజర్ పాలసీతో మైనార్టీ ఆస్తులను, హక్కులను హరిస్తుంటే, రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో అదే బుల్డోజర్ పద్ధతిలో మైనార్టీలపైన ప్రతీకారం తీర్చుకుంటున్నారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మైనార్టీలు పెద్ద ఎత్తున భారత రాష్ట్ర సమితికి మద్దతు అందించారని అందుకే కాంగ్రెస్ పార్టీ మైనార్టీల గురించి పట్టించుకోవడం లేదన్నారు.
ఆర్ఎస్ఎస్ మూలాలు కలిగి ఉన్న రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మైనార్టీలకు రాష్ట్ర క్యాబినెట్ లో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని కేటీఆర్ అన్నారు. 1953 తర్వాత తొలిసారి రాష్ట్ర క్యాబినెట్లో మైనార్���ీలకు ప్రాతినిధ్యం దక్కలేదన్నారు. కేవలం ఎమ్మెల్యేగా మైనార్టీ నేతలెవరు గెలవలేరు అన్న సాకుతో కాంగ్రెస్ తప్పించుకోజాలదని, మైనార్టీలకు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత కూడా శాసనసభ్యునిగా ఎమ్మెల్సీ పదవి ఇవ్వచ్చన్న విషయం కాంగ్రెస్ కావాలనే మరిచిపోయిందన్నారు. మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం ఇవ్వని ఇతర రాష్ట్రాల బిజెపి ప్రభుత్వాల కన్నా ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం తీసి పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవ��ం ఎన్నికల్లో ఓటర్లుగా మాత్రమే మైనార్టీలను కాంగ్రెస్ పార్టీ చూస్తుందని విషయం మైనార్టీ సోదరులు అర్థం చేసుకోవాలన్నారు. మైనార్టీలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించకుండా అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ బిజెపితో పోటీ పడుతుందన్నారు.
ఎన్నికల ముందు మైనార్టీ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ షబ్బీర్ అలీ పేరు వాడుకుందని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కేవలం సలహాదా���ు పదవి ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. మైనార్టీలకు మంత్రి పదవికాకుండా సలహాదారు పదవి మాత్రమే ఇవ్వడం అంటే మైనార్టీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయటమే అన్నారు.
రేవంత్ రెడ్డి 50 రోజుల కాంగ్రెస్ పాలనలో ఒక్కరోజు కూడా మైనార్టీ సంక్షేమం పైన సమీక్ష నిర్వహించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల అప్పుడు ఇచ్చిన 12 ప్రధానమైన హామీలను వెంటనే అమలు చేయాలని, ముస్లిం కోటాను పెంచడం, 4000 కోట్ల రూపాయల బడ్జెట్ ను మైనార్టీలకు కేటాయించడం వంటి అంశాల పైన తక్షణమే చర్యలు ప్రారంభించాలన్నారు.
గత ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ��్తే మతకల్లోలాలు చెలరేగుతాయని తాము హెచ్చరించామని ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో సంగారెడ్డి, నల్గొండ మరియు అనేక ఇతర ప్రాంతాల్లో జనవరి 22వ తేదీన మత ఘర్షణలు చోటు చేసుకున్న విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. మత ఘర్షణలను ఆపకుండా కేవలం కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పైన కేటీఆర్ మండిపడ్డారు. హోం శాఖ నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డినే మత ఘర్షణలకు ప��ర్తి బాధ్యత వహించాలన్నారు. మత ఘర్షణల అనంతరం రేవంత్ రెడ్డి ఎలాంటి సమీక్ష నిర్వహించకపోవడం, జిల్లా పోలీసు అధికారులతో మాట్లాడకపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు
గత ప్రభుత్వం హయాంలో మైనార్టీల సంక్షేమం కోసం ఎంతగానో ప్రయత్నం చేశామని విస్తృతమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. ముఖ్యంగా విద్యారంగంలో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి. మైనార్టీలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ విధానాల పట్ల నమ్మకం ఉంచి పార్టీకి పెద్ద ఎత్తున గత ఎన్నికల్లో మైనార్టీలు మద్దతు ఇచ్చారని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పైన కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టిన మైనార్టీ సోదరులకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ బిజెపికి లబ్ధి చేకూర్చేలా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బలహీన��ైన అభ్యర్థులను నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోను ఇదే మాదిరిగా బిజెపికి కాంగ్రెస్ లబ్ధి చేకూర్చిందన్నారు. బిజెపి కాంగ్రెస్ లు అనేక ఎన్నికల్లో తెలంగాణలో కలిసి పని చేశాయని విమర్శించిన కేటీఆర్, రానున్న ఎన్నికల కోసం ఇదే తీరుగా పనిచేసేందుకు సమాయత్తమవుతున్నాయి అన్నారు. కాంగ్రెస్ బిజెపిల ఫెవికాల్ బంధాన్ని మైనార్టీ సోదరులు గుర్తించాలని కోరారు.
ఈ భోగి ప్రజలందరి జీవితాల్లో భోగభాగ్యాలతో పాటుగా సుఖసంతోషాలను అందించాలని.. ప్రతీ ఇంట సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ
ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.
#HappyBhogi
యువతక��� స్ఫూర్తి ప్రదాత, దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన చైతన్య మూర్తి స్వామి వివేకానంద జయంతి సందర్భంగా
ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.
#NationalYouthDay
I've been watching & hearing from concerned citizens about numerous videos of Praja Palana applications being mishandled carelessly by certain private individuals. These application forms contain sensitive data of Crores of Telangana citizens
I urge the state government to take appropriate precautions to prevent this confidential data from falling into the hands of cybercriminals
Dear Telangana Brothers and Sisters,
Don’t share OTP or any bank details if someone calls you offering to give pension or house or any of the 6 Guarantees.
Don’t unnecessarily lose money listening to the words of Dy CM Bhatti Vikramarka.
Irrespective of whether you voted for BRS or not,
As someone who was part of drafting Cybercrime legislation- take my word seriously and don’t fall prey to Cybercriminals.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
ప్రజలు మనకు పదేళ్లు అవకాశం ఇచ్చారు. అధికారంలోకి వస్తాం అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకోలేదు. నోటికి ఏది వస్తే అది హామి అని చెప్పారు. ఆరు గ్యారెంటీలు అన్నారు. కానీ 420 హమీలిచ్చింది కాంగ్రెస్
వాళ్ళ తప్పుడు ప్రచారం నమ్మి ప్రజలు గొప్పగా పని చేసిన నాయకులను కూడా తిరస్కరించారు.
రేషన్ కార్డులు ఇవ్వలేదు అని ప్రచారం చేశారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అన్నారు, తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చింది
దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మన ప్రభుత్వం. మేము ఏనాడు చెప్పుకోలేదు.
ప్రభుత్వ ఉద్యోగు��కు అత్యధిక వేతనాలు ఇచ్చింది మన ప్రభుత్వం కానీ మేము చెప్పుకోలేదు, ప్రచారం చేస్కోలేదు.
దేశంలో అందరికన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు 73% జీతాలు పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్
29 లక్షల ఫించన్లను 46 లక్షలకు పెంచినా ఏనాడు చెప్పుకోలేదు.
దేశంలో అందరికన్నా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే
కానీ ఇలాంటి అనేక అంశాలను చెప్పుకోవడం విఫలమయ్యాం
అందుకే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది
పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మేమే గెలిచే వాళ్ళం.
వందలాది సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వ హయాంలో అమలు చేసినా, ఏనాడు కూడా ప్రజలను లైన్లలో నిలబెట్టలేదు
ప్రజల సౌకర్యమే చూసాము కానీ రాజకీయ ప్రయోజనము, రాజకీయ ప్రచారమే గురించి ఏనాడు ఆలోచించలేదు
ప్రజలు మనల్ని పూర్తిగా తిరస్కరించలేదని గుర్తుంచుకోవాలి. BRS పార్టీకి మూడో వంతు సీట్లు 39 వచ్చాయి. 14 స్థానాల్లో ఓటమి కేవలం గరిష్టంగా 6 వేల ఓట్ల తోనే జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ మనకు తేడా కేవలం 1.85 శాతం.
స్దానిక సంస్ధల నుంచి మెదలుకోని, అసెంబ్లీదాకా బలమైన నాయకత్వం మనకున్నది. బలమైన ప్రతిపక్షం మనద��. అన్నిటికీ మించి కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు మనకున్నారు.
మహబూబ్ బాద్ పార్లమెంట్ ఎన్నికలే మన గెలుపుకు సోపానం కావాలి
ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ రెడ్డి అనేక మాటలు మాట్లాడారు, రుణం ఉన్నవాళ్లే కాదు, వ్యవసాయ రుణం లేనివాళ్లు కూడా తీసుకోండి, రాగానే వెంటనే రుణమాఫీ చేస్తామన్నారు
ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దారిలేకనే అప్పులు, శ్వేతపత్రాల నాటకాలను ఆడుతున్నారు.
అందుకే వాస్తవాలు అందరికీ తెలియాలనే స్వేద పత్రం రూపొందించాం.
ఎవరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు... మన పార్టీకి బలమైన నాయకులు అద్భుతమైన నాయకత్వం ఉన్నది
ఇలాంటి పార్టీ సమావేశాలను వరుసగా పెట్టుకుంటాం... అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తాం.. పార్టీకి అన్ని వర్గాలను దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడతాం
గిరిజనులకు స్థానిక సంస్థల రిజర్వేషన్ తో పాటు.. పొడు భూముల పట్టాల ��ంపిణీ, అనేక ఇతర సంక్షేమ పథకాలు అనేక కార్యక్రమాలను మన ప్రభుత్వం గతంలో అందించింది
అయినా గిరిజనం ఎక్కువ ఉన్న చోట్లకూడా ప్రజలు పూర్తి మద్దతు మనకివ్వలేదు, ఇలాంటి వాటన్నింటి విమర్శ చేసుకుని ముందుకుపోతాం.
ఈ సమావేశంలో మాజీ మంత్రులు @BRSHarish, @VPR_BRS, @Satyavathi_BRS, మాజీ స్పీకర్ @PocharamBRS, ఎంపీ @BRSKavitha, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మ��జీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్లో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, బీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ కే.కేశవరావు, మాజీ మంత్రి @VPR_BRS, మాజీ స్పీకర్ లు @PocharamBRS, మధుసూధనా చారి, ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ @RaoKavitha, నిజామాబాద్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవకర్గాల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.
లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల్లో భాగంగా తెలంగాణ భవన్ లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ప్రతినిధులతో సమావేశం.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజ��� మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ స్పీకర్ లు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూధనా చారి, ఎంపీ బిబి పాటిల్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, ��ిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.