@SriKrishnaLavu గౌరవనీయులైన ఎంపీ గారికి, వినుకొండ రైల్వే స్టేషన్ లో సమస్యల పరిష్కారానికి మరియు ఎంతో కాలం గా ప్రయాణికులు అభ్యర్థిస్తున్న రైళ్ళు హాల్ట్ గురించి మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం
@drmgnt@SCoRAILWAYVSKP@RailMinIndia Thanks for developing railway https://t.co/1GRKhvSrBE addition to this, please provide stoppages of trains also at station to utilise the facilities.
మా శ్రమను అవమానించకండి... మేము కష్టపడి గెలిచాం!
నోటిఫికేషన్ కోసం ఎదురు చూసిన ప్రతి రోజు మాకు నరకప్రాయమే. సమాజం ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, పండుగలకు ఇంటికి వెళ్లలేక, చిన్న గదుల్లో పుస్తకాలతోనే ప్రపంచం నిర్మించుకున్న జీవితాలు మావి.
2019–24 మధ్య ఒక్క డీఎస్సీ కూడా లేక నిరాశలో గడిపిన మాకు, ఈ ప్రభుత్వం 16,347 పోస్టులతో అవకాశం కల్పించింది. 3.36 లక్షల మంది పోటీ పడిన పరీక్షలో మేము ఎవరి సిఫార్సులతో కాదు, ఎవరి దయతో కాదు, కేవలం మా ప్రతిభతో, మెరిట్‌తో ఉద్యోగాలు సాధించాం.
ఈ విజయాల వెనుక పగలు కూలి చేసి రాత్రిళ్లు చదివిన వారి కన్నీళ్లు ఉన్నాయి. 16 ఏళ్లుగా ప్రయత్నించి గెలిచిన వారి పట్టుదల ఉంది. ఎన్నో అపజయాల తర్వాత విజయం సాధించిన వారి ఆత్మవిశ్వాసం ఉంది. గర్భిణిగా ఉండి చదివి ఉద్యోగం సాధించిన తల్లుల కలలు ఉన్నాయి.
అలాంటి మా విజయాలపై రాజకీయ ఆరోపణలు చేయడం బాధిస్తోంది.
పరీక్షలు అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో జరిగాయి. కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ, మెరిట్ లిస్ట్ ప్రచురణ, సర్టిఫికేట్ వెరిఫికేషన్—అన్నీ పారదర్శకంగా జరిగాయి. రిజర్వేషన్ల నిబంధనలను అర్థం చేసుకోకుండా చేసే ఆరోపణలు వేలాది మంది అభ్యర్థుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
ఒక వ్యక్తిగత కేసును ఆధారంగా తీసుకుని మొత్తం 16,347 మంది భవిష్యత్తుపై అనుమానాలు వేయడం న్యాయం కాదు.
ప్రభుత్వాలను విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు. కానీ ఆ విమర్శల మంటలో మా భవిష్యత్తును బలి చేయకండి.
డీఎస్సీ సెలెక్షన్ వచ్చిందని చెప్పినప్పుడు మా అమ్మ ఆనందంతో ఏడ్చింది. ఆ కన్నీళ్ల విలువ మాకు తెలుసు.
మా కష్టాన్ని గౌరవించండి.
మా ప్రతిభను గుర్తించండి.
మా ఉద్యోగాలను రాజకీయాలకు బలిచేయకండి.
ఇట్లు,
ఓ ఉపాధ్యాయుడు
#MegaDSC2025 #TeacherLivesMatter #MeritWins #APTeachers #DSC2025