#BreakingNews ముంబైలోని జుహు
ప్రాంతంలో బాలీవుడ్ నటుడు #TigerShroff కారుపై దుండగులు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ క్షేమంగా బయటపడ్డారు, ఎవరికీ గాయాలు కాలేదు. కానీ ఆయన డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలైనట్లు సమాచారం. పెద్ద వివాదాలేమీ లేని ఆయనపై ఈ దాడికి అసలు కారణం ఏంటన్న దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
#TigerShroff #Mumbai
మొన్నటివరకు స్టార్ హీరోల క్యామియోల ట్రెండ్
నడిచింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ క్యామియోల ట్రెండ్
మొదలయ్యింది. ఇప్పటికే #ToxicTheMovie లో నలుగురు
హీరోయిన్స్ కనిపించారు.
.. ఇక ఇప్పుడు అదే ఫార్ములాని #dharman కి
వాడుతున్నారు. #Jailer2 తరువాత #Rajinikanth నటిస్తోన్న
#dharman లో నలుగురు హీరోయిన్స్ కనిపించనున్నారు.
ఇప్పటికే #simran #raashikhanna #sreeleela కీలక
పాత్రల్లో నటిస్తోండగా మరో ప్రత్యేకమైన పాత్ర కోసం
#Nayanthara ని సంప్రదించారట. ఇప్పటికే నాలుగు
సినిమాల్లో జంటగా నటించిన రజనీ- నయన్ కి ఇది ఐదో
సినిమా అవుతుంది.
#Aasha రివ్యూ
#urvashi#jojugeorge#aishwaryalakshmi ప్రధాన
పాత్రల్లో సఫర్ సనాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా #Zee5 లో స్ట్రీమింగ్ అవుతుంది.
కథ విషయానికొస్తే.. ఆశ(ఊర్వశి) కి భర్త చనిపోతాడు. ఆమెకుఇద్దరు కూతుళ్లు. అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలనుకునే ఆశ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వలన ఒక మెంటల్ తరుమాలో ఉండిపోతుంది. ఒకరోజు కూతురు అనఘ (ఐశ్వర్యలక్ష్మీ) తో కలిసి ఆశ సెకండ్ షో సినిమా చూసి వస్తుండగా.. వారి కారును జీమోన్ (జోజూ జార్జ్) కారు ఢీ కొడుతోంది. ఆ గొడవలో ఆశ.. అతనిపై కేసు పెడుతుంది. ఆ తరువాత జరిగిన సంఘటనలు ఏంటి.. ? ఆశ అనుమానంతో చేసిన అఘాయిత్యం ఏంటి..? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఫస్ట్ హాఫ్ చాలా బావుంటుంది.. సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్
ఉంటుంది. క్లైమాక్స్ అస్సలు ఊహించలేం. మనసును
మెలిపెట్టేస్తుంది.
వీకెండ్ లో ఒకసారి చూడొచ్చు. చూసిన వాళ్లు ఎలా ఉందో చెప్పండి.
కంటెంట్ క్రియేటర్‌గా సోషల్ మీడియాను షేక్ చేసిన #AyeJude (అజయ్ హనుమంతు) హీరోగా కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది! 🚀✨
ఈ ముహూర్తపు షాట్‌కు స్టార్ డైరెక్టర్లు #HarishShankar, #BuchiBabuSana, మరియు లెజెండరీ డైరెక్టర్ #BGopal గారు ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌ను ఆశీర్వదించారు!
సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ దంపతులు
తెలంగాణ ముఖ్యమంత్రి @revanth_anumula గారిని మర్యాదపూర్వకంగా కలిశారు!
తమ కుమార్తె #kavyamaran మరియు ప్రముఖ సంగీత దర్శకులు #anirudh ల వివాహ రిసెప్షన్ (నవంబర్ 21న చెన్నైలో జరగనుంది) కు ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించారు. #tollywood
#itluarjuna Grand Pre Release Event lo..
#AkkineniNagarjuna ప్రేక్షకుల మనసులను చదివేశారు.
"ఈ మధ్య ఒళ్లు దగ్గరపెట్టి చేసిన సినిమాలే
ఆడుతున్నాయి.. ఈ వన్ ఇయర్ లో ప్రేక్షకులు
చెబుతున్నారు ఎలాంటి సినిమాలు కావాలనేది.
ఆ లెసన్స్ ను చూడాలి. #chiranjeevi గారు, నేను ఒక కల్చర్ ను అలవాటుపడి సినిమాలు చేస్తున్నాము"
చాలామంది హీరోలు కూడా ఈ విషయాన్ని గమనిస్తే బావుంటుంది. #tollywood
సౌత్ ఇండస్ట్రీ మ్యూజిక్ సెన్సేషన్ #Anirudh &
#Kavyamaran ల వివాహ వేడుకకు ముహూర్తం ఫిక్స్! ✨
నవంబర్ 11: గ్రీస్‌లో గ్రాండ్ డెస్టినేషన్ వెడ్డింగ్ 🇬🇷 📍
నవంబర్ 14: చెన్నై 5-స్టార్ హోటల్లో గ్రాండ్ రిసెప్షన్ 🏨
#sungroup అధినేత #kalanidhimaran స్వయంగా సీఎం ఎం.కే.
స్టాలిన్ & #CMVijay లకు తొలి పెళ్లి పత్రికను
అందజేయనున్నారు.