తెలంగాణ ఆత్మకు రూపం ఇచ్చిన మహనీయుడు, ఆచార���య ప్రొఫెసర్ జయశంకర్ గారు.
ఆయన చూపిన మార్గం, చెప్పిన సిద్ధాంతాలు తెలంగాణ సమాజానికి ఎల్లప్పుడూ దిక్సూచిగా నిలుస్తాయి.
ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు! 🧘♂️
యోగం కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానం.
ఇది మనసుకు శాంతిని, శరీరానికి బలాన్ని, జీవితానికి సమతౌల్యాన్ని ఇస్తుంది.
మనమందరం యోగాను రోజువారీ అలవాటుగా మార్చుకుని, ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమై�� భవిష్యత్తు వైపు ముందుకు సాగుదాం.
#internationalyogaday
Yoga is an integral part of Bharat’s civilisational ethos and a timeless gift that Bharat has offered to the world. It promotes physical well-being, mental clarity, inner balance, and a healthier way of life. May everyone embrace yoga as a way of life and make it a part of their daily routine.
I began my journey with yoga at a young age. At a time when my mind was filled with many questions, yoga gave me not just answers, but a deeper sense of clarity and inner maturity that profoundly shaped my journey. Practices such as Kriya Yoga,Ashtanga Yoga and the Art of Living’s Sudarshan Kriya continue to remain an integral parts of my daily life.
On the occasion of #InternationalYogaDay, I extend my heartfelt gratitude to Hon’ble Prime Minister Sri @narendramodi ji for his visionary efforts in securing global recognition for yoga and for leading the initiative to have June 21 observed worldwide as International Yoga Day.
@PMOIndia@themodistory
"మట్టి పరిమళం" వంటి రచనలు ఈ కాలానికి ఎంతో అవసరం.
భూమి, వ్యవసాయం, ప్రకృతి, గ్రామీణ జీవన విలువలను గుర్తు చేస్తూ యువతను మళ్లీ మట్టివైపు ఆలోచింపజేసే కథల సమాహారం ఇది. అభివృద్ధి అంటే కేవలం నగరాలు, యంత్రాలు కాదు; మన మూలాలను, నీటిని, భూమిని, ప్రకృతిని కాపాడుకోవడమూ అంతే ముఖ్యమని ఈ కథలు చెబుతున్నాయి.
వ్యవసాయం, పర్యావరణం, గ్రామీణ భారత భవిష్యత్తుపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం.
#పర్యావరణాన్ని_పరిరక్షించే_అభివృద్ధి_ప్రస్థానం #మట్టి_పరిమళం #వ్యవసాయం #ప్రకృతి #గ్రామీణభారతం #పర్యావరణం
#JSPForNewAgePolitics #SaveMotherEarth
#AshokKumarKP @watermanofindia@mvrsastry
తొలి విడత 'అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్' నిధులు విడుదల
•కాకినాడ జిల్లా రైతుల ఖాతాల్లోకి జమ చేసిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా పరిధిలోని రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడి సాయంగా అందిస్తున్న 'అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్' పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి విడత నిధులను విడుదల చేశారు. కాకినాడ జిల్లావ్యాప్తంగా 2.73 లక్షల రైతు కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుండగా, రూ. 99.58 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.
శనివారం మన ఊరు మాటా మంతి కార్యక్రమంలో ప్రాధాన్యతాంశంగా 'అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్'ను తీసుకున్నారు. రైతులతో కలసి ఈ మొత్తం నిధులు విడుదల చేశారు. తొలి విడత ఆర్థిక సాయం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 47 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 7,000 చొప్పున జమ కానున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం రూ. 2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం 5 వేలు అందజేస్తుంది. అన్నదాత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏటా మూడు విడతల్లో రూ. 6 వేలు అందజేస్తుండగా, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మరో రూ. 14,000 కలిపి ఏడాదికి రూ. 20 వేల చొప్పున పెట్టుబడి సాయం కింద అందజేస్తోంది.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ వరుసగా రెండో ఏడాది అన్నదాతకు అండగా నిలవడం రైతు సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న సంకల్పానికి నిదర్శనమని ఈ సందర్భంగా శ్ర�� పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. రైతులతో కలసి నిధులు విడుదల చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, ఎంపీలు శ్రీ లింగమనేని రమేష్ గారు, శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, శ్రీ ఉదయ్ శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు , జిల్లా అధికారులు పాల్గొన్నారు.
నేరం చేసిన వారిని సమాజం క్రిమినల్స్‌గా మాత్రమే చూడాలి.
నేరం చేసినవారిని కులం రంగు పులిమి సమర్థించకూడదు.
కులాలు, మతాల పరంగా వాట్సాప్ గ్రూపులు ఉన్నప్పుడు, లా & ఆర్డర్ కోసం, లోకల్‌గా ఉన్న సమస్యల కోసం వాట్సాప్ గ్రూపులు ఎందుకు ఉండకూడదు? ఆ దిశగా సమాజం ఆలోచించాలి.
ఈ చైతన్యం ప్రజల్లో వస్తేనే నాయకులు బాధ్యతగా పని చేస్తారు.
- కాకినాడలో మన ఊరు - మాటా మంతి కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
మాది రౌడీలు, గూండాలను వెనకేసుకొచ్చే ప్రభుత్వం కాదు
•అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా ఉంటాం
•నాయకులకి ఫ్లెక్సీల ఏర్పాటు మీద కంటే పని మీద శ్రద్ధ ఉండాలి
•విద్యార్ధుల ఆలోచనలు, ఆవిష్కరణలు వెలుగులోకి తెచ్చే వేధిక అవసరం
•కాకినాడలో మన ఊరు.. మాటా మంతి కార్యక్రమంలో ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రివ���్యులు శ్రీ @PawanKalyan గారు
‘ఇది కూటమి ప్రభుత్వం. రౌడీలు గూండాలను వెనకేసుకొచ్చే ప్రభుత్వం కాదు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు కఠినంగా ఉంటాయి. 21 ఏళ్ల కసబ్ పాకిస్థాన్ నుంచి వచ్చి ఎంతో మంది ప్రాణాలు తీసేశాడు. వయసు చిన్నది పోనీలే పాపం అనుకోవడానికి వీల్లేదు. యువత బాధ్యతగా వ్యవహరించాలి. మీరు బలంగా ఉంటేనే సమాజంలో నేరాల సంఖ్య తగ్గుతుంద’ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. కూటమి ప్రభు��్వం శాంతిభద్రతల నిర్వహణను అమలు చేస్తుందని తెలిపారు. శనివారం సాయంత్రం కాకినాడలో నిర్వహించిన మన ఊరు.. మాటా మంతి కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. ప్రజల సమస్యలు నేరుగా విన్నారు.
కాకినాడ బాలాజీ చెరువు ప్రాంతానికి చెందిన శ్రీ గంజాల అరవింద్ బాబు అనే వ్యక్తి కాకినాడ పట్టణంలో మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇబ్బందిపెడుతున్న ఆకతాయిల వ్యవహారంపై ఫిర్యాదు చేయగా, ఆ అంశంపై స్పందించారు. కనస్ట్రక్షన్ కంపెనీ చేతిలో మోసపోయిన శ్రీమతి భవానీ అనే మహిళ, కాకినాడ సర్వజన ఆసుపత్రి బస్ షెల్టర్ వద్ద ఆక్రమణలపై శ్రీ మహ్మద్ అన్సర్ అనే వ్యక్తి, కళాశాలల్లో గంజాయి, మత్తుపదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై శ్రీనివాస్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి, కాకినాడ నగరంలో అనధికారికంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీల వల్ల ఇబ్బందులను శ్రీ ఎం. హరీష్ బాబు ఉపముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువచ్చారు.
పిఠాపురం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పాదగయ సెంటర్ వద్ద ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలని శ్రీ యనమండ్ర సూర్యనారాయణ ఫిర్యాదు చేశారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు, వాహనాలతో ఈ ప్రాంతం అత్యంత రద్దీగా మారుతోంది. దీనివల్ల అత్యవసర సేవల వాహనాలు, అంబులెన్స్ లు సైతం గంటల తరబడి నిలిచిపోతున్నాయి. అత్యంత కీలకమైన ఈ కూడలిలో శాశ���వతంగా ఒక ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరారు.
కాకినాడ కార్పోరేషన్ లో గత ప్రభుత్వ హయాంలో పనులు చేసి బిల్లులు రాక ఇబ్బందులుపడుతున్న కాంట్రాక్టర్లు,ప్రత్యేక క్లినిక్స్, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని జాహ్నవి అనే ట్రాన్స్ జెండర్, గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వేలో 45 సెంట్ల భూమిని కోల్పోయానిని కిర్లంపూడి మండలానికి చెందిన శ్రీ కాకిలేటి వీర్రాజు అనే వ్యక్తి తమ సమస్యలను శ్రీ పవ��్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువచ్చారు. నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పించడంతోపాటు చదువు పూర్తయ్యాక రాష్ట్రంలోనే ఉద్యోగం కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్థితి రాకుండా చూడాలని పలువురు విద్యార్ధులు విన్నవించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు పెట్టేందుకు ఒకరి మీద ఒకరు పోటీపడుతున్నారు. ఆ శ్రద్ధ ఏదో పనిలో చూపిస్తే బాగ���ంటుంది. విచ్చలవిడిగా ఫ్లెక్సీలు వేసి ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నామో అర్ధం కావడం లేదు. ఫ్లెక్సీల ఏర్పాటుపై వ్యవస్థల నియంత్రణ ఉండాలి. నిర్ణీత ప్రాంతాల్లో మాత్రమే వేసేలా చర్యలు తీసుకోవాలి. ప్రజలు కూడా ఇష్టారాజ్యంగా ఫ్లెక్సీలు పెట్టే రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయమని చెప్పాలి. పాఠశాలల్లో ఆర్టీఈ యాక్ట్ అమలులో ఉన్న లోపాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తాం. విద్యా సంస్థలతో ఏమైనా సమస్యలు ఉంటే రెండు రోజుల్లో కలెక్టర్ గారికి ఫిర్యాదుల ���ూపంలో అందజేయండి. విద్యార్థుల ఆలోచనలు, ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చే విధంగా పార్లమెంటు సభ్యులంతా కలసి ఓ ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయాల’ని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, శ్రీ కందుల దుర్గేష్ గారు, కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాకినాడ కలెక్టర్ శ్రీ ఎం.ఎన్. హరీంధ్రప్రసాద్ గారు, ఎస్పీ శ్రీ జి.బిందు మాధవ్ గారు, ఇతర జిల్ల��� అధికారులు పాల్గొన్నారు. (1/4)
(3/3)
•అలా సమర్థించేవాళ్ళతో ప్రమాదం
పాపం చిన్న వయసులో 23 నేరాలు చేశాడు, పాపం పసి వయసులో బీరు బాటిల్ తీసుకుని గొంతు కోసేశాడు, తెలిసి తెలియని పసి వయసు అని సమర్థించే వ్యక్తులను ప్రోత్సహిస్తే రాష్ట్ర భవిష్యత్తు అగమ్యగోచరం అవుతుంది. అలా సమర్థించేవారితో ప్రమాదం. ఇదే పెద్ద మనిషి నిర్భయ కేసులో తెలంగాణ పోలీసుల చర్యను సమర్థించాడు. ఇక్కడకు వచ్చేసరికి కులం అంటూ మాట్లాడుతున్నాడు.
హోమ్ శాఖ మంత్రి గారిని సైతం అతని పార్��ీ వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె మేకప్ గురించి మాట్లాడుతున్నారు. ఇది అక్కడితో ఆగదు. ఇంటిలో మన ఆడబిడ్డలు ఫేస్ పౌడర్ కూడా రాసుకోకూడదా? రేపు ఏదో కాలేజీలో కుర్రాళ్ళు ఆడబిడ్డలను గురించి ఇదే విధంగా కామెంట్స్ చేస్తే... అప్పుడు పరిస్థితి ఏమిటి?
నేను బాధ్యతలు తీసుకున్నాక కాకినాడలో ఎవరు ఎస్పీగా ఉండాలి ఎవరు కలెక్టర్ గా ఉండాలి అనే ఆలోచన చెయ్యలేదు. ఒక్కటే సూచన ఇచ్చాను ప్రజాస్వామ్యం బలంగా ఉండాలి, వ్యవస్థ బలంగా ఉండాలి. ఇది తప్పా నా దగ్గర నుండి మీకు ఎలాంటి ఫోన్లు రావు. నా పార్టీ వారు అయినా నేను ప్రోత్సహించను. ఎందుకంటే నేను వ్యవస్థలను బలపరచడానికి ఉన్నాను, బలహీనపరచడానికి కాదు” అన్నారు.