Official account of singireddy niranjanreddy (EX Minister for Agriculture & marketing, Co Operative). Government of Telangana. India. Ex MLA from Wanaparthy
ఆధునికత,
సాంకేతికత,
పాలనాదక్షత,
మానవీయతల కలబోత
నేటి, రేపటి తరం అవసరాలను పసిగట్టి, పనిచేసే దక్షత గలిగిన నాయకుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి, రెండున్నరేళ్లుగా పాలమూరు-రంగారెడ్డి పైన ఒక్క సమీక్ష చేయకుండా,
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను ఎందుకు పడావు పెట్టాడో సమాధానం చెప్పాలి.
74 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ కు పాలమూరుకు వెళ్లడానికి సమయం దొరకాలేదా?
నాడు బీఆర్ఎస్ హయాంలోనే 68 టీఎంసీల సామర్ధ్యం ఉన్న నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను నిర్మించాం.
145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంపులను ఉపయోగించడం ప్రపంచంలోనే మొదటిసారని విదేశీ నిపుణులే ప్రశంసిస్తే..
ప్రాజెక్ట్ నిర్మాణం అడ్డుకునేందుకు కోర్టులు, ట్రిబ్యునళ్లలో అనేక కేసులు వేసి అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు.
- మాజీ మంత్రి @SingireddyBRS
తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శాట్స్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిశోర్ గౌడ్, బీఆర్ఎస్ నేత గౌతమ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
@SingireddyBRS
🔹 కేసీఆర్ నాయకత్వంలోనే పాలమూరు ముఖచిత్రం పూర్తిగా మారింది.
🔹 రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పాలమూరుకు ఇచ్చిన బహుమతి మళ్లీ వలసలే. రేవంత్ రెడ్డి తెలంగాణ తడిలేని పొడి మనిషి.
🔹 ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమైక్యవాది అని ఉద్యమ సమయంలోనే స్పష్టమయింది.
🔹 గత రెండున్నరేళ్లలో పాలమూరు ప్రాజెక్టులలో రేవంత్ ప్రభుత్వం తట్టెడు మట్టి కూడా ఎత్తింది లేదు. ఏ పనీ చేయకుండానే తాము చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటు.
🔹 తెలంగాణ ఉద్యమంలో పాలమూరు ఆకలిచావులు, అంబలికేంద్రాలు, వలసలు, కరువు, పేదరికం, విధ్వంసమే కథావస్తువుగా మారాయి.
🔹 కేసీఆర్ అచంచల దీక్షతో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత పాలమూరు జిల్లాలో పాత ప్రాజెక్టులు పూర్తి చేసి, చెరువులు, కుంటలు పునర్నిర్మించి, చెక్ డ్యాంల ద్వారా దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు.
🔹 కేసీఆర్ పాలనలో ప్రారంభించిన నార్లాపూర్ పంపును 34 నెలలుగా పక్కనపెట్టి, ఇప్పుడు మళ్లీ ప్రారంభించి రేవంత్ రెడ్డి వచ్చాకే అక్కడ పనులు ప్రారంభించినట్లు చిత్రీకరిస్తున్నారు.
🔹 ఉమ్మడి రాష్ట్రంలో విస్మరించిన పెండింగ్ ప్రాజెక్టులను తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన తరువాత యుద్ధప్రాతిపదికన పూర్తి చేశాం.
🔹 కేఎల్ఐ నిర్మాణానికి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు 30 ఏళ్ల సమయం తీసుకుని కేవలం రూ. 2600 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టాయి. దానివల్ల పారింది కేవలం 12 వేల ఎకరాలు మాత్రమే. కానీ, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు రూ. 3 వేల కోట్లు ఖర్చు పెట్టి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చారు.
🔹 సమైక్య రాష్ట్రంలో కలిపిన పాపానికి పాలమూరు రైతాంగం, ప్రజలు రెండు తరాల జీవితాన్ని కోల్పోయారు.
🔹 హైదరాబాద్ రాష్ట్రంలో బూర్గుల రామకృష్ణారావు హయాంలో 174 టీఎంసీల సామర్థ్యంతో తలపెట్టిన ప్రాజెక్టులను, సమైక్య రాష్ట్రం ఏర్పడిన వెంటనే నీలం సంజీవరెడ్డి పాలనలో రద్దు చేశారు.
🔹 బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మూలంగా నీటి కేటాయింపులను 20 టీఎంసీల నుండి 18 టీఎంసీలకు, ఆ తర్వాత 11 టీఎంసీలకు కుదించారు. దీనివల్ల ఆరున్నర టీఎంసీల జూరాల, నిజాం పాలనలోని ఆర్డీఎస్ ద్వారా 80 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరు దక్కింది.
🔹 కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సోర్స్ గా శ్రీశైలం బ్యాక్ వాటర్ ను ఎంచుకుని కేవలం ఎనిమిది నెలల్లో ఎస్టిమేట్స్ పూర్తి చేశారు. 15 జూన్ 2015న రాష్ట్ర ప్రభుత్వ నిధులతో శంకుస్థాపన చేశారు.
🔹 ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగకుండా కాంగ్రెస్ పార్టీ భూసేకరణకు అడ్డుతగిలింది. అయినా రైతులను ఒప్పించి 27 వేల ఎకరాల భూసేకరణ పూర్తి చేశాం. మిగిలింది 160 ఎకరాలు మాత్రమే. అడ్డంకులను అధిగమించి 90 శాతం పనులను పూర్తి చేశాం.
🔹 భూసేకరణ మొత్తం పూర్తయినా, రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నా... "భూసేకరణ కానిదే రిజర్వాయర్లు ఎలా నింపాలి?" అంటూ రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. జరిగిన పనులు రైతాంగానికి తెలియవనే భ్రమలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇది అహంకారమా? అపరిపక్వతా? బాధ్యతారాహిత్యమా? అజ్ఞానమా?
🔹 రేవంత్ రెడ్డి ప్రాపకం కోసం కొందరు కాంగ్రెస్ నేతలు "మీరు సమీక్ష చేశాకే పాలమూరులో నీళ్లు పడ్డాయి" అని భజన చేస్తున్నారు. రెండున్నరేళ్లు పాలమూరు వైపు కన్నెత్తి చూడడానికి రేవంత్ రెడ్డికి సమయం చిక్కలేదు. 74 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ కు పాలమూరు వెళ్లడానికి సమయం దొరకలేదు.
🔹 తెలంగాణ భవన్ నుండి అనేక సార్లు నిలదీస్తే రేవంత్ రెడ్డి రెండు రోజులు పర్యటించి, మొక్కుబడి సమీక్ష చేశారు. కానీ ఏ పని ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు.
🔹 బీఆర్ఎస్ హయాంలోనే 68 టీఎంసీల సామర్థ్యం ఉన్న నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను నిర్మించాం. ఈ రిజర్వాయర్ల దూరం 75 కిలోమీటర్లు. 11.5 మీటర్ల వ్యాసార్థం ఉన్న 120 కిలోమీటర్ల టన్నెళ్లను నిర్మించాం. 63 కిలోమీటర్ల ఓపెన్ కెనాళ్లను పూర్తి చేసి, 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న 34 పంపులను బిగించడం జరిగింది.
🔹 145 మెగావాట్ల సామర్థ్యం ఉన్న పంపులను ఉపయోగించడం ప్రపంచంలోనే మొదటిసారి. వీటిని చూడడానికి విదేశీ నిపుణులు కూడా వచ్చారు. నాలుగు పంపింగ్ స్టేషన్ల వద్ద నాలుగు 400 కేవీ విద్యుత్ కేంద్రాలు నిర్మించాం. 250 కిలోమీటర్ల టవర్ లైన్ల నిర్మాణం పూర్తి చేశాం. భూగర్భ పంపింగ్ కేంద్రాలను అంతర్జాతీయ జల నిపుణులు ప్రశంసించారు.
🔹 కాంగ్రెస్ పార్టీ దీని నిర్మాణాన్ని అడ్డుకునేందుకు అనేక కోర్టులు, ట్రిబ్యనళ్లలో కేసులు వేసింది. అయినా ప్రజల జీవితాల్లో మార్పు రావాలన్న లక్ష్యంతో పనిచేశాం తప్పితే ప్రచారం కోసం వాడుకోలేదు.
🔹 120 టీఎంసీల కోసం పాలమూరుకు ఇదివరకే జీఓలు విడుదల చేయడం జరిగింది. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే డిండికి 40 టీఎంసీలకు అనుమతులు తీసుకురావాలి.
🔹 కృష్ణా నది మీద ఆధారపడి ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు 580 టీఎంసీల నీళ్లు కావాలి. తాగునీరుతో కలుపుకుంటే 600 టీఎంసీల నీళ్లు అవసరం.
🔹 పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం కాంగ్రెస్ కనీసం రూ. 500 లేదా రూ. 600 కోట్లు ఖర్చు చేసి ఉంటే ఇప్పటికే అందుబాటులో ఉన్న రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండేది.
🔹 కన్నెపల్లి నుండి పంపులు ప్రారంభించవచ్చని సామాన్యులు చెబుతున్నా, కాళేశ్వరం మీద కక్షతో అక్కడ రైతులు అలమటించేలా చేస్తున్నారు. ఈ గత రెండున్నరేళ్లలో పనులు చేసి ఉంటే ఈ కరువులో రైతులకు సాగునీరు అందుబాటులో ఉండేది.
🔹 రేవంత్ రెడ్డి పాలమూరు పనులను పరుగులు పెట్టిస్తాడని ప్రజలు ఆశించారు. పనులను పడావు పెట్టడానికే రేవంత్ రెడ్డి కావాలా? రెండున్నరేళ్లు పనులు ఆపినా ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రేవంత్ రెడ్డిని ప్రశ్నించలేదు.
🔹 పాలమూరు కాలువల టెండర్లు రద్దు చేసి రేవంత్ రెడ్డి కొడంగల్ ఎత్తిపోతల చేపట్టాడు. దాంతో పాటు ఇక్కడ ఒక రూ.600 కోట్లు ఖర్చు చేసి ఉంటే ఐదు రిజర్వాయర్లు నింపుకునే అవకాశం ఉండేది
🔹హైదరాబాద్ నుండి మీడియా మిత్రులను తీసుకువెళ్లి పాలమూరు పనులను చూయించింది మంత్రి జూపల్లి క్రిష్ణారావు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ కేసీఆర్ పాలనలో ఏం చేయలేదు అని చెబుతున్నాడు.
🔹ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటూ కేసీఆర్ పాలనలో ఏం చేయలేదని మాట్లాడటం సరికాదు.
🔹పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి... పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులను ఎందుకు పడావు పెట్టాడో సమాధానం చెప్పాలి.
🔹 "ఇంటి పేరు నీళ్లు అని పెట్టుకున్నాయన ఎప్పుడైనా మీ బడికి వచ్చాడా?" అని రేవంత్ రెడ్డి నిన్న కొత్తకోట పర్యటనలో విద్యార్థులను అడిగాడు. మేము తిరిగిందే కాలువలు, చెరువులు, నీళ్లు, బడుల వెంట. దానికి మాకు ఎవరూ సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు.
🔹 బీఆర్ఎస్ హయాంలో విద్యావ్యవస్థ నాశనమైందని రేవంత్ అన్నాడు. కానీ నిన్న రేవంత్ రెడ్డితో మాట్లాడిన విద్యార్థిని కేసీఆర్ పెట్టిన గురుకుల పాఠశాల విద్యార్థిని కావడం గమనార్హం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత విద్య కోసం చేసింది ఏమీ లేదు.
🔹 రూ. 107 కోట్లతో పాలెంలో వ్యవసాయ కళాశాలను కేసీఆర్ గారి చేత ప్రకటింపచేశాం. వనపర్తిలో అగ్రికల్చర్, కొల్లాపూర్ లో హార్టికల్చర్ కళాశాల, నారాయణపేటకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలు ఇచ్చాం. పీజీ సెంటర్ వచ్చింది.
🔹 పాలమూరులో రూ. 450 కోట్లతో మెడికల్ కళాశాల మొదటి దశ పూర్తి చేశాం. తర్వాత అన్ని జిల్లా కేంద్రాలలో మెడికల్, నర్సింగ్ కళాశాలలు, ఎస్సీ గురుకులాల డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్, మత్స్య కళాశాలలు తీసుకువచ్చాం. కేసీఆర్ హయాంలో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో విద్యార్థులు హిమాలయాలు అధిరోహించారు.
🔹 'మన ఊరు - మన బడి' పథకం కింద రూ. 7 వేల కోట్లతో భవనాలు నిర్మిస్తే, కక్షగట్టి ఈ ప్రభుత్వం వాటి బిల్లులు ఇవ్వడం లేదు. 26 వేల బడులను నాలుగు వేలకు కుదిస్తామని చెబుతున్నారు. కార్పొరేట్ పాఠశాల ప్రారంభానికి వెళ్లి ప్రభుత్వ ఉపాధ్యాయులను అవమానించారు. ప్రైవేటు ఆసుపత్రుల ప్రారంభానికి వెళ్లి "మీ 100వ బ్రాంచ్ ను కూడా నేనే ప్రారంభించాలి" అని సీఎం చెప్పారు.
🔹 కేసీఆర్ పాలనలో జరిగిన ప్రగతిని కొనసాగించకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విద్య, మున్సిపల్ శాఖల నిర్వహణలో విఫలమైనట్లు రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడు. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి మాటలను చూసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
🔹 అనవసర భేషజాలకు పోయి మొండి పట్టుదలతో పనులను పడావు పెట్టొద్దు. కాళేశ్వరం పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి. పాలమూరు పనులు పూర్తి చేసి రిజర్వాయర్లు నింపాలి.
అంగుష్ఠమాత్రుడి అసమర్థ పాలన❗
అధికారం చేతిలో ఉందనే అహంకారంతో రేవంత్ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. కానీ తన రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దుర్మార్గం. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు ఇంకెవరైనా చేస్తే పోలీసులు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. ఇలాంటి మాటలను, చర్యలను కోర్టులు సుమోటోగా స్వీకరించాలి.
ప్రజల పట్ల చిత్తశుద్ధి లేని, పాలన పట్ల అనుభవంలేని అంగుష్ఠమాత్రుడైన ఇలాంటి వ్యక్తిని తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రజల నెత్తిన కాంగ్రెస్ అధిష్ఠానం రుద్దడం దారుణం. కాంగ్రెస్ చేస్తున్న ఈ తప్పులకు భవిష్యత్తులో తెలంగాణ సమాజానికి జవాబు చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. చరిత్రలో రేవంత్ తెలంగాణ ద్రోహిగా నిలబడక తప్పదు.
వ్యాసకర్త: మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
భూమి మీద ఉన్న అన్ని జీవులకు నీరు అత్యంత అవసరం. అందుకే నీరు నాగరికతను ప్రభావితం చేసింది. నీరు కేవలం ఒక పదార్థం కాదు. అది జీవితం. అది సంస్కృతి. అది అభివృద్ధికి మూలం. నీటిని సక్రమంగా ఉపయోగించకపోతే నాగరికతలు కూలిపోవచ్చు. దానికి చారిత్రక ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసి, దేశ నిర్మాణంలో విశిష్ట సేవలందించిన మహోన్నత నాయకుడు
బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే ఘన నివాళులు
గౌరవనీయులైన ముఖ్యమంత్రి @revanth_anumula గారికి,
విషయం: తుంగభద్ర జలాల్లో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను తక్షణమే విరమించాలి – తుంగభద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలి.
@TelanganaCMO@UttamINC
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధాన్యం కొనుగోళ్ల గురించి రేవంత్ రెడ్డి పొడుగు పొడుగు మాటలు మాట్లాడి,
ఇప్పుడు కేంద్రం చెప్పిన మేరకు తప్ప అదనంగా ఒక్క గింజ కూడా కొనమంటూ చేతులు ఎత్తేశాడు.
అప్పుడు రేవంత్ మాట్లాడిన మాటలు.. ఇప్పుడు ఆయనకు, ఆయన ప్రభుత్వానికి వర్తిస్తాయి.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. దద్దమ్మ ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, నేరపూరిత ప్రభుత్వం.
- మాజీ మంత్రి @SingireddyBRS
తెలంగాణ రాష్ట్రం కోసం అనునిత్యం పరితపించి, మన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి, మలిదశ ఉద్యమానికి సిద్దాంతకర్తగా నిలిచిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే ఘన నివాళులు
పాలమూరు ప్రాజెక్టును పూర్తిగా సొంత రాష్ట్ర నిధులతో చేపట్టిన ఘనత కేసీఆర్ గారిది.. పాలమూరుపై కేసీఆర్ కు ఉన్న ప్రేమలో ఇసుక రేణువు అంత కూడా రేవంత్ రెడ్డికి ఎప్పుడూ లేదు.
రియల్ ఎస్టేట్, మూసీ ప్రాజెక్టుల మీద ఉన్న శ్రద్ద
పాలమూరు ప్రాజెక్టుల మీద, పాలమూరు ప్రజల బతుకుల మీద లేదు.
కేసీఆర్ గారు అద్భుతంగా పరుగులు పెట్టించిన పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది.
- మాజీ మంత్రి @SingireddyBRS🔥
జాతీయ, అంతర్జాతీయ సూత్రాల ఆధారంగా తెలంగాణకు రావాల్సిన నీళ్లను తీసుకొస్తా అనకుండా..
చంద్రబాబు NOC ఇవ్వాలి అంటున్నావ్..
NOC ఇవ్వడానికి చంద్రబాబు ఎవరు?
తెలంగాణ వ్యతిరేక ప్రయోజనాల కోసం పనిచేసిన IAS అధికారిని తీసుకొచ్చి,
సాగునీటి రంగ సలహాదారునిగా ఎందుకు పెట్టుకున్నావ్?
నువ్వు ప్రభుత్వాధినేతవా లేక పైరవీకారుడివా రేవంత్?
- మాజీ మంత్రి @SingireddyBRS
❇️ పాలమూరు పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల్లో జరిగిన పనులపై చేసిన ఆరోపణలను ఖండించిన మాజీ మంత్రి @SingireddyBRS
🔹పాలమూరు గడ్డ సాక్షిగా రేవంత్ పచ్చి అబద్ధాలు
🔹 పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కేసీఆర్ హయాంలో రూ. 35,200 కోట్ల పనులు చేసింది నిజం కాదా?
🔹 పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు వ్యతిరేకంగా వందల కేసులు వేసింది కాంగ్రెస్ పార్టీ కాదా?
🔹 రూ. 27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని రేవంత్ స్వయంగా ఒప్పుకున్నాడు
🔹 రూ. 52,121 కోట్లు సాగు నీటి ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకు వడ్డీ, అసలు కింద చెల్లించామని చెబుతున్న రేవంత్ రెడ్డి.. దమ్ముంటే దానికి సంబంధించిన వివరాలు విడుదల చేయాలి
🔹 ఒక టీఎంసీకి వరి వేస్తే ఆరు వేల ఎకరాలు, ఒక టీఎంసీకి వేరుశనగ, మిర్చి, ఉద్యాన పంటలు, మొక్కజొన్న పంటలు వేస్తే పదివేల ఎకరాలు, డ్రిప్, స్ప్రింక్లర్ ఉపయోగించి పంటలు పండిస్తే 15 వేల ఎకరాలుగా లెక్క కడతారు
🔹 పాలమూరు పర్యటనలో మీడియా ప్రశ్నకు టీఎంసీ అంటే గతంలో పదివేల ఎకరాలుగా, ఇప్పుడు 15 వేల ఎకరాలుగా లెక్క కడుతున్నారని చెప్పడం మరో పచ్చి అబద్ధం
🔹 ఇదే మాట కేంద్ర జలసంఘం సమావేశాల్లో చెబితే పరువు పోవడమే కాకుండా, టీఎంసీకి 15 వేల ఎకరాలు లెక్కగట్టి కేటాయిస్తే తెలంగాణ శాశ్వతంగా నీటి హక్కులు కోల్పోతుంది
🔹 రేవంత్ రెడ్డి అబద్ధాల లెక్కలు నమ్ముకుంటే రాష్ట్ర రైతాంగం డ్రిప్పులు, స్ప్రింక్లర్ల మీదనే ఆధారపడాలి
🔹 పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాల్వల టెండర్లు రద్దు చేయడం కారణంగా ఇప్పుడు రూ.4 వేల కోట్ల భారం పెరగడం నిజం కాదా?
🔹 దశాబ్దాల పాటు కాంగ్రెస్ హయాంలో పెండింగ్ లో పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేసింది కేసీఆర్ పాలనలోనే కాదా?
🔹 కమీషన్ల కోసమే పంపులు, లిఫ్టులు పూర్తి చేశారని రేవంత్ చెప్పడం ఆయన అజ్ఞానానికి, అవగాహనా రాహిత్యానికి నిదర్శనం
🔹 ఎత్తిపోతల పథకాల్లో మొదట చేయాల్సింది పంపులు, లిఫ్టు పనులే .. ఈ మాత్రం అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడాడు
🔹 కాంగ్రెస్ హయాంలో కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు, భీమా తదితర పథకాల్లో మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని కాలువలు తవ్వి పంపులు, లిఫ్టు పనులను గాలికి వదిలేసి వెళ్లిపోయారు
🔹 ఇప్పటికీ అప్పటి పనులు రద్దు చేయలేని, కొనసాగించలేని పరిస్థితి నెలకొన్నది
🔹 2006లో కాంగ్రెస్ వదిలేసిన కేఎల్ఐ ఎత్తిపోతల పనులను 2016లో బీఆర్ఎస్ పూర్తి చేసింది వాస్తవం కాదా?
🔹 పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం 27,100 ఎకరాల భూసేకరణకు గాను 26,800 ఎకరాలు కేసీఆర్ హయాంలోనే సేకరించడం జరిగింది. భూసేకరణలో మిగిలింది 300 ఎకరాలు మాత్రమే
🔹 భూసేకరణ చేయలేదని రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటు. ఆర్టీఐలో ఆరితేరిన రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖకు దరఖాస్తు చేసి వివరాలు తెప్పించుకోవాలి
🔹 కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన మొబిలైజేషన్ అడ్వాన్సుల వ్యవస్థను రద్దు చేసింది కేసీఆర్ హయాంలోనే. దాని స్థానంలో చేసిన పనులకు బిల్లులు చేసే పద్ధతి తీసుకువచ్చారు
🔹 పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి 30 నెలల్లో ప్రాజెక్టుల పూర్తి చేసింది ఏంటి?
🔹 30 నెలల్లో మూడు లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్ రెడ్డి అప్పుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది
🔹 తెలంగాణ అప్పుల గురించి రేవంత్ రెడ్డి రెండేళ్లుగా చెబుతున్న అబద్ధాలను కాగ్ నివేదిక స్పష్టం చేసింది
🔹 30 నెలల్లో పాలమూరు ప్రాజెక్టుల్లో తట్ట మట్టి ఎత్తకుండా తీరిగ్గా పరిశీలనకు వచ్చిన రేవంత్ రెడ్డి పాత అబద్ధాలనే వల్లె వేశాడు
🔹 30 నెలల్లో రేవంత్ రెడ్డి ఏం పనులు చేశాడని బీఆర్ఎస్ అడ్డుకున్నది. వీలైనంత వేగంగా పనులు పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలనే బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది
🔹 పాలమూరు పర్యటనలో ఇన్ని మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి కేంద్రం వెనక్కి పంపిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీపీఆర్ గురించి ఎందుకు మాట్లాడలేదు?
🔹 సీఎం స్థాయిని మరచి రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటనలో అబద్ధాలు, అనుచిత వ్యాఖ్యలు చేశారు
🔹 వలసల పాలమూరులో సాగునీరు పారించి, వలసల జిల్లాకే వలసలు వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్ ది
🔹 అబద్ధానికి అంగీ, లాగు వేస్తే అది రేవంత్ రెడ్డి. ప్రాజెక్టుల మీద, పాలమూరు మీద ఆయనకున్న అవగాహన శూన్యం
🔹 రేవంత్ రెడ్డి అబద్ధాలకు కాలం చెల్లింది.. మిగిలిన పదవీకాలం అయినా నిజాలు మాట్లాడితే బాగుంటుంది
🔹 ఈ అబద్ధాలు చెప్పడానికి రెండు రోజుల పర్యటన ఎందుకు? హైదరాబాద్ లోనే ఇదే స్క్రిప్టు చదివితే ప్రజలకు కొంచెం భారమైనా తగ్గేది
పాలమూరు బిడ్డను అని చెప్పుకునే వ్యక్తి పుట్టిన గడ్డ దురవస్థ గురించి మౌనం వహించడం తగిన పనేనా ? బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించడం, పాదయాత్ర చేస్తామని హెచ్చరించడంతో రేవంత్ రెడ్డి పాలమూరు ప్రాజెక్టుల పరిశీలనకు బయలుదేరారు. ఇది రాజకీయ వత్తిడితో చేస్తున్న ‘డ్యామేజ్ కంట్రోల్’ యాత్ర మాత్రమే
ప్రాంతీయవాదం ఉగ్రవాదం అయితే మీరే ఉగ్రవాదులు అవుతారు
రాచరికపు పాలన పోయి తెలంగాణ దేశంలో విలీనం కావాలని పోరాటం చేసిన జాతీయ వాదులు మా తెలంగాణ ప్రజలు
మమ్మల్ని బలవంతంగా ఆంధ్రా ప్రాంతంతో విలీనం చేశారని, విడిపోవాలని పోరాడారు తప్ప మా ప్రజలు ప్రాంతీయవాదులు కాదు
పక్కా రాష్ట్రాల వాళ్లు మనల్ని వెక్కిరిస్తుంటే మౌనంగా చూస్తున్న రేవంత్ రెడ్డి పెద్ద ద్రోహి
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మద్రాస్‌తో కలిసి ఉన్న ఆనాటి ఆంధ్ర..
ప్రాంతీయ వాదంతో మద్రాస్‌తో విడిపోయింది.
ప్రాంతీయ వాదం నిజంగా ఉగ్రవాదం అయితే మీరే ఉగ్రవాదులు..
ఇతరులు కాదు.
మా తెలంగాణ వాదం నిజమైన జాతీయ వాదం.
అంతిమంగా ఈ ప్రాంతం భారతదేశంలో విలీనం కావాలని,
జాతీయత కోసం పాటుపడిన సమాజం.. తెలంగాణ సమాజం.
- మాజీ మంత్రి @SingireddyBRS 🔥
తెలంగాణ తల్లి సంకెళ్లు తెంచిన రణధీరుడు🔥
స్వరాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు✊
సాధించిన రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నిలిపిన దార్శనికుడు✌️
తెలంగాణ చిరునామా కేసీఆర్ 🩷
జై తెలంగాణ✊
#TelanganaFormationDay