తెలంగాణ ప్రజల పెద్ద పండగ దసరా!
సొంతూర్లలో చుట్టాలను, శ్రేయోభిలాషులను కలవడం
బంధుమిత్రులు అలాయి బలాయి చేసుకోవడం
జమ్మి చెట్టుకు పూజలు చేయడం
పాలపిట్టను చూడటానికి ఇంటిల్లిపాది వెళ్ళడం
ఇలా తెలంగాణ జీవనంలో దసరా పండుగది ఒక ప్రత్యేక స్థానం.
చెడుపై మంచి, అధర్మంపై ధర్మం విజయం సాధించిన ఈ విజయ దశమి పర్వదినాన... రాష్ట్రంలో అధర్మం నశించాలని, తెలంగాణ ప్రజలకు సకల విజయాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని ప్రార్ధిస్తున్నాను.
రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు ☘️
శ్రీకృష్ణుడి రూపంలో.. చిన్నశేష వాహనంపై విహరించిన శ్రీవారు
తిరుమల లో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం మలయప్ప స్వామి ఐదు తలల చిన్నశేష వాహనంపై మాడవీధుల్లో విహరించారు. శ్రీకృష్ణుడి రూపంలో కొలువుదీరి భక్తులకు అభయమిచ్చారు. #tirumala
ప్రయాణికులందరినీ సురక్షితంగా ఉంచేందుకు, గుండెపోటును సైతం లెక్క చేయకుండా బస్సును సురక్షితంగా నిలిపి స్టీరింగ్‌పైనే ప్రాణాలు వదిలిన డ్రైవర్ శివ గారికి నా సెల్యూట్. 40 మంది ప్రాణాలను కాపాడి కన్నుమూసిన ఆపద్బాంధవుడు శివ. కాకినాడ జిల్లా, శంఖవరం మండలం, కత్తిపూడి గ్రామానికి చెందిన జట్ల శివ కాకినాడ ఆర్టీసీ డిపోలో ఒక డైలీ వేజ్ డ్రైవర్. కాకినాడ నుంచి విశాఖపట్నానికి 40 మంది ప్రయాణికులతో బస్సు బయలుదేరింది. తుని సమీపంలోకి రాగానే శివకు ఛాతీలో విపరీతమైన నొప్పి వచ్చింది. ఆ సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బస్సును నియంత్రించి, రోడ్డు పక్కగా ఆపి, ఆయన స్టీరింగ్‌పైనే ఒరిగిపోయారు.
తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ప్రయాణికుల క్షేమమే పరమావధిగా చాకచక్యంగా బస్సును అదుపు చేసిన శివ గారి త్యాగం చిరస్మరణీయం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం శివ గారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటుంది.
https://t.co/NnapbtXrC6
‘‘అప్పులుంటే ఆత్మహత్య చేసుకోవద్దు.. నా దగ్గరికి రండి.. నేను డబ్బులిస్తా’’ అని రైతులకు అండగా నిలిచిన మనసున్న మనిషి శ్రీ నానా పటేకర్ ..
🙏
Extraordinary Actor, Terrific Screen Presence, Beautiful Artistic Journey .. May His Soul Rest In Peace .. #NanaPatekar
“If we could see the world through their eyes, what would we do differently?”
On World Animal Day 2026, the theme “See the World Through Their Eyes” calls upon us to look beyond our own perspective and recognise the needs, well-being and dignity of every animal, wild or domestic.
The choices we make today shape the world they live in. Protecting habitats, preventing cruelty and caring for animals are expressions of our shared responsibility towards every living being.
In Andhra Pradesh, our zoological parks at Visakhapatnam and Tirupati provide an opportunity for people to participate in animal care and conservation through their Animal Adoption Programmes. A birthday, anniversary or family celebration can become more meaningful when it also becomes an occasion to extend our care towards another life.
Let our celebrations create a legacy of compassion.
Let our choices speak for those who cannot speak for themselves.
See the world through their eyes.
- @PawanKalyan
#WorldAnimalDay #SeeTheWorldThroughTheirEyes #AnimalWelfare #WildlifeConservation #Coexistence
#WATCH | Israeli Prime Minister Benjamin Netanyahu speaks with Flydubai Captain Smit Machchhar and invites him and PM Narendra Modi to the next Israeli Independence Day.
He says, "I want to invite you and my dear friend, Prime Minister Narendra Modi, to light a celebratory flame on our next Independence Day. You are a true hero of the brave peoples of India and Israel, and you are a hero of the entire world. I wish you a very speedy and complete recovery..."
(Source: Prime Minister of Israel/X)
ఆవేదనతో చేస్తున్న అత్యవసర విజ్ఞప్తి..!! 🙏
రాచవారిపాలెం సమీపంలో ఒక దారుణమైన సంఘటన మా దృష్టికి వచ్చింది. కేవలం 8 సంవత్సరాల వయసున్న రామయ్య అనే చిన్నారి గొర్రెలు మేపుతూ కనిపించాడు.
మమ్మల్ని చూసి ఆ బాలుడు ఏడుస్తూ చెప్పిన మాటలు గుండెను పిండేస్తున్నాయి:
"అన్నా… నన్ను ఇంటికి తీసుకెళ్లండి. నాకు అన్నం కూడా సరిగా పెట్టడం లేదు. నేను సరిగ్గా తిరగలేకపోతున్నాను."
విచారించగా ఆ బాలుడు నర్రవాడ గ్రామానికి చెందినవాడని తెలిసింది.
ఇంత చిన్న వయసులో బాలుడిని పనుల్లో పెట్టి, ఆకలితో అలమటించేలా చేయడం తీవ్రమైన నేరం.
మంత్రి నారా లోకేష్ గారికి @naralokesh , ఆంధ్రప్రదేశ్ పోలీసులకు @APPOLICE100 , మరియు చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు మా విజ్ఞప్తి:
వెంటనే ఈ ప్రాంతానికి చేరుకుని బాలుడిని గుర్తించాలి.
అతనికి వైద్యం, ఆహారం అందించి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చాలి.
చిన్నారిని ఈ పరిస్థితికి తీసుకువచ్చిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి.
📢 దయచేసి ఈ పోస్ట్‌ను షేర్ చేసి, బాలుడికి న్యాయం జరిగేలా సహాయపడండి.
#ChildLabour #ChildProtection #AndhraPradesh #NaraLokesh #NarraWada #Rachavaripalem
నగరంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగేలా చూసేందుకు క్షేత్రస్థాయి ఏర్పాట్లను ద్విచక్ర వాహనంపై స్వయంగా పర్యటించి పరిశీలించాను.
అంకితభావంతో శ్రమించి హైదరాబాద్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా విజయవంతం చేసిన మా సిబ్బంది నిబద్ధత వెలకట్టలేనిది.. వీరి కష్టానికి ఎన్ని ప్రశంసలైనా తక్కువే!
కర్తవ్య నిర్వహణలో అలసిసొలసిన నా సహచరుల్లో సరికొత్త జోష్ నింపేందుకే వారితో కలిసి సరదాగా ఆడిపాడాను.
అహోరాత్రులు చెమటోడ్చిన వాళ్ల ముఖాల్లో.. ఆ అలసట స్థానంలో విరిసిన నవ్వులు చూశాక, ఇంతకంటే సంతృప్తి ఇంకేముంటుంది
#HyderabadCityPolice #DutyFirst #PoliceFamily
#GaneshUtsav #HyderabadGaneshImmersion