జనసేన GHMC,MMC,CMC విస్తృతస్థాయి సమావేశం
జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC), సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) పరిధిలోని నాయకులు, ముఖ్య కార్యకర్తలు, వీర మహిళలు మరియు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
తేదీ: ఆగష్టు 30, ఆదివారం
సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు
వేదిక: జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం, హైదరాబాద్
GHMC, MMC, CMC పరిధిలోని జనసేన నాయకులు, ముఖ్య కార్యకర్తలు, వీర మహిళలు, పోటీ చేయనున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరు కావాలని కోరుతున్నాం.
– జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం, తెలంగాణ
ప్రజారాజ్యం పార్టీ తరఫున నాచారం కార్పొరేటర్ డివిజన్‌కు పోటీ చేసి, జనసేనలోనూ మాతో కలిసి ప్రయాణించిన పర్దీపూర్ నరసింహ గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికరం.
వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం.
@JanaSenaParty@PawanKalyan@JSPTelangana
#భావపూర్వకనివాళి #JanaSenaParty #JanaSenaTelangana
జనసేనాని శ్రీ @PawanKalyan గారి పోరాట స్ఫూర్తితో గత వైసీపీ దాష్టికాలను ఎదుర్కొని స్థానిక ఎన్నికల్లో పోటీకి నిలబడ్డాం, రౌడీ మూకలతో కలబడ్డాం, గెలిచి చూపించాం.
ఈ సారి ఎన్నికల్లో మన సత్తా చాటుదాం ✊
#JSPForNewAgePolitics#VoteForGlass
మీ ప్రేమపూర్వక శుభాకాంక్షలకు, నాపై ఉంచిన నమ్మకానికి మీ విజన్ లో నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు ధన్యవాదాలు @PawanKalyan గారు.
ఏపీ-గ్రీన్ బాధ్యత నాకు ఒక పదవి కాదు, ఒక గొప్ప బాధ్యత. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను మరింత పచ్చగా మార్చే లక్ష్యాన్ని నిజం చేసేందుకు నా వంతు కృషి చేస్తాను.
పర్యావరణ పరిరక్షణను ప్రజల ఉద్యమంగా మార్చి, మన రాష్ట్రాన్ని భవిష్యత్ తరాలకు పచ్చని ఆంధ్రప్రదేశ్‌గా అందించడమే నా లక్ష్యం.
30 రోజుల పాటు స్థానిక సంస్థల ఎన్నికల జనసేన ప్రణాళిక అమలు
* ఎన్నికల వ్యూహం ఎలా ఉండాలో అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు నిర్ణయిస్తారు
* యువత, మహిళల సాధికారత జనసేన ప్రాధాన్య అంశాలు
* జన సైనికుల పోరాటం కొనసాగించేలా, ఆత్మగౌరవం నిలబెట్టేలా స్థానిక సంస్థల ఎన్నికలు
* శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా సెప్టెంబరు 2వ తేదీన జనసేన యువజన విభాగం ప్రారంభం
* సిద్ధం అన్న వ్యక్తులు యుద్ధం అంటున్నారు... అందుకు జనసేన ఎప్పుడూ సిద్ధమే
* స్థానిక పోరులో జనసేన బలాన్ని చూపుదాం
* జనసేన ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖామాత్యులు, పీఏసీ ఛైర్మన్ శ్రీ @mnadendla గారు
జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం లో జనసేన పార్టీ తరుపున గత స్థానిక సంస్థల ఎన్నికల్లో దైర్యంగా పోటీ చేసిన వీరమహిళలను @JanaSenaParty అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి తరుపున సత్కరించిన PAC సభ్యులు, గౌరవ ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ @mnadendla గారు.
#JSPForNewAgePolitics
నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమాలు ఏ రాజకీయ పార్టీలో జరిగి ఉండదు ఎక్కడైనా గెలిచిన వాళ్ళని సన్మానిస్తారు కానీ మొట్టమొదటిసారిగా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం చేయడం నిజంగా ఆనందం వుంది ❤️🙌😍🙏
పిఠాపురం ఆడపడుచులకు రాఖీ కానుక పంపిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
పిఠాపురం శాసనసభ్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు సోదర భావంతో 2,400 మంది వితంతు మహిళలకు రాఖీ పండుగ కానుకగా చీరలు పంపించారు. రాఖీ కానుకతో ఆనందం వ్యక్తం చేసిన పిఠాపురం ఆడపడుచులు.
పిఠాపురం నియోజకవర్గం లోని జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు ఇంటింటికి వెళ్లి కానుక అందజేస్తున్నారు.
#RakshaBandhan
#RakshaBandhan
సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు..!
అక్కాచెల్లెళ్లతో అన్నదమ్ములకున్న ఆప్యాయత, అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) పర్వదినం సందర్భంగా సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాఖీ పౌర్ణమి భారతీయ కుటుంబ వ్యవస్థతో పెనవేసుకున్న బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలకు ఓ భావోద్వేగపూరిత సంకేతం. సోదర భావాన్ని, మహిళలకు గౌరవాన్ని, భరోసాని అందించే పండుగ.
రాఖీ పౌర్ణమి వేళ రాష్ట్రంలో మహిళల భద్రత, మహిళా సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ముందుకు వెళ్తుందన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. ఇప్పటికే దీపం-2 ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. డోలీ రహిత గిరిజన గ్రామాల కల సాకారం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నాం. ఇప్పటికే 426 గిరిజన ఆవాసాలను రోడ్లతో అనుసంధానించడమైనది. అడవితల్లి బాట ఫేజ్-2 ద్వారా ఈ రోడ్లను మరింత విస్తరించే దిశగా చర్యలు చేపట్టాం.
గిరిజన మహిళల్లో కనిపించే జన్యుపరమైన వ్యాధి సికిల్ సెల్ అనీమియా నుంచి రక్షణ కల్పించేందుకు అరకులో ప్రత్యేక బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నాము. ఆడపడుచుల అభ్యున్నతి, సాధికారత దిశగా ముందుకు వెళ్తామని రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలియచేస్తున్నాము.
- Hon'ble Andhra Pradesh Deputy CM, JanaSena Chief Sri @PawanKalyan