సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ న్యాల్కల్ మండల్ టేకుర్ గ్రామ సర్పంచ్ ఎండి అమీర్ అక్రమాల గురించి ప్రశ్నించినందుకు అక్రమ కేసులు పిల్లలకి జైలు పంపించిండు
నిజానికి ఈ డాక్యుమెంట్లనన్నింటినీ ఈ రోజు గౌరవ మంత్రుల ముందు పెట్టి చాలా శాంతియుతంగా, సుహృద్భావ వాతావరణంలో ప్రెస్ క్లబ్ లో చర్చిద్దాం అనుకున్నాం. కానీ..మంత్రులు మొహం చాటేశారు. తొండి చేశారు. ఇప్పటికైనా జీవో 17 ను రద్దు చేయండి సీయం గారు. మీ స్వార్థం కోసం మంత్రులను పావులుగా వాడకండి.
Don’t Miss This.
రేపటి నుండి జరగనున్న పదవ తరగతి పరీక్షల్లో గొప్పగా మార్కులు తెచ్చుకోవడం చాలా ఈజీ.
నేను చెబుతున్న ఈ సూచనలను చివరిదాకా చూసి వాటిని తప్పకుండా ఫాలో అయ్యి పరీక్షలు రాస్తే మీరు అసలే ఫెయిల్ అవరు. ఇది మా @BRSparty గ్యారంటీ.💪
I have compiled all these tips after talking to a lot of experienced teachers who worked in a lot of spot valuation centres. Please follow them without fail and come up with flying colours. In spite of all these things, even if you fail, no worries. You will still become great, if you gain some specific skill in your life.
@KTRBRS@BrsSabithaIndra@BRSHarish
#BRStheOnlyHopeForTelangana
తెలంగాణ రాష్ట్ర సాధకులు,తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 💐💐💐
పుట్టిన బిడ్డ నుండి వృద్ధాప్య దశ వరకు ప్రతి పేద బిడ్డను కడుపులో పెట్టుకొని కాపాడుకున్న పెద్దన్న.
బీడు భూముల్లో సిరులు పండింపజేసేలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి కోటి ఎకరాలకు సాగునీరు అందించిన రైతు బిడ్డ.
అధికారం పోయినా,కొందరు దొంగలు గులాబీ జెండాతో గెలిచి వెన్నుపోటు పొడిచి మోసం చేసి వెళ్లినా,అధికార పార్టీ నాయకులు ఎన్ని రకాలుగా వేధింపులకు గురిచేస్తూ, వ్యక్తిగతంగా దూషించినా...
తెలంగాణే ఆశగా,శ్వాసగా బతుకుతున్న రాష్ట్ర ప్రజల గుండె ధైర్యం, మరోసారి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBirthdayKCR
నేను వ్యక్తిగత దూషణలు చేయను-చిల్లర భాషను వాడను - వాస్తవాలు దాచను - దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం ఆపను.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లో మా @BRSparty సీనియర్ నాయకులు @KTRBRS@BRSHarish గార్లకు ఆ వ్యవహారంలో సంబంధం లేకున్నా నోటీసులు ఇచ్చి @CPHydCity @SajjanarVC గారి నేతృత్వంలో ఏర్పాటైన రెండవ సిట్ గంటల తరబడి దర్యాప్తు పేరిట వేధిస్తున్న ప్రహసనాన్ని నిన్న తెలంగాణ భవన్ లో పత్రికా సమావేశంలో ఖండించిన 12 గంటల లోపే రాత్రి 12 గంటలకు మా ఇంటికి వచ్చి సిట్ పోలీసులు నాకు నోటీసు ఇచ్చారు.
రెండు రోజుల్లో ఆధారాలతో సహా రిప్లై ఇవ్వకపోతే సివిల్-క్రిమినల్ చర్యలకు సిద్దం కావాలని వార్నింగ్ కూడా ఇచ్చారు!!
ప్రజా సమస్యలపై, దౌర్జన్యాలపై గొంతెత్తడం నా హక్కు. నేను వార్నింగ్ లకు భయపడను.
నా దగ్గర ఉన్న సమాచారంతో జవాబు ఇస్తాను. తరువాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి.
నేను నిన్న మీడియా సమావేశంలో చెప్పిన కీలకమైన విషయాలు స్పష్టత కోసం కింద మళ్లీ ఇస్తున్నా:
1. దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, వ్వవస్థీకృత నేరాల నివారణ కోసం టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం నేరం కాదని చట్టమే చెప్పింది. దీనికి అనేక మార్గదర్శకాలు ఉన్నాయి. అనేక మంది అధికారులు రకరకాల స్థాయిల్లో దీన్ని పర్యవేక్షిస్తారు. ఇది ఒక్క ఆఫీసర్ వల్ల అయ్యే పని కాదు. ఈ విషయాన్నే దివంగత ప్రధాని డా. మన్మోహన్ సింగ్ గారు చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ జరగడం మామూలే అని ఢిల్లీలో చెప్పినట్లుగా కూడా వార్తలున్నాయి. అలాంటప్పుడు సిట్ దర్యాప్తు ఎందుకు?
2. నేను సిట్ ఛీఫ్ సజ్జనార్ గారి మీద ఆంధ్ర ప్రదేశ్ లో నమోదైన కేసుల మీద మరో సిట్ వేయాలి అని డిమాండ్ చేసినట్లుగా నోటీసులో ఉంది. ఇది వాస్తవ విరుద్ధం.
3. నేను చెప్పింది: గతంలో ఓటుకు నోటు కేసులో లైవ్ కెమెరాలో నాటి టీడీపీ ఎమ్మెల్యే @revanth_anumula గారు(నేటి తెలంగాణ సీఎం!) అడ్డంగా దొరికిన తరువాత, ఆంధ్ర ప్రదేశ్ నాయకుల ఫోన్లు తెలంగాణ ప్రభుత్వం-ఇంటలిజెన్స్ అధికారులు ట్యాప్ చేశారని 2015 జూన్ నెలలో ఆంధ్ర లో చాలా పోలీసు స్టేషన్లలో తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పై కేసులు నమోదయ్యాయని పత్రికల్లో చాలా వార్తలొచ్చాయి. ఆ సమయంలో ఆంధ్ర లో కూడా ఒక సిట్ కూడా ఏర్పాటు అయ్యింది. ఆ కాలంలో నేటి సీపీ సజ్జనార్ గారు కూడా తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం లో అధికారిగా పనిచేశారు అన్న అవగాహన నాకుంది. అందుకే ఆయన ఇప్పుడు ట్యాపింగ్ వ్యవహారం పై వేసిన రెండో తెలంగాణ సిట్ కు ఛీఫ్ గా ఉండడం నైతికంగా కరక్టు కాదు అని నా అభిప్రాయం చెప్పాను.
ఇది రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు. ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజల ముందుకు ఈ మరుగున పడిన విషయాలను ప్రజల ముందుకు తీసుకరావాల్సిన కనీస బాధ్యత నా పై ఉంది. మీకు ఇది నచ్చకపోతే వివరణ ఇవ్వండి.
4. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పలు కుంభకోణాల(బొగ్గు కుంభకోణం తో సహా) మీద సిట్ వేయాలని డిమాండ్ చేశాను.
5. పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డి - కాంగ్రెస్ రాజకీయ క్రీడలో పావులుగా మారవద్దని సలహా ఇచ్చాను.
6. నాటి డీజీపి, హోం సెక్రెటరీ, ఛీఫ్ సెక్రటరీ లాంటి అధికారులను అందరినీ విడిచిపెట్టి సిట్ అధికారులు కేవలం డా. ప్రభాకర్ రావు, IPS (Retd) గారిని, వారి కుటుంబాన్ని , ఆయనతో పనిచేసిన కానిస్టేబుళ్లను , బంధువులను వేధించడం అన్యాయం అని చెప్పాను.
7. కేవలం కొంత మంది పోలీసు అధికారుల కనుసన్నల్లోనే అత్యంత గోప్యంగా జరగాల్సిన ఈ ట్యాపింగ్ ప్రజల నోళ్లలో తరచుగా నానడం ప్రమాదకరం అని హెచ్చరించాను.
8. నేను సజ్జనార్ గారితో సహా ఏ అధికారి-ఏ రాజకీయ నాయకుడి వ్యక్తిత్వ హననానికి పాల్పడలేదు, పాల్పడను, నాకు ఆ సంస్కృతి లేదు.
నిజానికి కేటీఆర్, హరీష్ రావు, మరెందరో బీఆరెస్ నాయకులు గత రెండేళ్ల రేవంత్ రెడ్డి ప్రతీకార పాలనలో తీవ్రమైన వ్యక్తిత్వ హననానికి గురయ్యారు. ఆ విషయంలో నిందితులపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఎందుకని @TelanganaCOPs ?
ఈ వ్యవహారంలో మేము ముమ్మాటికీ బాధితులం. ప్రజల గొంతు గా నిలిచిన @BRSparty పై ప్రభుత్వ అణచివేత కు వ్యతిరేకంగా మా ఈ పోరాటం ఆగదు. మీ నోటీసులకు మేము అదరం, బెదరం.
9. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ట్యాపింగ్ పై చేసిన ఫిర్యాదు పై ఆయనకు పోలీసులు ఇంతవరకు నోటీసులు ఇవ్వలేదు. నాకు కనీసం అక్నాలెడ్జ్మెంటు కూడా ఇవ్వలేదు.
10. కేవలం బీఆరెస్ నాయకులకు మాత్రమే నోటీసుల మీద నోటీసులు ఆఘమేఘాల మీద రావడం, మీడియా లీకులు, జర్నలిస్టుల, సోషల్ మీడియా ఆక్టివిస్టుల విచ్చలవిడి అరెస్టులు, నాలుగు గోడల మధ్య జరగాల్సిన దర్యాప్తుపై గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకులు రోజూ లైవ్ కామెంటరీ ఇవ్వడం దేనికి సంకేతం? ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు.
జై తెలంగాణ.
నేడు దీక్ష దివస్
“కేసిఆర్ సచ్చుడో... తెలంగాణ వచ్చుడో...” అన్న నినాదంతో 16 ఏండ్ల కింద 2009 నవంబర్ 29న ప్రత్యేక తెలంగాణ కోసం నినదించకపోతే....
తెలంగాణ ఎంత ఆగమయ్యేదో!
కాళేశ్వరం నీళ్లు రాకపోవు,
రైతుబంధు రాకపోవు,
కేసిఆర్ కిట్ లేకపోవు,
వృద్ధులకు 2000 ఫించన్ వచ్చేది కాదు,
బతుకమ్మ,బోనాలకు గౌరవం దక్కేది కాదు, తెలంగాణ అస్థిత్వమే ప్రశ్నార్ధకమయ్యేది.
ఆనాటి కేసిఆర్ తెగువను,ఉద్యమ ప్రస్థానాన్ని ఙ్ఞాపకం చేసుకుందాం.. మళ్లా కేసిఆర్ ను ముఖ్యమంత్రిని చేసి తెలంగాణను కాపాడుకుందాం.
#DeekshaDivas #Telangana
@BRSparty
బీడీ కార్మికులు పడుతున్న కష్టాలు పగవారికి కూడా రావద్దు.
రోజంతా కష్టపడి బీడీలు చేస్తే వారు సంపాదించేది కేవలం 200 రూపాయలు మాత్రమే.
నడుము నొప్పి,మెడ నొప్పి వంటి అనారోగ్య సమస్యలు అదనంగా కొని తెచ్చుకోవడం లాంటివే.
గత @brsparry ప్రభుత్వం బీడీ కార్మికులకు నెలకు 2000 రూపాయల ఫించన్ ఇచ్చేది.
అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 4000 ఫించన్ ఇస్తామని హామి ఇచ్చింది. అలవాటు ప్రకారం గెలిచాక మరిచింది.
నేను వ్యవసాయ కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన అని చెప్పుకునే ముఖ్యమంత్రి,కనీసం ఈ కార్మికులకు ఇచ్చిన హామీలనైనా నెరవేర్చాలె.
ఒకవేళ కేసిఆర్ సార్ మాకు ఫించన్ ఇచ్చి ఉండకపోతే మా పరిస్థితి ఎలా ఉండేదో సార్ అంటున్న మహిళల బాధ చూస్తే నిజంగా కన్నీళ్లు రాకుండా ఉండవు.
#BeediWorkers @BRSparty
Your vision and dedication have shaped not only the lives of many individually but also the community. As a politician, your commitment to justice and progress continues to inspire, and as a godfather, your wisdom and love offer a steady hand to guide us all. Thank you for being both a leader and a mentor sir. Happy Birthday sir #HBD_RSP
బహుజన బిడ్డలకు తెలంగాణ నేడు ఒక వెలివాడగా మారింది.
నాడు ఉత్తర రామాయణం లో తపస్సు చేసినందుకు శంభూకుడు సంహరించ బడ్డాడు.
నేడు తెలంగాణ రేవంతాయణంలో బహుజనులు ప్రతిభ ఉన్నందున ఓపెన్ కేటగిరీ నుండి వెలివేత గురైతున్నరు.
కాంగీయుల నిరంకుశ పాలనలో మాస్కులు ధరించి పాటలు పాడాల్సిన పరిస్థితి మన బిడ్డలకు ఎందుకొచ్చింది?
#ScrapGO29
#TGPSCGroup1
@RSPraveenSwaero @SabithaindraTRS @BSPTelangaana టేకురు విలేజ్ లో కూడా అడ్డుకున్నారు సార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్ళినందుకు టిఆర్ఎస్ నాయకులు చాలా అవమానించి మమ్మల్ని ఇక్కడికి మీరు రావద్దు అని
@RSPraveenSwaero @SabithaindraTRS @BSPTelangaana టేకురు విలేజ్ లో కూడా అడ్డుకున్నారు సార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వెళ్ళినందుకు టిఆర్ఎస్ నాయకులు చాలా అవమానించి మమ్మల్ని ఇక్కడికి మీరు రావద్దు అని
I have just finished reading very intently Sri KCR ji’s response to the notice issued by hon’ble Justice(Retd) L Narsimha Reddy, the Chairman of Commission of Enquiry into Energy Policy in Telangana.
The 12 page response vividly portrays the vision and toil of KCR ji and his team of technocrats in making Telangana self sufficient in power generation. I am particularly impressed with the decision to set up a thermal power station on the banks of Krishna river in Southern Telangana. Catapulting a state from the abyss of 5000 MW deficit to the peaks of 20,000 MW capacity is no mean achievement! No chief minister in our independent India could undertake and complete such mega visionary projects in a fledgling state in record time at that like #KCR! In fact all these great policy marvels must be taught as case studies in business and public policy schools across the country.
When doctors treat patients in emergency wards, they don’t care for accuracy in the results of lab tests. Some don’t even waste time in such tests! They follow their gut instincts to save the lives first. Telangana’s case in 2014 was that.
KCR did what his cabinet thought apt for the youngest state which was on life support. Emergency always demand alacrity over accuracy in response. By the way, hind sight always looks 20/20 !
If current Telangana govt is keen on good governance and make a name for themselves, they should immediately focus on how to improve the efficiency of what has already been built by the earlier dispensation. Setting up of commissions not only amounts to sheer waste of time and public money, but also reveals the vengeful attitude of the current ruling dispensation.
A person whose family members faced serious allegations of encroaching OU lands, a judge who created ruckus for having fined by the SI for not wearing a seat belt in 2006, and a judicial functionary whose colleagues refused to attend his farewell in Bihar for acting like a ‘Moghul Badshah’ doesn’t deserve to be the chairman of a commission set up to enquire into a subject of national importance. Govt should have done thorough background checks before choosing people for important positions.
Justice Narsimha Reddy garu, please quit on moral, ethical and technical grounds, sir.
Neither you nor the current Chief Minister of Telangana, @revanth_anumula garu have the right to comment on what KCR and his team of technocrats did to the State of Telangana since its birth. Only history has such right to judge.
Jai Telangana.✊
@KCRBRSPresident@jagadishBRS@KTRBRS@BRSHarish@BRSparty
#KCROnceAgain
నాకు జన్మనిచ్చిన గడ్డ అలంపూర్ లో నేను ఓటు హక్కును వినియోగించుకున్నాను. గ్రామాల్లో ఓట్ల పండగ వాతావరణం కనిపిస్తోంది. ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలివస్తున్నారు.
ఇదీ ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం.
ఓటు హక్కు నిశ్శబ్ద విప్లవానికి నాంది.ప్రజలే న్యాయ నిర్ణేతలుగా ఇచ్చే ఎన్నికల తీర్పులో... భారత రాజ్యాంగం రక్షించబడాలి, ప్రజాస్వామ్యం ఫరిఢవిల్లాలి!
మీరు కూడా మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోండి.ఓటు వేస్తున్న ప్రతి ఒక్కరికి నాలహృదయపూర్వక కృతజ్ఞతలు.
Casted my vote in Alampur today.
#Elections2024
#SaveConstitution
#SaveDemocracy
@RSPraveenSwaero జై భీమ్ సార్
మాకు BRS అంటే నచ్చదు టేకుర్ BRS సర్పంచు మమ్మల్ని చాలా విధాలుగా ఇబ్బంది పెట్టిండు కానీ మీరంటే నాకు చాలా ఇష్టం మిమ్మల్ని మా నాన్నతో పోల్చుకుంటా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటే ఉంటా నీకోసమే పని చేస్తా సార్
జహీరాబాద్ అసెంబ్లీ అధ్యక్షులు సంగ్రామ్