తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాత, మహిళా చైతన్యానికి ప్రతీక "చాకలి ఐలమ్మ గారి వర్ధంతి" సందర్భంగా ఆ మహనీయురాలి దివ్య స్మృతికి నివాళులు.
"భారత క్రీడా ప్రగతికి పునాది వేసిన హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి జ్ఞాపకార్థం ప్రతీ ఏడాది ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటాం. మన క్రీడాకారులకు గౌరవం, ప్రోత్సాహం అందిద్దాం!" జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు
#NationalSportsDay#MajorDhyanChand
ఐటీడీఏ ప్రాత నియోజకవర్గాలకు అదనంగా 2000 ఇండ్లు మంజూరు చేయాలని మంత్రి @meeseethakka గారితో కలిసి గృహ నిర్మాణ శాఖ మంత్రి @PonguletiOffice గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది…
ఉట్నూర్ మండలం లక్కారం గ్రామంలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గారు పాల్గొన్నారు.
అర్హులందరికీ రేషన్ కార్డులు, ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని తెలిపారు.
#VedmaBhojjuPatel#Khanapur
అన్న చెల్లెల, అక్కదమ్ముళ్ళ యొక్క ఆప్యాయత, అనురాగాలకి చిహ్నం ఈ రాఖీ పండుగ. రక్ష బంధన్ అంటే రెండు గొప్ప బంధాల మధ్య వారధి.
అలాంటి గొప్ప బంధాలకి, ఆ బందుత్వాలకి, సోదర సోదరిమణులందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు
ఆదివాసీలు, దళితులు కార్లలో తిరగవద్దా? @KTRBRS
రూ.3 కోట్ల లగ్జరీ కారు అంటూ అసత్య ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు? ప్రమాదానికి గురైన నా కారు స్థానంలో స్నేహితుడు తాత్కాలికంగా ఇచ్చిన కారును వాడుకున్నాను. వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ విమర్శలు చేయడం తగదు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గౌరవనీయులు @actorvijay గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు.
ప్రజల పట్ల అంకితభావంతో, స్పష్టమైన దూరదృష్టితో సేవ చేయడంలో మీకు తగిన శక్తి, విజ్ఞత, విజయాలు చేకూరాలని ఆకాంక్షిస్తున్నాను.
మీ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగి, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
యువతకు స్ఫూర్తి ప్రదాత, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు శ్రీ స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బోజ్జు పటేల్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా పథకాల అమలు, గిరిజన ప్రాంతాల సమస్యలపై విస్తృతంగా చర్చించారు.
ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలను వివరించిన ఎమ్మెల్యే, స్థానిక ప్రజల ఆశలు ప్రతిబింబించేలా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని కోరారు.
అటవీ శాఖ పరిమితుల కారణంగా గిరిజన ప్రాంతాల్లో గృహనిర్మాణ పనులు నిలిచిపోయిన అంశాన్ని ప్రస్తావించారు. అలాగే చికమన్ ప్రాజెక్ట్, త్రివేణి సంగమ అభివృద్ధి, పులిమడుగు, నర్సాపూర్ J, ఆద్ కుమరం భీమ్ ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశారు.
పాదయాత్ర సందర్భంగా చేసిన హామీలను సాకారం చేసుకోవడమే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే మార్గమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కేస్లాపూర్ జాతరకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని ప్రత్యేక ఆహ్వానాన్ని అందించారు.