సర్పంచులు తలెత్తుకొని సగర్వంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిపేలా పంచాయతీలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున నిధులు విడుదల చేయడం జరిగింది - గౌ|| ఉప ముఖ్యమంత్రి , పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు @PawanKalyan
ఇటు శాఖల సమీక్షలు చేస్తూ.... అటు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ...
• అధికారులతో శాఖలవారీగా సమీక్షలు
• ప్రజల ��ుంచి స్వయంగా వినతుల స్వీకరణ
• శుక్రవారం బిజీబిజీగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
ఒక వైపు తనకు సంబంధించిన శాఖలపై సమీక్షలతో బిజీబిజీగా ఉంటూనే... మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాధాన్యత ఇస్తున్నారు. శుక్రవారం మంగళగిరి కేంద్ర కార్యాలయానికి సమస్యలతో ప్రజలు పోటెత్తడంతో స్వయంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారే రంగంలోకి దిగారు. జనసేన పార్టీ కార్యాలయానికి వినతులు తీసుకొని వచ్చిన బాధితులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి వారి నుంచి వినతులు స్వీకరించారు. పరిష్కారానికి తగు హామీలను ఇచ్చారు. బాధితులు చెప్పిన కొన్ని సమస్యలు ఇవి...
•ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నుంచి 1143 ఉపాధ్యాయ పోస్టులను మినహాయించాలని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో తాము బోధనలో ఉన్నామని తెలిపారు. 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు వచ్చేలా చూడాలని, ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థకు కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ అని పేరు మార్చాలని విజ్ఞప్తి చేశారు.
•ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీలోనే డ్రాయింగ్, క్రాఫ్ట్, మ్యూజిక్ ఉపాధ్యాయుల నియామకం కూడా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నిరుద్యోగ ఉపాధ్యాయుల సంఘం కోరింది. 1986 నుంచి ఈ పోస్టులు భర్తీ చేయడం లేదని విన్నవించింది.
•ప్రమాదవశాత్తు ఇళ్లు కాలిపోవడం వల్ల తన కుమార్తె సర్టిఫికెట్లతో పాటు ఆమె చదువుకోసం దాచిపెట్టిన డబ్బులు ��ాలిపోయాయని ముమ్మిడి మహేశ్వరి అనే మహిళ కన్నీరు పెట్టుకున్నారు. తమ కుమార్తెను చదువులకి సాయం అందించాలని కోరారు.
•పలువురు దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. వారందరి దగ్గర నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వినతులు స్వీకరించారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
పిఠాపురం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా
వైసీపీ వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించింది
నిర్వీర్యమైన వ్యవస్థల్ని కూటమి ప్రభుత్వం గాడిన పెడుతుంది
పార్టీ కోసం పని చేసిన కార్యకర్తల గుర్తింపు
చేబ్రోలుకు చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు
పిఠాపురం అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా @pithapuramjsp
వైసీపీ వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించింది
నిర్వీర్యమైన వ్యవస్థల్ని కూటమి ప్రభుత్వం గాడిన పెడుతుంది
పార్టీ కోసం పని చేసిన కార్యకర్తల గుర్తింపు
చేబ్రోలుకు చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @NagaBabuOffl గారు
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తెలుగు సినీ నిర్మాతలు
గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగినట్టు, తమ విజ్ఞాపనకు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సానుకూలంగా స్పందించినట్టు ప్రముఖ నిర్మాత శ్రీ అల్లు అ���వింద్ తెలియచేశారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చార���్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించలేదనీ, త్వరలోనే మరోసారి కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న అవకాశాలపై చర్చిస్తామని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో తెలుగు సినీ నిర్మాతలు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫి శాఖ మంత్రి శ్రీ క��దుల దుర్గేష్ గారు, నిర్మాతలు శ్రీ సి.అశ్వనీదత్, శ్రీ ఎ.ఎం.రత్నం, శ్రీ డి.సురేష్ బాబు, శ్రీ ఎస్.రాధాకృష్ణ (చినబాబు), శ్రీ దిల్ రాజు, శ్రీ భోగవల్లి ప్రసాద్, శ్రీ డి.వి.వి.దానయ్య , శ్రీమతి సుప్రియ, శ్రీ ఎన్.వి.ప్రసాద్, శ్రీ బన్నీ వాసు, శ్రీ నవీన్ ఎర్నేని, శ్రీ నాగవంశీ, శ్రీ టి.జి.విశ్వప్రసాద్, శ్రీ వంశీ కృష్ణ, శ్రీ వై.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ చిక్కులు ఇచ్చిన చక్కటి ముచ్చట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన తరవాత క్లిక్ అనిపించిన అందమైన ఫోటో ఇది. ప్రమాణ స్వీకారం చేసి మంగళగిరిలో నివాసానికి బయలుదేరాలనుకొంటే - ట్రాఫిక్ చిక్కులు ఏర్పడ్డాయి. వాహనాన్ని రోడ్డు పక్క నిలిపివేసి సేద తీరిన క్షణ���లో సతీమణి శ్రీమతి అనా కొణిదెల గారు, పిల్లలు అకీరా నందన్, ఆద్యలతో తీసుకున్న ఫోటో ఇది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారితో తెలుగు సినీ నిర్మాతల భేటీ
ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలు, రా���్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి గురించి చర్చించిన నిర్మాతలు, సినీ పరిశ్రమకు అండగా ఉంటుందని హామీ ఇచ్చిన గౌ. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
రాష్ట్ర పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా శ్రీ కందుల దుర్గేష్ గారు ఈ రోజు సాయంత్రం సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. రూ.2.31 కోట్లతో 10 టూరిజం బోట్ల కొనుగోలుకి సంబంధించిన ఫైల్ మీద తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ��భినందనలు తెలిపారు. జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, టీడీపీ నేతలు హాజరై అభినందలు అందించారు.
@kanduladurgesh @mnadendla
రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు గురువారం ఉదయం 10 గం. నుంచి శాఖాపరమైన సమీక్షలు ప్రారంభించారు. తొలుత ఉపాధి హామీ పథకంలో సోషల్ ఆడిట్ విభాగంతో సమీక్ష మొదలయింది.
అటవీ శాఖపై సమీక్ష !!
మొదటి సమీక్ష నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, గ్రామీణ రక్షిత మంచినీటి, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు..
#PawanKalyanAneNenu
2023లో ఇచ్చిన మాటను రెండవ సంతకంతో నిలబెట్టుకున్న ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, గ్రామీణ రక్షిత మంచినీటి, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు..
#PawanKalyanAneNenu
ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ, గ్రామీణ రక్షిత మంచినీటి, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు..
#PawanKalyanAneNenu
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయకుమార్ గారు, పిఠాపురం నియోజక వర్గం సమన్వయకర్త శ్రీ మరెడ్డి శ్రీనివాస్ గారు, తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గారు శుభాకాంక్షలు తెలిపారు.
@PawanKalyan@NagaBabuOffl@AjayaKumarJSP@JSPshankargoud
ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం ఇచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
@PawanKalyan@mnadendla@kanduladurgesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన శ్రీ @PawanKalyan గారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి తో పాటుగా, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ & రూరల్ వాటర్ సప్లై శాఖా, అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ డెవలప్మెంట్ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది.