పెళ్లి కూతురును డాన్స్ చేయొద్దని మందలించిన పెళ్లి కొడుకు
పెళ్ళికి ముందే ఇలా ఉంటే పెళ్లయ్యాక ఎలా ఉంటాడో అని పెళ్లి రద్దు చేసిన వధువు తండ్రి
ఏపీలోని మార్కాపురం జిల్లా కంభం మండలం తురుమెళ్ళ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన రాచర్ల మండలం చిన్నగానిపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు
పెళ్ళికి ముందు రోజు రాత్రి వరుడి గ్రామంలో ఊరేగింపు తీస్తున్న సమయంలో వధువువరులను డాన్స్ చేయాలని కోరిన బంధువులు, మిత్రులు
డాన్స్ చేసేందుకు వధువు సిద్ధమైన సమయంలో, నువ్వు డాన్స్ చేసేందుకు వీలులేదు అని వధువుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వరుడు
పెళ్లి అవ్వకముందే ఇలా ఉంటే పెళ్ళయ్యాక ఎలా ఉంటాడో అని, పెళ్లి రద్దు చేసి వధువును తీసుకెళ్లిపోయిన ఆమె తండ్రి
“బెజవాడ అంటే మా ‘ఇంద్రసేన’ అడ్డా” - SKN
అయితే అదే కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు “జై ఎన్టీఆర్.. బెజవాడ అంటే సింహాద్రి గడ్డ..!” అంటూ నినాదాలతో హాల్‌ను మార్మోగించారు.
పరువు పోయినట్టుగా ముఖం పెట్టాడంటూ SKNపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
FAKE AUDIO పై స్పందించిన ప్రకాష్ రాజ్.
Spelling Mistakes కోసం మాట్లాడుకున్న Audio ను EDIT చేశారు.
అయినా ఈ AUDIO LEAK మీకు ఎలా వచ్చింది?
ఎవరు పోస్ట్ చేశారు JUST ASKING
- ప్రకాష్ రాజ్
కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్‌పై ఎముకలు, బూడిద
సాయికృష్ణవే అని సిట్ అధికారుల అనుమానం
ఏపీలో సంచలం సృష్టించిన గాదె సాయికృష్ణ మృతి కేసులో వెలుగులోకి కీలక అంశాలు
కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్‌పై ఎముకలు, బూడిద, అనుమానాస్పద మరకలతో ఉన్న లాఠీ, స్టీల్ బ్రేస్లెట్ ఉన్నట్లు సిట్ అధికారుల గుర్తింపు
లభించిన వస్తువులకు సీల్ వేసి ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపిన అధికారులు
ఆ బూడిద, ఎముకలు సాయికృష్ణవే అని సిట్ అధికారుల అనుమానం
మరోవైపు కస్టడీలో తగిలిన గాయాల వల్లే సాయికృష్ణ మరణించాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అధికారులు
ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ప్రశ్న రావణ్
తనపై పలు పోలీస్స్టేషన్లలో నమోదైన కేసులన్నింటిని.. ఒకే కేసు కింద విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్
తనపై నమోదు చేసిన అన్ని కేసులను.. సీబీఐతో విచారణ జరిపించాలని పేర్కొన్న రావణ్
ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, డీజీపీ.. ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ జిల్లాల ఎస్పీలు
ప్రతివాదులుగా పాయకరావుపేట, పిఠాపురం.. మచిలీపట్నం, సర్పవరం SHOలు
పిటిషన్‌పై రేపు హైకోర్టులో విచారణ
మేము కాపులం ఓట్లు వేసినందుకు పవన్ కళ్యాణ్ బాగా బుద్ధి చెప్పాడు
నా కొడుకు నీ అభిమాని వాడిని క్రిమినల్ అంటావా.
ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అయ్యే మాట్లాడుతున్నారు.
- సాయి కృష్ణ తల్లి
సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫాం ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరిట తీసుకున్న అప్పులు చెల్లించకపోవడంతో, జూబ్లీహిల్స్ లోని బండ్ల గణేష్ ఆస్తిని రూ.8.50 కోట్లకు వేలం వేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఈ వేలానికి వ్యతిరేకంగా బండ్ల గణేష్ వేసిన పిటిషన్‌పై అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన డెట్ రికవరీ ట్రిబ్యునల్
డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఇరు వర్గాల వాదనలు విని బండ్ల గణేష్‌కు అనుకూలంగా డెట్ రికవరీ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ, ఆస్తుల వేలం సరైన నిర్ణయమేనని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సానుకూలంగా తీర్పు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు