సార్ తో కలిసి లంచ్ చేయడం!
సార్ తో కలిసి ప్రయాణం చేయడం!
సార్ ప్రశంసించడం!
ఎన్నో జన్మల అదృష్టం నాది!!
అతి సామాన్యుని మీద సార్ చూపిన ఆప్యాయతకు ఎన్ని జన్మలు సేవ చేసిన తీర్చుకోలేని రుణం!!
సార్ తో గత పది నెలల ప్రయాణాన్ని మీతో త్వరలో పంచుకుంటాను!!
రేవంత్ శూన్య పాలన.. చిల్లర సవాళ్లు❗
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై మంత్రి జూపల్లి కృష్ణారావు విసురుతున్న సవాళ్లు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రసంగాలు చూస్తుంటే.. పునాదులు తవ్వి, బిల్డింగ్ నిర్మించిన వాడిని పక్కనపెట్టి, పైన రంగులు వేసిన వాడు బిల్డింగ్ నాదే అన్నట్టున్నది!
నేడు తెలంగాణలో రూపాయి ఆదాయం వస్తున్నదన్నా, ప్రభుత్వం జీతాలు ఇస్తున్నదన్నా.. దానికి మూలస్తంభం కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్లపాటు పకడ్బందీగా, ప్రణాళిక ప్రకారం నిర్మించిన అద్భుతమైన ఆర్థిక సామ్రాజ్యమే కారణం. ఆనాడు శూన్యం నుంచి బంగారు తెలంగాణను నిర్మించిన ఒక మహానేత, సంపదను చేతుల్లో పెడితే, రాష్ర్టాన్ని దివాలా తీయించిన అసమర్థ పాలకుడి అసంబద్ధ రాజకీయానికి తాజా పరిణామాలు పరాకాష్ఠ!
రేవంత్ - జూపల్లి చిల్లర సవాళ్లు, సినిమా డైలాగులు ఆపి.. కేంద్ర ప్రభుత్వ రికార్డులను, రాష్ట్ర ప్రభుత్వ శ్వేతపత్రాన్ని చదువుకోవాలి. కేసీఆర్ గారి పాలనలో సృష్టించిన సంపదను అనుభవిస్తూ, ఆ మహానాయకుడిపైనే బురదజల్లాలని చూస్తే కాంగ్రెస్ నేతలను తెలంగాణ సమాజం క్షమించదు.
వ్యాసకర్త: ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు
రేవంత్ రెడ్డి రూపంలో.. మనకు ఒక ఎల్‌నినో వచ్చింది.
తెలంగాణ ఎదుర్కొంటున్న ఈ ఎల్‌నినో సహజమైనది కాదు.
కేసీఆర్ గారు ఎంతో ముందుచూపుతో కాళేశ్వరం ప్రాజెక్టుని నిర్మించారు.
కాళేశ్వరంలో దెబ్బతిన్న రెండు గేట్లకు మరమ్మతులు చేసి ఉంటే..
ఇవాళ తెలంగాణ ఆ ఎల్‌నినోను సమర్థవంతంగా ఎదుర్కొని ఉండేది.
కానీ రేవంత్ రూపంలో వచ్చిన ఈ ఎల్‌నినో మనల్ని నాశనం చేస్తోంది.
రేవంత్ రూపంలో ఉన్న ఈ ఎల్‌నినోను మనం తరిమికొట్టాలి.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
సమకాలీన రాజకీయాల్లో తెలుగు భాషపై ఇంత పట్టు ఉన్న నాయకుడు కేసీఆర్ తప్ప ఇంకెవరూ లేరంటే అతిశయోక్తి కాదు.
పద్యాలు, పాటలు, మాటలు, పురాణాలు, ఇతిహాసాలు.. రూపం ఏదైనా, తెలుగు భాషా పరిజ్ఞానంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సాటి మరే నాయకుడు లేడు.
యదావిధిగా నల్గొండ జిల్లా ప్రజలు ఊహించినట్టే రేవంత్ తన వికారాన్ని వాంతి చేసుకున్నాడు
మరొకసారి తన సంస్కారహీనతను బయటపెట్టుకున్నాడు
నల్గొండ జిల్లా కు కెసిఆర్ ఏం చేసిండు అంటే 3 నిమిషాల్లో 300 పనులు చెప్పొచ్చు
రేవంత్ కు 30 గంటలు కాదు కదా 30 రోజుల సమయం ఇచ్చినా జిల్లా కి చేసిన మేలు ఒక్కటి చెప్పలేడు
కెసిఆర్ జిల్లా పర్యటన కి వచ్చిన ప్రతి సారి ప్రజలకు ఏదో ఒక మేలు జరిగింది,రేవంత్ వస్తే మాత్రం ఉన్న మూసి కంపు కి అదనంగా తన నోటి కంపు తోడవడం తప్పితే జిల్లా కి ఒరిగింది ఏం లేదు
కెసిఆర్ కి జిల్లా కి వస్తే నిధుల ప్రవాహం వుండేది, రేవంత్ వస్తే మాత్రం బూతుల ప్రవాహం తప్పితే ఏం లేదు…
- మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
1969 ఉద్యమంలో రక్త తర్పణం జరిగింది.
తెలంగాణ ప్రాంత పోలీసులైతే ఉద్యమకారుల మీద దయదాక్షిణ్యాలు చూపిస్తారని, అప్పటి కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలోనే క్రూరమైన రెజిమెంట్ అని పేరున్న మలబార్ పోలీసులను రప్పించి, ఉద్యమకారులను చంపించింది.
జై తెలంగాణ నినాదం మొలకెత్తొద్దని చూసింది.
- వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో ఎమ్మెల్సీ @TheDeshapathi
రైతు బీమాతో రైతు కుటుంబానికి ధీమాగా నిలిచిన కేసీఆర్ 👨🏻🌾
బీమా ప్రీమియం చెల్లించక రైతు కుటుంబాలను రోడ్డున పడేస్తున్న రాబందు రేవంత్ 😡
ఏ కారణంతోనైనా రైతన్న చనిపోతే, వారం రోజుల్లోనే రూ. 5 లక్షల బీమా సాయాన్ని వారి ఖాతాల్లో జమ చేసి బాధిత కుటుంబానికి ధీమాగా నిలించిండు కేసీఆర్.
కానీ నేడు రైతు వ్యతిరేక రేవంత్ సర్కార్‌లో రైతు బీమా ప్రీమియం బకాయిలు చెల్లించకపోవడంతో, చనిపోయిన రైతుల కుటుంబాలు రోడ్డున పడే దయనీయ పరిస్థితి ఏర్పడింది.
రెండున్నర ఏళ్లకు ముందే ఉన్న స్కూల్‌కు రంగులు వేసి పోజులు కొడుతున్న రేవంత్ రెడ్డి కండ్లు తెరిపించడానికి ఈ ట్వీట్.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారు వందలాది గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలు, మెడికల్ కాలేజీలు నిర్మించారు. కొన్ని వేల బడులకు కొత్త సదుపాయాలు కల్పించారు.
THREAD 👇
ఈ ప్రపంచలో హిట్లర్ నాకు ఆదర్శం అని చెప్పుకున్న ఒకే ఒక్క మూర్ఖుడు రేవంత్ రెడ్డి
అధికారులు నా మాట వినడం లేదు అని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగా అనడం ఆయన చేతకానితనానికి నిదర్శనం. రేవంత్.. ఆ మాట అనడానికి నీకు సిగ్గు లేదా? కమిషన్ల దందాలు చేసుకునేందుకు నువ్వు వ్యవస్థలను వాడుకుంటుంటే నిన్ను అధికారులు ఎందుకు లెక్కచేస్తారు? అందుకే నువ్వు సీఎం కుర్చీలో ఉన్న కనీస విలువ లేకుండా పోయింది. నువ్వొక రెన్యూవల్ ముఖ్యమంత్రివి మాత్రమే.
25 ఏండ్ల క్రితం.. 27 ఏప్రిల్ 2001న.. కులబలం, ధనబలం, మీడియా పవర్, మజిల్ పవర్ ఏదీ లేకుండా ఒక బక్క పలుచటి మనిషి ఒంటరిగా ప్రారంభించిన ప్రయాణం మన గులాబీ జెండా!
ఎన్నో ప్రతికూల పరిస్థితులను, శక్తులను తట్టుకుని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ పార్టీగా విజయవంతంగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న చరిత్ర మనది. నాడు చీకట్లో చిరుదీపంలా మొదలై.. నేడు తెలంగాణకు శ్రీరామరక్షగా నిలిచిన మన బీఆర్ఎస్ ప్రస్థానం ఒక అద్భుతం.
తెలంగాణకు రేవంత్ చేస్తున్నది జల ద్రోహం!
ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి తెలంగాణ ప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్నాడు!
అటు కృష్ణా నది వాటాలో కేఆర్ఎంబీ తెలంగాణకు ద్రోహం చేసింది, ఇటు గోదావరి జలాల్లో సెంట్రల్ వాటర్ కమిషన్ ద్రోహం చేస్తున్నది.
ఈ రాష్ట్ర మంత్రులుగా మీరు పట్టించుకోరా?
బండి సంజయ్, కిషన్ రెడ్డి… మీరు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతారా? లేక మీ రాజకీయ ప్రయోజనాలే చూసుకుంటారా?
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
ఆకలి చావులు, ఆత్మహత్యలు, లక్షల సంఖ్యలో వలసలు చూసి చలించి పోయినం..😥
పిడికెడు మందితో తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టాం..✊
భగవంతుడి దయ,పోరాటంలో ఉండే న్యాయమే మాకు ఆనాడు బలం.. ✊🔥
#Telanganaformationday#KCR
మనం కూడా గాలి గాలి కావొద్దు...
ఆగమాగం కావొద్దు!!
నన్ను పదేండ్ల ఉద్యమకాలంలో
పది లక్షల తిట్లు తిట్టిండ్రు..
అయినా నేనెప్పుడూ నారాజ్ అవ్వలే,
ఎవ్వరికీ భయపడలే..!
పట్టుదలతో ఉన్నాం కాబట్టే,
ఈరోజు ఇక్కడదాకా రాగలిగినం."
- 18 లక్షల మంది హాజరైన
'తెలంగాణ మహాగర్జన' సభలో కేసీఆర్ 🔥
#TelanganaFormationDay #Telangana
(ఫైల్ వీడియో : 2010)
2001లో ఉద్యమం
ప్రారంభించినప్పుడు నేను ఒక్కడినే
ముందు మార్గం కానరాదు..
కారు చీకట్లు.. కరెంటు లేదు
కానీ, ధర్మముంటే..
న్యాయముంటే..
ఏనాటికైనా విజయం సాధిస్తామనే
ఆత్మవిశ్వాసంతో నేను ముందడుగు వేసినా!
"ఈ బక్కపలుచనోడిని ఖతం చేద్దాం..
నలిపేద్దాం" అని ఎన్నో కుట్రలు చేసిండ్రు.
తెలంగాణ ప్రజలను ఏకం కానీయవద్దని
ఎన్నో విషప్రచారాలు చేసిండ్రు!
- సకల జనభేరి సభలో (2013)లో కేసీఆర్ గారు
#TelanganaFormationDay #TSwithKCR
త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు..
అవమానాల అధ్యాయానికి ముగింపు
పలికిన రోజు..
తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు..
నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు నేడు.
కేసీఆర్ గారి ఉద్యమ నాయకత్వం, సబ్బండ వర్గాల పోరాటం కలిసి తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్నది.
సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాం. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపాం.
అమరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని ఆకాంక్షిస్తూ..
ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
అమరులకు జోహార్లు!
జై తెలంగాణ!
#TelanganaFormationDay
ఎన్నో అవమానాలు.. అవహేళనలు..
మరెన్నో త్యాగాలు.. కుట్రలు..!
అయినా కేసీఆర్ ఒక్కడే ఉద్యమ జ్వాలగా మారి ✊
లక్షల మందిని పోరాట సైన్యంగా తీర్చిదిద్ది🔥
తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిండు.
అప్పుటి లక్ష్యం రాష్ట్ర సాధన..
ఇప్పటి లక్ష్యం తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటం✊
జై తెలంగాణ ✊
#TelanganaFormationDay