ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి, ప్రాణాలు కోల్పోయిన మహనీయులు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక శ్రీ పొట్టి శ్రీరాములు గారు. తన ప్రాణత్యాగంతో ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పడేలా చేసి, అమరజీవిగా నిలిచారు. నేడు ఆయన వర్థంతి సందర్భంగా ఘన నివాళులు.
Congratulations to @BJP4India on winning the assembly elections in Rajasthan, Madhya Pradesh and Chhattisgarh.
Congratulations to @INCIndia on winning the assembly elections in our neighbouring state of Telangana.
విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. వారు కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. వారికి మంచి వైద్యం అందించడంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించాను.
మహాత్మా గాంధీ గారి మాటలు ఆదర్శంగా…రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నాం. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశాం. మునుముందు కూడా ఆయన చూపిన మార్గంలోనే నడుస్తాం. నేడు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా నివాళులు.
I am proud to extend @YSRCParty’s support to the #WomenReservationBill.
Empowering our women is of utmost importance to us. We achieved this in Andhra Pradesh not only through the schemes and initiatives introduced in the past 4 years, but also by ensuring equitable representation.
Together, let’s create a brighter and more equitable future! #WomenEmpowerment #AndhraPradesh
ఈ వినాయక చవితి నాడు ఆ విఘ్నేశ్వరుడి శుభ దృష్టి మన రాష్ట్రంపై ఉండాలని, విఘ్నాలన్నీ తొలగి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
రాష్ట్రవ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటులో భాగంగా నిర్మాణం పూర్తైన 5 కాలేజీలను నేడు మన ప్రభుత్వంలో ప్రారంభించాం. ఈ కాలేజీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు ఇక్కడ నేర్చుకున్న విద్యతో ప్రజలకు మెరుగైన సేవలు అందించి, గొప్ప డాక్టర్లుగా పేరు తెచ్చుకోవాలి. మన ప్రభుత్వం నిర్మిస్తున్న మెడికల్ కాలేజీల్లో వచ్చే ఏడాది 5, ఆ మరుసటి ఏడాది మరో 7 కాలేజీలు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటుకు మన ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఫలితంగా మన రాష్ట్రానికి చెందిన వేల మంది విద్యార్థులను గొప్ప డాక్టర్లను చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
I trust that you will become some of the best doctors this country has ever seen.
All the very best!
నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా.
The Telugu Flag flies high at the 69th National Film Awards!
My best wishes and congratulations to @alluarjun on winning the National award for best actor and @ThisIsDSP on winning the National Award for best music for Pushpa.
Kudos and congratulations to @ssrajamouli garu and the entire team of RRR for the continued accolades in winning the National Award for best popular film and 5 other awards.
My best wishes and congratulations to @boselyricist garu on winning the National Award for best lyrics for the film Konda Polam.
You have made us all incredibly proud!
My congratulations and best wishes to our very own @JyothiYarraji from Vizag, on winning gold at the 25th Asian Athletics Championships held in Thailand. You’ve made us all very proud Jyothi!
నేడు జమ్మలమడుగు, తిరుపతి, విశాఖపట్టణాల్లో ఒబెరాయ్ సంస్థ తన హోటల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం శుభ పరిణామం. గ్రాండ్ కానియన్ ఆఫ్ ఇండియాగా మనం పిలుచుకునే జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండికోట ప్రాంతాన్ని నేడు ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తే మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. ఈ దిశగా మన ప్రభుత్వం కృషి చేస్తోంది.
ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోంది. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు.