బైక్ మీద ముగ్గురు వెళ్తే ఫైన్,
ఆటోలో నలుగురు పోతే ఫైన్,
మంచిదే...
మరి ఆర్టీసీ బస్సులో 40 సీట్లు మాత్రమే ఉంటే, ఎందుకు పరిమితి మించి అనుమతిస్తున్నారు?
ప్రాణాలకు తెగించి ఫుట్ బోర్డు ప్రయాణం చేస్తుంటే ఎందుకు అనుమతిస్తున్నారు?
అంటే మీకు అనుకూలంగా రైట్,
లేదంటే రాంగ్..
గ్రేట్ రూల్స్
@KTRBRS కొట్టుకు పోయింది అని దుష్ప్రచారం చేసిన వాళ్ళకి చెంపపెట్టు సమాధానం. తెలంగాణ ప్రజలారా.. ఇప్పటికైనా కళ్లు తెరిచి చూడండి. గోదావరి నదికి అడ్డంగా మేడిగడ్డ సగర్వంగా ఎలా నిలబడ్డదో..
ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్టులు అయితే ఇట్లనే ఉంటది. జర్నలిజం అనేది ఉద్యోగం కాదు. వృత్తి. బాధ్యత. టీచర్, లాయర్, డాక్టర్, జర్నలిస్ట్.. ఇవన్నీ వృత్తి. రిటైర్మెంట్ ఉండదు. లాభాల గురించి ఆలోచించ వద్దు. సమాజానికి మంచి చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లు మాత్రమే ఇందులోకి రావాలి.
చెప్పేది కొండంత ..చేసేది గోరంత కూడా లేదు అన్నట్లుంది సీఎం రేవంత్ రెడ్డి తీరు.
ఎల్బీస్టేడియం వేదికగా నర్సింగ్ ఆఫీసర్ లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేశారు. ఊహించినట్లు గానే తామే రిక్రూట్మెంట్ చేసినట్లు డబ్బా కొట్టుకున్నారు.
ఎన్నికల ప్రచారం లో కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను వంచిందని కల్లి బొల్లి మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి, బీ ఆర్ ఎస్ ప్రభుత్వ హయం లో జరిగిన నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియ ను తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ తన అబద్దాల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.
ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చి, నియామక పత్రాలు ఇచ్చారా రేవంత్ రెడ్డి చెప్పాలి.
మాకు కుళ్ళు లేదు కడుపులో నొప్పి లేదు. సొమ్మొక్కడిది సోకు ఇంకొకడిది అన్నట్టు ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వడం లో రేవంత్ వ్యవహరించిన తీరునే తప్పు బడుతున్నాం.
కేసీఆర్ గారి హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ఈ నర్సుల నియామక పత్రాలు ఇచ్చిన విషయాన్ని మరచిపోవద్దు. నర్సులుగా ఉద్యోగాలు పొందిన వారికి కూడా వాస్తవాలు తెలుసు.
తెల్లారితే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తారనుకున్న నిరుద్యోగుల ఆశలపై రేవంత్ రెడ్డి నీళ్ళు చల్లారు. అయన ప్రసంగంలో దీని గురించి ఒక్క మాట లేదు.
ఎన్నికల సమయంలో ఫిబ్రవరి 1 వ తారీఖున గ్రూపు 1 నోటిఫికేషన్ ఇస్తామని ప్రచారం చేశారు. పత్రికల్లో మొదటి పేజీలో ప్రకటనలు గుప్పించారు. ఇప్పుడు నోరూమెదపడం లేదు.
మేము యదార్థం చెబితే, శాపనార్థాలు అని మాట్లాడారు తప్ప నోటిఫికేషన్ల గురించి చెప్పలేదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్ని నీటి మూటలే అని రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించారు.
రూ. 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు పెంపు, రూ. 500 లకు సిలిండర్, 4000 నెలవారీ పించన్, మహాలక్ష్మి ద్వారా రూ. 2500, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుద్యోగ భృతి వంటి అమలు కానీ హామీల లిస్ట్ లో నేడు జాబ్ క్యాలెండర్ కూడా చేరింది.
అసలు ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల బాధల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడిది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసింది 10 వేల ఉద్యోగాలు మాత్రమే కాదా? అపుడు నిరుద్యోగ యువత ను మోసం చేసింది చాలక ఇపుడు మరో సారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నది ఎవరు?
ఉద్యోగ నియామకాల్లో మా ప్రభుత్వం రికార్డు సృష్టించింది. తొమ్మిదనరేళ్లలో లక్షా 65 వేల ఉద్యోగాలను భర్తీ చేయగా, మరో 40 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ వివిధ దశల్లో ఉన్నది వాస్తవం కాదా..?
కేసీఆర్ ప్రభుత్వం మీద ఉద్యోగాల భర్తీకి సంబంధించి రేవంత్ మాట్లాడినదంతా వట్టి డొల్ల అని నేటి కార్యక్రమం రుజువు చేసింది.
2 లక్షల ఉద్యోగాల భర్తీ కి మీరు చేసిన వాగ్ధానాన్ని నిలుపుకుంటే స్వాగతిస్తాం. సీఎం హోదా లో తప్పుడు మాటలు చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టవద్దు .రోజూ అబద్దాలు మాట్లాడే రేవంత్ కు కనీసం కాంగ్రెస్ అధిష్టానం అయినా గడ్డి పెట్టాలని కోరుతున్నా..
కాంగేయులా
కాలకేయులా?
కాంగ్రెస్ అనే శనేశ్వరం పోయింది
కాళేశ్వరం అనే ప్రాజెక్టు వచ్చింది. అందుకనే సూర్యాపేట జిల్లా కాల్వల్లో గోదావరి నీళ్లు పారుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నయి
కండ్లుండీ చూడలేని పార్టీ కాంగ్రేస్ పార్టీ
మంత్రి @BRSHarish#KaleshwaramProject
జూన్ 2, ఏప్రిల్ 30 ఇవి రెండూ చారిత్రక సందర్బాలే.
స్వరాష్ట్రం సాధించుకోగా, నాలుగు కోట్ల హృదయాల్లో ఉప్పొంగిన సంబురం అది.. వివక్షల పునాదులు పెకిలించి, నూతన సచివాలయం నిర్మించుకున్న 4 కోట్ల మనస్సుల ఆత్మగౌరవ ప్రతీక ఇది..
సచివాలయ భవనాన్ని చూస్తే నడిగడ్డ మీద కేసీఆర్ నిలబడ్డట్టే ఉన్నది.