ఆన్లైన్లో ఏవైనా బిల్స్ చెల్లింపు, రిచార్జ్���ు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్ల కోసం థర్డ్ పార్టీ వెబ్సైట్లు, యాప్స్ వాడకండి. కేవలం అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించండి.
#TelanganaPolice #CyberCrime #FakeWebsites
డబ్బులు రెట్టింపయ్యే ట్రేడింగ్ సీక్రెట్స్ మీకు ఉచితంగా ఎందుకు చెబుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. వేలల్లో పెట్టుబడితో లక్షలు వస్తాయన్న మాటలకు పడిపోవద్దు. ఈజీ మనీకోసం వెళ్లి మోసపోవద్దు.
#TelanganaPolice#TradingScams
మాట్రిమోని యాప్స్‌లో జరిగే మోసాలపై జాగ్రత్త. మీ అవసరాన్ని ఆసరాగా చేసుకొని మోసం చేస్తారు. మొదట తియ్యగా మాట్లాడి..ఆపై అత్యవసరమంటూ డబ్బులు అడుగుతారు. పెట్టుబడుల పేరిట మోసగిస్తారు. అపరిచితులతో స్నేహం చేసేముందు ఆలోచించండి.
#TelanganaPolice#MatrimonialScams
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి: వరంగల్ సీపీ
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ప్రపంచ మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవం సందర్భంగా నిన్న సెంట్రల్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ��ిర్వహించిన 2కె పరుగును ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్. నాగరాజు, వరంగల్ కలెక్టర్ డా. సత్య శారద, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, కుడా చైర్మన్ ఇనగాల వెంట్రామిరెడ్డి తో కలిసి ప్రారంభించారు. ట్రై సిటీ పరిధి యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ రన్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుండి సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు జరిగింది. విజేతలకు అతిథులు పతకాలు, సర్టి��ికెట్లు అందజేశారు.
Youth should come forward to build a drug-free society: Warangal CP
Warangal Police Commissioner Sunpreet Singh, yesterday, on the occasion of the International Day Against Drug Abuse and Illicit Trafficking, along with MLAs Nayini Rajender Reddy and K.R. Nagaraju, Warangal Collector Dr. Satyasharada, Hanumakonda Collector Chahat Bajpai, and KUDA Chairman Inagala Venkatrami Reddy, inaugurated a 2K run organized by the Central Zone Police.
A large number of students and youth from the tri-city area participated in the run, which commenced from the Warangal Police Commissionerate and concluded at the Arts and Science College ground in Subedari. Medals and certificates were presented to the winners by the dignitaries. @TelanganaDGP @TelanganaCOPs #WarangalPolice #2KRun #DrugFreeTelangana #saynotodrugs
📢 సోషల్ మీడియాలో కనిపించే ప్రతి పెట్టుబడి ప్రకటన నిజమైన అవకాశమే అనుకోవద్దు.
అసాధారణ లాభాల హామీలు, తక్కువ సమయంలో భారీ రాబడులు, అత్యవసరంగా పెట్టుబడి పెట్టాలనే ఒత్తిడి... ఇవన్నీ పెట్టుబడి మోసాల హెచ్చరిక సంకేతాలు కావచ్చు.
పెట్టుబడి పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి.
✔️ సంస్థను ధృవీకరించండి.
✔️ SEBIలో నమోదైందో లేదో పరిశీలించండి.
✔️ సోషల్ మీడియా ప్రకటనలను మాత్రమే ఆధారంగా పెట్టుకొని నిర్ణయం తీసుకోవద్దు.
గుర్తుంచుకోండి...
పెట్టుబడి పెట్టే ముందు చేసే ధృవీకరణే, మీ కష్టార్జిత డబ్బుకు నిజమైన రక్షణ.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 కు కాల్ చేయండి లేదా https://t.co/2wrINFFxM3 లో ఫిర్యాదు చేయండి.
#TelanganaPolice #CyberSecurityBureau #InvestmentFraud #CyberSafety #ThinkBeforeYouInvest
అధిక లాభాల ఆశ... భారీ నష్టానికి దారి తీయొచ్చు!
FIU-IND సిఫార్సుల మేరకు, నకిలీ క్రిప్టో మరియు పెట్టుబడి మోసాలపై చర్యలు మరింత బలోపేతం చేయబడుతున్నాయి. అయితే, మీ అప్రమత్తతే మీ మొదటి రక్షణ.
మోసగాళ్లు మొదట చిన్న లాభాలు చూపించి నమ్మకం పెంచి, ఆ తర్వాత మరింత పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి చేస్తారు. చివరికి డబ్బు విత్‌డ్రా చేయాలంటే అదనపు చెల్లింపులు చేయాలని కోరుతూ మోసం చేస్తారు.
అసాధారణ లాభాల హామీలను నమ్మకండి.
పెట్టుబడి పెట్టే ముందు ప్లాట్ఫారం, సంస్థ, సలహాదారుని తప్పనిసరిగా ధృవీకరించండి.
సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 కు కాల్ చేయండి లేదా https://t.co/2wrINFG5BB లో ఫిర్యాదు చేయండి.
#TelanganaPolice #CyberSecurityBureau #InvestmentFraud #CyberSafety #ThinkBeforeYouInvest
Drugs don't just destroy lives they steal dreams, opportunities, and futures. Every decision you make today shapes the life you live tomorrow.
Let's work together towards a healthier, safer, and drug-free Telangana.
#SayNoToDrugs#DrugFreeTelangana#TelanganaPolice
Phishing messages often look genuine-whether it's a bank KYC update or urgent account alert. One careless click can compromise your personal and financial information. Always verify the source before sharing any details or clicking links.
#StopPhishing#TelanganaPolice
#అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల పోలీస్ వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీలో పట్టణములో గల అన్నీ విద్య విద్యాసంస్థల విద్యార్థులతో నిర్వహించిన అవగాహ�� కార్యక్రమంలో పాల్గొన్నారు.
నూతన ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన సీపీ
వరంగల్ పోలీస్ కమిషనర్ శ్రీ సన్‌ప్రీత్ సింగ్ సుబేదారి మహిళా పోలీస్ స్టేషన్-1లో నూతన ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించి అవసరమైన మౌలిక వసతులపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం రంగంపేట మహిళా పోలీస్ స్టేషన్-2లో కొనసాగుతున్న ఫ్యామిలీ కౌన్సిలింగ్ కేంద్రాన్ని సందర్శించి కేసుల పరిష్కార విధానం, రికార్డులు, కౌన్సిలర్ల పనితీరును సమీక్షించారు.
CP Warangal Inspects Site for New Family Counselling Centre
Warangal Police Commissioner Sunpreet Singh, IPS, inspected the proposed site for a new Family Counselling Centre at Women Police Station-1, Subedari, and reviewed the required infrastructure and facilities. The CP later visited the existing Family Counselling Centre at Women Police Station-2, Rangampet, and examined case resolution procedures, records, and the performance of counsellors.
@TelanganaDGP@TelanganaCOPs
మైనర్లకు వాహనం ఇచ్చి చట్టపరమైన చిక్కుల్లో పడోద్దు.
-వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్.
వాహనదారులు మైనర్లకు వాహనం అందజేసి వారి కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలకు వాహన యజమాని చట్టపరమైన చిక్కుల్లో పడోద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల ��ివారణకై ప్రతి పోలీసు అధికారి నిరంతరం కృషి చేయడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం, కార్యక్రమాలను నిర్వహిస్తున్న కొంత మంది వాహనదారుల బాధ్యతరాహిత్య కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతునే వ��న్నాయి. ప్రధానం ఈ రోడ్డు ప్రమాదాలు అధికంగా మైనర్ వాహనదారుల కారణంగా అధికంగా జరుగుతున్నాయి. గత రెండు రోజుల క్రితం పర్వతగిరి పోలీస్ స్టేషన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వృద్దులతో పాటు, ఒక మైనర్ బాలుడు మరణించగా, మరో మైనర్ బాలుడు తీవ్ర గాయలతో ప్రస్తుతం చికిత్స పోందుతున్నాడు. ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణంగా మైనర్ బాలుడు అతి వేగంగా వాహనం నడుపుతూ ఇద్దరు వృద్దులు ప్రయాణిస్తున్న ��్విచక్ర వాహనాన్ని అతి వేగంగా ఢీ కోట్టడం కారణంగానే సంఘటన స్థలంలోనే మైనర్ బాలుడితో పాటు ఏ పాపం ఎగురుగని ఇద్దరు వృద్దులు మరణించారు. ఈ సంఘటన చాలా బాధకరమైన విషయం. ఈ సంఘటనపై ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయమని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి వుండాలని, ముఖ్యంగా మైనర్లకు వాహనం అందజేయడం చట్టరీత్యా నేరమని, ఇలా మైనర్లకు వాహనం అందజేయడం ద్వారా మైనర్ల డ్రైవింగ్ కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాలకు వాహన యజమాని లేదా మైనర్ తల్లిదండ్రులు బాధ్యులుగా చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో వారిని జైలులు తరలించడం కూడా జరుగుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ వాహనదారులను హెచ్చరించారు. ఇకనైన వాహనదారులు తమ వాహనదారులు మైనర్ డ్రైవర్లకు వాహనాలు అందజేయడం లేదా వారిని ప్రోత్సహించవద్దని పోలీస్ కమిషనర్ వాహనదారులకు హితవు చేసారు.
@TelanganaDGP @TelanganaCOPs
మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో ఫేక్ ప్రొఫైల్స��తో జాగ్రత్త. అందమైన ఫోటోలు పెట్టి ఆకర్షిస్తారు. తియ్యటి మాటలతో మీ వివరాలు సేకరించి మోసాలు చేస్తారు. ఇన్వెస్టిమెంట్స్తో లాభాలు అంటూ ఎవరైనా మీకు తియ్యటి మాటలు చెప్తే అస్సలు నమ్మొద్దు.
#TelanganaPolice #matrimonialscams
సైబర్ మోసాలపై మీ చిన్నారులకు అవగాహన పెంచండి. ఆర్ధిక సంబంధిత మోసాలు జరిగే తీరుతో పాటూ, వాటి బారిన పడుకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించండి. అంతేకాదు ఆన్లైన్ గేమ్స్ మాటున ఉండే సైబర్ మోసాలను కూడా వివరించండి. వారి వెబ్ యాక్టివిటీని తరచూ పరిశీలించండి.
#telanganapolice
ఎంత అర్జెంటు అయినా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయొద్దు. ఒక్క పది నిమిషాలు పక్కకు ఆగి ఫోన్ మాట్లాడండి. మిమ్మల్ని నమ్ముకొని కుటుంబం ఉందని గుర్తుంచుకోండి. ఫోన్లో రీల్స్ చూస్తూ డ్రైవింగ్ చేయడం, రీల్స్ చేస్తూ వాహనాలు నడపడం చాలా ప్రమాదకరం.
#telanganapolice#ArriveAlive
మీ క్రెడిట్/ డెబిట్ కార్డు సేవలు నిలిచిపోతాయంటూ వచ్చే కాల్స్ పై అప్రమత్తంగా ఉండండి. నకిలీ కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి జరుగుతున్న మోసాలివి. ఇలాంటి కాల్స్ వస్తే తక్షణమే సంబంధిత బ్యాంకును సంప్రదించండి.
#TelanganaPolice#BeAlert#FakeCallCenters#CyberCrime