సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్టు ముంపు పేరుతో గోదావరి నదిని చెరబట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల మంత్రులు కుట్రలు చేస్తున్నారు
ఆదివాసీల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇసుక క్వారీల పేరుతో గ్రామ సభలు నిర్వహించి 70 కి.మీ.ల పొడవునా గోదావరి నుంచి ఇసుక తవ్వి తీసి వేల కోట్ల రూపాయల దందాకు తెరతీశారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతమ్మ సాగర్ హెడ్ వర్క్స్ ఉంటే అక్కడి నుంచి 70 కి.మీ.ల దూరంలోని ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట, వాడగూడెం, అకినపల్లి వరకు గోదావరి నది ముంపు పేరుతో మొత్తం ఇసుక దోచేసి వేల కోట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారు
ముఖ్యమంత్రి డైరెక్షన్ లో ఇద్దరు మంత్రులు సాగిస్తున్న ఈ దందాకు అడ్డుకట్ట వేసే వరకు తెలంగాణ రక్షణ సేన పోరాడుతుంది
Hyderabad, Telangana: Telangana Rakshana Sena President Kavitha says, "Today is the 6th Moharram. Moharram reminds us of the sacrifices made by Hazrat Imam Hussain and his followers. And ultimately, the sacrifices made by them have only helped humankind to go ahead. Even today, we have to carry the spirit of Imam Hussain Sahib. And we have to make sure that in Telangana and in India, the development will only happen by cooperating with each other, by making sure that there is peace at all time among all the communities. And a very progressive thought process should be a part of our thinking and culture..."
భూపాలపల్లిలో ఈ రోజు బొగ్గు లారీ ఢీకొని డీటీఓ వెంకన్న మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది
ఎంతో భవిష్యత్ ఉన్న అధికారిని ప్రమాదం బలితీసుకోవడంతో వారి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది.. ఈ ప్రమాదంపై న్యాయ విచారణకు ఆదేశించాలి.. వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
వెంకన్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను
భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్ (జెన్ కో)కు తాడిచర్ల కోల్ మైన్ కేటాయించి 13 ఏళ్లు గడిచిపింది.. 13 ఏళ్లుగా తాడిచర్ల – భూపాలపల్లి థర్మల్ పవర్ స్టేషన్ కు ఎందుకు రైల్వే లైన్ వేయలేదు? దీనికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల అలసత్వమే కారణం
రోడ్డు మార్గంలో బొగ్గు రవాణాతో కొందరు స్థానిక నాయకులు కోట్లు కూడబెట్టుకుంటుంటే.. అమాయకులు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు
వెంటనే తాడిచర్ల నుంచి భూపాలపల్లికి రైల్వే లైన్ వేసే పనులు ప్రారంభించాలి
Deeply troubled by the tragic loss of Sheikh Sana, a NEET aspirant from Hyderabad. Sana’s heartbreaking death takes the number of lives lost to this systemic collapse to 13 nationwide.
Accountability cannot be fixed at the lowest levels. The responsibility for systemic failures rests at the top, and that is where answers and corrective action must come from.
My message to the students: We all get how helpless it feels to be punished for the system’s negligence, and that is unacceptable. Having said that, no opportunity lost is worth your life. If it is getting too overwhelming, speak to someone you trust. Do not take extreme steps and deprive this country and your families of bright young souls with the passion to do the right thing. The world needs you.
https://t.co/CLIE5LvTzZ
బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఉద్యమకారుల భూపోరాటం పోస్టర్ ఆవిష్కరించిన తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ..
🔹జులై 2న ఉప్పల్ భగాయత్ భూములు స్వాధీనం చేసుకుంటాం
🔹ఉద్యమకారుల భూపోరాటానికి అన్ని వర్గాల ప్రజలు తరలిరావాలి
🔹జులై 2న ఉప్పల్ భగాయత్ లో భూపోరాటం చేసి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకుంటాం
🔹ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇచ్చే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది.
🔹వెంటనే ఉద్యమకారులను గుర్తించి వారికి ఇస్తామన్న భూమి ఇవ్వాల్సిందే.
🔹మరో మారు కొంతమంది వ్యక్తులు, శక్తులు తెలంగాణవాదం మీద దాడి చేస్తూ తెలంగాణ స్ఫూర్తిని దెబ్బ తీసే కుట్ర చేస్తున్నారు
🔹అందుకే వాళ్ల కుట్రలను తిప్పికొట్టేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
🔹ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం మనందరి చారిత్రక కర్తవ్యం.
🔹ఉద్యమకారులకు మంచి జరగాలని భావించే వాళ్లంతా పెద్ద ఎత్తున తరలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా.
🔹ముఖ్యంగా యువత, మహిళలు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనాలి.
🔹మీ భవిష్యత్ కోసం ఉద్యమకారులు వాళ్ల జీవితాలనే త్యాగం చేశారు.
🔹కనుక వారికి మంచి చేసే కార్యక్రమంలో మనమంతా పాల్గొనాలి.
#TRS
రైతు డిస్కమ్ ఏర్పాటుపై తెలంగాణ ఈఆర్సీ నిర్వహించే పబ్లిక్ హియరింగ్లో పాల్గొననున్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత గారు
📅 తేదీ : 29 మే 2026 (శుక్రవారం)
🕥 సమయం : ఉదయం 10:30 గంటలకు
📍 వేదిక : విద్యుత్ నియంత్రణ్ భవన్, టీజీఈఆర్సీ, ఎర్రగడ్డ, హైదరాబాద్ ఎర్రగడ్డ
#TRS
ఉమ్మడి ఆదిలాబాద్ కు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బోడ జనార్థన్ ఆయన అనుచరులకు కండువా కప్పి టీఆర్ఎస్ పార్టీ లోకి ఆహ్వానించిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత గారు
🔹సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళిక తయారు చేస్తున్నాం
🔹ఆ అభివృద్ధి ప్రణాళిక విప్లవత్మక మార్పు తెస్తుంది. తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలి
🔹సింగరేణి, ఆర్టీసీ కార్మికులను ఈ ప్రభుత్వం ఘోరంగా మోసం చేస్తోంది
🔹కార్మికులకు మినిమమ్ వేజెస్ ఫిక్స్ చేశామని చెప్పి వారికి ముఖ్యమంత్రి తీరని అన్యాయం చేస్తున్నారు
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత గారు మాట్లాడుతూ...
🔹సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని...అది తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బోడ జనార్థన్ తో పాటు ఆయన అనుచరులు టీఆర్ఎస్ లో చేరారు. గురువారం బంజరాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో వారికి కండువాలు కప్పి టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న బోడ జనార్దన్ చేరికతో టీఆర్ఎస్ కు మరింత బలం చేకూరిందన్నారు. చిన్న వయసులోనే కార్మిక శాఖ మంత్రిగా, ఆర్టీసీ ఛైర్మన్ గా పనిచేసిన జనార్థన్.. సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికుల కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఆయన హోదాకు తగిన విధంగా పార్టీలో ప్రాధాన్యం ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి, ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తూ కర్కషంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
సబ్బండ వర్గాల అభివృద్ధి ప్రణాళిక:-
🔹తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించేందుకు ఏర్పడిందే తెలంగాణ రక్షణ సేన అని కవిత అన్నారు. సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళికను తయారు చేస్తున్నామని... త్వరలోనే ఆ ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు. ఇందుకోసం చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నామన్నారు. తాము తీసుకురాబోయే ప్రణాళిక తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని కవిత చెప్పారు. తమ పార్టీ సమసమాజ స్థాపన కోసం ఏర్పడిందని... తాము కచ్చితంగా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మారుతామన్నారు. ప్రశ్నించటం, పోరాటడటం, పరిష్కరించటం అనే విధానంతో తాము ముందుకు వెళ్తున్నామని కవిత చెప్పారు. కొంతమంది ప్రశ్నిస్తారు. మరికొంతమంది పోరాటం చేస్తారు. కానీ తమ పార్టీ ప్రశ్నించి, పోరాడి, పరిష్కరించే వరకు సమస్యను వదిలిపెట్టదన్నారు. జనం బాట కార్యక్రమం లో మనం ప్రస్తావించిన సమస్యల్లో 25 సమస్యలకు పరిష్కారం లభించిదని గుర్తు చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ ను మనం ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రివ్యూ చేశారు. ఉద్యమాలు చేయకండి మేము పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారన్నారు. నల్గొండలో 35 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బ్రిడ్జి పనులను జనంబాటలో ప్రస్తావిస్తే...ఇప్పుడు ఆ బ్రిడ్జి పనులను ప్రారంభించారని కవిత గుర్తు చేశారు.
కార్మికులకు తీరని అన్యాయం:-
🔹సింగరేణి, ఆర్టీసీ సహా అన్ని రంగాల్లోని కార్మికులను రేవంత్ సర్కార్ ఘోరంగా మోసం చేస్తోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు మినిమమ్ వేజేస్ ఫిక్స్ చేశామంటూ గతంలో ఎవరు ఇలా చేయలేదని ఈ ముఖ్యమంత్రి చెబుతున్నారని కవిత అన్నారు. కానీ ఆయన మినిమమ్ వేజేస్ పేరుతో పచ్చి దగా చేశారన్నారు. ఆరేళ్ల క్రితమే మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి సీఎం కు కార్మికులకు మినిమమ్ వేజేస్ 20 వేలు ఉండాలని రేవంత్ రెడ్డి లేఖ రాశారని చెప్పారు. ఆయన లేఖలో ఏదైతే కేటగిరీ చెప్పారో ఆ కేటగిరీకి ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి రూ. 16 వేల వేతనం ఫిక్స్ చేశారన్నారు. అంటే ఆరేళ్ల తర్వాత నాలుగు వేలు తగ్గించి 16 వేల వేతనం ఇస్తామని గొప్పగా చెబుతుండటం కార్మికులను నయవంచనకు గురిచేయటమేనని చెప్పారు. ఇక సింగరేణిలో కార్మికుల చెమట, రక్తాన్ని పీల్చి మరి దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఒక్క రూపాయి తో అయ్యే పనికి పది రూపాయలు ఖర్చు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక మనం డిపెండెంట్ ఉద్యోగాలు సాధించుకున్నాం. కానీ కాంగ్రెస్ వాటిని పొగొట్టే పనిచేస్తోందని కవిత మండిపడ్డారు. ఐఎన్ టీయూసీ, దాని తోక పార్టీ తో అధికారం చెలాయిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. బోడ జనార్థన్ రాకతో మా హెచ్ఎంఎస్ కు సింగరేణిలో మరింత బలం వస్తుంది. ఆయన సహకారంతో సింగరేణి కార్మికుల కోసం ప్రభుత్వంపై మరింత గట్టిగా పోరాటం చేస్తామని కవిత చెప్పారు.
ఆర్టీసీ విలీనం ఊసే లేదు:-
🔹రేవంత్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను కూడా అన్యాయం చేస్తుందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి రెండున్నరేళ్లు మొద్దు నిద్రపోయారని విమర్శించారు. రాజు గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ బలిదానం చేసుకునే వరకు కూడా విలీనం ఊసే ఎత్తలేదన్నారు. ఇటీవల పెట్రోల్ ధరలపై ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ముందు వడ్లు కొనాలని సూచించినందుకు ఓ ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ మేమంతా పోరాటం చేస్తే వెనక్కి తగ్గారని చెప్పారు. అంటే ప్రశ్నిస్తే తట్టుకోలేని కర్కష పాలన ఈ రాష్ట్రంలో జరుగుతోందని మండిపడ్డారు. ఆర్టీసీ ఛైర్మన్ గా పనిచేసిన బోడ జనార్థన్ సహకారంతో ఆర్టీసీ కార్మికుల కోసం కూడా పోరాడుతామన్నారు.
మాజీ మంత్రి బోడ జనార్థన్ గారు మాట్లాడుతూ...
ఎన్టీఆర్, కేసీఆర్ కన్నా ఉన్నతంగా ఆలోచించారు:-
🔹ఒక మహిళ నాయకురాలు పార్టీ పెట్టి ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తానని ముందుకు రావటం చాలా ధైర్యంతో కూడిన విషయమని మాజీ మంత్రి బోడ జనార్దన్ అన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ కూడు, గూడు, గుడ్డ అనే మూడు అంశాలతో అధికారంలోకి రాగా ఆ తర్వాత కేసీఆర్ గారు నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ మూడు అంశాలతో అధికారంలోకి వచ్చారని చెప్పారు. కానీ కవిత మాత్రం పాంచజన్యం అంటూ ఐదు కీలకమైన అంశాలతో ఆ ఇద్దరు నాయకుల కన్నా ఉన్నతంగా ఆలోచించారని చెప్పారు. కవిత ప్రకటించిన మేనిఫెస్టో నచ్చి టీఆర్ఎస్ లో చేరుతున్నాన్నారు. రాష్ట్రానికి మహిళ సీఎం అయితే ఎంతో అభివృద్ధి ఉంటుందని చెప్పారు. ఇక నుంచి కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ... టీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు కష్టపడి పనిచేస్తానని చెప్పారు.
#TRS
మాజీ మంత్రి బోడ జనార్దన్ భారీ ఎత్తున తన అనుచరులతో కలిసి తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా TRS అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
#TRS
తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి బోడ జనార్దన్.. మధ్యాహ్నం 3 గంటలకు బంజారాహిల్స్ లోని టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత సమక్షంలో చేరనున్న మాజీ మంత్రి బోడ జనార్దన్
#TRS
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారు. తెలంగాణ రాజకీయ, సాంఘీక చైతన్యానికి నిదర్శనంగా నిలిచిన ఆయన రచయితగా, పండితుడిగా, పత్రికా సంపాదకుడిగా సేవలందించి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. శ్రీ సురవరం ప్రతాప రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు.
మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది.. ఎండల వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే రైతులు, గిగ్ వర్కర్స్, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇతర పనులు చేసే వాళ్లందరూ ఎండల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి తగిన ఏర్పాట్లు చేయాలి