ఇవ్వాళ ఒక్క రోజు అయినా ఆ ysr ని బూతులు తిట్టకండి!! మిగిలిన 364 రోజులు, మహామేత అని, ధన యజ్ఞం అని, రాష్ట్రాన్ని, నీటి ప్రాజెక్టులని అడ్డుపెట్టుకుని కుటుంబానికి మొత్తం దోచిపెట్టాడు, అవినీతి కింగ్ అని, ప్రత్యర్ధులని చంపించాడు అని, ఇలా ఏమైనా గాని ఇవ్వాళ మాత్రం ఏమీ అనొద్దు 🙏🏻🙏🏻
మేము ఎప్పటినుంచో చెప్తానే ఉన్నాం ఆ రాజశేఖరరెడ్డి గాడు పెద్ద ఫ్రాడ్ గాడు అని..రాష్ట్రం పరువు విదేశాల్లో కూడా తీసేసాడు..బతికుంటే పంచె ఊడదీసి కొట్టేవాళ్ళు తెల్లోళ్ళు ఖనిజ సంపదని అక్రమ రవాణా చేసినందుకు..వాడు పోయి ఇప్పుడు ఆత్మని ఇరికించాడు..
ఈ "అణు"మానం ఇప్పటిది కాదనమాట..అబ్బాకొడుకులు
జీ గ్రూప్ సుభాష్ చంద్ర ₹22,000 కోట్లు అప్పు తీసుకుని కేవలం ₹6.5 కోట్లకు సెటిల్ చేసుకున్నాడని నిన్నటి నుంచి మీమ్‌లు వస్తున్నాయి.
“సామాన్యులకు ఇలా వదిలేస్తారా?” అని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలు విషయం ఏమిటో కొంచెం సింపుల్‌గా చెప్పడానికి ప్రయత్నిస్తాను.
ముందుగా సంఖ్యలు:
2019లో జీ/ఎస్సెల్ గ్రూప్ మొత్తం అప్పులు సుమారు ₹45,000 కోట్లు ఉండేవి.
సుభాష్ చంద్ర చెప్పిన ప్రకారం, ఇప్పటివరకు కంపెనీలు సుమారు ₹43,000 కోట్లు చెల్లించాయి.
ఇంకా మిగిలిన బకాయి చాలా తక్కువే ఉంది.
అయితే ఎందుకు సుభాష్ మీద ₹22,000 కోట్ల క్లెయిమ్ వచ్చింది?
అసలు కథ ఇలా జరిగింది.
ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, వివేక్ ఇన్ఫ్రా అనే కంపెనీకి ₹170 కోట్లు లోన్ ఇచ్చింది.
ఆ లోన్‌కు సుభాష్ చంద్ర వ్యక్తిగత పూచీ (Personal Guarantee) ఇచ్చారు.
వివేక్ ఇన్ఫ్రా ఆ అప్పు చెల్లించలేదు. కాబట్టి ఇండియాబుల్స్ సుభాష్ మీద కేసు వేసింది.
సుభాష్ “నేను అప్పు తీసుకోలేదు, కేవలం పూచీ ఇచ్చాను. నా దగ్గర అంత ఆస్తులు లేవు” అని వ్యక్తిగత దివాళా పిటిషన్ వేశారు.
ఎప్పుడైతే సుభాష్ దివాళా ప్రక్రియలోకి వచ్చారో, ఇతర బ్యాంకులు, LIC వంటి రుణదాతలు కూడా/“మాకు కూడా సుభాష్ వ్యక్తిగత పూచీ ఇచ్చారు కదా” అని తమ క్లెయిమ్‌లన్నీ NCLTలో దాఖలు చేశారు.
ఆ క్లెయిమ్‌ల మొత్తమే ₹22,000 కోట్లు అయ్యింది.
ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం
ఏమిటంటే ₹22,000 కోట్లు అంటే సుభాష్ వ్యక్తిగతంగా తీసుకున్న అప్పు కాదు.
అది బ్యాంకులకు/ LIC కి ఆయన ఇచ్చిన పూచీ (Guarantee) మొత్తం మాత్రమే.
బ్యాంకులు సాధారణంగా గ్యారంటీ పేపర్లో ఉన్న పూర్తి మొత్తానికి క్లెయిమ్ పెడతాయి తప్ప
ఇప్పటికే చెల్లించిన మొత్తాలను తగ్గించి పెట్టరు. అందుకే సంఖ్య పెద్దదిగా కనిపిస్తుంది.
ప్రభుత్వ సోర్సుల ప్రకారం, అసలు ఇంకా చెల్లించ వలసిన అప్పులకు ఒరిజినల్ గ్యారంటీలు సుమారు ₹2,574 కోట్లు మాత్రమే.
NCLT ఏం చేసింది?
సుభాష్ వ్యక్తిగత ఆస్తులు చాలా తక్కువగా ఉన్నాయి (సుమారు ₹6.5 కోట్లు).
కాబట్టి NCLT ఆయనను ₹6.5 కోట్లు చెల్లించమని చెప్పి వ్యక్తిగత పూచీ బాధ్యత నుంచి ఆయనను విడుదల చేసింది.
అంటే:
ఇకపై సుభాష్ మీద ఈ ₹22,000 కోట్ల క్లెయిమ్ ఎవరూ చేసుకోలేరు.
కానీ నిజంగా అసలు అప్పులు తీసుకున్న కంపెనీలు అంటే వివేక్ ఇన్ఫ్రా, జీ గ్రూప్ కంపెనీలు ఇంకా మిగిలిన అప్పులు చెలించవలసిన బాధ్యత ఉంది.
రుణదాతలు అంటే బ్యాంకులు/LIC ఆ కంపెనీల అంటే జీ/వివేక్ ఇన్ఫ్రా ఆస్తులు, సెక్యూరిటీల ద్వారా తమ మిగతా అప్పులు రికవరీ చేసుకోవచ్చు.
సుభాష్ చంద్ర చెప్పిన ప్రకారం, మిగిలిన బకాయిలు కూడా కంపెనీలు త్వరలో చెల్లిస్తాయని హామీ ఇచ్చారు.
అంటే, ₹22,000 కోట్లు అసలు బకాయి కాదు. అది సుభాష్ ఇచ్చిన పూచీ క్లెయిమ్‌ల మొత్తం.
NCLT కేవలం ఆయన వ్యక్తిగత బాధ్యతను సెటిల్ చేసింది.
కంపెనీల బకాయిలు ఇంకా ఉన్నాయి. వాటిని కంపెనీల ఆస్తుల నుంచి వసూలు చేసుకోవాలి.
ఇప్పుడు అర్థమైందా? ₹22000కోట్లకు ₹6.50కోట్లు రికవరీ మాత్రమే చేశారు అనేది శుద్ధ తప్పు.
డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి.