డా. సుంకర వెంకట ఆదినారాయణ రావు గారు ఆత్మకు శాంతి చేకూరాలి
ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా.సుంకర వెంకట ఆదినారాయణ రావు గారు కన్ను మూశారని తెలిసి చింతిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
కొన్ని సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో డా.ఆదినారాయణ రావు, డా.శశిప్రభ దంపతులను వారి నివాసంలో కలుసుకున్నాను. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో వారి తపన, సామాజిక బాధ్యతతో చేస్తున్న కార్యక్రమాలు అర్థమయ్యాయి. దశాబ్దాలుగా వైద్య వృత్తిలో ఉన్న డా.ఆదినారాయణ రావు గారు పోలియోతో బాధపడ్డవారికి అందించిన సేవలు అమూల్యమైనవి. 900కి పైగా పోలియో శస్త్ర చికిత్స శిబిరాలు నిర్వహించారు. పోలియో వ్యాధిగ్రస్తులకు శస్త్ర చికిత్సలు లెక్కకు మిక్కిలి చేశారు. ఎన్నో సేవా, వితరణ కార్యక్రమాలు చేపట్టారు. సమాజానికి ఆయన చేసిన సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారం అందించింది. నవతరం వైద్యులకు డా.ఆదినారాయణ రావు గారు సేవలు స్ఫూర్తినిస్తాయి. డా.శశిప్రభ గారికి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
- @PawanKalyan
Akira Toriyama, creator of the Dragon Ball series has passed away at the age of 68. He is a legend in anime and gaming, his work includes Dr. Slump, Dragon Quest, Chrono Trigger, and other classic works. https://t.co/G9wzWHWHLP