పొలంలో చెమట చుక్కలు చిందించే రైతన్నకు భరోసా చినుకులై చేరుతున్నాయి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ నిధులు.రైతు సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీయే ప్రభుత్వం మరోసారి నిధులు విడుదల చేసి అన్నదాతకు అండగా నిలిచింది. రైతు సంతోషమే దేశ సౌభాగ్యమనే నమ్మకంతో రైతు కుటుంబాల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోంది. #pmkisan
-డాక్టర్. ఏలూరి రామచంద్రారెడ్డి.
(బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి.)
మాజీ రాజ్యసభ సభ్యులు, గురుసమానులు, పెద్దలు శ్రీ. కేవీపీ రామచందర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. 💐🙏
-డాక్టర్. ఏలూరి రామచంద్రారెడ్డి.
(బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి.)
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కృషితో ప్రపంచవ్యాప్తంగా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా, నేడు విశాఖపట్నంలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో యోగ భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన 12 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి యోగాభ్యాసం చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు.
యోగ మన భారతీయ సంస్కృతికి ప్రతీక. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసాన్ని అందించే యోగను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
"యోగతో ఆరోగ్యం – ఆరోగ్యంతో అభివృద్ధి" అనే సంకల్పంతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని ఆకాంక్షించారు.
#InternationalYogaDay2026
ముప్పై ఏళ్ల నిరీక్షణకు ప్రతిరూపం వెలిగొండ.. కరవుతో కఠినమైన నేలను పచ్చని పంటల పండుగగా మార్చే మహాసంకల్పం. నల్లమల గుండెల్లో చెక్కిన ఇంజినీరింగ్ అద్భుతం. లక్షలాది రైతు కుటుంబాల ఆశలు, తరతరాల కలలు, దాహార్తిని తీర్చే జీవజల ధార. వెలిగొండ కేవలం ఒక ప్రాజెక్టు కాదు.. ప్రకాశం నేల భవిష్యత్తును వెలిగించే అభివృద్ధి దీప్తి, ప్రజల ఆకాంక్షలకు సజీవ సాక్ష్యం. ప్రతి నీటి బొట్టులో అభివృద్ధి, ప్రతి ప్రవాహంలో ప్రజల ఆకాంక్షలు నిండిన మహోన్నత జలయజ్ఞం. మూడు దశాబ్దాల నిరీక్షణ త్వరలో ఫలించనుంది. 🙏 @BJP4Andhra@MadhavBJP
నేడు మా దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా మాకు ఫోన్, సందేశాలు, సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు ఆత్మీయులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలు, ఆశీస్సులు మాకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించాయి. మీ అందరి ఆదరణ, అనురాగం ఎల్లప్పుడూ మాపై, మా కుటుంబంపై ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరొకసారి మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు.🙏
💐 ధన్యవాదాలతో
డా. ఏలూరి రామచంద్రారెడ్డి & శ్రీమతి వరలక్ష్మి 💐
మోదీ ప్రభుత్వ ప్రోత్సాహంతో దేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రికార్డు స్థాయిలో ₹13 లక్షల కోట్లకు చేరింది. ఏటా ₹3.3 లక్షల కోట్ల ఎగుమతులతో దూసుకుపోతూ, ప్రపంచ వేదికపై భారత్ సత్తాచాటుతోంది.
#MakeInIndia#DigitalIndia
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మాత్యులు శ్రీ కుందూరు జానారెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. 💐🙏
-డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి.
(ఏపీ బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి.)
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. 💐🙏 @UttamINC
-డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి.
(ఏపీ బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి.)
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ధర్మపత్ని, ఎన్టీఆర్ మెమోరియల్ మేనేజింగ్ ట్రస్టీ
శ్రీమతి నారా భువనేశ్వరి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము.💐🙏 @ManagingTrustee
-డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి.
(బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి.)
ఉమ్మడి ప్రకాశం జిల్లాకు మరియు ముఖ్యంగా మార్కాపురం జిల్లాకు వరప్రదాయని అయినటువంటి శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి దశకు చేరుకున్నాయి.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైన ఈ తరుణంలో.. ఇటీవల మార్కాపురం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డు సెంటర్లో నిర్వహించిన ఎన్డీఏ కూటమి రెండేళ్ల పాలన విజయోత్సవ కార్యక్రమానికి హాజరై అక్కడ ఏర్పాటు చేసిన వెలిగొండ ప్రాజెక్టు నమూనాను రాష్ట్ర మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, గౌరవ కలెక్టర్ శ్రీమతి విజయ సునీత గారు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు.. శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు, శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు, యర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు తదితరులతో కలిసి వెలిగొండ నమూనాను వీక్షించడం ఎంతో సంతోషంగా ఉంది.
-డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి.
(బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి.)
ఈ రోజు మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది, ఎంతో ఇష్టమైనది. మా దంపతులం ఇద్దరం కలిసి జీవిత ప్రయాణాన్ని ప్రారంభించిన ఆ మధుర క్షణాలను మరోసారి గుర్తు చేసుకునే అందమైన రోజు ఇది. సుఖదుఃఖాల్లో ఒకరికొకరం తోడుగా నిలుస్తూ, ప్రేమ, నమ్మకం, అనురాగాలతో సాగుతున్న మా బంధం ఇలాగే చిరకాలం కొనసాగాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మాకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 💐🙏
-డాక్టర్. ఏలూరి రామచంద్రారెడ్డి.
(బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి.)
ఎస్ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమం ద్వారా ఓటరు జాబితాలోని చనిపోయినవారి ఓటర్లు తొలగించబడుతుంది, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించబడుతుంది. డూప్లికేట్, మరియు నకిలీ ఓట్లు తొలగించబడుతుంది.. #SIR తో ఎన్నికల వ్యవస్థ మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా మారుతుంది. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలి. స్వచ్ఛమైన ఓటరు జాబితా – బలమైన ప్రజాస్వామ్యానికి పునాది. దేశ అభివృద్ధి కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.🙏 @BJP4Andhra@MadhavBJP