వారాహి నవరాత్ర ప్రారంభం :
నేటి నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభం. వారాహి... లలితాదేవికి సైన్యాధ్యక్షురాలు. సప్త మాతృకలలో వారాహి ఒకటి. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు. ఈమె వరాహ స్వామి అర్ధాంగి. వారాహి దేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు కూడా పూజిస్తారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి ఈమె ప్రతిరూపాలే అంటారు. మార్కండేయ పురాణంలోని దేవీ మాహాత్మ్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుళ్ళ శరీరాల నుండి వారి స్త్రీ రూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రహ్మాణి, ఇలా పరాహ స్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ రూపంలో చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణితమైంది. వామన పురాణం, మత్స్యపురాణంలో కూడా వారాహీ దేవత ప్రస్తావనలు ఉంటాయి.
ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తసవరాత్రులు అంటారు. వారాహి దేవి లలితా పరాభట్టారిక సేనాని.. లలితసైన్యంలోని రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి ఆధీనంలో ఉంటాయి...అందుకే ఆవిడను దండనాథ అన్నారు. ఈమెకు ప్రత్యేక రథం ఉంది. దానిపేరు కిరి చక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి, రథసారథి పేరు స్థంభినీ దేవి. ఈమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి, దేవవైద్యులైన అశ్విని దేవతలు వారాహి రథంలో ఉంటారు. వారాహీ అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు, శ్రీమహావిష్ణువు వరాహరూపంలో అవతరించి, వాడిని సంహరించి, భూదేవిని రక్షిస్తాడు. శ్రీలక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. ఆమె అనేక స్వరూపాలతో భక్తుల పూజలందుకుంటోంది.
#BhakthiTV
🌞 Divine Harathi Darshan of Sri Surya Narayana Swamy at Arasavalli Sri Surya Narayana Swamy Temple 🙏
May Surya Bhagavan bless everyone with good health, prosperity, success, and spiritual light.
🌅 Om Sri Surya Narayanaya Namah
#Arasavalli#SuryaNarayanaSwamy
Kalyana Srinivasa Swamy, adorned as Navaneeta Krishna, captivated devotees on Chandra Prabha Vahanam during the annual Brahmotsavams at Narayanavanam. The divine procession bestowed peace, prosperity and spiritual bliss.
#chandraprabhavahanam#narayanavanam#ttd
🙏 Sri Venkateswara Swamy Divya Darshan 🙏
The Lord of the Seven Hills — where devotion meets the divine.
May Balaji's blessings bring peace and prosperity to all 🪔🌸
Govinda Govinda 🙏 | Om Namo Venkatesaya
#SriVenkateswaraSwamy#Balaji#Tirupati#DivyaDarshan#Govinda
హనుమజ్జయంతి వైభవం 🌺🙏
Worshipping Lord Hanuman is equal to worshipping all the deities.
Remembering Anjaneya Swamy protects us from every negative force and fills life with courage, strength, and devotion. 🚩
🗓️ Hanuman Jayanti Special
🕓 May 12 | Tuesday | From 4:00 AM onwards
Watch LIVE special programs and divine celebrations only on Bhakthi TV and receive the blessings of Anjaneya Swamy. 🙏
#HanumanJayanti #HanumanJayanti2026 #JaiHanuman #AnjaneyaSwamy #BhakthiTV #LordHanuman #HanumanBlessings #HanumanVaibhavam
The powerful Nethra Darshan of Sri Venkateswara Swamy 👁️
A divine gaze that dissolves worries and fills hearts with peace.
🌺 Govinda Govinda 🌺
#NethraDarshan#Tirumala#Venkateswara#Bhakti
రోజూ మిమ్మల్ని మీరు వేసుకోవాల్సిన ప్రశ్నలు!
1. విటమిన్ డి వేసుకున్నానా? (లోపం ఉంటే)
2. వ్యాయామం చేశానా?
3. ఇంట్లో వాళ్ళతో/ నేస్తాలతో కలిసి భోజనం చేశానా?
4. బుర్రకి పదునుపెట్టే ఏదైనా పదవినోదమో, పజిలో చేశానా?
5. పుస్తకం చదివానా?
6. ఎవరికైనా ఏదైనా సాయం చేశానా?
7. నీళ్లు సరిపడా తాగానా?
8. ప్రొటీన్లతో కూడిన ఆహారం తిన్నానా?
9. సంతృప్తినిచ్చే విధంగా పని చేశానా?
10. ఏదైనా విషయం పట్ల కృతజ్ఞత (గ్రాటిట్యూడ్) కలిగి ఉన్నానా?