రాఖీ పండుగ నాడ��� #TGSRTC బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
గద్వాల డిపోనకు చెందిన గద్వాల-వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడబిడ్డకు మహిళ జన్మనిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.
రక్షాబంధన్ నాడు బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్ భారతికి #TGSRTC యాజమాన్యం తరపున అభినందనలు. తాను సమయస్పూర్తితో వ్యవహారించి నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే.. సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్టీసీ ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయం.
@TGSRTCHQ @PROTGSRTC @Ponnam_INC
Happy Raksha Bandhan!!
Raksha Bandhan is a festival that fills hearts with love and affection between sisters and brothers. This festival symbolises brother-sister bond.
I celebrated the festival with my family members.
రాఖీ పండుగ శుభాకాంక్షలు!!
అన్నా, చెల్లెళ్లు, అక్కా, తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలను, ఆప్యాయతలను నింపే పండగ రక్షాబంధన్. సోదర బంధానికి ప్రతీక ఈ పండుగ.
స్త్రీ పురుషులందరూ సోదర భావంతో మెలిగినప్పుడే సమాజంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావుండదు.
మానవీయ సంబంధాలను మరింత పటిష్ఠం చేసే రాఖీ పండుగను నా కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం జరిగింది.
ರಾಖಿ ಹಬ್ಬದ ಶುಭಾಶಯಗಳು!!
ರಕ್ಷಾ ಬಂಧನವು ಅಣ್ಣ-ತಂಗಿಯರ ನಡುವೆ ಪ್ರೀತಿ-ವಾತ್ಸಲ್ಯವನ್ನು ತುಂಬುವ ಹಬ್ಬವಾಗಿದೆ. ಈ ಹಬ್ಬವು ಸಹೋದರತ್ವದ ಸಂಕೇತವನ್ನು ಸೂಚಿಸುತ್ತದೆ.
ಎಲ್ಲಾ ಸಹೋದರ ಸಹೋದರಿಯರು ಭ್ರಾತೃತ್ವದಿಂದ ಬಾಳಿದಾಗ ಮಾತ್ರ ಸಮಾಜದಲ್ಲಿ ಯಾವುದೇ ಅಹಿತಕರ ಘಟನೆಗಳು ನಡೆಯುವುದಿಲ್ಲ.
ನನ್ನ ಕುಟುಂಬದ ಸದಸ್ಯರೊಂದಿಗೆ ರಾಖಿ ಹಬ್ಬವನ್ನು ಆಚರಿಸುವುದು ಮಾನವೀಯ ಸಂಬಂಧಗಳನ್ನು ಬಲಪಡಿಸುತ್ತದೆ. ಮತ್ತೊಮ್ಮೆ ಎಲ್ಲರಿಗೂ ರಕ್ಷಾ ಬಂಧನದ ಶುಭಾಶಯಗಳು.
#RakshaBandhan #rakshabandhan2024
#rakshabandhanspecial #RakhiCelebration
#SiblingLove #RakhiFestival
One donor can save up to eight lives. Be a lifesaver this World Organ Donation Day!
Your decision to donate organs can make a profound difference and offer hope to those in need.
#WorldOrganDonationDay
INS-SS ప్రవేశ పరీక్షలో జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించి సత్తా చాటిన కండక్టర్ కూతురు మౌనికకు #TGSRTC కుటుంబం అభినందనలు తెలియజేస్తోంది.
@PonnamLoksabha @TelanganaCMO@TGSRTCHQ @PROTGSRTC
@tsrtcmdoffice @RMMBNR_TSRTC@DMNRPT_TSRTC ఈరోజు నారాయణపేట ఆర్టీసీ డిపోలో మా కోసం, మా ���ిబ్బంది కోసం రెస్ట్ రూమ్ లో కొత్త పరుపులు, కూలర్స్ ఏర్పాటు చేసినందుకు మా ఆర్టీసీ సిబ్బంది తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు, 🙏సజ్జనార్ సార్ మరియు RM & DM మేడమ్ గారు
ప్రజల మధ్య విధులు నిర్వర్తించే ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే #TSRTC యాజమాన��యం ఏమాత్రం సహించదు. సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా దాడులకు, దౌర్జన్యాలకు దిగితే .. బాధ్యులపై ఇలా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుంది.
గద్వాల డిపోనకు చెందిన కండక్టర్ పై దాడి కేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు శ���క్ష పడేలా చర్యలు తీసుకున్న పోలీస్, ఆర్టీసీ అధికారులకు #TSRTC యాజమాన్యం అభినందనలు తెలియజేస్తోంది.
@TSRTCHQ @eenadulivenews @TV9Telugu @NTVJustIn
భక్తుల ఇంటికే భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలు
రూ.151 చెల్లిస్తే విశిష్టమైన రాములోరి తలం��్రాలు పొందే సదావకాశం
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ చేస్తుంది.
హైదరాబాద్‌లోని బస్ భవన్లో సోమవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. తలంబ్రాల బుకింగ్‌ను ఆయన ప్రారంభించారు.
"నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా రాములోరి కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని రెండేళ్ల క్రితమే ��ీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకుంటున్నారు. 2022లో దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను బుక్ చేసుకోగా.. గత ఏడాది 1.17 లక్షల మంది భక్తులకు తలంబ్రాలను సంస్థ అందజేసింది." అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అన్నారు.
భద్రాద్రిలో ఈ నెల 17న అంగరంగ వైభవంగా ���రిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరుతోందన్నారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని చెప్పారు. సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా భక్తుల వద్ద నేరుగా ఆర్డర్లను స్వీకరిస్తారని తెలిపారు. తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర���లైన 040-23450033, 040-69440000, 040-69440069 ను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణకాంత్, సీటీఎం(మార్కెటింగ్ & కమర్షియల్) శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.
#SriRamaNavami #Hyderabad #Bhadradri #RamaNavami @TSRTCHQ @PROTSRTC @TSRTC_LOGISTICS
హైదరాబాద్ లోని టీఎస్ఆర్���ీసీ కళాభవన్ లో గురువారం గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్‌తో పాటు మేడారం జాతరలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఉద్యోగులకు, దసరా లక్కీ డ్రా విజేతలకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు.. టీఎస్ఆర్టీసీ ఎండీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారితో కలిసి 157 మంది ఉత్తమ ఉద్యోగులకు అవార్డులు అందజేసి వారిని సన్మానించారు. అవార్డు అందుకున్న వారిలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్, హెల్పర్స్, శ్రామిక్ లతో పాటు సూపర్వైజర్స్, డిపో మేనేజర్స్, డిప్యూటీ ఆర్ఎంలు, ఆర్ఎంలు.. ఇలా అన్ని విభాగాల వారున్నారు.
@TSRTCHQ @PROTSRTC @PonnamLoksabha #Hyderabad #Telangana
@PPR_CHALLA @tsrtcmdoffice Buses ఏర్పాటు చేశాము. Scheduled buses అన్ని వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువమంది ప్రయాణికులు రావడం వలన buses ఏర్పాటు చేయడంలో ఆలస్యం జరిగింది. Sorry for the inconvenience.
#Hyderabad మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లో ఘనంగా #NewYear2024 వేడుకలు. ప్రయాణికులతో కలిసి కేక్ కట్ చేసిన TSRTC (@TSRTCHQ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు(@SajjanarVC).
#NewYear#HappyNewYear2024
కన్నీటి సిరాను కలంలో నింపి హృదయ పలకం మీద రాస్తున్న చరాక్షర నివాళి!
గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ���రాండ్. విప్లవ ప్రయాణానికి రథ సారథి ఆయన. పేదల పక్షాన జరిగే పోరాటాలకు వెన్నెముక. ఎన్నో ప్రభుత్వాలను ప్రజల పక్షాన అడిగిన ప్రశ్న.
పాట అంటే చెవులతో కాదు వినేది.. పాటంటే గుండెలతో విని మెదడులో ఆలోచనలు రేపేది అని పరమార్థాన్ని చెప్పేది.. పాటంటే మాటలతో తూటాలను ఎక్కుబెట్టి.. అన్యాయపు మర్మాన్ని రట్టు చేసేది అని అర్ధం అని చెప్పిన వారు గద్దర్.
ఎన్నో ప్రజా పోరాటాలను ముందుండి నడిపించి, అన్ని ���క్షాల ప్రజలను కలుపుకుని సమ సమాజ నిర్మాణానికి అలుపెరగని పోరాటం చేసి, మృత్యువుతో పోరాడి ఓడినా.. ప్రజల నాలుకలపై పాటవై చిరంజీవిగా నిలిచిన గద్దర్ గారికి TSRTC యాజమాన్యం పక్షాన మరియు TSRTC ఉద్యోగుల పక్షాన నివాళులు అర్పిస్తున్నాం.
గద్దర్ గారితో నాకు సుమారు దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. ప్రజా ఉద్యమంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర గురించి ఎన్నో సందర్భాలలో నాతో పాలు ప��చుకున్నారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడం అని ఎన్నోసార్లు చెప్పేవారు.
ఒకానొక సందర్భంలో తను రాసిన పాట "మల్లె తీగకు పందిరి వోలె... మసక చీకటిలా వెన్నెలవోలె నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా తొడ బుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా'' అనే పాటకు ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించినా తను దానిని తిరస్కరించినట్లు చెప్పి పాట పై తనకున్న గౌరవాన్ని చాటి, పాటంటే వ్యాపారం కాదని, పాటంటే ప్రజల నాడి అని చెప్పారు.
గద్దర్ గారు ఎన్నో సందర్భాలలో నన్ను కలిసి ఆయన మీద నమోదైన కేసుల గురించి చర్చించేవారు. తను చెప్పవలసిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, మృదువుగా చెప్పేవారు. ఎంత పెద్ద అధికారి అయినా రాజకీయ నాయకులనైనా, వయసులో తనకంటే చిన్న వారిని కూడా నోరార "అన్నా" అని పిలిచేవారు. ఆసువుగా పాట పాడటంలో గద్దర్ గారిని మించిన కవి, గాయకుడు లే���ని చెప్పవచ్చు.
తెలంగాణ ఉద్యమాన్ని కలిసికట్టుగా నడిపిన నాయకులు ఎందరు ఉన్నా, తెలంగాణ సాధించిన ఘనత పాటల తల్లిదని చెప్పి సంతోషించే వారు. ఈ మధ్య కాలంలో గద్దర్ గారి ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. సమయాభావం వల్ల కలువలేక పోయాను. పాట నిలిచి ఉన్నంత కాలం గద్దర్ బ్రతికే ఉంటారు. ఉద్యమ కారులు ఎవ్వరు చనిపోయినా ఆయన అక్కడికి చేరుకొని తన పాటలతో నివాళులు అర్పించేవారు. ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించడం అనేది బాధాకరం.
గద్దర్ గారి కుటుంబ ���భ్యులకు మరియు ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
#Gaddar @HiHyderabad @YakaswamyChalla @way2_news @tsrtcmdoffice @TV9Telugu @abntelugutv @V6News @NtvTeluguLive @eenadulivenews
కన్నీటి సిరాను కలంలో నింపి హృదయ పలకం మీద రాస్తున్న చరాక్షర నివాళి!
గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. విప్లవ ప్రయాణానికి రథ సారథి ఆయన. పేదల పక్షాన జరిగే పోరాటాలకు వెన్నెముక. ఎన్నో ప్రభుత్వాలను ప్రజల పక్షాన అడిగిన ప్రశ్న.
పాట అంటే చెవులతో కాదు వ��నేది.. పాటంటే గుండెలతో విని మెదడులో ఆలోచనలు రేపేది అని పరమార్థాన్ని చెప్పేది.. పాటంటే మాటలతో తూటాలను ఎక్కుబెట్టి.. అన్యాయపు మర్మాన్ని రట్టు చేసేది అని అర్ధం అని చెప్పిన వారు గద్దర్.
ఎన్నో ప్రజా పోరాటాలను ముందుండి నడిపించి, అన్ని పక్షాల ప్రజలను కలుపుకుని సమ సమాజ నిర్మాణానికి అలుపెరగని పోరాటం చేసి, మృత్యువుతో పోరాడి ఓడినా.. ప్రజల నాలుకలపై పాటవై చిరంజీవిగా నిలిచిన గద్దర్ గారికి TSRTC యాజమాన్యం పక్షాన మరియు TSRTC ఉద్యోగుల పక్షాన నివాళులు అర్పిస్తున్నాం.
గద్దర్ గారితో నాకు సుమారు దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. ప్రజా ఉద్యమంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర గురించి ఎన్నో సందర్భాలలో నాతో పాలు పంచుకున్నారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడం అని ఎన్నోసార్లు చెప్పేవారు.
ఒకానొక సందర్భంలో తను రాసిన పాట "మల్లె తీగక�� పందిరి వోలె... మసక చీకటిలా వెన్నెలవోలె నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా తొడ బుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా'' అనే పాటకు ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించినా తను దానిని తిరస్కరించినట్లు చెప్పి పాట పై తనకున్న గౌరవాన్ని చాటి, పాటంటే వ్యాపారం కాదని, పాటంటే ప్రజల నాడి అని చెప్పారు.
గద్దర్ గారు ఎన్నో సందర్భాలలో నన్ను కలిసి ఆయన మీద నమోదైన కేసుల గురించి చర్చించేవారు. తను చెప్పవల���ిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, మృదువుగా చెప్పేవారు. ఎంత పెద్ద అధికారి అయినా రాజకీయ నాయకులనైనా, వయసులో తనకంటే చిన్న వారిని కూడా నోరార "అన్నా" అని పిలిచేవారు. ఆసువుగా పాట పాడటంలో గద్దర్ గారిని మించిన కవి, గాయకుడు లేరని చెప్పవచ్చు.
తెలంగాణ ఉద్యమాన్ని కలిసికట్టుగా నడిపిన నాయకులు ఎందరు ఉన్నా, తెలంగాణ సాధించిన ఘనత పాటల తల్లిదని చెప్పి సంతోషించే వారు. ఈ మధ్య కాలంలో గద్దర్ గారి ఆరోగ్యం క్���ీణించిందని తెలిసింది. సమయాభావం వల్ల కలువలేక పోయాను. పాట నిలిచి ఉన్నంత కాలం గద్దర్ బ్రతికే ఉంటారు. ఉద్యమ కారులు ఎవ్వరు చనిపోయినా ఆయన అక్కడికి చేరుకొని తన పాటలతో నివాళులు అర్పించేవారు. ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించడం అనేది బాధాకరం.
గద్దర్ గారి కుటుంబ సభ్యులకు మరియు ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.
#Gaddar @HiHyderabad @YakaswamyChalla @way2_news @tsrtcmdoffice @TV9Telugu @abntelugutv @V6News @NtvTeluguLive @eenadulivenews
గ్రామీణ, పట్టణ ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు #TSRTC కీలక నిర్ణయం తీసుకుంది. పల్లె వెలుగు బస్సులో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం ‘టి-9 టికెట్’ అందుబాటులోకి తెచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను ఇప్పటికే అందిస్తోన్న సంస్థ.. తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల సౌకర్యార్థం టి-9 టికెట్ ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
హైదరాబాద్ లోని బస్ భవన్ లో శుక్రవారం ‘టి-9 టికెట్’ పోస్టర్ ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. ఈ టికెట��� ఈ నెల 18(ఆదివారం) నుంచి పల్లె వెలుగు బస్సుల్లో కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.
‘టి-9 టికెట్’ పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు వర్తిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది. ఈ టికెట్ ద్వారా 60 కిలోమీటర్ల పరిధిలో ఒక్కసారి రానూపోను ప్రయాణం చెయొచ్చు. ‘టి-9 టికెట్’ కు రూ.100 ధరగా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. టోల్ గేట్ చార్జీలపైన మినహాయింపు ఇచ్చింది. దీంతో ఈ టికెట్ ద్వారా ఒక్కోక్కరికి రూ.20 నుంచి రూ.40 వరకు ఆదా అవుతందని సంస్థ ప్రకటించింది.
60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు వయసు ధృవీకరణ కోసం తమ ఆధార్ కార్డును కండక్టర్లకు చూపించి టి-9 టికెట్ పొందవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఈ టికెట్లను కండక్టర్లు ఇస్తారు. తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఈ టికెట్ చెల్లుబాటు అవుతుంది.
"పల్లె వెలుగు బస్సుల్లో ప్రతి రోజు సగటున 15 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అందులో మహిళలు, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా ఉన్నారు. వారికి ఆర్థికభారం తగ్గించాలనే ఉద్దేశంతోనే పల్లెవెలుగు బస్సుల్లో ‘టి-9 టికెట్’కు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుట్టింది. ఈ టికెట్ తో రూ.100 చెల్లించి 60 కిలోమీటర్ల పరిధిలో రానూపోను ప్రయాణించవచ్చు. గ్రామీణ, పట్టణ ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని సంస్థను ఆదరించాలి.” అని ట��ఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను అందుబాటులోకి తెచ్చామని, వాటికి ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన వస్తోందని గుర్తు చేశారు. ఆ టికెట్లకు మంచి స్పందన వస్తుండటంతో తొలిసారిగా గ్రామీణ, పట్టణ ప్రయాణికుల కోసం ‘టి-9 టికెట్’ను తీసుకువచ్చామని చెప్పారు. ఈ టికెట్ కు సంబంధించిన పూర్తి వివరాలకు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సూచించారు.
‘టి-9 టికెట్’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ)లు, పీవీ ముని శేఖర్, పురుషోత్తం, కృష్ణ కాంత్, సీటీఎం జీవన్ ప్రసాద్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్, సీఎఫ్ఎం విజయపుష��ఫ, తదితరులు పాల్గొన్నారు.
@TSRTCHQ @PROTSRTC @Govardhan_MLA @puvvada_ajay @CTMOTSRTC
Introducing the all-new e Garuda electric buses. With state-of-the-art security facilities - including CCTV cameras, Wi-Fi, and GPS tracking - ensure your safety. Experience ultimate comfort and security on the go with e Garuda, brought to you by TSRTC.