మేధావులుగా పిలవబడే కోదండరాం, ఆకునూరి మురళి, హరగోపాల్ వంటివారు వెలుగుమట్ల బాధితులకు సంపూర్ణంగా న్యాయం జరిగేవరకు వారి పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి- జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత
ఖమ్మం వెలుగుమట్ల బాధితుల ఇళ్లు కూల్చేసిన చోటనే ఇండ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ గారు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం సాయంత్రం విరమించారు
రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఈశ్వరయ్య గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు
రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవితక్క గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. అక్క చెల్లెళ్లు అందరికీ ఇదే మా ఆహ్వానం.
*సమయం:* 10.30AM, 08 మార్చ్ 2026, ఆదివారం.
*స్థలం:* జాగృతి కేంద్ర కార్యాలయం.
@RaoKavitha
న్యాయవ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు అన్నారు.
నేను కడిగిన ముత్యంలా బయటికి వస్తానని తెలంగాణ ప్రజలకు మొదట్నుంచి చెబుతున్నాను. అలాగే వచ్చాను. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పాను. అదే నిజమైంది. దీంతో నేను, నా కుటుంబం కొన్ని నెలలపాటు క్షోభ అనుభవించాం. విపక్షాలను వేధించేందుకు దర్యాప్తు సంస్థలను -వాడుకుంటున్నారు. కోర్టు తీర్పు రాకుండానే నాపై కొందరు అనుచితంగా -మాట్లాడారు. కష్ట సమయంలో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తాను అని కవిత గారు అన్నారు.
మలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు అర్పించిన యోధుడు శ్రీకాంతాచారి
తన ఆత్మబలిదానంతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమజ్వాలను రగిల్చిన శ్రీకాంతా చారి వర్ధంతి సందర్భంగా ఆ అమరుడి త్యాగాన్ని స్మరించుకుంటూ ఘన నివాళులు.
లీడర్ అంటే ఎవరూ ఆకాశం నుండి ఊడిపడరు. పుట్టకతోనే ఎవరూ లీడర్ అవ్వరు. తనకు తాను నేర్చుకుంటూ మార్చుకుంటూ ముందుకు వెళ్లే వాళ్లే నాయకులు అవుతారు - ఎమ్మెల్సీ @RaoKavitha
బీసీ బిల్లు సాధన కోసం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి జూలై 17న చేపట్టబోయే రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు కోసం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య గారిని కలవడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల కోసం చేసే ఏ పోరాటానికైనా అండగా ఉంటామని, జూలై 17న చేపట్టే రైల్ రోకో కార్యక్రమానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన కృష్ణయ్య గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.