అంటే మీ AI లాంగ్వేజ్ మోడల్ లో వాట్సాప్ లో BRS status పెట్టుకుంటే, ఎస్సీలైతే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వనవసరం లేదని షరతులు విధించి ప్రోగ్రాం తయారు చేసిండ్రన్న మాట! మరీ ఇంత చిల్లర పాలనా?
@TelanganaCMO
Y TGPSC issued 2 Different Halltickets for Prelims and Mains..?
Y Gender Medium based seggregation Taken place ?
Y Telugu medium students are not in the list?
Y Marks are not Published in Public domain?
Only from koti women's college 12.62% selection in 563 🙄.?
@kishanreddybjp
Congress Government's decision will affect Civil Engineers who are awaiting 1000 Deputy Surveyor Jobs.
As Minister Ponguleti announced that VRO, VRAs will be selected for this Job, a recruitment opportunity will be lost.
Apart from Congress stealing credit for 50000 Jobs notified and conducted by KCR Govt,
Congress could not even fill these 1000 Jobs ❓️
Deputy Surveyor Jobs seek Qualified Civil Engineers, if that is indirectly filled with VRA's then Civil Engineers are at loss..
Is backdoor selection for Corruption❓️
@revanth_anumula keep your word to Civil Engineers and release Job notification ...
ముఖ్యమంత్రి @revanth_anumula గారు, కేసీఆర్ గారి హయాంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కు మీ ప్రభుత్వ హయాంలో తుది ఫలితాలు రాబట్టుకోవడానికి ఎనిమిది వేల మంది నిరుద్యోగ గ్రూప్-4 అభ్యర్థులు పడిన బాధలు వర్ణనాతీతం. మీరు అన్విల్లింగ్ (Relinquishment) ఆప్షన్ ఇవ్వనందు వల్ల చాలా బ్యాక్ లాగ్ పోస్టులు వచ్చే ప్రమాదముంది. ఇప్పటికైనా డిసెంబర్ 9 లోగా వారికి అపాయింట్మెంట్ ఇస్తామని చెబుతున్న ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారి మాటలు నిజం చేస్తారని ఆశిస్తున్నా.
అయితే, మీ జరుపుకోబోయే విజయోత్సవాల్లో మీరు కావాలని పక్కకు పెడుతున్న జె ఎల్ అభ్యర్థుల ఫలితాల గురించి, అపాయింట్మెంట్ ఆర్డర్ ల గురించి మళ్ళీ మీ దృష్టికి తీసుకువస్తూ, ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించి అభ్యర్థుల తరపున అడుగుతున్న మా ఈ మౌళిక ప్రశ్నలకు సమాధానం చెప్పండి.
1. @KCRBRSPresident గారి హయాంలో ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీ లలోకి జూనియర్ లెక్చరర్లు పోస్టులకు అభ్యర్థులు పరీక్షలు రాసి ఏడాది గడిచిపోయింది. 8000 మంది గ్రూప్-4 ఫలితాలను ఒకే సారి విడుదల చేయగలిగిన టిజిపిఎస్సి కి, ఎప్పుడో జనరల్ ర్యాంకింగు లిస్టు ఇచ్చి ఉన్న 1392 మంది ఉన్న జె ఎల్ అభ్యర్థుల ఫలితాలను దశలవారీగా కూడా ఎందుకు 'పూర్తిగా' విడుదల చేయలేకపోతుంది? వాళ్ళు ధర్నా చౌక్ ను ఇంకా ఆశ్రయించకపోవడమే దీనికి కారణమా?
2. పేద విద్యార్థులు, ముఖ్యంగా బిసి, ఎస్సి,ఎస్టీ పిల్లలు ఎక్కువగా చదువుకునే ప్రభుత్వ కళాశాలల్లో విద్య బలోపేతానికి ఈ రెండు నెలలు చాలా కీలకం. నూతనంగా ఎంపికయ్యే అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యకు అత్యవసరం. ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయడానికి మీ పైన ఉన్న ఒత్తిడి ఏమిటి? ఆ ఒత్తిడి చేస్తున్న సంఘ నాయకులెవరు?
3. విద్యా శాఖ మంత్రిగా కూడా ఉన్న మీ దర్శనం ఈ పేద అభ్యర్థులకు ఎలాగూ దక్కదు. పోనీ,మీ మంత్రుల ఇళ్ల చుట్టూ, గాంధీ భవన్ చుట్టూ తిరిగితే అయినా అపాయింట్మెంట్ తేదీల గురించి ఒక స్పష్టత వస్తుందేమో అనుకుంటే, వాళ్లకు కనీస సమయం కూడా ఇవ్వట్లేదు. పరీక్ష రాసి నిజాయితీగా ఉద్యోగం సాధించడమే ఈ అభ్యర్థులు చేసుకున్న పాపమా? వీళ్లకు ఈ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఎప్పుడిస్తారో అయినా చెబితే కనీసం మానసికంగా ఐనా సిద్ధపడి ఉంటారు కదా!
4. నెక్స్ట్ అకడమిక్ ఇయర్ వరకూ ఈ ప్రాసెస్ ను సాగదీసి 'ఖజానా' ను మిగుల్చుకునే కుట్ర, ఇతర ఒత్తిళ్లు ప్రభుత్వం మీద ఉన్నాయనే అభ్యర్థుల అనుమానాలు నిజమేనా మరి? ఇటీవల డిఎస్సి నియామకాల్లో నకిలీ స్పోర్ట్స్ పత్రాల గురించి వస్తున్న వార్తలు చూస్తే ప్రభుత్వ సమర్ధత మీద అనుమానాలు రావడం సహజమే.
చివరిగా, మీరు ఒక నాడు బలిదేవత అన్న సోనియా గారి పుట్టిన రోజు సందర్భంగా ముగించబోతున్న మీ ప్రభుత్వ అపజయోత్సవాల్లోనైనా జె ఎల్ అభ్యర్థుల అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి. లేకపోతే, మొత్తం ఇంటర్మీడియట్ విద్య ను మీరు మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం 'బలి' చేసినట్టే.
జెఎల్ అభ్యర్థుల పెండింగ్ ఫలితాలను విడుదల చేసి వెంటనే వారికి అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
అభ్యర్థులు ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తాత్సరం చేస్తే అభ్యర్థుల తరపున @BRSparty పోరాటానికి సిద్ధంగా ఉందని ప్రకటిస్తున్నాం. @TelanganaCMO@KTRBRS #tgpscJLappointmentOrders #CongressFailedTelangana
#BRS4Jobs