చదువుకున్న చదువు, సంపాదించుకున్న అనుభవం.... ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ -AI ముందు పనికిరాకుండా పోతాయా...? అవుననే అంటున్నాయి టెక్ వర్గాలు. వచ్చే 12 నుంచి 18 నెలల్లోనే.... ప్రపంచవ్యాప్తంగా లక్షలాది వైట్ కాలర్ ఉద్యోగాలు అంతరించిపోతాయని లేదా పూర్తిగా ఆటోమేట్ అవుతాయని.... మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం అధిపతి ముస్తఫా సులేమాన్ హెచ్చరించారు. అకౌంటెంట్లు, లాయర్లు, మార్కెటింగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలకు కాలం చెల్లిపోతుందన్నారు. సులేమాన్ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల్లో వణుకు పుట్టిస్తున్నాయి.
మన గ్రామదేవతలు ఎలా వెలిశారు ? మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామదేవతల నామ విశేషాలేమిటి?
గ్రామదేవతా వ్యవస్థ:
గ్రామాలలో వెలిసే దేవత దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను గ్రామదేవతలని అంటారు. సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు. ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు, ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో, కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు. ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము సాద్యపడకపోవచ్చు. ఇలాంటి సందర్భాలలో అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.
ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త, ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది. ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో అలాంటి వారిని వారికోరిక మేరకు అర్చకులుగా నియమించారు పూర్వికులు. అప్పటినుంచి ఆ అర్చకుని వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము సరైన మూహూర్తములోనే వేయబడింది కాబట్టి గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు. అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన ఆ నెల, ఆ తిథినాడు కచ్చితముగా విద్వాంసులను పిలిచి #పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. అలా చేయడమువలన అమ్మకి మన ద్వారా ఏదైనా అపవిత్రత కలిగివుంటే తొలగుతుంది.
గ్రామదేవతల ఆవిర్భావము:
#పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది. అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు గ్రామదేవతలను ఏర్పాటు చేసారు తొలి దశలో.
🙏పృధ్వీ దేవత:పృధ్వీ అంటే నేల, ఇది పంటకి ఆధారము, కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన పృధ్వినీ దేవతను #కుంకుళ్ళమ్మ అన్నారు. గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార. ఇవే వారి జీవన ఆధారము కాబట్టి ఆపేరుతో #గోగులమ్మని యేర్పాటు చేసారు. జొన్నలు పండేచోట #జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో #నూకాళమ్మ అని పిలుచుకున్నారు. మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూవుండడము, దాన్నే సొమ్ముగా మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ. పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని చేనుకి వెల్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి కాబట్టి #అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది. ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది.
🙏జల దేవత:జలానికి సంభందించిన తల్లి #గంగమ్మ–గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది. గుడి ఎత్తుగా కట్టినా తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.
🙏 అగ్ని దేవత:మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా #సూరమ్మనూ, రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా #పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. సూరమ్మను ప్రతీ అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతీ పౌర్ణమినాడు పూజించే విదముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు. ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు #ఇరుకళమ్మ (సూర్య,చంద్రుల కల వున్న అమ్మ).
🙏వాయు దేవత:నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి. కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు #కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు.
🙏ఆకాశ దేవత:ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున #కొండమ్మ ను ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు, గాలివాన. ఇలాంటి వాటి నుండి రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు.
కుక్క కరిస్తే …
కుక్క అన్నాక కరుస్తుంది, అది ముద్దు పెట్టుకుంటుంది, మూతి నాకుతుంది అని మాత్రమే అనుకుంటే అది నీ మూర్ఖత్వం.
అది ఊర కుక్కైనా, పెంపుడు కుక్కైనా, జాతి కుక్కైనా, వాక్సిన్లు వేసిన కుక్కైనా ప్రతి కుక్క కాటుకి తప్పకుండా రేబీస్ రాకుండా చికిత్స తీసుకోవాలి. చికిత్స తీసుకోకుండా నువ్వు తీసుకునే రిస్కు విలువ నీ ప్రాణం కావచ్చు.
రేబీస్ సోకిన కుక్క మెదడులో రేబీస్ వైరస్ ఉంటుంది. అక్కడ్నుంచి దాని లాలాజల గ్రంధులకు (సలైవరీ గ్లాండ్స్)పాకి దాని ఉమ్మిలోఆ వైరస్ డాన్సు చేస్తూ ఉంటుంది. రేబీస్ సోకిన కుక్కకి మతి భ్రమిస్తుంది, దాంతో అది విచక్షణారహితంగా కనపడినవాళ్లందర్నీ కరుస్తుంది.
ఎక్కడ, ఎంత కరిచింది అన్నది ముఖ్యం. మన మెదడు నుంచి గాయం ఎంత దూరం ఉంది, ఎంత లోపలికి ఉంది అన్నది రేబీస్ మనకి వచ్చే వేగాన్ని డిసైడ్ చేస్తాయి. ఉదా, ముఖం మీద కరిస్తే, కాలు మీద కరిచిన దానికంటే వైరస్ త్వరగా మెదడుని చేరుకుంటుంది. అలాగే చర్మం పైన పన్నుతో గీకడం లేదా తెగిన చర్మం మీద కుక్క నాకడం కంటే పన్ను లోపలికి దిగినట్లు కరిస్తే మెదడుని చేరే వేగం ఎక్కువ. మన ఒంట్లో నాడులు ( నర్వ్స్) అన్నీ మెదడుకి వెళ్తాయి. ఈ వైరస్ కరిచిన చోటుని ఉన్న నాడిని పట్టుకుని పైకెళ్ళి మెదడుని చేరుకుంటుంది. అక్కడ మెదడుని తిని వృద్ధి చెందుతుంది. అదీ విషయం.
ఇక పోతే మనకేదో దెబ్బ తగిలి దాన్ని కుక్క నాకినా, లేదా కుక్క కరిచినా అది రేబీస్ సోకే అవకాశం ఉన్న గాయంగా పరిగణించాలి. కుక్కే కాదు పిల్లి, ఎలుక కరిచినా ఇదే జాగ్రత్తలు తీసుకోవాలి. వాటివలన కూడా రేబీస్ వస్తుంది.
కుక్క కాళ్ళతో గోకితే ఈ ఇబ్బంది లేదు. అలాగే కుక్క తిన్న ఆహారాన్ని తిన్నా కూడా ఇబ్బంది లేదు. (ఇలా తినేవాళ్ళు ఉన్నారు). రేబీస్ ఈ రకంగా రాదు.
మొత్తానికి ఇక గాయాన్ని ముందు సబ్బుతో బాగా కడగాలి. సబ్బులోని క్షారగుణం వలన వైరస్ నిర్వీర్యం అవుతుంది. ఈ కడగటం నీరు ధారగా కారే కుళాయి కింద కడగాలి అంటే వాడిన నీరు మళ్లీ వాడకూడదు. గాయానికి కట్టు కట్టొచ్చు కానీ కుట్లు వెయ్యకూడదు. కుట్లు వెయ్యటం వలన రేబీస్ వైరస్ని సరాసరి సూదితో నాడిలోకి ఎక్కించే అవకాశం ఉంది. కుట్లు వెయ్యాలా వద్దా అన్నది డాక్టర్ నిర్ణయిస్తారు.
కుక్క కరిచిన రోజే ఆంటీ రేబీస్ వాక్సిన్ వేయించుకోవాలి. అక్కడ్నుంచి మిగతా మూడు డోసులూ క్రమం తప్పకుండా సమయానికి వేసుకోవాలి. ఈ వాక్సిన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభిస్తుంది. కొన్నిసార్లు కరిచింది రేబీస్ ఉన్న కుక్కే అని నిర్ధారణ అయినపుడు, గాయం పెద్దది ఉన్నప్పుడు అక్కడ చేరిన వైరస్ ని నిలువరించడానికి రేబీస్ ఇమ్యునోగ్లోబులిన్ ఇంజెక్షన్ చేస్తారు. ఇది అన్నివేళలా అవసరం లేదు, అలాగే అందుబాటులో ఉండదు.
ఏదైనా గాని వైరస్ మెదడుకి చేరనంత వరకే, ఒకసారి చేరాక రేబీస్ వస్తుంది. దీనికి వైద్యం లేదు. మరణం తథ్యం. కాబట్టి కుక్కలకి దూరంగా ఉండండి. కుక్కలున్న ఇళ్లకి దూరంగా ఉండండి. ఎక్కువ పెంపుడు కుక్కలకు తర్ఫీదు ఇవ్వరు కాబట్టి అవి కరుస్తాయి. వాటి జోలికి వెళ్ళకండి. మీ పిల్లలని ఒంటరిగా రోడ్డుపైకి పంపకండి. రాత్రివేళల్లో చేతిలో ఒక కర్ర పట్టుకుని వెళ్ళండి. లేదా కుక్కలు రోడ్ల మీద తిరగని దేశాలకి వలస వెళ్ళిపోండి.