స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయానికి త్వరలో నూతన కమిటీలు
స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ తరఫున పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సమన్వయం, పర్యవేక్షణకు త్వరలో నూతన కమిటీలను నియమించాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు నిర్ణయించారు. గతంలో నియమించిన సమన్వయకర్తలు, ముగ్గురు సభ్యులతో కూడిన సమన్వయకమిటీలు, వారికి అనుబంధంగా ఉన్న సపోర్ట్ టీమ్స్ చెల్లుబాటులో ఉండవు. 25 మంది సభ్యులతో కూడిన పార్లమెంట్ కమిటీలనీ రద్దు చేశారు.
ఇటీవల రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం నియమించిన అయిదుగురు సభ్యులతో కూడిన సమన్వయ కమిటీ, ప్రచార కమిటీలు యథావిధిగా విధుల్లో ఉంటాయి.
- జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం
వాస్తవాలు ముఖ్యం. రికార్డులే తుది ఆధారం.
2016లో R&B శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన రహదారిని, కేవలం ఒక హ్యాష్‌ట్యాగ్ లేదా @PawanKalyan గారి పేరు ప్రస్తావించడం ద్వారా ‘అడవి తల్లి బాట’ కార్యక్రమానికి చెందిన రహదారిగా పేర్కొనడం సరైనది కాదు.
అధికారిక రికార్డుల ప్రకారం ఈ రహదారి 2016లో R&B శాఖ పరిధిలో నిర్మించబడింది. ‘అడవి తల్లి బాట’ కార్యక్రమం కింద నిర్మించిన రహదారులకు సంబంధించిన వివరాలు వేరుగా ఉంటాయి.
ఎవరైనా దీనిపై భిన్నమైన సమాచారం కలిగి ఉంటే, GO, మంజూరు ఉత్తర్వులు, టెక్నికల్ శాంక్షన్ లేదా అధికారిక పనుల వివరాలను ప్రజల ముందుంచితే వాస్తవాలు మరింత స్పష్టమవుతాయి.
విమర్శలు ఉండవచ్చు. అభిప్రాయ భేదాలు ఉండవచ్చు.
కానీ అభివృద్ధి పనుల విషయంలో అధికారిక రికార్డులకు గౌరవం ఇవ్వడం మనందరి బాధ్యత.
ప్రచారం కంటే వాస్తవం ముఖ్యం.
హ్యాష్‌ట్యాగ్ కంటే రికార్డు ముఖ్యం.
వాస్తవాలు ఎప్పటికీ నిలుస్తాయి.
సీతంపేట మండలంలోని చాకలిగూడకు వెళ్లే రహదారి R&B శాఖ పరిధిలో 2016 సంవత్సరంలో నిర్మించబడింది.
ఈ రహదారి నిర్మాణానికి పంచాయతీరాజ్ శాఖకు గానీ, ‘అడవి తల్లి బాట’ కార్యక్రమానికి గానీ ఎటువంటి సంబంధం లేదు.
స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీతో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక ప్రక్రియలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీ సభ్యులతో శుక్రవారం సాయంత్రం సమావేశమయ్యారు. జనసేన పార్టీ శ్రేణుల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్థానిక ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి, దానిని ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షులకు నివేదించేందుకు ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల ప్రత్యేక సమన్వయ కమిటీతో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిటీ విధివిధానాలు, బాధ్యతలు, పనితీరు, అలాగే పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అందించే సహకారంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు కమిటీ సభ్యులకు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి కమిటీల ద్వారా సేకరించిన సమగ్ర సమాచారాన్ని నివేదికల రూపంలో సిద్ధం చేసి, సమన్వయంతో ముందుకు సాగాలని, ఎప్పటికప్పుడు సమాచారం తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కమిటీ తదుపరి కార్యాచరణపై సోమవారం మరోసారి సమావేశమై, పూర్తిస్థాయిలో కార్యాచరణకు సన్నద్ధం కావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సభ్యులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల కోఆర్డినేషన్ కేంద్ర కమిటీ సభ్యులు, APMSIDC చైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు, మాజీ శాసనసభ్యులు శ్రీ పెండెం దొరబాబు, విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ యాదవ్, భీమవరం నియోజకవర్గానికి చెందిన శ్రీ పులపర్తి ప్రశాంత్, రైల్వేకోడూరు నియోజకవర్గానికి చెందిన శ్రీ యనమల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
#APLocalBodyElections
జనసేన పార్టీలోకి శ్రీ యనమల కృష్ణుడు, శ్రీ నవీన్ నిశ్చల్
వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు
జనసేన పార్టీ సిద్దాంతాలు, పరిపాలనలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి నిబద్ధత, సంస్కరణలకు ఆకర్షితులై వైసీపీ నుంచి పలువురు కీలక నాయకులు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో శుక్రవారం జనసేన పార్టీలో చేరారు.
తుని నియోజకవర్గం వైసీపీ నాయకులు శ్రీ యనమల కృష్ణుడు, హిందూపురం సీనియర్ వైసీపీ నాయకులు శ్రీ నవీన్ నిశ్చల్, వైసీపీ నాయకుడు, ఏలూరు డీసీసీబీ మాజీ ఛైర్మన్ శ్రీ పీవీఎల్ఎన్ నరసింహరాజు, వైసీపీ కందుకూరు, సర్వేపల్లి, కనిగిరి నియోజకవర్గాల పరిశీలకుడు శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి అయితాబత్తుల సుభాషిణి, తుని వైసీపీ నాయకుడు శ్రీ పొలినాటి శేషగిరిరావు, తణుకు వైసీపీ నాయకుడు శ్రీ దిరిశాల కృష్ణ శ్రీనివాస్, శ్రీకాళహస్తికి చెందిన వైసీపీ నాయకుడు శ్రీ సత్రవాడ ప్రవీణ్, శ్రీ మిద్దెల హరి, ముమ్మడివరం మాజీ ఏఎంసీ ఛైర్మన్ శ్రీ కుడిపూడి శివన్నారాయణ నరసరావుపేట నుంచి శ్రీ ఏలూరి ప్రసాద్ లకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందరినీ కలుపుకొని వెళ్లి పార్టీ ఉన్నతి కోసం పని చేయాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈటీవీ గల్లీ గణేష్ ఈవెంట్లో మన్యం ప్రజలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా చెప్పడం పవన్ కళ్యాణ్ గారి వల్లే మా మన్యం జిల్లాలకి మంచి జరుగుతుంది ❤️🙌🙏
గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి స్ఫూర్తితో 10వ తరగతిలో 596/600 మార్కులు సాధించిన కాకినాడ జిల్లా, పెదపూడి మండలం, సంపర ZPH స్కూల్ విద్యార్థిని D. చిన్నారి ని అభినందించి, ల్యాప్ టాప్ బహుకరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
శ్రీ @PawanKalyan గారితో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ
జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శ్రీ వంగవీటి మోహనరంగా గారి కుమారుడు, మాజీ శాసనసభ్యులు శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు ఈరోజు సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వీరి ఇరువురి మధ్య సుదీర్ఘకాలంగా ఉన్న స్నేహం నేపథ్యంలో జరిగిన ఈ ఆత్మీయ భేటీలో, గతంలో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజులను, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో చోటుచేసుకున్న పలు అంశాలను వారు గుర్తుచేసుకున్నారు.
ఈ సందర్భంగా సమకాలీన రాజకీయ అంశాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. అలాగే, శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు నిర్వర్తిస్తున్న శాఖల్లో తీసుకొస్తున్న మార్పులు, చేపడుతున్న సంస్కరణలను వంగవీటి రాధాకృష్ణ గారు ప్రత్యేకంగా అభినందించారు.
@VangaveetiOffl