నాగార్జునసాగర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని, SIR మరియు సభ్యత్వ నమోదు కార్యక్రమం పై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.
తిరుమలగిరి మండల కేంద్రానికి చెందిన శాగం అంజిరెడ్డి గారి కుమారుడు ఇటీవల మరణించడం వలన వారి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.
మాడుగుల పల్లి మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పగిల్ల సైదులు గారి తల్లి లక్ష్మమ్మ గారు ఇటీవల మరణించడం వలన వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది.
బండి సంజయ్ కొడుకును వెంటనే అరెస్ట్ చేయాలి..
బండి సంజయ్ ని కేంద్ర మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలి..!
మైనర్ అమ్మాయిని అత్యాచారం చేసిన బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ను వెంటనే అరెస్ట్ చేసి.. బండి సంజయ్ ని కేంద్ర మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని నాగార్జునసాగర్ నియోజకవర్గం, హాలియా పట్టణంలో బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ శ్రేణులు.
#BJPSeBetiBachao
కెసిఆర్ గారి పాలనలో రైతన్నలు వరి పండించి బంగారం కొనుక్కునేవారు
నేడు రేవంత్ పాలనలో బంగారం అమ్మి వరి పంట సాగు చేసుకునే పరిస్థితి వచ్చింది
రాబందు రేవంత్ పాలన పోవాలి..!
రైతు బంధు కేసీఆర్ రాజ్యం రావాలి.
వరంగల్ కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ కు పిండ ప్రదానం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ పేరుతో రైతులకు అడ్డగోలు హామీలు ఇచ్చి నాలుగు సంవత్సరాలు కావస్తున్న అమలు చేయకుండా రైతులను మోసం చేసినందుకు నాగార్జునసాగర్ కృష్ణానది తీరంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ కు పిండ ప్రదానం చేయడం జరిగింది.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఐకెపి కేంద్రాల వద్ద రైతులకు ధాన్యం తరలించడానికి లారీలు లేక ఇబ్బంది పడుతుండడం వలన రైతులు వారి సమస్యలను నా దృష్టికి తీసుకోని రాగ సివిల్ సప్లై డిఎం గారితో మాట్లాడి అధికారులతో రివ్యూ నిర్వహించి తక్షణమే రైతుల సమస్యను పరిష్కరించవలసిందిగా కోరడం జరిగింది.
నాగార్జునసాగర్ నియోజకవర్గం మాడుగులపల్లి మండలం విశాఖ ఇండస్ట్రీ మరియు త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి రెడ్డీస్ ల్యాబ్ నందు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే)ను పురస్కరించుకొని ఎమ్మెల్సీ కోటి రెడ్డి గారు మరియు కార్మికులతో కలిసి జెండాను ఆవిష్కరించి, కార్మిక సోదరులందరికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల నోటి నుంచి వచ్చే ఒక్కటే మాట రేవంత్ పోవాలే.. కెసిఆర్ రావాలే
ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి మాయ మాటలు నమ్మి ఏదో పెద్ద మొనగాడు అనుకున్నరు
కానీ రెండున్నర సంవత్సరాలలో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది వీడు మొనగాడు కాదు ఒక పెద్ద మోసగాడు అని
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish గారు
గుర్రంపోడ్ మండలం కొప్పోలు గ్రామశాఖ అధ్యక్షుడు కొట్ర శ్రీను గారు అనారోగ్యంతో బాధపడుతూ నల్గొండ పట్టణం సాయి శ్రీనివాస హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారన్న విషయాన్ని తెలుసుకొని వారిని పరామర్శించడం జరిగింది.
పాలన గాలికి వదిలేసి గాలి మోటార్ లలో తిరుగుతూ రైతులకు గాలికి వదిలేసిన కాంగ్రెస్ మంత్రులు.
రేవంత్ రెడ్డి ప్రతి పక్షంలో ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలు తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేశాడు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 70 సార్లు ఢిల్లీకి వెళ్లటానికి టైం దొరుకుతుంది కానీ రాష్ట్రంలో ఒక్క ధాన్యం కొనుగోలు కేంద్రానికి అయిన వెళ్లి రైతుల సమస్యలు అడిగి తెలుసుకోవడానికి టైం లేదు.
-మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే శ్రీ @BRSHarish గారు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యధా రాజ - తదా ప్రజా అంటూ రాష్ట్రంలో మంత్రులు పోటీపడి దోచుకుంటుంటే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇసుక మాఫియా ద్వారా కోట్ల రూపాయల దండుకుంటుంటే అధికారుల కంటికి మాత్రం కనబడటం లేదు.
నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడ్ మండలంలోని తేనేపల్లి గ్రామంలో మంజురైనా మహిళా శక్తి భవనం నిర్మాణం కోసం గ్రామ కంఠం భూమిని గ్రామ పంచాయతీలో తీర్మానం చేసుకున్న తరువాత పనులు చేపట్టనివ్వకుండా అడ్డుపడుతున్న కాంగ్రెస్ నాయకులు
అలాగే చామలోని బావి గ్రామంలో మంజూరైన గ్రామ పంచాయతీ భవనం, మహిళా శక్తి భవనం, సీసీ రోడ్డు ఎస్టిమేషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న అధికారులు
గ్రామాలలో ఉన్న సమస్యలను ఎంపిడిఓ గారి దృష్టికి ఎన్నిసార్లు తీసుకోని వెళ్లిన స్పందించడం లేదని నా దృష్టికి తీసుకొని రాగ పంచాయతీ రాజ్ శాఖ ఎఈ గారితో మాట్లాడి అభివృద్ధికి సహకరించాలే కానీ సర్పంచ్ లను ఇబ్బంది పెట్టకుండా సమస్యలను పరిష్కరించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని కోరడం జరిగింది.
@BRSHarish
నిడమనూరు మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు జినుకుంట్ల బద్రయ్య గారి సతీమణి అనారోగ్యం కారణంగా మరణించడం వలన వారి పార్థివ దేహానికి పూలమాలవేసి, నివాళులర్పించడం జరిగింది.