*వినాయక చవితి సందర్బంగా*
ఈ రోజు సుభాష్ నగర్ డివిజన్ లోని వీర గణపతి యూత్ (VGY)ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం లో మొదటి పూజ లో పాల్గొని ఆ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న డివిజన్ BRS పార్టీ అధ్యక్షులు పోలె శ్రీకాంత్ గారు.
*_"ఆయిమాత" అమ్మవారి కృపా కటాక్షాలు భక్తులందరిపై ఉండాలి: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు..._*
ఈరోజు 130 - సుభాష్ నగర్ డివిజన్ సుభాష్ నగర్ లోని అయిమాత దేవాలయంలో సిర్వీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఆయిమాత అమ్మవారి 611వ జయంతి & దేవాలయ 23వ వార్షికోత్సవ వేడుకలకు" బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆయి మాత కృపా కటాక్షాలు, సిర్వి సమాజ్ సంపూర్ణ మద్దతుతో నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన మీకు అందరకీ నా ధన్యవాదాలు. సమాజ సభ్యులకు నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.
అనంతరం సిర్వి సమాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సిర్వి సమాజ్ అధ్యక్షులు రావత్ రాంజీ బర్ఫా, ఉపాధ్యక్షులు సోహన్ లాల్జీ పరిహార్ , దుర్గా రాంజీ ములేవా, కార్యదర్శి ప్రేమ్ పావార్, జాయింట్ సెక్రెటరీ మంగల్ పావార్, ట్రెజరర్ పవర్ లాల్ ఖగ్, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
*కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తాలో ని బాబా సాహెబ్ D.R. BR అంబేద్కర్ విగ్రహిని వినతిపత్రం**కత్బుల్లాపూర్నియోజకవర్గం130 సుభాష్ నగర్ డివిజన్ న్నిన్న అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం BRS పార్టీ MLA లు, MLC పట్ల జరిగిన దౌర్జన్యం పై నిరసనగా వినతిపత్రం.
🔥✊*కుత్బుల్లాపూర్లో నియోజకవర్గం CMC కొంపల్లి సర్కిల్ BRS పార్టీ డివిజన్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోరు బాట*@BRSPartyKcr @KTRBRS@kp_vivekanand@RajuShambipur
*_ప్రతీ ఆటో కార్మికుడికి బాకీ పడ్డ 36 వేల రూపాయలను ఎప్పుడు చెల్లిస్తావ్ రేవంత్ రెడ్డి : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు..._*
కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనలో భాగంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులపాటు నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు "మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వ విఫలం, ఆటో కార్మికులకు సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసిన తీరును" నిరసిస్తూ బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారి ఆధ్వర్యంలో సుచిత్ర చౌరస్తా నుంచి జీడిమెట్ల గ్రామం గాంధీ విగ్రహం వరకు ఆటో కార్మికులతో కలిసి బిఆర్ఎస్ శ్రేణులు భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ గారు మాట్లాడుతూ....
🛺 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆచరణకు సాధ్యం కానీ అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆటో కార్మికులను రోడ్డున పడేసింది.
🛺 ప్రతి ఆటో కార్మికుడికి సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సంవత్సరాలైనా 12 వేల రూపాయల కాదు కదా 12 పైసలు కూడా ఇవ్వకుండా ఆటో కార్మికులను మోసం చేసింది.
🛺 మూడు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వం ఒక్కో ఆటో కార్మికుడికి 36వేల రూపాయలను బాకీ ఉందని, రేవంత్ రెడ్డి ఈ బాకీ ని ఎప్పుడు చెల్లిస్తారో ఆటో కార్మికులకు స్పష్టం చేయాలి.
⛲ హైదరాబాద్ నగరంలో రాత్రి అయితే చాలు చిమ్మ చీకట్లు అలుముకుంటున్నాయి. కొత్త వీధి దీపాల ఏర్పాటును పక్కకు పెడితే ఉన్న వీధి దీపాల నిర్వాహణను కూడా నిర్వహించలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉంది.
⛲ నగరంలో ఎక్కడ ఏ రోడ్డు చూసినా డ్రైనేజీ మూతలు కుంగడం వాటిని మార్చకపోవడంతో వాహనదారులు, పాదాచారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్న ప్రజలకు మౌనిక వసతులను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది.
⛲ వేగంగా విస్తరిస్తున్న నార్త్ హైదరాబాద్ నగరాన్ని పక్కకు పెట్టి సీఎం తన ఊహల నగరమైన ఫోర్త్ సిటీకి అధిక ప్రాధాన్యతనిస్తూ హైదరాబాద్ నగర ప్రజలను విస్మరిస్తున్నారు.
⛲ వేగంగా విస్తరిస్తున్న నార్త్ హైదరాబాద్ సిటీకి మెట్రో రైలు మార్గం ఎంతో అవసరం. కానీ ప్రభుత్వం మాత్రం నార్త్ హైదరాబాద్ సిటీని పక్కకు పెట్టి ఫోర్త్ సిటీ పేరుతో రాజకీయాలు చేస్తూ ఇక్కడి ప్రజలను మోసం చేస్తుంది. ఇదే విషయంలో మెట్రో సాధన సమితి సభ్యులు, ప్రజల పక్షాన మేము ఎన్ని సార్లు ధర్నాలు చేసినా ప్రభుత్వంలో మాత్రం ఎటువంటి చలనం లేదు.
⛲ఫోర్త్ సిటీలో కనీసం ఒక పుట్టు, ఒక మనిషి నివసించే పరిస్థితి లేదు. అలాంటి నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామంటూ నానా హైరానా చేస్తూ హైదరాబాద్ మహానగరాన్ని మూడు ముక్కలు చేసి మౌలిక వసతులను కల్పించకుండా ప్రజలకు తీవ్ర అవస్థలు కలిగిస్తున్నారు.
⛲ యధా రాజా తధా ప్రజా.... అనే విధంగా రాష్ట్రంలో గుంపు మేస్త్రి వ్యవహరిస్తుంటే స్థానికంగా ఉన్న కొందరు కాంగ్రెస్ నాయకులు కార్లల్లో కొబ్బరికాయలు పెట్టుకొని తిరుగుతూ ఎక్కడపడితే అక్కడ కొబ్బరికాయలు కొడుతూ చెడ్డి గ్యాంగ్ లా కొబ్బరికాయల గ్యాంగ్ తయారయ్యారు.
⛲ మరికొన్ని ప్రాంతాల్లో అయితే సంక్షేమ సంఘాల సభ్యులను బ్రతిమిలాడి చీకట్లలో ఉన్న వారి రాజకీయ భవిష్యత్తులో చివరి ప్రయత్నంగా నానా హైరానా చేస్తూ ఫోటో ఫోజుల కోసం, వారి అధిష్టానం మెప్పుకోసం, లేనిది ఉన్నట్లుగా అర్హత లేకున్నా కొబ్బరికాయలు కొడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.
⛲ ఇకనైనా స్థానిక కాంగ్రెస్ నాయకులు ఈ కొబ్బరికాయల చిల్లర రాజకీయాలను బంద్ చేయాలి. ప్రజలు అంతా గమనిస్తా ఉన్నారు. మీరు ఎన్ని వేషాలు వేసిన ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా కెసిఆర్ గారిని కోరుకుంటున్నారు. రానున్న ఎన్నికల్లో కెసిఆర్ గారు మళ్లీ సీఎం అవ్వడం కాయం.... కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవ్వడం ఖాయం.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన వివిధ మున్సిపాలిటీల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, అభిమానులు, స్థానిక సంక్షేమ సంఘాల సభ్యులు, ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.