➡️ఆన్లైన్ ఆటల ఉచ్చులో బాల్యం!!
➡️తల్లిదండ్రుల నిఘా లోపమే ప్రధాన కారణం
➡️చిన్నారుల గేమింగ్ ప్రమాదాలపై హైదరాబాద్ సీపీ సజ్జనర్ కీలక అడ్వైజరీ
✳️'ఫ్రీ ఫైర్', 'ఫ్రీ ఫైర్ మ్యాక్స్' వంటి ఆన్లైన్ మల్టీప్లేయర్ ఆటల ఉచ్చులో పడి చిన్నారులు ఆర్థికంగా, మానసికంగా నష్టపోకుండా ఉండేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఒక కీలకమైన అడ్వైజరీ జారీ చేశారు. ఇటీవల సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వస్తున్న అనేక ఫిర్యాదులు బయటకు కేవలం ఆర్థిక మోసాలుగా కనిపిస్తున్నప్పటికీ.. వాటి వెనుక ముఖ్యంగా ఈ ఆన్ లైన్ గేములకు పిల్లలు బానిస కావడం, తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడమే ప్రధాన కారణాలని ఆయన స్పష్టం చేశారు. చిన్నారుల భవిష్యత్తును నాశనం చేస్తున్న ఇలాంటి గేమింగ్ యాప్‌ల అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని, వీటి నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకునేలా గూగుల్ వంటి అంతర్జాతీయ సాంకేతిక సంస్థలకు సైతం లేఖలు రాస్తామని పేర్కొన్నారు.
✳️హ్యాకింగ్ కాదు.. సొంత బిడ్డల పనే!
మొబైల్‌కు వరుసగా డెబిట్ మెసేజ్‌లు రావడంతో తమ బ్యాంక్ ఖాతా హ్యాక్ అయిందని ఆందోళన చెందుతూ చాలామంది బాధితులు ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు దర్యాప్తు చేశాక బయటపడే నిజం తల్లిదండ్రులకు పెద్ద షాక్ ఇస్తోంది. అక్కడ ఎలాంటి హ్యాకింగ్ లేదా మోసపూరిత లింకులు లేవని, పిల్లలే 'ఫ్రీ ఫైర్', 'ఫ్రీ ఫైర్ మ్యాక్స్' వంటి ఆన్లైన్ మల్టీప్లేయర్ ఆటల్లో వర్చువల్ కాయిన్స్, డైమండ్స్ కొనుగోలు చేయడానికి ఫోన్లో సేవ్ చేసిన కార్డ్స్ లేదా యూపీఐ వివరాలను వాడేశారని తేలుతోంది. ముఖ్యంగా, తాతయ్యలు, నానమ్మల ఫోన్లలో యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయి ఉండటంతో పిల్లలు సులభంగా వేల రూపాయల లావాదేవీలు చేసేస్తున్నారు. ఇది సాంకేతికంగా నేరం కానప్పటికీ, కేవలం ఇంట్లో పర్యవేక్షణ లోపం వల్ల జరుగుతోంది. ఇటువంటి అజాగ్రత్తల వల్ల అసలైన సైబర్ నేరస్థులను పట్టుకోవాల్సిన పోలీసుల విలువైన సమయం వృథా అవుతోంది.
✳️గేమ్ పరిచయం.. పక్క రాష్ట్రానికి పరుగు!
ఇటీవల జరిగిన మైనర్ బాలికల అదృశ్యం ఉదంతం.. ఆన్లైన్ ఆటలు, సోషల్ మీడియాతో పొంచి ఉన్న ప్రమాదాలను మరోసారి కళ్లకు కట్టింది. 'ఫ్రీ ఫైర్' గేమ్ ద్వారా కొందరు అపరిచిత వ్యక్తులతో పరిచయం పెంచుకున్న బాలికలు, ఆ తర్వాత సోషల్ మీడియా యాప్స్ ద్వారా వారితో చాటింగ్ కొనసాగించారు. ఆన్లైన్ మాయలో పడిపోయి.. కేవలం ఇంటర్నెట్లో మాత్రమే పరిచయమైన ఆ వ్యక్తులను నేరుగా కలవడానికి తమ ఇళ్లను వదిలి, పక్క రాష్ట్రానికి వెళ్లేందుకు సిద్ధపడ్డారు. అయితే, పోలీసులు సకాలంలో స్పందించి ఆ బాలికలను సురక్షితంగా కాపాడి తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. పిల్లలు ఫోన్లలో ఏం చేస్తున్నారో గమనించడం, వారికి డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడం ఎంత అత్యవసరమో ఈ సంఘటన తెలియజేస్తోంది.
✳️'స్టేటస్' కోసం దొంగచాటు ఖర్చులు!
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదివే 10 నుంచి 17 ఏళ్ల లోపు విద్యార్థులు నేడు క్లాస్‌రూమ్‌ల కంటే 'ఫ్రీ ఫైర్, మ్యాక్స్' వంటి గేమింగ్ వర్చువల్ యుద్ధభూమిలోనే ఎక్కువగా గడుపుతున్నారు. స్నేహితుల మధ్య తమ స్టేటస్ కోల్పోకూడదనే తాపత్రయమే దీనికి కారణం. ఆటలో రేర్ ఐటమ్స్, రకరకాల ఆయుధాలు, 'ఎలైట్ పాస్' ఉన్నవారినే స్నేహితులు హీరోలుగా చూడటం, అవి లేని వారిని తక్కువ చేసి మాట్లాడటంతో.. ఆ ఒత్తిడి తట్టుకోలేక పిల్లలు దొంగచాటుగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. ఒకప్పుడు ఆన్లైన్ క్లాసుల పేరుతో చేతికి వచ్చిన ఫోన్లు, నేడు అర్ధరాత్రి వరకు సాగే గేమింగ్ సెషన్లుగా మారిపోతున్నాయి. తల్లిదండ్రులు బిజీగా ఉండటం, టెక్నాలజీపై వారికి తగినంత అవగాహన లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
✳️పసిమనస్సులను కబళిస్తున్న 'గేమింగ్ డిజార్డర్స్
అతిగా ఆన్లైన్ ఆటలు ఆడటం కేవలం అలవాటు మాత్రమే కాదు, ఒక భయంకరమైన మానసిక రుగ్మత అని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019లోనే గుర్తించి దీనికి 'గేమింగ్ డిజార్డర్' అని నామకరణం చేసింది. ఆటలపై నియంత్రణ కోల్పోవడం, చదువు, నిద్ర, కుటుంబ సభ్యుల కంటే ఆటలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, నష్టాలు జరుగుతున్నా ఆట మానలేకపోవడం ఈ రుగ్మత ప్రధాన లక్షణాలు. దీనివల్ల పిల్లల్లో తీవ్ర కోపం, దూకుడు ప్రవర్తన, చదువులో వెనుకబాటుతనం, నిద్రలేమి, కంటి సమస్యలు, సామాజిక దూరం పెరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, ఆటలను కఠినంగా నిషేధించడం దీనికి సరైన పరిష్కారం కాకపోవచ్చు. అది వారిలో మరింత ఉత్సుకతను పెంచి దొంగచాటుగా ఆడేందుకు దారితీస్తుంది. కాబట్టి పిల్లలతో ఆప్యాయంగా మాట్లాడటం, వారిని అర్థం చేసుకోవడం, ఆటల సమయాన్ని క్రమబద్ధీకరించడమే దీనికి అసలైన పరిష్కారం.
దేశ భద్రతా కారణాల దృష్ట్యా 2022లోనే కేంద్ర ప్రభుత్వం అసలైన 'ఫ్రీ ఫైర్' గేమ్‌ను భారతదేశంలో నిషేధించింది. అయినప్పటికీ, సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు చిన్నారులు వీపీఎన్ ల ద్వారా దొంగచాటుగా ఈ నిషేధిత గేమ్‌ను ఇంకా ఆడుతూనే ఉన్నారు. మరోవైపు, ఈ గేమ్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా వచ్చిన 'ఫ్రీ ఫైర్ మ్యాక్స్' ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో యథేచ్ఛగా లభిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. నిషేధిత గేమ్‌కు ప్రత్యామ్నాయంగా మారిన ఈ వెర్షన్‌కు చిన్నారులు అత్యంత వేగంగా ఆకర్షితులవుతూ, తీవ్ర వ్యసనానికి లోనవుతున్నారు.
✳️ఇప్పుడైనా కళ్లు తెరవండి.. పిల్లలను కాపాడుకోండి
చిన్నారులను ఆన్లైన్ ఆటల ముప్పు నుంచి కాపాడుకునేందుకు తల్లిదండ్రులు తక్షణమే కొన్ని కీలక రక్షణ చర్యలు చేపట్టాలి. మొదటగా, పిల్లలు వాడే ఫోన్ల నుంచి సేవ్ చేసిన బ్యాంక్ కార్డులు, యూపీఐ ఆటోఫిల్ వివరాలను తొలగించి, ప్రతి లావాదేవీకి పిన్ లేదా బయోమెట్రిక్ లాక్ తప్పనిసరి చేయాలి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో 'పేరంటల్ కంట్రోల్స్', 'పర్చేజ్ అప్రూవల్స్' ఆన్ చేసుకోవాలి. బ్యాంక్ అలర్ట్ మెసేజ్‌లను నిరంతరం గమనిస్తూ, వాటి ప్రాముఖ్యతను ఇంట్లోని వృద్ధులు, పెద్దవారికి కూడా వివరించాలి. అవసరమైతే పిల్లలకు పరిమిత బ్యాలెన్స్ ఉండే ప్రీపెయిడ్ కార్డులు మాత్రమే ఇవ్వాలి. ఇంట్లో ఎవరి మొబైల్ వాడినా సరే, రోజువారీ ఫోన్ వాడకంపై కచ్చితమైన సమయ పరిమితి విధించాలి. పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటూ వారు ఆడే ఆటల గురించి అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ వారిలో తీవ్ర కోపం, నిద్రలేమి, మార్కులు తగ్గడం, ఫోన్‌ను దొంగచాటుగా దాచడం వంటి మార్పులు కనిపిస్తే వెంటనే అప్రమత్తమై చైల్డ్ సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ సహాయం తీసుకోవాలి.
"ఈ అడ్వైజరీ ఆన్లైన్ ఆటలను లేదా గేమింగ్‌ను పూర్తిగా వ్యతిరేకించడానికి ఉద్దేశించింది కాదు. ఆన్లైన్ ఆటలను కేవలం వినోదం కోసమే, అదీ పరిమిత పరిధుల్లోనే ఆడాలి. మితిమీరిన గేమింగ్, నియంత్రణ లేని సోషల్ మీడియా వాడకం వల్ల పిల్లల చదువు, ఆరోగ్యం, ప్రవర్తనతో పాటు వారి సమగ్ర వికాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ తరుణంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా 'పర్యవేక్షణ (Monitor), మార్గదర్శకత్వం (Mentor), ప్రోత్సాహం (Motivate)' అనే త్రిసూత్రాన్ని పాటించాలి. అలాగే, విద్యార్థులు లేదా చిన్నారులు ఆటల్లోనైనా సరే.. 'క్లిక్ చేసే ముందు ఆలోచించండి' (Think Before You Click, Even While You Play) అనే నినాదాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఉపాధ్యాయులు, సంరక్షకులు కూడా చిన్నారుల ఆన్లైన్ కార్యకలాపాలను చురుగ్గా పర్యవేక్షించాలి. వారిలో సైబర్ భద్రతపై అవగాహన పెంపొందిస్తూ, డిజిటల్ ప్రపంచానికి, నిజ జీవిత కార్యకలాపాలకు మధ్య సరైన సమతుల్యత ఉండేలా ప్రోత్సహించాలి. సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడమే పిల్లల భద్రతకు, వారి శ్రేయస్సుకు అత్యంత కీలకం. పర్యవేక్షణ లేని ఇంటర్నెట్ వల చిన్నారుల భవిష్యత్తును ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీయకుండా, అలాగే ఆన్లైన్ వేధింపుల బారిన పడకుండా కాపాడుకోవడానికే ఈ మార్గదర్శకాలను విడుదల చేశాం. డిజిటల్ భద్రతపై తల్లిదండ్రులకు, పాఠశాలలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై చర్యలు తీసుకుంటోంది."అని సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ సిటీ పోలీస్
𝐇-𝐅𝐀𝐒𝐓 𝐂𝐫𝐚𝐜𝐤𝐬 𝐃𝐨𝐰𝐧 𝐨𝐧 𝐔𝐧𝐥𝐢𝐜𝐞𝐧𝐬𝐞𝐝 𝐅𝐚𝐬𝐭 𝐅𝐨𝐨𝐝 𝐆𝐨𝐝𝐨𝐰𝐧 𝐢𝐧 𝐂𝐡𝐚𝐫𝐦𝐢𝐧𝐚𝐫; 𝐀𝐝𝐮𝐥𝐭𝐞𝐫𝐚𝐭𝐞𝐝 𝐅𝐨𝐨𝐝 𝐌𝐚𝐭𝐞𝐫𝐢𝐚𝐥𝐬 𝐒𝐞𝐢𝐳𝐞𝐝
✳️In a continued crackdown on food adulteration and unsafe food practices, the H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) along with the Food Safety Officer (FSO) conducted a surprise raid on an illegal fast food godown operating under the limits of Hussainialam Police Station, Charminar.
Acting on credible information, the team inspected the premises of M/s Al Akbar Fast Food and Godown, located at New Laad Bazar, Panch Mohalla, Charminar.
During the inspection, it was found that food items were being prepared and stored under extremely unhygienic and hazardous conditions, posing a serious threat to public health.
✳️Major Violations Observed:
• Operation without a mandatory FSSAI licence.
• Use of prohibited/artificial food colours (MSK Lion Green and Raspberry Red).
• Reuse of stale and hazardous cooking oil.
• Absence of water analysis certification and quality control measures.
• Gross unhygienic conditions and lack of pest control.
Seizure Details:
• Approximately 110 kg of prepared fried chicken.
• 6 tins of loose cooking oil (15 litres each).
• Artificial chemical food colours.
Two persons responsible for running the illegal operations have been apprehended.
Health Risks to Consumers:
✳️Consumption of such adulterated and unhygienic food may lead to:
• Food poisoning, vomiting, and diarrhea.
• Gastrointestinal infections.
• Long-term health issues due to repeated consumption of reused oil.
• Allergic reactions and toxicity due to artificial food colours.
• Increased risk of serious illnesses affecting the liver and overall health.
✳️Legal Action Initiated:
The accused, by concealing these unsafe practices and supplying adulterated food to consumers, have endangered public health and gained unlawfully. A case has been registered in Hussainialam Police Station under relevant provisions of the Food Safety and Standards Act, 2006 and other applicable laws.
The accused persons and seized material have been handed over to the Station House Officer, Hussainialam Police Station, for further legal action.
Public Advisory:
✳️Hyderabad City Police reiterates its zero-tolerance policy towards food adulteration. Citizens are advised to:
• Consume food only from licensed establishments.
• Verify the FSSAI licence before purchase.
• Avoid artificially coloured or suspicious food.
• Report unsafe food practices.
For complaints, contact Toll-Free Number: 8712661212. @HFastHCP
Public cooperation is essential to safeguard food safety and public health.
Issued By: Vaibhav Raghunath Gaikwad, IPS Deputy Commissioner of Police Task Force, Hyderabad
𝐏𝐚𝐧𝐞𝐞𝐫 𝐀𝐝𝐮𝐥𝐭𝐞𝐫𝐚𝐭𝐢𝐨𝐧, 𝐌𝐢𝐬𝐛𝐫𝐚𝐧𝐝𝐢𝐧𝐠 & 𝐅𝐨𝐨𝐝 𝐒𝐚𝐟𝐞𝐭𝐲 𝐕𝐢𝐨𝐥𝐚𝐭𝐢𝐨𝐧𝐬
It has come to the notice of the authorities that Cheese Analogue products (made from vegetable fats and non-milk ingredients) are being sold as Paneer, Malai Paneer, or Milk Paneer without proper declaration, amounting to misbranding and consumer deception.
FBOs are procuring Cheese Analogue from manufacturers and from states such as Karnataka, Tamil Nadu, Maharashtra, and Andhra Pradesh, and selling it as paneer. The same product is often marketed under misleading labels like “Low Fat Paneer”, “Medium Fat Paneer”, or “Fresh Paneer”, or sold without manufacturing details, batch number, or expiry date. In some cases, FBOs unknowingly order paneer but are supplied Cheese Analogue as a substitute.
Manufacturers supply these products with labels declaring “Cheese Analogue” and disclaimers such as “not responsible for loose sale” and “contains no dairy fat”; however, at the retail level, FBOs misrepresent or knowingly sell them as paneer to increase profits.
It is also observed that some manufacturers and retail shop owners are operating without valid FSSAI licenses. Certain FBOs are procuring Cheese Analogue in bulk and repacking it under misleading labels such as “Premium Paneer” without licence, proper declaration, or traceability.
Inspections have revealed adulteration practices including addition of starch, excess water, non-milk fats, use of poor-quality or synthetic milk, and non-food-grade substances, along with violations such as absence of mandatory labelling, invalid licences, and unhygienic storage.
Seizure of Adulterated and Misbranded Products:
During raids conducted yesterday, approximately 45 outlets and 8 manufacturing units were inspected, and about 825 kg of suspected adulterated/misbranded products were seized.
These practices pose serious health risks including food poisoning, allergic reactions, and consumption of inferior and unsafe products.
Strict enforcement drives are ongoing, and samples are being collected for analysis. Violations will attract stringent legal action.
Public Advisory: Purchase paneer only from licensed vendors, check labels and expiry details, avoid loose/unlabelled products, and report violations.
Warning to FBOs: Ensure proper declaration of Cheese Analogue, maintain mandatory labelling and valid licences, and avoid repacking or selling analogue as paneer; violations will invite strict legal action.
Issued in the interest of public health and consumer safety.
SD/-
VAIBHAV GAIKWAD RAGHUNATH, IPS,
DEPUTY COMMISSIONER OF POLICE,
COMMISSIONER’S TASK FORCE, HYDERABAD.
Upon receiving a Dial-100 call regarding a child trapped in a manhole cover near the Secretariat Bus Stop, Saifabad Police responded immediately and coordinated with the Fire Department for a safe rescue.
The timely intervention of police and fire service personnel ensured the child's safety and prevented any untoward incident.
Subsequently, GHMC officials were informed to undertake necessary rectification of the manhole cover and implement preventive measures in the interest of public safety.
హైదరాబాద్‌లో పోలీస్ మెంటార్స్ వ్యవస్థ
ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక మెంటార్.. మార్గదర్శక్ వలంటీర్లతో సమన్వయం
నగర సీపీ వీసీ సజ్జనర్ వెల్లడి
హైదరాబాద్ నగరంలో భద్రతను మరింత బలోపేతం చేసేందుకు సిటీ పోలీస్ సరికొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ‘మార్గదర్శక్’ కార్యక్రమానికి అనుబంధంగా, కొత్తగా ‘పోలీస్ మెంటార్స్ ప్రోగ్రామ్’ను తీసుకువస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ ప్రకటించారు. ఇకపై ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కానిస్టేబుల్‌ను మెంటార్‌గా నియమిస్తామని, వారు క్షేత్రస్థాయిలో మార్గదర్శక్ వలంటీర్లతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేస్తారని ఆయన తెలిపారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీజీఐసీసీసీ ఆడిటోరియంలో హెచ్సీఎస్సీ ఆధ్వర్యంలో జరిగిన మార్గదర్శక్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీపీ శ్రీ వీసీ సజ్జనర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 80 మంది వలంటీర్లకు సర్టిఫికెట్లను ప్రదానం చేయడంతో పాటు, మార్గదర్శక్ లోగోను ఆవిష్కరించి, రెండో దశ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ, నగరంలో ప్రజా భద్రత, మహిళా భద్రత, అత్యవసర సేవలలో భాగస్వాములుగా ఉంటూ, ప్రజలను చైతన్యవంతమైన వలంటీర్లుగా తీర్చిదిద్దడమే మార్గదర్శక్ ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. బాధితులకు తక్షణ అండగా నిలుస్తూ, పోలీసు వ్యవస్థకు 'ఫోర్స్ మల్టిప్లయర్స్'గా పనిచేసేలా పౌరులను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
వలంటీర్లకు ప్రజా భద్రత, ఎమర్జెన్సీ రెస్పాన్స్, మహిళల భద్రత, సైబర్ అవగాహన వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించామని, వీరంతా ఇకపై సేఫ్టీ అంబాసిడర్స్ గా నగర భద్రతలో కీలక పాత్ర పోషిస్తారని వివరించారు.
సమాజంలో మహిళలు ఎదుర్కొనే వేధింపులు, పని ప్రదేశాల్లో ఇబ్బందులు, గృహ హింస వంటి ఘటనల్లో బాధితులు భయం, అవగాహన లేమితో బయటకు చెప్పలేక మౌనంగా ఉండిపోతున్నారని, ఇది కాలక్రమేణా పెద్ద నేరాలకు దారితీసే ప్రమాదముందన్నారు. అందుకే, బాధితులకు భరోసా కల్పించేందుకే మార్గదర్శక్ వ్యవస్థను తీసుకువచ్చామని, సమస్యను చూసి తప్పుకునే ప్రేక్షకులుగా కాకుండా, సమాజంలో మార్పు తెచ్చే 'చేంజ్ మేకర్స్'గా ప్రజలు ఎదగాలని పిలుపునిచ్చారు. షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సైబర్ క్రైమ్ పోలీసులకు, బాధితులకు మధ్య మార్గదర్శకులు ఒక నమ్మకమైన వారధిగా పనిచేయాలని, నిబద్ధతతో కూడిన సేవలే పోలీస్ వ్యవస్థకు గౌరవాన్ని తెస్తాయని చెప్పారు. పోలీసింగ్‌లో అయినా, సామాజిక సేవలో అయినా నాణ్యత, క్రమశిక్షణ అత్యంత కీలకమని, వలంటీర్లు ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు.
ఆపదలో ఉన్న మహిళలు తమ ఇబ్బందులను మహిళా సిబ్బంది వద్ద మరింత స్వేచ్ఛగా, నిర్భయంగా చెప్పుకోగలరన్న వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని, బాధితులకు తక్షణ సాయం, భరోసా అందించేందుకు "స్పందన - ఆల్ ఉమెన్ ఫస్ట్ రెస్పాండర్ సిస్టమ్" అనే ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చామని, ఈ వ్యవస్థ, మార్గదర్శక్, పోలీస్ మెంటార్ల నెట్‌వర్క్‌తో కలిసి పనిచేస్తూ మహిళా భద్రతకు ఒక బలమైన రక్షణ కవచంలా మారుతుందని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో రిటైర్డ్ అధికారులు, విద్యావేత్తలు, నిపుణుల సేవలను కూడా ఈ వ్యవస్థలో భాగస్వామ్యం చేస్తామని వెల్లడించారు. మార్గదర్శకులు మొదటి స్థాయిలో సహాయం అందిస్తే, ఆయా స్టేషన్లలోని పోలీస్ మెంటార్లు వారికి నిరంతర తోడ్పాటును అందిస్తారని, తద్వారా పాఠశాలలు, కళాశాలలు, గేటెడ్ కమ్యూనిటీలు మరియు ఆఫీసుల్లో ఈ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. సురక్షితమైన హైదరాబాద్ నిర్మాణమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా భద్రతా విభాగం డీసీపీ డాక్టర్ లావణ్య, హెచ్సీఎస్సీ సెక్రటరీ జనరల్ శ్రీ సి. శేఖర్ రెడ్డి, మహిళా ఫోరం జాయింట్ సెక్రటరీ శ్రీమతి ఖ్యాతి నారవనే తదితరులు పాల్గొన్నారు.
𝟑𝟎 𝐋𝐨𝐬𝐭 𝐌𝐨𝐛𝐢𝐥𝐞 𝐏𝐡𝐨𝐧𝐞𝐬 𝐓𝐫𝐚𝐜𝐞𝐝 𝐭𝐡𝐫𝐨𝐮𝐠𝐡 𝐂𝐄𝐈𝐑 𝐀𝐩𝐩𝐥𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 𝐚𝐧𝐝 𝐇𝐚𝐧𝐝𝐞𝐝 𝐎𝐯𝐞𝐫 𝐭𝐨 𝐕𝐢𝐜𝐭𝐢𝐦𝐬
KULSUMPURA POLICE STATION, GOLCONDA ZONE, HYDERABAD: The Kulsumpura Police Station staff, Golconda Zone, Hyderabad, have successfully traced and recovered 30 lost mobile phones through the Central Equipment Identity Register (CEIR) Application.
The victims who had lost their mobile phones lodged complaints through the CEIR portal and at the police station. Acting on these complaints, the Kulsumpura Police staff made sustained efforts and successfully traced the whereabouts of the lost mobile phones from various locations. After completing the necessary verification and legal formalities, all the recovered mobile phones were returned to their rightful owners.
In a programme organized at Kulsumpura Police Station, Sri.Krishna Goud, Additional Deputy Commissioner of Police, Golconda Zone, Hyderabad, handed over the recovered mobile phones to the victims. The victims expressed their happiness and thanked the Hyderabad City Police for the prompt action taken in tracing and recovering their lost mobile phones.
The officers and staff of Kulsumpura Police Station who played a vital role in tracing and recovering the mobile phones are:
1) D. Nagarjuna, Detective Inspector (DI), 2) G. Naveen, Sub-Inspector of Police (SI), 3) HC 3394 Md. Shaker, 4) PC 30814 M.V. Sanjay Kumar, 5) PC 1582 G. Naveen Kumar, 6) PC 6564 L. Narsing Rao, 7) PC 31589 K. Ravi Prasad, 8) WPC-31652 Bhavani
The Additional DCP, Golconda Zone, appreciated the efforts of the Kulsumpura Police staff for their dedicated work and encouraged them to continue rendering efficient service to the public.
The programme was attended by the Sri.V.Tirupathi, ACP, Kulsumpura Division, Sri.A.Ramulu, SHO, Kulsumpura Police Station, and the Sub-Inspectors of Kulsumpura Police Station, besides other police personnel and the beneficiaries.
The Hyderabad City Police appeal to the public that in case of loss or theft of mobile phones, they should immediately register a complaint through the CEIR portal and inform the nearest police station so that timely action can be taken for tracing and recovering the lost devices.
Issued by : Station House Officer,PS Kulsumpura, Hyd.
𝐁𝐞𝐰𝐚𝐫𝐞 𝐨𝐟 “𝐁𝐚𝐜𝐤𝐝𝐨𝐨𝐫 𝐉𝐨𝐛” 𝐒𝐜𝐚𝐦𝐬
➡️Cyber fraudsters are using social media platforms to lure job seekers with promises of “backdoor jobs,” guaranteed placements, and direct recruitment in reputed companies.
➡️They conduct fake interviews, issue fraudulent selection letters, and demand money under the guise of processing fees, security deposits, or job confirmations.
➡️ Never pay money for any job opportunity. Genuine employers do not sell jobs. Verify before you trust and report cyber frauds to 1930.
Beware of fake Census Verification messages and links. Never share your Aadhaar details, OTPs, PINs, or bank information. A genuine Census exercise will never ask for such details and is conducted door-to-door, not online.
#ThinkBeforeYouClick
* హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆధ్వర్యంలో బ్యాంకు ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
* ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ హాజరుకాగా, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈడీ బీనా వహీద్, జోనల్ హెడ్ సుధాకర్ మరియు వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
* బ్యాంకు ఉద్యోగులకు సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు వివిధ భాషల్లో రూపొందించిన ఒక ప్రత్యేక బ్రోచర్‌ను హైదరాబాద్ సీపీ ఆవిష్కరించారు.
* ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ శ్రీ సజ్జనర్, ఐపీఎస్ మాట్లాడుతూ కీలక సూచనలు చేశారు.
* ప్రతి బ్యాంకు ఉద్యోగి కూడా సైబర్ నేరాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
* తాము ప్రజల సొమ్ముకు రక్షకులమనే బాధ్యతను ఎట్టిపరిస్థితుల్లోనూ మర్చిపోవద్దని బ్యాంకు సిబ్బందికి గుర్తుచేశారు.
* సైబర్ నేరాలను అరికట్టడం అనేది కేవలం పోలీసుల బాద్యతే కాదని, ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన అన్నారు.
* ప్రతి బ్యాంకు ఉద్యోగి తమ బ్రాంచ్‌లో 'జీరో మ్యూల్ అకౌంట్ ఛాలెంజ్', 'సేఫ్ కస్టమర్ ఛాలెంజ్'లను ఖచ్చితంగా పాటించాలని కోరారు.
* తమ బ్రాంచ్ కస్టమర్లలో ఒక్కరు కూడా సైబర్ నేరాల బారిన పడకూడదనే విషయాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకోవాలని పిలుపునిచ్చారు.
* ఇటీవల చేపట్టిన 'ఆపరేషన్ ఆక్టోపస్' ద్వారా సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకున్నామని, అయితే ఆయా కేసుల దర్యాప్తులో చాలా మంది బ్యాంకు ఉద్యోగులకు సైబర్ నేరాలపై కనీస అవగాహన లేదని తేలిందని గుర్తుచేశారు.
* కొత్తగా బ్యాంక్ ఖాతాలు తెరవడంలో చూపిస్తున్న శ్రద్ధను, సైబర్ నేరాల బాధితుల విషయంలో చూపించడం లేదన్నారు.
* కనీసం ఒక్క సైబర్ బాధితుడు కూడా లేని బ్రాంచ్ ఉద్యోగులను గుర్తించి, వారికి పురస్కారాలు అందించి ప్రోత్సహించాలని సూచించారు.
* కేవలం వ్యాపార లక్ష్యాలను (టార్గెట్లను) మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతను కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.
➡️మొహర్రం ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం
➡️ప్రశాంత వాతావరణంలో ఊరేగింపునకు సీపీ వీసీ సజ్జనర్ పిలుపు
✳️పవిత్ర మొహర్రం మాసంలో అషూరా సందర్భంగా షియా ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే చారిత్రాత్మక బీబీ-కా-ఆలం మాతం ఊరేగింపును ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు పిలుపునిచ్చారు.
✳️ఈ సాంప్రదాయక ఊరేగింపు మార్గంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ శాఖ ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టిందని ఆయన వెల్లడించారు.
✳️హైదరాబాద్‌లోని సాలర్ జంగ్ మ్యూజియం ఆడిటోరియంలో శుక్రవారం మొహర్రం ఏర్పాట్లపై హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో షియా కమ్యూనిటీ మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
✳️ఈ సందర్భంగా సీపీ గారు మాట్లాడుతూ.. ఊరేగింపు డబీర్‌పురాలోని బీబీ-కా-ఆలం అషూర్ ఖానా నుండి ప్రారంభమై ఎత్తేబార్ చౌక్, కోట్ల అలిజా, పంజేశా, మీరాలం మండి, చార్మినార్, గుల్జార్ హౌస్, పురానీ హవేలీ, దారుషిఫా మీదుగా సాగి చాదర్‌ఘాట్‌లోని మజీద్-ఎ-ఇలాహి వద్ద ముగుస్తుందని వివరించారు.
✳️ఊరేగింపునకు వచ్చే వారిని దృష్టిలో ఉంచుకొని స్పష్టమైన ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికను అమలు చేయడంతో పాటు, తగిన వాహన పార్కింగ్ సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు అదనపు పోలీస్ ప్లాటూన్లను మోహరిస్తున్నామన్నారు. మహిళల రక్షణ కొరకు షీ టీమ్స్, టాస్క్ ఫోర్స్ బృందాలతో నిరంతరం నిఘా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
✳️గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఊరేగింపు సజావుగా సాగేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
✳️ఊరేగింపులో పాల్గొనే ఏనుగు భద్రత, సంరక్షణపై ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేశారు. ఊరేగింపునకు ముందే ఏనుగును నగరానికి తీసుకువచ్చి తగిన విశ్రాంతి కల్పించాలని అధికారులకు సూచించారు. ఊరేగింపు సమయంలో ఏనుగు చుట్టూ తగినంత బఫర్ జోన్ ఉండేలా చూడాలని, ప్రజలు దానికి సమీపంలోకి రాకుండా వాలంటీర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా జూలాజికల్ పార్క్ ఆధ్వర్యంలో ఒక పశువైద్య బృందాన్ని, ట్రాంక్విలైజర్ (Tranquilizer) ను అందుబాటులో ఉంచాలని కోరారు.
✳️మొత్తం ఊరేగింపు మార్గాన్ని సీసీ కెమెరాల ద్వారా బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పోలీస్, ఇతర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు ఉమ్మడిగా నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిపారు.
✳️షియా కమ్యూనిటీ ప్రతినిధులు లేవనెత్తిన రోడ్ల మరమ్మతులు, విద్యుత్ వైర్ల క్రమబద్ధీకరణ, తాగునీటి సరఫరా, పారిశుధ్యం తదితర సమస్యలను జి.హెచ్.ఎం.సి, జలమండలి, విద్యుత్ శాఖల సమన్వయంతో తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
✳️ఈ కోఆర్డినేషన్ మీటింగ్ లో ఎమ్మెల్సీ శ్రీ మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, ఎమ్మెల్యేలు శ్రీ మీర్ జుల్ఫీకర్ అలీ, శ్రీ జాఫర్ హుస్సేన్ మెహరాజ్, శ్రీ అహ్మద్ బిన్ అబుద్ధుల్లా బలాలతో పాటు పోలీస్ ఉన్నతాధికారులు అడిషనల్ సీపీ లా అండ్ ఆర్డర్ శ్రీ తఫ్సీర్ ఇక్బాల్, ఐపీఎస్, జాయింట్ సీపీలు శ్రీ.డి.జోయల్ డెవిస్, ఐపిఎస్, శ్రీమతి ఎన్. శ్వేత, ఐపీఎస్, చార్మినార్ జోన్ డీసీపీ శ్రీ ఖారే కిరణ్ ప్రభాకర్, ఐపీఎస్, డీసీపీ ట్రాఫిక్-2 శ్రీ రాహుల్ హెగ్డే, ఐపీఎస్, డీసీపీ కార్ హెడ్ క్వార్టర్స్ శ్రీ ఆర్. వెంకటేశ్వర్లు, ఐపీఎస్, జి.హెచ్.ఎం.సి జోనల్ కమిషనర్ శ్రీ సత్యనారాయణ, డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీ ఎమ్. లక్ష్మణ్, విద్యుత్ శాఖ ఎస్ఈ సౌత్ శ్రీ ఎమ్. శ్రీనివాస్, ఆర్ అండ్ బీ ఈఈ శ్రీ మనోహర్, వాటర్ బోర్డ్ ఆపరేషన్స్ డైరెక్టర్ శ్రీ ప్రభు, జూ పార్క్ డీడీ వెటర్నరీ శ్రీ హకీమ్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న, ప్రముఖ మత పెద్దలు మౌలానా ఫరిస్తా, మౌలానా వహీబుద్దిన్ హైదర్ జఫరీ, మార్కజి అంజుమాన్ కమిటీ నుంచి నజఫ్ అలీ షౌకత్, ముస్తాబా ముసావి, సున్ని కమ్యూనిటీ బీబీ కా అలవా, ముజావార్ నుంచి శ్రీ ఎజాజ్, బీబీ కా అలవా అలంబర్దార్ నుంచి శ్రీ షబ్బీర్ హసన్ రజ్వి, తదితరులు పాల్గొన్నారు.
హోంగార్డుల కుటుంబాలకు రూ.34 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కుల అందజేత
విధి నిర్వహణలో ఉంటూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు హోంగార్డుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.34 లక్షల చొప్పున ప్రమాద బీమా చెక్కులను హైదరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అందజేశారు.
బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఈ చెక్కులను బాధిత కుటుంబాలకు అందించారు.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డులు సయ్యద్ హుస్సేన్, సింహగిరి ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మరణించారు.
సయ్యద్ హుస్సేన్ నీటిలో మునిగి చనిపోగా.. సింహగిరి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హోంగార్డుల వేతన ఖాతాలకు ప్రమాద బీమా కవరేజీ ఉండటంతో.. యాక్సిస్ బ్యాంక్ వారికి ప్రమాద బీమాను మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలో బ్యాంక్, పోలీస్ అధికారులతో కలిసి రూ.34 లక్షల చొప్పున చెక్కులను సయ్యద్ హుస్సేన్ భార్య రేష్మా బేగం, సింహగిరి భార్య భవానీకి సీపీ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు అందజేశారు.
@AxisBank@hydcitypolice@TelanganaCOPs
#AdminPost
వాతావరణ శాఖ నగరంలో భారీ వర్ష సూచనలు జారీ చేసిన నేపథ్యంలో హైదరాబాద్ సిటీ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.
ఇందులో భాగంగానే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు వాటర్ లాగింగ్ ప్రాంతాలను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
జాయింట్ సీపీ ట్రాఫిక్ శ్రీ డి.జోయల్ డేవిస్, ఐపీఎస్, డీసీపీ ట్రాఫిక్ శ్రీ అవినాష్ కుమార్, ఐపీఎస్, శ్రీమతి కాజల్, ఐపీఎస్ లతో కలిసి ఆయన లక్డీకాపూల్, మసబ్ ట్యాంక్, పంజాగుట్ట శ్మశాన వాటిక, కేబీఆర్ పార్క్ జంక్షన్, తదితర వాటర్ లాగింగ్ పాయింట్లను సందర్శించారు.
రోడ్లపై వర్షపు నీరు ఎక్కువ సమయం నిల్వ ఉండకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, నీరు సులువుగా పోయేలా తగిన ఏర్పాట్లు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు.
వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి, విద్యుత్ శాఖ, తదితర ప్రభుత్వ విభాగాలలో నిరంతరం సమన్వయం చేసుకుంటామని వివరించారు.
భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. వర్షాల సూచనపై వాతావరణ శాఖ, పోలీసుల సూచనలను గమనించి.. అందుకు అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని పేర్కొన్నారు.
రోడ్లపై ప్రయాణించేటప్పుడు మ్యాన్‌హోల్స్, తెరిచిన డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాల పట్ల ప్రజలు, వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నగర ప్రజలకు ఏదైనా అత్యవసర సహాయం లేదా ఇబ్బంది ఎదురైతే తక్షణ సహాయం కొరకు డయల్ 100/112ను సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
⚠️ Weather & Traffic Advisory
As per IMD, light rain/thundershowers accompanied by gusty winds are likely in parts of Hyderabad towards the evening/night today.
Rain may lead to waterlogging and slow-moving traffic at some locations. Commuters are advised to plan their travel in advance, maintain safe distances while driving, and avoid unnecessary movement during heavy spells. Also avoid sheltering under trees or unstable structures.
For assistance, dial 100 or 112.
#HyderabadRains #TrafficAlert #StaySafe
➡️జనగణన ధృవీకరణ పేరుతో వచ్చే నకిలీ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండండి – మీ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోండి
✳️ సైబర్ మోసగాళ్లు జనగణన (Census) ధృవీకరణ పేరుతో నకిలీ లింకులు, సందేశాలు పంపిస్తూ ప్రజలను మోసం చేసి వారి వ్యక్తిగత, ఆర్థిక మరియు గోప్యమైన సమాచారాన్ని దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
✳️ధృవీకరించని లింకులపై క్లిక్ చేయవద్దు. ఆధార్ వివరాలు, OTPలు, PINలు, బ్యాంక్ ఖాతా సమాచారం, పాస్వర్డ్లు లేదా ఇతర గోప్యమైన సమాచారాన్ని అపరిచిత వ్యక్తులు లేదా వెబ్సైట్లతో పంచుకోవద్దు.
✳️ అధికారిక జనగణన అధికారులు ఎప్పటికీ ఫోన్ కాల్స్, సందేశాలు లేదా ఆన్లైన్ లింకుల ద్వారా OTPలు, PINలు, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఇతర ఆర్థిక సమాచారాన్ని అడగరు.
✳️జనగణనకు సంబంధించినదిగా పేర్కొంటూ వచ్చే ఏ సమాచారాన్నైనా స్పందించే ముందు దాని ప్రామాణికతను తప్పనిసరిగా ధృవీకరించండి.
✳️అప్రమత్తంగా ఉండండి – సైబర్ భద్రతను పాటించండి. అనుమానాస్పద లింకులు, సందేశాలు లేదా సైబర్ మోసాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కు తెలియజేయండి లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.
వాహనదారులకు ముఖ్య గమనిక!!
మీ వాహన ట్రాఫిక్ ఉల్లంఘన ఈ-చలానాలతో పాటు ఇతర కీలక సమాచారాన్ని ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా నేరుగా, సకాలంలో తెలుసుకోవడానికి.. వెంటనే 'వాహన్' (VAHAN) పోర్టల్‌లో మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీలను అప్డేట్ చేసుకోండి.
కాంటాక్ట్ వివరాలను అప్ డేట్ చేసుకోవడం ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే కాకుండా, నోటిఫికేషన్లు అందకపోవడం వల్ల పడే జరిమానాల భారం నుంచి తప్పుకోవచ్చు.
వాహనదారులు తమ వివరాలను https://t.co/5yf75K1LMK పోర్టల్ ద్వారా లేదా ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ (QR) కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా సులభంగా, వేగంగా ఆప్ డేట్ చేసుకోవచ్చు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 'వాహన్' పోర్టల్‌లో నమోదైన మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీకి పంపిన చలానాలను వాహన యజమానికి అధికారికంగా చేరినట్లుగానే (Deemed to be served) పరిగణిస్తారు.
కాబట్టి అలసత్వం వహించకుండా నేడే మీ వివరాలను అప్డేట్ చేసుకోండి.. సమాచారం తెలుసుకుంటూ జరిమానాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండండి.
@HYDTP@hydcitypolice@CPHydCity@TelanganaCOPs@MORTHRoadSafety@MORTHIndia
#RoadSafety #VAHAN #HydTrafficPolice #Alert
𝐀𝐫𝐫𝐞𝐬𝐭 𝐨𝐟 𝐀𝐜𝐜𝐮𝐬𝐞𝐝 𝐈𝐧𝐯𝐨𝐥𝐯𝐞𝐝 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐌𝐮𝐫𝐝𝐞𝐫 𝐨𝐟 𝐀𝐝𝐯𝐨𝐜𝐚𝐭𝐞 𝐊𝐡𝐚𝐣𝐚 𝐌𝐨𝐢𝐳𝐮𝐝𝐝𝐢𝐧
𝐍𝐚𝐦𝐩𝐚𝐥𝐥𝐲 𝐏𝐨𝐥𝐢𝐜𝐞 𝐒𝐭𝐚𝐭𝐢𝐨𝐧 – 𝐊𝐡𝐚𝐢𝐫𝐚𝐭𝐚𝐛𝐚𝐝 𝐙𝐨𝐧𝐞 – 𝐇𝐲𝐝𝐞𝐫𝐚𝐛𝐚𝐝 𝐂𝐢𝐭𝐲 𝐏𝐨𝐥𝐢𝐜𝐞
Brief Facts of the Case:
On 23-05-2026, Advocate Khaja Moizuddin was allegedly murdered in a planned vehicle attack near his residence at Masab Tank, Hyderabad, while leaving for swimming in the early morning. He sustained grievous injuries after being intentionally hit by a Scorpio vehicle and later died during treatment at a hospital.
Initially, a case was registered at Nampally Police Station under relevant sections of BNS, and later altered to murder charges following his death.
Investigation:
During investigation, CCTV footage revealed that the accused deliberately waited near the victim’s residence and intentionally rammed the vehicle into him before fleeing the scene. Through CCTV analysis and technical evidence, police identified the accused persons.
Motive:
Police investigation found that long-standing disputes existed between the deceased and the family of accused Mujahid Alam Khan over Waqf properties and related legal cases in Hyderabad. The accused allegedly developed a grudge against the advocate due to ongoing legal disputes and setbacks.
Conspiracy and Execution:
According to police, accused Mujahid Alam Khan and Mahaboob Alam Khan allegedly conspired with associates to eliminate the advocate through a contract killing for ₹15 lakh. The accused conducted surveillance on the victim for several months and executed the attack using a Scorpio vehicle on 23-05-2026.
Arrests:
Police traced and arrested key accused persons, including:
Mujahid Alam Khan
Mahaboob Alam Khan
Kishan @ Pappu
Vinay
Abhijeeth @ Nani
Vikram Aditya @ Chintu
Manideep @ Pogo Nani
The Scorpio vehicle, cash, and mobile phones were seized from the accused. Further investigation is underway to apprehend remaining absconding accused and gather additional evidence.
Investigation Team:
The above arrests were made by the Investigating Officer, Sri P. Praveen Kumar, ACP, Abids Division, Hyderabad, with the assistance of Sri CH Saidulu, Inspector of Police, Nampally Police Station, Sri M.A. Adil Riyaz Khan, Sub-Inspector of Police, Nampally Police Station, and staff under the direct supervision of senior officers of Hyderabad City Police.
𝐀 𝐫𝐞𝐞𝐥 𝐦𝐚𝐲 𝐥𝐚𝐬𝐭 𝟑𝟎 𝐬𝐞𝐜𝐨𝐧𝐝𝐬… 𝐛𝐮𝐭 𝐚𝐧 𝐚𝐜𝐜𝐢𝐝𝐞𝐧𝐭 𝐜𝐚𝐧 𝐝𝐞𝐬𝐭𝐫𝐨𝐲 𝐚𝐧 𝐞𝐧𝐭𝐢𝐫𝐞 𝐟𝐮𝐭𝐮𝐫𝐞.
✳️For likes, shares, and followers youngsters performing risky stunts just to go viral on social media.
✳️Remember: Trending today can become tragedy tomorrow.
✳️Your family needs you alive, not famous for a dangerous reel.
Life is real. Reels are not.
C𝐨𝐮𝐫𝐚𝐠𝐞𝐨𝐮𝐬 𝐚𝐜𝐭𝐢𝐨𝐧 𝐛𝐲 𝐓𝐚𝐩𝐩𝐚𝐜𝐡𝐚𝐛𝐮𝐭𝐫𝐚 𝐏𝐨𝐥𝐢𝐜𝐞 𝐬𝐚𝐯𝐞𝐝 𝐚 𝐥𝐢𝐟𝐞 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐧𝐢𝐜𝐤 𝐨𝐟 𝐭𝐢𝐦𝐞.
In a remarkable act of courage and presence of mind, PC B. Suresh of Tappachabutra Police Station saved the life of a TGPDCL contract worker who suffered a severe electric shock while carrying out repair works near Kummarwadi Hanuman Temple, Karwan. Responding instantly during his BC-I patrolling duty, the constable rushed to the spot and found the worker unconscious and not breathing.
Without wasting a moment, PC B. Suresh administered CPR on-site and successfully revived the victim’s pulse and breathing before shifting him to the hospital for further treatment. Doctors stated that the timely CPR given during the golden hour played a crucial role in saving the worker’s life, highlighting the Hyderabad City Police’s commitment towards public safety and humanitarian service.
✳️Fraudsters are increasingly using fake online astrology, tantra & spiritual services to trap innocent people.
✳️Don’t share personal details, photos or money with unknown online “gurus”
Stay Alert, Stay Safe!