రైతుబంధు బకాయిలు వెంటనే చెల్లించాలి: కేటీఆర్
మూడు విడతల బకాయిలతో పాటు రబీ సీజన్ సాయాన్ని కలిపి నాలుగు విడతల డబ్బులు జమ చేయాలి
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతులకు మూడు విడతల రైతుబంధు సాయం అందించలేదని ఆరోపిస్తూ, పెండింగ్‌లో ఉన్న మూడు విడతల డబ్బులతో పాటు రాబీ పంటకు సంబంధించిన తదుపరి విడతను కూడా కలిపి మొత్తం నాలుగు విడతల సాయాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో రైతులకు రూ.15,000 ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత రూ.12,000 ఇస్తామని చెప్పిందని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, ఆ మొత్తాన్ని కూడా మూడు విడతల్లో చెల్లించలేదని విమర్శించారు. రైతులకు రావాల్సిన బకాయిలను ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
#KTR #BRS #RythuBandhu #TelanganaFarmers #CongressGovernment #Hyderabad #TelanganaPolitics
జర్నలిజంలో ట్రైనింగ్ సమయంలో మొదలు డెస్క్‌లో చేరేవరకు అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటర్ రామచంద్రమూర్తి గారు ఇచ్చిన సూచనలు, అందంచిన ప్రోత్సాహం మరువలేనవి. ఆయన కాలమ్ కు శీర్షిక పెట్టడం గొప్ప అనుభూతి. అట్లాంటి సీనియర్ సంపాదకులు మూర్తి గారితో ఎప్పుడూ నేరుగా ఫొటో దిగే అవకాశం దక్కలేదు. గురువారం 'తెలుగుప్రభ' రీ లాంచ్ కార్యక్రమంలో మా ఎండీ, ఎడిటర్ ఉద్యోగులను భాగస్వాములుగా చేస్తూ షేర్లు వచ్చిన పత్రాన్ని మూర్తి చేతుల మీదుగా తీసుకోవడం సంతోషాన్ని ఇచ్చింది.
ఈసీ ప్రెస్‌నోట్ వారికే వ్యతిరేకంగా పనిచేస్తోంది: ఎస్‌వై ఖురేషీ
ఇకపై అజెండా సమావేశాలు, అజెండాలు, మినిట్స్.. అంటే గతంలో ఇవేవీ చేయలేదా? మాజీ సీఈసీ ప్రశ్న
న్యూఢిల్లీ: మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ మాట్లాడుతూ.. “ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రెస్‌నోట్ వాస్తవానికి వారికే వ్యతిరేకంగా పనిచేస్తోంది. అందులో గతంలో జరుగుతున్న వివిధ తప్పిదాలను వారు అంగీకరించారు. ఇకపై అజెండా సమావేశాలు నిర్వహిస్తామని వారు చెబుతున్నారు. అంటే ఇంతకుముందు నిర్వహించలేదనే కదా అర్థం. ఇకపై అజెండాలు జారీ చేస్తామని చెబుతున్నారు. అంటే గతంలో అలా చేయలేదనే కదా. ఇకపై మినిట్స్ జారీ చేస్తామని చెబుతున్నారు. అంటే ఇంతకుముందు జారీ చేయలేదనే కదా. ఇకపై అంశాలను వింటామని కూడా చెబుతున్నారు. అంటే ఇంతకుముందు వినలేదనే కదా అర్థం” అని అన్నారు.
“ఇదేం అసంబద్ధమైన మాటలు? భారతదేశంలో రెండు రకాల చట్టాలు ఉండగలవా? మీ కోసం ఫారం-6 ఒక విధంగా ఉపయోగిస్తారు. నా కోసం ఫారం-6 మరో విధంగా ఉపయోగిస్తారా?” అని ఎస్‌వై ఖురేషీ ప్రశ్నించారు.
ఈడీ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన..
మంత్రి పొంగులేటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్:రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై ఈడీ (ED) ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి ఇళ్లపై ఈడీ దాడులు జరిగి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ ఎలాంటి చర్యలు లేవని మండిపడ్డారు.
విదేశాల నుంచి అక్రమంగా ఖరీదైన గడియారాలు దిగుమతి చేసుకున్న ఆయన కుమారుడిపైనా సోదాలు జరిగాయని, ఆ దాడుల్లో ఏం తేలిందో ఈడీ బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఈడీ చర్యలు తీసుకోకపోవడంతోనే మంత్రి ప్రతిరోజూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని, లేదంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బీజేపీ, ఈడీనే అండగా నిలుస్తున్నట్లు భావించాల్సి వస్తుందని హెచ్చరించారు.
. 'ఎస్ఐఆర్ గో బ్యాక్'
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు.
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం (EC) చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. 1929 నాటి 'సైమన్ గో బ్యాక్' నినాదానికి నేటి 'ఎస్ఐఆర్ గో బ్యాక్' నినాదానికి ప్రత్యక్ష పోలిక ఉందని ఆయన అభివర్ణించారు. ఎస్ఐఆర్ సమస్య పరిష్కారమయ్యే వరకు దేశ యువత వెనకడుగు వేయదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటి బ్రిటీష్ ప్రభుత్వం సైమన్ కమిషన్‌ను ఏవిధంగా ఉపయోగించుకుందో, నేడు 'బ్రిటీష్ జనతా పార్టీ' కూడా ఎన్నికల సంఘాన్ని అలాగే వాడుకుంటోందని మండిపడ్డారు. దేశ పునాది అయిన ఓటు హక్కును నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. అందుకే యువత రోడ్లెక్కి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని, తాము కూడా దానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. నాటి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భగత్ సింగ్ ఎలా పోరాడారో, నేడు ఈవీఎంలు మరియు ఓటర్ల జాబితా వివాదంపై రాహుల్ గాంధీ పోరాటానికి నాయకత్వం వహిస్తున్నారని తెలిపారు. ఈ ప్రజాస్వామ్య పోరాటంలో అందరూ మద్దతుగా నిలవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
బేలా ఎస్టేట్‌లో 728 మందిలో 727 మంది ఓట్లు తొలగింపు
ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 : దేశ రాజధానిలోని బేలా ఎస్టేట్‌లో ఓటర్ల పేర్లను తొలగించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇది ఓట్ల చోరీకి పాల్పడే ఒక పద్ధతి అని ఆయన మండిపడ్డారు. సోమవారం బేలా ఎస్టేట్‌ను సందర్శించిన ఆయన, అక్కడ నివసిస్తున్న నిరాశ్రయులైన స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ మేరకు 'ఎక్స్' వేదికగా రాహుల్ గాంధీ స్పందిస్తూ.. "యమునా నది ఒడ్డున ఉన్న బేలా ఎస్టేట్‌లో 728 మంది నివసిస్తున్నారు. 'ఎస్ఐఆర్' తర్వాత ఓటర్ల జాబితాలో కేవలం ఒక్క పేరు మాత్రమే మిగిలింది.. మిగతా 727 పేర్లు తొలగించారు. వీరు దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నారు. 2024 లోక్‌సభ, 2025 దిల్లీ ఎన్నికల్లోనూ ఓటు వేశారు. 2023లో వీరి నివాసాలు కూల్చివేసినా వీరు ఎక్కడికీ వెళ్లకుండా ఇక్కడే జీవిస్తున్నారు" అని పేర్కొన్నారు. తాను అక్కడి గుడిసెలకు వెళ్లి ఎన్నికల సంఘం తమ పట్ల వ్యవహరించిన తీరును ప్రత్యక్షంగా తెలుసుకున్నానని రాహుల్ చెప్పారు. ఎస్‌డీఎమ్‌తో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఇల్లు ఉందా లేదా అనేదానికి ఓటు హక్కుకు సంబంధం లేదని స్పష్టం చేసినట్లు తెలిపారు. నిరాశ్రయుల కోసం 'హౌస్ నంబర్ 0' కేటాయించామని సీఈసీ జ్ఞానేశ్ కుమార్ స్వయంగా చెప్పినప్పటికీ, 727 మంది పేర్లు ఎలా తొలగిస్తారని నిలదీశారు. ఇది ఎస్ఐఆర్ కాదని, ఓట్లను కొల్లగొట్టే విధానమని ఆరోపించారు. ఇప్పటికే అతి తక్కువ వనరులు ఉన్నవారి హక్కులను హరిస్తున్నారని, జ్ఞానేశ్ కుమార్ పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుందని, కానీ ఆయనతో ఈ పని చేయించిన వ్యవస్థ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.
I published a song on StarMaker, check out my singing now!
Post your cover of Ninnu Talachi on StarMaker and discover your musical talent!
https://t.co/KgFlIcvIFa
మోదీ, షా రాజీనామా చేసే వరకు నిద్రపోనివ్వం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీతో పాటు మొత్తం ప్రతిపక్షం ఇప్పుడు తమ గొంతును వినిపించడం ప్రారంభించిందని, ఇక ఈ ప్రక్రియను ఆపడం సాధ్యం కాదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజీనామా చేసి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పదవి నుంచి తప్పుకునే వరకు వారిని నిద్రపోనివ్వబోమని వ్యాఖ్యానించారు.
‘‘కాంగ్రెస్ పార్టీ, మొత్తం ప్రతిపక్షం ఇప్పుడు తమను తాము వ్యక్తం చేయడం ప్రారంభించాయి. ఇది ఇక ఆగదు. మోదీ రాజీనామా చేసే రోజు, అమిత్ షా పదవి నుంచి తప్పుకునే రోజు వరకు వారిద్దరూ ప్రశాంతంగా నిద్రపోలేరు. చివరకు ‘ఇది మా వల్ల కాదు.. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని వెళ్లనివ్వండి’ అని చెప్పే వరకు వారిని మేల్కొనేలా చేస్తాం’’ అని రాహుల్ అన్నారు.
దేశ ఆలోచనా విధానం, సంస్కృతి కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పోరాటం ద్వేషం, హింసతో కాకుండా ప్రేమ, సోదరభావం, అహింసతో సాగుతుందని స్పష్టం చేశారు. ‘‘భారత్ ద్వేషానికి నిలయం కాదు.. ప్రేమ, ఆప్యాయత, సోదరభావం, అహింసకు నిలయం. ఈ విషయాన్ని అందరికీ నిరూపిస్తాం’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
I published a song on StarMaker, check out my singing now!
Like Priyathama (Short Ver.)? Check out more amazing covers on StarMaker!
https://t.co/2RqhsS7gMU
పదవి త్యాగంతోనే బీఆర్ఎస్ ఆవిర్భావం
రాష్ట్ర సాధనలో రాజీనామాలే కీలక ఆయుధం: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్) పుట్టుకే పదవి త్యాగంతో ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఉద్యమం కేవలం నినాదాలతో కాదు, త్యాగాలు, రాజీనామాలు, రాజకీయ పోరాటంతో విజయాన్ని సాధించిందని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ 2006లో తన పదవికి రాజీనామా చేసి, అనంతరం 2008లో మరోసారి రాజీనామా చేసిన సమయంలో తాను తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్‌తో చర్చించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా జయశంకర్ సార్ ఉద్యమానికి మూడు కీలక పార్శ్వాలు ఉంటాయని వివరించారని తెలిపారు.
మొదటి దశలో ఉద్యమ భావజాలాన్ని ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తి చేయడం, రెండో దశలో ప్రజా ఆందోళనలను నిర్మించడం జరుగుతుందని, ఈ రెండు దశలు కలిసినప్పుడే ఉద్యమం రాజకీయ శక్తిగా రూపాంతరం చెందుతుందని జయశంకర్ చెప్పినట్లు కేటీఆర్ వెల్లడించారు.
అప్పటి వరకు కేంద్రాన్ని యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి ఎదిగి, ఢిల్లీ మెడలు వంచించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్నదే ఉద్యమ లక్ష్యమని జయశంకర్ స్పష్టం చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన వెనుక ఉన్న రాజకీయ త్యాగాలు, ఉద్యమ వ్యూహాలను ప్రజలు గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.