రాజమహేంద్రవరం ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కాలుష్యం చేస్తూ కట్టాల్సిన పన్నులు ఎగ్గొట్టడంపై ఉపముఖ్యమంత్రి @PawanKalyan గారు సీరియస్.
బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్న ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కి రూ.21.01 కోట్ల ఫైన్ విధించిన ఏపీ కాలుష్య నియంత్రణ మండలి.
గణేష్ ఆగమన్ కార్యక్రమంపై లాఠీలు ఎత్తిన సుల్తాన్ బజార్ పోలీసు���ను వెంటనే సస్పెండ్ చేయాలి.
BGUS ఉపాధ్యక్షుడిపై దాడిని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తీవ్రంగా ఖండిస్తుంది. ఈ దాడిని భాగ్యనగర్ గణేష్ ఉత్సవాలపై జరిగిన దాడిగా BGUS బావిస్తుంది.పోలీసులు గణేష్ భక్తులపై ఆంక్షలు పెడితే సహించేది లేదు రోడ్లపై పోరాటాలకు హిందూ సమాజం సిద్ధంగా ఉంది. భాగ్యనగర్ లో రజాకార్ ఎజెండా అమలు చేయాలని చూస్తే తిప్పి కొడుతాం. పై దాడి ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమీషనర్ గారు చట్టపరమైన చర్యలు చేపట్టక పోతే BGUS తదుపరి కార్యచరణ ప్రకటిస్తుంది.
Bhagyanagar Ganesh Utsav Samiti (BGUS) strongly condemns the lathi charge by Sultan Bazar police during the Ganesh Aagaman event, targeting the BGUS Vice President. We consider this an attack on the Utsav itself and demand immediate suspension of the personnel involved.
@hydcitypolice @CPHydCity @SajjanarVC_IPS @TelanganaDGP @acpsulthanbazar @shosulthanbazar
@ANI @ians_india
హిందువుల పై పగబట్టిన తెలంగాణ పోలీసులు | Nationalist Hub
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షుడి పరిస్థితి ఇలా ఉంటె.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో ఒక్కసార��� ఆలోచించాలి
Section 40 of the Waqf Act gave the Waqf Board sweeping powers to claim properties as Waqf.
The Modi government moved to curb such arbitrary claims and protect public and private property from irregular occupation.
Now, why is @RaoKavitha opposing these reforms?
Is this about protecting people’s property - or protecting the politics of appeasement?
Public property cannot be a vote-bank bargaining chip.
#Waqf #JanaSenaTelangana #JSPForTelangana
A Proud Addition to Andhra Pradesh’s Wildlife Conservation Efforts
The Indira Gandhi Zoological Park (IGZP), Visakhapatnam, has successfully completed an animal exchange programme with the Radhe Krishna Temple Elephant Welfare Trust, Jamnagar, Gujarat.
IGZP has welcomed 3 Zebras, 4 Cotton-top Tamarins, 3 Red-necked Wallabies and 2 Common Marmosets. Notably, the Critically Endangered Cotton-top Tamarin has been introduced at IGZP for the first time.
Heartfelt thanks to the Radhe Krishna Temple Elephant Welfare Trust, Gujarat, for this valuable collaboration. Appreciation to the AP Forest Department and IGZP team for strengthening conservation breeding, wildlife education and the visitor experience.
- @PawanKalyan
#APForestDepartment #IGZP #WildlifeConservation #Visakhapatnam
Let’s start doing this.
Take things into our hands.
Enough is enough.
@TelanganaCOPs@CVAnandIPS is just is slumber
We can’t let these 1/2 create nuisance in our celebration’s
I request the Telangana Government to bring some new resolutions in the State Assembly to take strict action against Hijras if they visit any private functions or housewarming ceremonies without an invitation.
In the Western world, people can use their own guns when someone trespasses on private property and tries to rob them!!
No sentimental negligence towards them. Just go very strict and ruthless on Hijras.
@TelanganaCMO@TelanganaDGP@CVAnandIPS@SajjanarVC_IPS
#Telangana
“गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः।
गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः॥”
A teacher does not simply impart knowledge. A teacher awakens curiosity, shapes character, gives confidence to dream and inspires a generation to become its best self.
On National Teachers’ Day, we honour every teacher whose wisdom, patience and dedication continue to shape the minds and futures of our children. From the first lesson in a classroom to the values that guide us through life, the influence of a great teacher remains forever.
On the birth anniversary of Dr. Sarvepalli Radhakrishnan Ji, I pay my heartfelt tribute to this distinguished philosopher, educationist and former President of Bharat, and extend my warm wishes to all teachers who dedicate themselves to building a knowledgeable, capable and responsible generation.
To every teacher who lights the path for others, my deepest gratitude and respect.
Happy Teachers’ Day!
- @PawanKalyan
#HappyTeachersDay #TeachersDay #DrRadhakrishnan
ఈ భాగ్యనగరంలో ఉండడానికి ఇల్లు కొనుక్కుందామని,
కష్టపడి అప్పులు చేసి,
రుణాలు తెచ్చుకుని,
మంచి ముహూర్తం చూసుకొని,
సంతోషంగా,
ఆనందంగా,
గృహప్రవేశం చేసుకునే సమయంలో ఎంతో ఉల్లాసంగా ఉండాల్సిన వారు ఎందుకు నిరాశ చెందుతున్నారు? దీనికి కారణం ఎవరు?
కారణమైన వారిని
ఈ మహానగరంలో కట్టడి చేసేవారు లేరా.. 🔥
@TelanganaDGP@CPHydCity@CPCyberabad
Konni police stations lo complaints raavadam valla akkada CIs and SIs hijras ni pilichi, counseling iccharu.
Ayina vaallatho change ledu. Day by day inka ekkuva chestunnaru.
Business opening, House warming, marriages - event edi ayina sare, hijras vacchi andarni saavagotti, money dobbutharu.
Chala mandi inti mundu tent and intiki lights veyadaniki kuda bhayapade stage ki teeskoccharu.
2020 GHMC election results vacchina roju win ayina oka corporator deggara 5 lakhs dobbaru. Live lo choosa.
Veella extortion ki limit eh ledu. Entha galeez ga ayina behave chestharu. Em cheyaleka andaru money icchestunnaru.
Government and police veellani control cheyali.
@TelanganaCMO@TelanganaDGP@revanth_anumula@CVAnandIPS
సాగు నీటి సంరక్షణ… పర్యావరణ పరిరక్షణ… అహ్లాదకర వాతావరణం
* ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ
* రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 50 కోట్లతో 105 చెరువుల ఆధునీకరణ
* ఇప్పటికే 26 చెరువులకు పునరుజ్జీవం
* భూగర్భ జలాల పెంపు.. సమగ్ర అభివృద్ధే ధ్యేయం
* ఆధునిక హంగులతో ఆహ్ల���దకర కేంద్రాలుగా చెరువులు
* వాకింగ్ ట్రాక్‌లు, ఓపెన్ ఎయిర్ జిమ్‌లు, చిల్డ్రన్ పార్కులతో కొత్త రూపు
* సెప్టెంబర్ నెలాఖరుకల్లా పనులు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం
సాగు నీటి వనరుల సంరక్షణ నుంచి పర్యావరణ పరిరక్షణ వరకు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నుంచి ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల వరకు సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక కృషి చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధిపై లక్ష్యంగా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవకు ‘ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన’ పథకం తోడవడంతో రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి చెరువులు, సరస్సుల పునరుజ్జీవనానికి కొత్త ఊపు వచ్చింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి దార్శనికత, అభివృద్ధి పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతతో చెరువులకు కొత్త జీవం పోయ��మే కాకుండా, వాటిని మరింత సమర్థవంతమైన సాగునీటి వనరులుగా తీర్చిదిద్దే దిశగా విస్తృత స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. చెరువుల ఆధునీకరణ ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడం, పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటం, సాగునీటి సామర్థ్యాన్ని బలోపేతం చేయడంతోపాటు గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన, ఆహ్లాదకరమైన జీవన వాతావరణాన్ని అందించాలన్న సమగ్ర లక్ష్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు స��గుతున్నాయి.
• 105 చెరువులు... రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో పనులు
రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం కోసం మొత్తం రూ.50 కోట్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 26 చెరువులను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. అనంతపురం, పల్నాడు, శ్రీ సత్యసాయి, చిత్తూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కాకినాడ, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే చెరువుల అభివృద్ధి పూర్తయ్యి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన పనులు వివిధ దశల్లో శరవేగంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చెరువుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ఆయ�� ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా పనులను చేపడుతున్నారు. ఈ కార్యక్రమం పూర్తయితే చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతోపాటు సాగు నీటి వనరులు మరింత బలోపేతం కానున్నాయి. అలాగే భూగర్భ జలాల వృద్ధికి తోడ్పడనున్నాయి.
• చెరువులకు కొత్త రూపు.. ప్రజలకు కొత్త సౌకర్యాలు
చెరువుల ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా చెరువు గట్ల బలోపేతం, వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటు, ప్రవేశ ద్వారాల నిర్మాణం, సోలార్ లైట్ల ఏర్పా���ు, సిట్టింగ్ బెంచ్‌ల ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నారు. పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పార్కుల ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓపెన్ ఎయిర్ జిమ్ పరికరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు చెరువుల సుందరీకరణ పనులకు ప్రాధాన్యం ఇస్తూ, వాటిని ప్రజల విశ్రాంతి, ఆరోగ్యం, వినోదానికి అనువైన కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా, కుప్పం నియోజకవర్గం పరిధిలోని వెదుళ్ల చెరువు, కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలోని పండూరు చెరువు, గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చెరువు, అనంతపురం జిల్లాల��� గుడిశెలపల్లి చెరువు, నెల్లూరు జిల్లాలోని వింజమూరు, శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం తదితర చెరువులు పూర్తి స్థాయి అభివృద్ధి పనులు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
• సాగు నీటితోపాటు భూగర్భ జలాలకు బలం
ఈ పనుల ద్వారా చెరువులు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే పరిమితం కాకుండా బహుళ ప్రయోజన కేంద్రాలుగా రూపుదిద్దుకోనున్నాయి. చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెరగడం వల్ల సాగునీటి వనరులు బలోపేతం కావడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు పెరిగే అవకాశం ఉంది. దీంతో రైతులకు సాగునీటి పరంగా ప్రయోజనం చేకూరడంతో పాటు గ్రామీణ ప్రజలకు దీర్ఘకాలికంగా మెరుగైన ఫలితాలు అందనున్నాయి. పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ కార్యక్రమం దోహదపడనుంది.
గోదావరిలో కలుస్తున్న డ్రెయిన్ కాలుష్యంపై సమగ్ర అధ్యయనానికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశం
• ప్రతి డ్రెయిన్‌పై నిరంతర పర్యవేక్షణ.. నమూనాల శాస్త్రీయ పరిశీలన..
• జీవ నదిలోకి చేరుతున్న వ్యర్థాలపై ప్రత్యేక అధ్యయనం
• పరిమితికి మించిన కాలుష్యంపై నియంత్రణ చర్యల అమలుకు ఆదేశాలు
• ప్రత్యేక పర్యావరణ టాస్క్ ఫోర్స్‌కు బాధ్యతలు
• రూ. 100 కోట్ల పీసీబీ నిధులతో మురుగు నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచన
• కాలుష్య రహిత గోదావరిలో భక్తులు పుష్కర స్నానమాచరించేలా చర్యలు
• ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రివర్యుల ప్రత్యేక కార్యాచరణ
‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ థీమ్‌తో గోదావరి పుష్కరాలకు సిద్ధమవుతున్న వేళ గోదావరి నదిని సంపూర్ణ కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి ��్రీ @PawanKalyan గారు స్పష్టం చేశారు. ముఖ్యంగా గోదావరిలో డ్రెయిన్ల ద్వారా కలుస్తున్న కాలుష్య కారక వ్యర్థాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పుష్కరాల నాటికి గోదావరి పవిత్రత ఉట్టిపడేలా, భక్తులు స్వచ్ఛమైన జలాల్లో స్నానమాచరించే వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ప���ి చేయాలన్నారు.
రాజమహేంద్రవరం నుంచి అంతర్వేది వరకు, గోదావరి నదిలో కలుస్తున్న అన్ని ప్రధాన, ఉప డ్రెయిన్లపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపు 15 ప్రధాన డ్రెయిన్లు, 45 వరకు మైనర్ డ్రెయిన్లు గోదావరి నదిలో కలుస్తున్నాయని, వాటి ద్వారా చేరుతున్న మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు, ఇతర కాలుష్య కారకా��పై శాస్త్రీయ విశ్లేషణ జరగాలని సూచించారు.
యనమదుర్రు వంటి డ్రెయిన్లు పారిశ్రామిక ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్థ జలాలను వెంట తీసుకుని వశిష్ట గోదావరిలో కలుస్తున్నాయని, అలాగే రామచంద్రపురం పరిసర ప్రాంతాల మురుగు టేకి మేజర్ డ్రెయిన్ ద్వారా, అమలాపురం ప్రాంత వ్యర్థాలు కుమ్మర కాలువ ద్వారా, ధవళేశ్వరం సమీపంలోని వ్యర్థాలు గోరింకల డ్రెయిన్ ద్వారా గోదావరిలోకి చేరుతున్న విషయాన్ని ప్రస్తావ���ంచారు. పట్టణ ప్రాంతాల మురుగుతోపాటు గోదావరి తీరం వెంబడి ఉన్న 262 గ్రామ పంచాయతీల నుంచి వెలువడే మురుగుకు కూడా గోదావరి నదే అంతిమ గమ్యస్థానంగా మారడం ఆందోళనకర అంశమన్నారు.
ప్రతి డ్రెయిన్‌లో క్రమం తప్పకుండా నీటి నమూనాలు సేకరించి కాలుష్య స్థాయిల���ు నిర్ధారించాలని, జీవ రసాయన ఆక్సిజన్ (BOD), రసాయన ఆక్సిజన్ (COD), ఘన వ్యర్థాలు, భారీ లోహాలు, హానికారక రసాయనాల వంటి అంశాలపై విశ్లేషణ చేపట్టాలని ఆదేశించారు. పారిశ్రామిక వ్యర్థాలు నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి చేయబడుతున్నాయా లేదా అనే అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలని, డ్రెయిన్ల నుంచి వ్యర్థ జలాలు గోదావరిలో కలిసే ముందు శుద్ధి కావాలని స్పష్టం చేశారు.
డ్రెయిన్ల ద్వారా గోదావరిలో ���లుస్తున్న వ్యర్థాల స్వరూపం, కాలుష్య స్థాయిలు, కాలుష్యానికి కారణమవుతున్న వనరులు, ప్రస్తుతం అమలులో ఉన్న శుద్ధి చర్యల ప్రభావం వంటి అంశాలపై నిరంతరం అధ్యయనం చేపట్టాలని, పరిమితికి మించి కాలుష్యాన్ని గుర్తించిన సందర్భాల్లో తక్షణం నియంత్రణ చర్యలు చేపట్టాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు నిర్దేశించారు.
గోదావరి కాలుష్య నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి, ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని తెలిపారు. అవసరమైతే కాలుష్య నియంత్రణ చర్యల కోసం ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నుంచి విడుదల చేసిన రూ.100 కోట్ల నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. అటవీ, పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ సమన్వయకర్తగా, పురపాలక, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, పరిశ్రమల శాఖ, వ్యవసాయ, మత్స్యశాఖల కమిషనర్లు, జలవనరులు, గ్రామీణ నీటి సరఫరా శాఖల చీఫ్ ఇంజినీర్లు, గోదావరి పరివాహకంలోని ఆరు జిల్లాల కలెక్టర్లు సభ్యులగా ఉండే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కాలుష్య నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలను నిరంతరం సమీక్షించాలని దిశా ని��్దేశం చేశారు.
(1/2)
@PIB_India @IPR_AP @pibvijayawada
భగవద్గీత ద్వారా కర్తవ్యాన్ని, ధర్మాన్ని, సత్యాన్ని మానవాళికి బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముని జన్మదినం మనకు ఆధ్యాత్మికతతో పాటు జీవన విలువలను గుర్తుచేస్తుంది. కష్టాల్లో ధైర్యంగా నిలిచి, కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించి, ధర్మం వైపు అడుగులు వేయాలనే స్ఫూర్తిని శ్రీకృష్ణుని జీవితం అందిస్తుంది.
శ్రీకృ���్ణ పరమాత్ముని ఆశీస్సులతో ప్రతి ఇంట సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.
- @PawanKalyan
#SriKrishnaAshtami #KrishnaJanmashtami #JaiSriKrishna
రాజమండ్రి గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్ లిమిటెడ్‌దే
•కాలుష్యం చేస్తూ ఉత్పత్తి చేస్తున్నారు.. పన్ను మాత్రం ఎగ్గొడుతున్నారు..
•ఆంధ్రా పేపర్ మిల్స్ పన్ను కట్టి దాదాపు పుష్కరకాలం పూర్తయ్యింది
•పన్ను చెల్లించమంటే కోర్టులకెళ్లి కాలయాపన చేస్తారా? ఇంత బాధ్యతారాహిత్యం ఎందుకు?
•తప్పుని సరిదిద్దుకునే అవకా���ం ఇచ్చినా మీ నుంచి స్పందన లేదు
రాజమహేంద్రవరం ఆంధ్రా పేపర్ లిమిటెడ్ పన్ను ఎగవేతకు దాదాపు పుష్కర కాలం పూర్తి కావస్తోంది. యథేచ్ఛగా కాలుష్యాన్ని వెదజల్లుతున్నారు. పన్నులు మాత్రం ఉద్దేశపూర్వకంగా ఎగ్గొడుతున్నారు. 2016 తర్వాత కాతేరు గ్రామ పంచాయతీకిగానీ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌కు గానీ ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించలేదన్న విషయం మీకు గుర్తుందా? ప్రభుత్వంతో సంబంధం లేకు���డా మీకు మీరే పన్ను మినహాయింపు ఇచ్చేసుకున్నారా? ఇది ఎలా సాధ్యం? రూ. 21.34 కోట్ల వరకు మీరు స్థానిక సంస్థలకు పన్నులు చెల్లించాల్సి ఉంది. పన్ను చెల్లించమని నోటీసుల��� ఇచ్చిన ప్రతిసారీ కోర్టులను ఆశ్రయించి కాలయాపన చేస్తూ.. మీ బాధ్యత నుంచి తప్పించుకు తిరుగుతున్నారు.
రాజమహేంద్రవరం నగర కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ నుంచే వస్తుందని అధికారిక గణాంకాలు సైతం చెబుతున్నాయి. రాజమహేంద్రవరం నగరం మొత్తం దాదాపు 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, మీరొక్కరే 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నారు. మీరు విడుదల చేస్తున్న వ్యర్థాల్లో పరిమితికి మించి కాలుష్య కారకాలు ఉన్నట్టు నిర్ధారణ కూడా అయ్యింది. మీరు వ్యర్థాలు విడుదల చేసే లగూన్స్ దగ్గర సేకరించిన నమూనాలను పరీక్షించగా, లీటర్ నీటికి 36 మిల్లీగ్రాముల బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీఓడీ) ఉంది. ఇది నిర్ణీత ప్రమాణాల కంటే 20 శాతం అధికం. ఫాస్ఫేట్ 5.3 మిల్లీగ్రాములు 6 శాతం అధికంగా ఉంది. సల్ఫైడ్స్ 3.4 మిల్లీగ్రాములు ఉన్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణా���తో పోలిస్తే.. ఇది 70 శాతం అధికం. మీరు విడుదల చేసే కాలుష్యం కారణంగా నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గి జలచరాల మనుగడకు ఇబ్బంది కలుగుతుంది. గోదావరి నది సహజ పర్యావరణ వ్యవస్థ దెబ్బ తింటోంది. దుర్గంధాలు వెదజల్లుతూ, నీటి నాణ్యత తగ్గి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, భవిష్యత్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. భూగర్భ జలాలు కలుషితం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని క్షేత్ర స్థాయి పర్యటనలో నేను సూచనలు చేశాను. వాటిని కూడా మీరు పాటించలేదు.
మీ ఉల్లంఘనలకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు లోబడి కఠిన చర్యలు తీసుకోవచ్చు. పరిశ్రమలో కార్యకలాపాలు నిలుపుదల చేయొచ్చు. పెనాల్టీలు విధించవచ్చు. కంపెనీని సీజ్ చేయొచ్చు. ఏకంగా లైసెన్స్ రద్దు చేయొచ్చు. అయినప్పటికీ పరిశ్రమలను ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందస్తు హెచ్చరికగా షోకాజ్ నోటీసులు ఇచ్చి.. తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇచ్చింది. గడచిన మూడు నెలల కాలంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మీ ప్రతినిధులతో పలుమార్లు చర్చించి, పరిష్కార మార్గాలు సూచించారు. అయితే మీ నుంచి స్పందన పూర్తిగా కొరవడింది.
దీంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణం ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ కి సమన్స్ జారీ చేసి నిబంధనల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నాను.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్‌తో పాటు ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్లు ఇటువంటి ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాను. స్వచ్ఛ గోదావరి-పవిత్ర పుష్కరాలు థీమ్ తో మన గోదావరి నదిని కాలుష్యం నుంచి కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పర్యావరణ వేత్తలు, పౌర సమాజం నుంచి మద్దతు కోరుతున్నాము. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అ���్యంత ప్రాధాన్యతాంశంగా ముందుకు తీసుకువెళ్తుందని తెలియజేస్తున్నాను.
- @PawanKalyan
ఈ రోజు బాపట్ల జిల్లా సూర్యలంకలో విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, స్థానికులతో కలిసి సముద్ర తీరంలో తాటి మొక్కలు నాటాను.
పర్యావరణ పరిరక్షణ అనేది ఒక రోజు కార్యక్రమం కాదు… ఒక బాధ్యత. ఒక తరం కోసం కాదు… భావితరాల కోసం మనం చేసే కర్తవ్యం.
పర్యావరణ��న్ని కాపాడేందుకు కనీసం 20 ఏళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు సాగాలి. ముఖ్యంగా తీరప్రాంతాల్లో తాటి చెట్లు, మడ అడవులను విస్తరించడం ద్వారా సముద్ర కోతను అరికట్టడంతో పాటు తుపాన్లు, సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి సహజ రక్షణ కవచాన్ని ఏర్పాటు చేయవచ్చు.
సూర్యలంకలో 20 ఏళ్ల క్రితం నాటిన తాటి చెట్లు నేడు సహజ రక్షణ గోడగా మారి తీరాన్ని కాపాడుతున్న తీరు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది. మనం ఈ రోజు నాటే ప్రతి మొక్క రేపటి తరాలకు మనం ఇచ్చే అమూల్యమైన బహుమతి.
‘గ్రేట్ గ్రీన్ వాల్’ వంటి కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలి. ముఖ్యంగా విద్యార్థులు, యువత ప్రకృతి సంరక్షణలో చురుకుగా భాగస్వాములు కావాలి.
మొక్క నాటడంతో మన బాధ్యత పూర్తికాదు… అది పెద్ద చెట్టుగా ఎదిగే వరకు సంరక్షించడమే నిజమైన బాధ్యత.