24 గంటల్లోనే చైన్ స్నాచింగ్ కేసును ఛేదించిన వేములవాడ పట్టణ పోలీసులు.
వేములవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్.ఆర్.ఆర్ పార్కింగ్ ప్రదేశంలో మహిళ మెడలోని బంగారు మంగళసూత్రాన్ని లాక్కెళ్లిన ఇద్దరు నిందితులను గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేసి,వారి వద్ద నుంచి 20.120 గ్రాముల బంగారు మంగళసూత్రాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించిన వేములవాడ టౌన్ పోలీసులు.
వేములవాడ టౌన్ పోలీసులకు అభినందనలు.
@TelanganaDGP@TelanganaCOPs
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన గ్రామ సభల్లో పోలీస్ అధికారులు #రోడ్డుభద్రత నియమాలు,#సైబర్ మోసాలు, #గంజాయినిర్మూలన,#మహిళలభద్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
@TelanganaDGP@TelanganaCOPs
Attended Grievance Day.... listened to the petitioners and directed the concerned officers to take appropriate action on the received complaints.
@TelanganaCOPs@TelanganaDGP#GrievanceDay#Monday
పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి మంచి మార్కులు సాధించిన జిల్లా పోలీసు అధికారుల,సిబ్బంది పిల్లలను జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అభినందించడం జరిగింది.
ఈకార్యక్రమానికి మొత్తం 40 మంది పోలీసు సిబ్బంది పిల్లలు,వారి తల్లిదండ్రులు హాజరుకగా,విద్యార్థుల కృషి, పట్టుదల, క్రమశిక్షణను ప్రశంసించి భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని విజయాలు సాధించాలని ఆకాంక్షించడం జరిగింది.
ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేవని నిరాశ చెందకుండా, లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని విద్యార్థులకు ప్రోత్సహించను.
పోలీస్ శాఖలో అహర్నిశలు కష్టపడుతూ ప్రజలకు సేవలు అందిస్తూ తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్న తల్లిదండ్రులు కష్టాన్ని పిల్లలకు తెలియజేశాను.
దురలవాట్లకు దూరంగా ఉంటూ ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలకు చేరుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరాను.
విద్యార్థిని,విద్యార్థులకు మెమొంటోలతో పాటుగా బహుమతులు అందజేషి శుభాకాంక్షలు తెలిపాను.
@TelanganaDGP@TelanganaCOPs
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు.
జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ,నేరాల నియంత్రణ లక్ష్యంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.
ఈ డ్రైవ్‌లో ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా మద్యం సేవిస్తున్న 84 మందిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
బహిరంగ మద్యపానం శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతో పాటు ఇతర నేరాలకు దారితీసే అవకాశం ఉన్నందున, శాంతియుత సమాజం కోసం ఇటువంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయి.
@TelanganaDGP@TelanganaCOPs
#SircillaPolice
#SpecialDrive
#PublicSafety
#CrimeControl
మహిళల భద్రతే ధ్యేయం... షీ టీమ్ ఎల్లప్పుడూ మీతోనే.
జిల్లాలో మహిళలు, బాలికలు, విద్యార్థినుల భద్రత కోసం షీ టీమ్ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోంది.
గడిచిన 5 నెలల్లో వేధింపుల కేసుల్లో 14 FIRలు, 16 పెట్టీ కేసులు నమోదు చేసి ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంది.
మహిళ భద్రతకు భరోసా కల్పిస్తూ జిల్లాలో గుర్తించిన హాట్‌స్పాట్స్ వద్ద షీ టీమ్ మఫ్టీలో నిఘా కొనసాగిస్తోంది.
మహిళలు, విద్యార్థినుల్లో చైతన్యం కల్పించేందుకు షీ టీమ్ బృందాలు విద్యాసంస్థలు, మహిళలు పనిచేసే ప్రదేశాలను సందర్శించి మహిళల రక్షణ, ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, పోక్సో చట్టం తదితర అంశాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
వేధింపులు, ఈవ్‌టీజింగ్, వెంబడింపులు ఎదురైతే వెంటనే 📞 8712656425 కు ఫిర్యాదు చేయండి.
@TelanganaCOPs@TelanganaDGP@tg_womensafety
#SheTeam
#WomenSafety
#SircillaPolice
సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నంబర్ ప్లేట్ తొలగింపు, నంబర్ ప్లేట్ మార్ఫింగ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 20 వాహనాలను గుర్తించి జరిమానాలు విధించారు.అనంతరం ఆయా వాహన యజమానుల ఆధ్వర్యంలో నిబంధనలకు అనుగుణంగా నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేయించారు.
@TelanganaCOPs@TelanganaDGP
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన గ్రామ సభల్లో పోలీస్ అధికారులు #రోడ్డుభద్రత నియమాలు,#సైబర్ మోసాలు, #గంజాయినిర్మూలన,#మహిళలభద్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
@TelanganaDGP@TelanganaCOPs
జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ తొలగింపు,నంబర్ ప్లేట్ మార్ఫింగ్‌పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం జరిగింది.
బుధవారం రోజున చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 55 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా, నంబర్ ప్లేట్లు తొలగించిన లేదా కనిపించకుండా మార్ఫింగ్ చేసిన 24 వాహనాలను గుర్తించడం జరిగింది.
మద్యం సేవించి వాహనాలు నడపడం, వాహనాలకు నంబర్ ప్లేట్లు తొలగించడం, నంబర్లను మార్ఫింగ్ చేయడం చట్టరీత్యా నేరం. ప్రతి వాహనదారుడు తన వాహనానికి నంబర్ ప్లేట్‌ను స్పష్టంగా కనిపించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి.
నంబర్ లేకుండా,నంబర్ ప్లేట్‌కు అడ్డుపెట్టడం, సగం నంబర్లు కనిపించేలా ఉంచడం లేదా నంబర్లను మార్ఫింగ్ చేసి వాహనాలు నడిపిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తోసుకోవడం జరుగుతుంది.
రోడ్డు భద్రత మన అందరి బాధ్యత.ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణానికి సహకరించండి.
@TelanganaCOPs@TelanganaDGP
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా తంగాళ్ళపల్లి మండలం తడూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యాను. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై రోడ్డు భద్రత నియమాల పాటింపు, హెల్మెట్ & సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపకుండా ఉండటం, గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీల ద్వారా బ్లాక్ స్పాట్ల గుర్తింపు, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం, మహిళలు మరియు బాలికలు షీ టీమ్ సేవలను సద్వినియోగం చేసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.
@TelanganaDGP@TelanganaCOPs
#సీపీఆర్ తో నిండు ప్రాణం కాపాడిన కోర్టు కానిస్టేబుల్ భాస్కర్.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోర్టు ఆవరణలో అకస్మాత్తుగా గుండె నొప్పితో కుప్పకూలిన ఇల్లంతకుంట మండలం కట్కూరు గ్రామానికి చెందిన వెంకటేశంకు కొనరావుపేట పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ భాస్కర్ వెంటనే #సీపీఆర్ అందించి ప్రాణాపాయం నుంచి బయటపడేలా చేశారు.
పోలీసులకు అందించిన సీపీఆర్ శిక్షణ మరోసారి ఫలించింది. సకాలంలో స్పందించిన కానిస్టేబుల్ భాస్కర్ కు అభినందనలు.
అత్యవసర పరిస్థితుల్లో #సీపీఆర్ ప్రాణాలను కాపాడగలదనే విషయాన్ని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
#CPRSavesLives
@TelanganaCOPs@TelanganaDGP
#EmergencyResponse
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు.ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
@TelanganaCOPs
డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్, ఐపీఎస్ 6,500 మంది అధికారులతో మెగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
నార్కోటిక్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ భద్రతపై దృష్టి సారించాలని సూచిస్తూ 112 కాల్స్‌కు వేగవంతమైన స్పందన, రాత్రి గస్తీ, సమర్థ పోలీసింగ్‌పై మార్గనిర్దేశం చేశారు
#TelanganaPolice
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించిన విద్యార్థులకు పోలీస్ శాఖ విధులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సైబర్ భద్రత, నేరాల నియంత్రణ, ప్రజా భద్రత అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.
విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు సమాజంలో జరుగుతున్న విషయాలపై అవగాహన పెంపొందించుకుని బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించడం జరిగింది.
@TelanganaCOPs@TelanganaDGP
ముస్తాబద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన 101 #సీసీకెమెరాలను ప్రారంభించడం జరిగింది.
నేరాల నియంత్రణ, కేసుల చేదన, నిందితుల గుర్తింపు మరియు శాంతిభద్రతల పరిరక్షణలో #సీసీకెమెరాలు కీలక పాత్ర కీలకం.
ప్రజలు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా #సీసీకెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.
#CCTV
#PublicSafety
#CrimePrevention #CommunityPolicing
#Sircillapolice
#SafeSociety
@TelanganaCOPs@TelanganaDGP