CEIR పోర్టల్ ద్వారా 104 మొబైల్ ఫోన్లు రికవరీ – బాధితులకు అందజేసిన సీపీ ఎన్.శ్వేత, ఐపీఎస్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు CEIR పోర్టల్ ద్వారా మొత్తం 104 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు.
ఈ విధంగా రికవరీ చేసిన 104 మొబైల్ ఫోన్లను బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ గారు తన చేతుల మీదుగా సంబంధిత బాధితులకు తిరిగి అందజేశారు.
CCS ACP P.సదయ్య, CCS SHO రాఘవేందర్ గార్ల సూచనల మేరకు CCS కానిస్టేబుళ్లు ఎస్. రాములు, జితేందర్ లు ప్రత్యేక చొరవ తీసుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ CEIR పోర్టల్ ద్వారా ఈ మొబైల్ ఫోన్లను గుర్తించి రికవరీ చేయడంలో కీలక పాత్ర పోషించారు.
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి పొందిన బాధితులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
మొబైల్ ఫోన్ల రికవరీలో కృషి చేసిన CCS SHO రాఘవేందర్, కానిస్టేబుళ్లు ఎస్. రాములు, జితేందర్‌లను సీపీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో సిసిఎస్ ఏసిపి పి.సదయ్య, సిసిఎస్ SHO రాఘవేందర్, కానిస్టేబుళ్లు రాములు మరియు జితేందర్ లు పాల్గొన్నారు. @TelanganaDGP@TelanganaCOPs #CEIR
Telangana DGP Shri C.V. Anand, IPS, thanked Aurobindo Pharma Foundation and Mr. K. Nityananda Reddy, VC & MD - Aurobindo Pharma, for extending a ₹1 crore CSR contribution towards building the infrastructure at Young India Police School (YIPS), Manchirevula.
He stated that the contribution would give impetus to the completion of pending works and strengthen the facilities.
The DGP appreciated Hyderabad CP Shri Mahesh M. Bhagwat and Sangareddy SP Shri Paritosh Pankaj for their sustained efforts in facilitating the contribution.
Planning to buy pre-owned items online? Whether it’s a mobile phone, laptop, camera, vehicle, furniture or home appliance, don’t let an attractive price compromise your safety!
#TelanganaPolice#Dial1930
On 18.11.2026, on reliable information about manufacturing of ID liquor at Mangal thanda Duggondi PS Staff rushed to the spot, found & destroyed 200 ltrs of fermenting mixture, and sezied 10 ltrs of Gudumba and registerd a FIR @cpwarangal@warangalpolice
As part of Cyber Jagruthi Diwas, Duggondi PS conducted Cyber Awareness program at Deshaipally village and the villagers were made aware about Advertisement Fraud, Identity Theft, Business & Investment frauds @cpwarangal@warangalpolice@TGCyberBureau
On 28.10.2026, Students belong to Sri Aadharshavani school visited Duggondi PS and they were made aware of all the verticals in the Police Station. Also explained about Road Safety, Crime Prevention and Awareness against the usage of Drugs @warangalpolice@cpwarangal
రోడ్డు ప్రమాద బాధితులు పీఎం రహత్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
- వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య చికిత్స అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రహత్ (PM RAHAT – Prime Minister Road Accident Victim's Hospitalisation and Assured Treatment) పథకాన్ని అర్హులైన బాధితులు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సూచించారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో మొత్తం 63 ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల్లో ఈ పథకం కింద వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పథకం నిబంధనలకు అనుగుణంగా అర్హులైన రోడ్డు ప్రమాద బాధితులు గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు, ఏడు రోజుల పాటు నగదు రహిత వైద్య చికిత్స పొందవచ్చని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ప్రజలకు చేసిన సూచనలు:
- రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సహాయం కోసం 112 నంబర్‌కు కాల్ చేయాలి.
- క్షతగాత్రులను వీలైనంత త్వరగా సమీపంలోని ఎంప్యానెల్డ్ ఆసుపత్రికి తరలించేందుకు సహకరించాలి.
- పథకం కింద వైద్య సేవలు పొందేందుకు ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించి, అవసరమైన వివరాలను అందించాలి.
- రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించి, పోలీసులకు, వైద్య సిబ్బందికి సహకరించాలి.
రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్య సహాయం అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ప్రజలు పీఎం రహత్ పథకంపై అవగాహన పెంపొందించుకుని, అర్హులైన బాధితులకు ఈ పథకం ప్రయోజనాలు అందేలా సహకరించాలని ఆమె కోరారు.
QVSE (Quantum Vest Stock Exchange) యాప్‌తో ఆన్లైన్ పెట్టుబడి మోసాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్
ప్రజలు ఆన్లైన్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ సూచించారు. QVSE (Quantum Vest Stock Exchange) యాప్ ద్వారా పెద్ద ఎత్తున ఆన్లైన్ పెట్టుబడి మోసాలు జరుగుతున్నట్లు కేంద్ర, రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగాలు హెచ్చరించాయని తెలిపారు.
ఈ మోసంలో భాగంగా సైబర్ నేరగాళ్లు బాధితులను QVSE యాప్ APK ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలని ప్రేరేపిస్తున్నారు. అనంతరం భారతీయ రూపాయలను Binance ఎక్స్ఛేంజ్ ద్వారా క్రిప్టోకరెన్సీగా మార్చి పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. కనీసం 500 USDT (సుమారు రూ.54,000) పెట్టుబడి పెడితే 1 శాతం లాభం వస్తుందని ఆశ చూపుతున్నారు. అంతేకాకుండా, ఇతరులను యాప్‌లో చేర్పిస్తే మొదటి స్థాయి రిఫరల్‌కు 50 USDT, రెండో స్థాయి రిఫరల్‌కు 25 USDT ఇస్తామని నమ్మిస్తున్నారు. ఈ తరహా మోసాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 56 కేసులు నమోదయ్యాయని తెలిపారు.
ప్రజలు ఈ క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి:
- అధిక లాభాలు, తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పే ఆన్లైన్ పెట్టుబడి పథకాలను నమ్మవద్దు.
- తెలియని వ్యక్తులు పంపే APK ఫైళ్లను, అనుమానాస్పద యాప్‌లను డౌన్లోడ్ చేయవద్దు.
- ధృవీకరించని యాప్‌లు, ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో డబ్బు పెట్టుబడి పెట్టవద్దు.
- క్రిప్టోకరెన్సీ రూపంలో డబ్బు బదిలీ చేయాలని కోరితే అప్రమత్తంగా ఉండండి.
- మీ OTPలు, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవద్దు.
- ఇతరులను రిఫర్ చేస్తే అదనపు ఆదాయం వస్తుందని చెప్పే పథకాల పట్ల జాగ్రత్తగా ఉండండి.
అత్యాశకు పోయి కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోవద్దు. అప్రమత్తతే సైబర్ మోసాల నుంచి రక్షణ.
ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి లేదా https://t.co/ThIi1Sb1bK వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలి. త్వరగా ఫిర్యాదు చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
N. శ్వేత, ఐపీఎస్,
వరంగల్ పోలీస్ కమిషనర్.
@TelanganaDGP@TelanganaCOPs
Addressed young girls below 18 years of age, highlighting the importance of being aware of their rights, personal safety and cyber security.
I urged them to stay vigilant on social media, report harassment without fear, and seek assistance from SHE Teams whenever necessary.
I thank Dr. Radhika for sensitising girls on their health and Mr. Barupati Gopi, Psychologist for motivating the girls with empowering words.
I sincerely thank all the girls, their parents, members of the Girls’ Associations (Baalika Sanghaalu) and Collector Warangal, DRDO Warangal and the distinguished guests for their participation and support.
@TelanganaDGP@TelanganaCOPs
వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన నేరాలు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు కేసుల ప్రగతి తదితర అంశాలపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో డీసీపీలు, ఏసీపీలు మరియు సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను గుర్తించి, వాటి దర్యాప్తు ఏ దశలో ఉందనే అంశంపై సంబందించిన అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది.
ప్రధానంగా పెండింగ్ కేసుల్లో నిందితుల అరెస్టు, నిందితులు పరారీలో ఉన్నట్లయితే వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ త్వరితగతిన అరెస్టు చేయాలని.
కేసుల దర్యాప్తు నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దర్యాప్తులో జాప్యం కారణంగా కేసులు పెండింగ్‌లో ఉండకుండా, ప్రతి కేసుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని దర్యాప్తును, అవసరమైన చోట సాంకేతికతను ఉపయోగించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని.
ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై నేరాలు, ఆస్తి నేరాలు, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసులు, తీవ్రమైన నేరాలు తదితర కేసుల దర్యాప్తు పురోగతితో పాటు ప్రజలకు త్వరితగతిన న్యాయం అందే విధంగా కేసుల దర్యాప్తును పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, నేరాలకు పాల్పడే వ్యక్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులను అదేశించడం జరిగింది.
రానున్న బతుకమ్మ దసరా పండుగలను పురస్కరించుకొని ప్రతి పోలీస్ స్టేషన్ అధికారి వారి పరిధిలో ప్రశాంతంగా పండుగలు నిర్వహించుకునే విధంగా తగు చర్యలు తీసుకోవడంతో పాటు, శాంతి భద్రతలకు ఎలాంటి సమస్య రాకుండా ముందస్తు చర్యలతో పాటు ముమ్మర పెట్రోలింగ్ చేపట్టాలని అధికారులను అదేశించడం జరిగింది.
ఈ నేర సమీక్షా సమావేశంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, అదనపు డీసీపీ లు రాయల ప్రభాకర్ రావు, హన్మకొండ ఎ సి పి నరసింహారావు, కాజీపేట ఎ సి పి ప్రశాంత్ రెడ్డి, పలువురు సి ఐ లు, ఎస్సై లు, ఐటీ కోర్ అధికారులు పాల్గొన్నారు. @TelanganaCOPs
వ్యక్తిత్వ వికాసమే అన్ని రంగాల అభివృద్ధికి మూలం: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS
విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సానుకూల ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవడం ద్వారా మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవచ్చని, వ్యక్తిత్వ వికాసమే విద్య, ఉద్యోగం, సామాజిక సేవతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధికి పునాది అని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, IPS తెలిపారు.
గురువారం పింగిలి ప్రభుత్వ మహిళా కళాశాలలో నిర్వహించిన నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) దిశానిర్దేశక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ మాట్లాడుతూ, NSS ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, సేవాభావం, నాయకత్వ లక్షణాలు, సమాజం పట్ల బాధ్యతాయుతమైన దృక్పథం పెంపొందుతాయని అన్నారు.
విద్యార్థులు తమ ప్రతిభను సద్వినియోగం చేసుకుంటూ, సమాజానికి ఉపయోగపడే NSS వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి, NSS ప్రోగ్రామ్ అధికారులు, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈసం నారాయణ, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
పొలీస్ మరియు ప్రజల బాగస్వామ్యం తో కలసి ఈ రోజు సంఘమిత్ర కార్యక్రమం వరంగల్ జిల్లాలో ఘనంగా ప్రారంభం.
ఈ రోజు సంఘమిత్ర కార్యక్రమం లో భాగంగా మొదటగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్వయం సహాయ గ్రూపులకు చెందిన మహిళా సంఘాలలు ) గ్రామ దీపికలు (VOA), మెప్మా భాగస్వామ్యంతో డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పోలీసు శాఖ మరియు ప్రజల భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు.
వరంగల్ లో“సంఘమిత్ర” కార్యక్రమం ద్వారా డ్రగ్స్ అంశంపై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నాము. SHG, VOA సంఘాల్లోని ప్రతి సభ్యురాలు ఈ కార్యక్రమంలో భాగస్వామిగా నిలిచి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతి అంశంపై అవగాహన సందేశాన్ని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. పోలీసులు–ప్రజల భాగస్వామ్యంతో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి, వరంగల్ జిల్లాను మరింత సురక్షితమైన జిల్లాగా తీర్చిదిద్దడంలో సంఘమిత్ర ఒక బలమైన వారధిగా నిలవాలి.
SHG, వాలంటీర్స్, మెప్మా సభ్యుల ద్వారా 1.17 లక్షల మంది సభ్యులకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన డ్రగ్స్, గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై యువత, మహిళలు మరియు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు “సంఘమిత్ర” కార్యక్రమాన్ని శనివారం హన్మకొండ లోని కాళోజి కళా క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. SHG గ్రూపులు 1,000 మెప్మా సభ్యుల ద్వారా 1.17 లక్షల మంది సభ్యులకు డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పిస్తూ, వారి ద్వారా జిల్లాలోని ప్రతి కుటుంబానికి డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని చేరవేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.
“జనగామ జిల్లాలో మొదటిసారిగా ‘సంఘమిత్ర’ కార్యక్రమం నిర్వహించండింది. నేడు వరంగల్ జిల్లాలో నిర్వహించడంతో పాటు మరికొద్ది రోజుల్లో హన్మకొండ జిల్లాలో సైతం మత్తు పదార్థాలు వ్యతిరేకంగా విస్తృతంగా సంఘ మిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. SHG, వాలంటీర్స్, మెప్మా గ్రూపు సభ్యులు తలచుకుంటే గంజాయి నిర్మూలన సాధ్యమవుతుంది. ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పించడంలో మహిళా సంఘాల సభ్యులు కీలక పాత్ర పోషించాలి.ప్రతి తల్లి తన బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించి, తన బిడ్డ డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా చూడాలి. పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వారితో మాట్లాడాలి. ప్రతి తల్లి బాధ్యత తీసుకుంటే గంజాయి, డ్రగ్స్ నిర్మూలన తప్పకుండా సాధ్యమవుతుంది.డ్రగ్స్, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగం, విక్రయం, సరఫరాకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసిన వెంటనే పోలీస్ శాఖకు తెలియజేయాలి. ఎలాంటి భయం లేకుండా సమాచారాన్ని పోలీసులకు అందించండి. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతాం. విలువైన సమాచారం అందించిన వారికి తగిన రివార్డు కూడా అందజేస్తాం.ప్రతి గ్రామ సమైక్య సభ్యురాలు ఒక *‘సంఘమిత్ర’*గా పనిచేసి, తన పరిధిలోని ప్రతి కుటుంబానికి డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని చేరవేయాలి. మీ ద్వారా 1.17 లక్షల మంది సభ్యులకు, వారి ద్వారా ప్రతి కుటుంబానికి ఈ సందేశం చేరాలి.డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తిని దూరం చేయకుండా, వారికి కౌన్సెలింగ్, వైద్య సహాయం మరియు కుటుంబ సహకారం అందేలా చూడాలి. సరైన సమయంలో సహాయం అందిస్తే వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావచ్చు.
మన యువతను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వచ్చి పోలీస్ శాఖకు సహకరించాలి. డ్రగ్స్‌కు NO చెప్పండి – జీవితానికి YES చెప్పండి.డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా, ప్రతి కుటుంబానికి డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సందేశాన్ని చేరవేయాలనే ఉద్దేశంతోనే ‘సంఘమిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ భాగస్వాములై పోలీస్ శాఖకు సహకరించాలి”.
వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ఐఏఎస్ మాట్లాడుతూ:
“డ్రగ్స్ సమస్య కేవలం పోలీస్ శాఖకు సంబంధించిన అంశం కాదు. ఇది మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య. అందరం కలిసికట్టుగా దీనిని ఎదుర్కోవాలి.యువతను సన్మార్గంలో నడిపించడంలో తల్లిదండ్రులు, కుటుంబాలు, విద్యాసంస్థలు మరియు గ్రామ సమైక్య సంఘాలు కీలక పాత్ర పోషించాలి.ప్రతి కుటుంబంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలి. యువతను మంచి మార్గంలో నడిపించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి
ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ:
“సంఘమిత్ర కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి SHG సభ్యుడు తన గ్రామంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కల్పిస్తూ ఒక సైనికుడిగా పనిచేయాలి.ప్రతి కుటుంబంతో మాట్లాడి డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే ప్రమాదాలను వివరించాలి. ముఖ్యంగా యువత డ్రగ్స్‌కు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వారికి సరైన మార్గదర్శనం చేయాలి.డ్రగ్స్ విక్రయం, సరఫరా లేదా వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలి. ప్రజల సహకారంతో డ్రగ్స్ నిర్మూలనకు సమిష్టిగా కృషి చేద్దామన్నారు”
డ్రగ్స్ వ్యసనం నుంచి బయటపడిన వ్యక్తి సందేశం:
కార్యక్రమంలో గతంలో డ్రగ్స్‌కు బానిసై, అనంతరం వాటిని పూర్తిగా వదిలి సాధారణ జీవితంలోకి తిరిగి వచ్చిన వ్యక్తి తన అనుభవాలను పంచుకున్నారు.“డ్రగ్స్ నాకు కొన్ని గంటల మత్తును ఇచ్చాయి… కానీ నా కుటుంబానికి ఎన్నో రోజుల కన్నీళ్లను ఇచ్చాయి. ఏ యువకుడూ నా పరిస్థితికి రావద్దు. డ్రగ్స్‌ను ఒక్కసారి కూడా ప్రయత్నించవద్దు”
డ్రగ్స్ అవేర్నెస్ స్కిట్:
డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యార్థినులు ప్రత్యేకంగా డ్రగ్స్ అవేర్నెస్ స్కిట్ ప్రదర్శించారు. యువత, కుటుంబాలు డ్రగ్స్ కారణంగా ఎదుర్కొనే సమస్యలను ప్రదర్శన ద్వారా వివరించారు.
ప్రత్యేక వీడియోల ద్వారా అవగాహన:
కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రసంగాల వీడియోలు, గౌరవ DGP గారి సందేశాల వీడియోలు, తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో (TG NAB) డైరెక్టర్ గారి అవగాహన వీడియోలు మరియు ఇతర ప్రముఖుల డ్రగ్స్ వ్యతిరేక సందేశాల వీడియోలను ప్రదర్శించారు.వీటి ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, యువతపై వాటి ప్రభావం మరియు డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరి బాధ్యతపై అవగాహన కలిపించాము.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, అడిషనల్ కలెక్టర్ వై. వి. గణేష్, ఐ.ఏ.ఎస్, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, పిడి డిఆర్డీఓ నాగ పద్మజ, జిల్లా వైద్యాధికారి రాజిరెడ్డి, అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, మామూనూర్ ఏసీపీ వెంకటేష్, గీసుగొండ ఇన్స్ స్పెక్టర్ విశ్వేశ్వర్, సైకియాట్రిస్ట్ డాక్టర్ భరత్, జిల్లా సమైక్య సంఘం అధ్యక్షురాలు శ్రీమతి రజిత, టిఎల్ ఎఫ్ అధ్యక్షురాలు పద్మ తో పాటు వెయ్యి కి పై వివిధ మహిళ సంఘాల సభ్యులు SIలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
“ప్రతి తల్లి చైతన్యవంతమైతే – ప్రతి కుటుంబం సురక్షితం.”
“ప్రతి కుటుంబం చైతన్యవంతమైతే – డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమే.”
అనే సందేశంతో సంఘమిత్ర కార్యక్రమాన్ని వరంగల్ లో ఘనంగా ప్రారంభించాము.
ఎన్. శ్వేత, ఐపిఎస్
వరంగల్ పోలీస్ కమిషనర్
@TelanganaDGP@TelanganaCOPs
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆధునికీకరించిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ATF) కేంద్రం ప్రారంభం
మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టుకుంటున్న యువతను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నూతనంగా ఆధునికీకరించిన అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ATF) కేంద్రాన్ని ఈగల్ ఫోర్స్ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది.
మద్యం, పొగాకు, గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వ్యసనం నేడు యువతతో పాటు వారి కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ప్రధాన సామాజిక సమస్యగా మారింది.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ మరియు విక్రయాలపై డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఆధ్వర్యంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో, మత్తు పదార్థాలకు బానిసలైన యువతను శిక్షించడం మాత్రమే కాకుండా, వారిని వ్యసన విముక్తులను చేసి తిరిగి ఆరోగ్యకరమైన జీవితంలోకి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, జి.ఓ. ఎం.ఎస్. నెం. 4, తేదీ 10-02-2026 ప్రకారం ఎంజీఎం ఆసుపత్రిలో అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఏర్పాటు చేయబడింది. వరంగల్ పోలీస్ కమిషనర్ చొరవతో, ఎంజీఎం ఆసుపత్రి అధికారులు మరియు సిబ్బంది సహకారంతో ఈ కేంద్రాన్ని మరింత ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు.
కేంద్రంలో ప్రత్యేక ATF వార్డు ఏర్పాటు చేసి, పడకల సామర్థ్యాన్ని 10 నుంచి 20 పడకలకు పెంచారు. రోగుల భద్రత కోసం ఇనుప గ్రిల్స్, సీసీటీవీ నిఘా, పరిశుభ్రమైన మరియు సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. బాధితుల మానసిక ప్రశాంతత కోసం క్యారమ్ బోర్డు, చెస్ వంటి వినోద సౌకర్యాలను కూడా కల్పించారు.
అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో బాధితులకు వైద్య చికిత్స, కౌన్సెలింగ్ మరియు అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ (ATF) సేవలు అందించబడతాయి. మత్తుకు బానిసైన యువతను తిరిగి సాధారణ, ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.
తమ పిల్లలు లేదా కుటుంబ సభ్యులు మత్తు పదార్థాలకు బానిసలైనట్లు గుర్తించిన తల్లిదండ్రులు ఆ సమస్యను దాచిపెట్టకుండా వెంటనే సహాయం పొందాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ విజ్ఞప్తి చేస్తోంది. సరైన సమయంలో చికిత్స, కౌన్సెలింగ్ మరియు కుటుంబ సభ్యుల సహకారం ద్వారా మత్తు పదార్థాల వ్యసనం నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది.
డీ-అడిక్షన్ చికిత్స అవసరమైన వారు ఎంజీఎం ఆసుపత్రిలోని ఈ కేంద్రాన్ని సంప్రదించి అవసరమైన సేవలను పొందవచ్చు. అవసరమైన సహాయం కోసం సమీప పోలీస్ స్టేషన్ అధికారులను లేదా ఎంజీఎం మానసిక వైద్య సిబ్బందిని కూడా సంప్రదించవచ్చు.
“మత్తును వదిలి – జీవితాన్ని ఎంచుకోండి.”
“వ్యసనాన్ని దాచకండి – సహాయం పొందండి.”
“చికిత్స ఒక జీవితాన్ని మార్చగలదు.”
మత్తు పదార్థాల వ్యసనానికి సంబంధించిన ఏదైనా సహాయం, సమాచారం లేదా మార్గదర్శకత్వం కోసం 87125 84473 / 87126 85299 నంబర్లను సంప్రదించండి.
ఈ కార్యక్రమంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, ఎస్బీ ఎంజీఎం సూపరింటెండెంట్ డా. రాంరెడ్డి, ఆర్ఎంఓ అశ్వని కుమార్, ఎస్బీ ఇన్చార్జ్ ఏసీపీ మధుసూదన్, డ్రగ్స్ కంట్రోల్ టీమ్ ఇన్స్పెక్టర్ సాయిరాం, ఆర్ఐ శివ కేశవులు, ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్, ఈగల్ టీమ్ ఎస్ఐ శ్రీకాంత్, ఆర్ఎస్ఐలు పూర్ణ చందర్ రెడ్డి, మనోజ్ రెడ్డి, నాగరాజు, పోలీస్ మరియు ఎంజీఎం ఆసుపత్రి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్. శ్వేత, ఐపీఎస్
వరంగల్ పోలీస్ కమిషనర్
@TelanganaDGP@TelanganaCOPs
పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించిన సీపీ
హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో క్యాటరింగ్ కాంట్రాక్టర్ పేరుతో హాస్టల్ యజమానులను మోసం చేసి లక్షల రూపాయలను కాజేసిన నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన హన్మకొండ ఇన్స్పెక్టర్ శివకుమార్, ఏఏఓ సల్మాన్ పాషా, కానిస్టేబుళ్లు కిరణ్‌కుమార్, రమణకుమార్, రవి, మహిళా కానిస్టేబుల్ కారుణ్య, హోంగార్డ్ రవిని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్., సీపీ కార్యాలయంలో అభినందించారు.
విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి శాఖాపరమైన గుర్తింపు ఉంటుందని సీపీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దారా కవిత, హన్మకొండ ఏసీపీ నర్సింహారావు పాల్గొన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
మహిళా సంఘాలే మాదకద్రవ్య రహిత సమాజానికి ‘సంఘమిత్రలు’
మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి మహిళ భాగస్వామి కావాలి
112కు సమాచారం ఇవ్వండి.. యువత భవిష్యత్తును కాపాడండి: వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత
జనగామను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి మహిళ తన కుటుంబంతో పాటు గ్రామాలు, పట్టణాలను కూడా మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడే ‘సంఘమిత్ర’గా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపునిచ్చారు.
బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ‘సంఘమిత్ర – మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు’ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌లతో కలిసి వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. గర్భిణీలకు పోషకాహారం అందించడం నుంచి చిన్నారులకు మధ్యాహ్న భోజనం, అక్షరాస్యత, కుటుంబ సంక్షేమం, సామాజిక ఆడిట్ వంటి అనేక కార్యక్రమాల్లో మహిళలు ముందుండి పనిచేస్తున్నారని తెలిపారు.
జనగామ జిల్లాలో మహిళల చైతన్యం ప్రత్యేకమైనదని పేర్కొంటూ, ఆ చైతన్యాన్ని సమాజ భద్రత కోసం వినియోగించాలని కోరారు. కమిషనరేట్ పరిధిలో సుమారు 26 లక్షల జనాభాకు కేవలం 3 వేల మంది పోలీసు సిబ్బంది మాత్రమే ఉన్నారని, అందువల్ల మహిళా సంఘాల సహకారం అత్యంత అవసరమని వివరించారు.
పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో డ్రగ్స్ వ్యసనం అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిన విషయాన్ని ప్రస్తావిస్తూ, తెలంగాణలో అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడే సమిష్టిగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
యువతే రాష్ట్ర భవిష్యత్తు అని, వారిని కాపాడటం ప్రతి కుటుంబం, ప్రతి మహిళా సంఘం బాధ్యత అని స్పష్టం చేశారు.
గంజాయి వంటి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు వెంటనే కనిపించకపోయినా, కొంతకాలానికి మెదడు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. డ్రగ్స్‌కు బానిసైన వారిని నేరస్తులుగా చూడటం సరికాదని, వారికి చికిత్స అందించి తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు.
మహిళా సంఘాలు సామాజిక మార్పుకు బలమైన వేదికలుగా ఉన్నాయని, పోలీస్ శాఖలో పరిమిత సంఖ్యలో సిబ్బంది ఉన్నప్పటికీ మహిళా సంఘాల ద్వారా లక్షలాది మందికి అవగాహన కల్పించడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి మహిళా సంఘ సమావేశంలో డ్రగ్స్, సైబర్ నేరాలు, మహిళల భద్రత వంటి అంశాలపై తప్పనిసరిగా చర్చించాలని సూచించారు.
గ్రామాల్లో ఎవరైనా మాదకద్రవ్యాలకు బానిసైనట్లు తెలిసినా, గంజాయి విక్రయాలు, రవాణా లేదా వినియోగం జరుగుతున్నట్లు సమాచారం ఉన్నా వెంటనే 112కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచడంతో పాటు, అవసరమైతే బహుమతులు కూడా అందజేస్తామని వెల్లడించారు.
పాఠశాల నిర్వహణ కమిటీల్లో ఉన్న మహిళా సభ్యులు విద్యార్థుల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పదో తరగతి లేదా ఇతర తరగతుల విద్యార్థులు అకస్మాత్తుగా పాఠశాలకు రాకపోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, అనుమానాస్పదంగా ప్రవర్తించడం వంటి అంశాలను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
‘సంఘమిత్ర’ కార్యక్రమం ఒకరోజు కార్యక్రమంతో ముగిసేది కాదని, ఇకపై మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యల సమావేశాల్లో పోలీసు అధికారులు క్రమం తప్పకుండా పాల్గొని డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరాల నివారణ, మహిళల భద్రత తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, మాదకద్రవ్యాల నిర్మూలనకు మహిళా సంఘాలే ప్రధాన శక్తిగా నిలవాలన్నారు. జిల్లాలో సుమారు 1.25 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులు ఉన్నారని, వీరి ద్వారా ప్రతి ఇంటికి డ్రగ్స్ వ్యతిరేక సందేశాన్ని తీసుకెళ్లవచ్చని చెప్పారు.
డ్రగ్స్ వల్ల వ్యక్తిగత ఆరోగ్యం మాత్రమే కాకుండా కుటుంబాల్లో గృహహింస, ఆర్థిక ఇబ్బందులు, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ శిక్షణలో నేర్చుకున్న అంశాలను గ్రామ మహిళా సంఘాలు, సంఘ సమాఖ్యలు, కాలనీ సమావేశాల్లో చర్చించి, యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచేందుకు కృషి చేయాలని సూచించారు.
జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా డీసీపీ రాజమహేంద్ర నాయక్ మాట్లాడుతూ, జనగామ జిల్లా మహిళా సంఘాలు రాష్ట్రంలోనే అత్యంత చైతన్యవంతమైన సంఘాలుగా గుర్తింపు పొందాయన్నారు.
@TelanganaDGP@TelanganaCOPs
https://t.co/vuB4mpHj3P