సీతకి రాముడే సొంతమయ్యే చోటిది
నేలతో ఆకాశం వియ్యమందే వేళిది
మూడు ముళ్ళు వేస్తే
మూడు లోకాలకీ ముచ్చటోచ్చేనమ్మా
ఊ..
ఏడు అంగలేస్తే ఏడు జన్మలకి
వీడదీ సీతమ్మ
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టెమో విరగ బూసింది
చిలకమ్మ ముద్దుగా చెప్పీందో మాట
ఆ మాట విన్నావా రామ అంటుంది
రామ రామ అన్నదీ ఆ సీత గుండె
అందనదే ఆమెకి మొగుడయ్యడే
చేతిలో చేతులే చేరుకుంటే సంబరం
చూపులో చూపులే లీనమైతే సుందరం
జంట బాగుందంటూ గొంతు విప్పాయంట
చుట్టూ చెట్టు చెమ్మా ఊ...
పంట పడిందంటూ పొంగిపోయిందమ్మ
ఇధిగో ఈ సీతమ్మా ఊ...
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
సిరిమల్లె చెట్టెమో విరగ బూసింది
కొమ్మతగలకుండా కొయ్యండి పూలు
కోసిన వన్ని సీత కొప్పు చుట్టండి
కొప్పున పూలు గుప్పి తండేందుకండి
కోదండ రామయ్య వస్తున్నాడండీ