తెలంగాణ ఉద్యమ సహచరుడు, సోదరుడు, అత్యంత ఆప్తుడు, తన సేవలతో, ప్రజల పట్ల అంకితభావంతో చిరస్థాయిగా నిలిపిన మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇక లేరనే వార్త తీవ్ర దిగ్భ్రాంతిని గురిచేసింది. తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
పెద్ది అన్న జీవితమే ఒక పోరాటం, ఉద్యమ దశ నుండి నేటి వరకు తను తన కోసం, తనను నమ్ముకున్న ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నాడు.
ప్రజల మధ్యే జీవించి, ప్రజల కోసమే శ్రమించిన ఆయన సేవలు ఎప్పటికీ మరువలేనివి. ఆయన ఆశయాలు, ప్రజాసేవ పట్ల చూపిన నిబద్ధత ఎన్నో తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయి.
పెద్ది సుదర్శన్ రెడ్డి అన్న మరణం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు తీరని లోటు.. వ్యక్తిగతంగా, ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకుడిగా, ఉద్యమ సహచరుడిగా, ఆత్మీయ సోదరుడిగా పెద్ది అన్న లేని లోటు తీర్చలేనిది.
భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఈ తీరని లోటును భరించే మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ఓం శాంతి. 🙏🕯️
సీఎం పదవిలో ఉండి “రక్తం ఏరులై పారిద్దాం” వంటి హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యం. రాష్ట్ర ముఖ్యమంత్రి నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం తెలంగాణ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
కన్నెపల్లి పంప్ హౌస్‌ను ప్రారంభించి రైతులకు నీళ్లు అందించాలని కోరడం @KTRBRS గారు, @BRSHarish గారు చేసిన తప్పా? రైతుల ప్రయోజనాల కోసం మాట్లాడటం నేరమా?
హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో పోక్సో కేసు నిందితుడు ఆరుగురిని హత్య చేసిన ఘటనపై ప్రజలు ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్న వేళ… ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే @revanth_anumula మరోసారి తనకు అలవాటైన డైవర్షన్ రాజకీయాలకు తెరలేపారు.
సాక్షాత్తూ హోంమంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి శాంతి, భద్రతలను కాపాడాల్సింది పోయి హింసను ప్రోత్సహించేలా మాట్లాడటం అత్యంత సిగ్గుచేటు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకు విరుద్ధం.
ఆరు గ్యారెంటీలతో పాటు “ఎవరైనా ప్రశ్నించవచ్చు… ప్రజాస్వామ్యం ఉంటుంది” అని హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు రైతులకు నీళ్లు ఇవ్వాలని కోరిన రిటైర్డ్ ఇంజినీర్లను జైలుకు పంపాలని బెదిరించడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిజంగానే ఉందా అనే సందేహం కలుగుతోంది.
రేవంత్ రెడ్డి గారూ… అహంకారపూరిత వ్యాఖ్యలు, బెదిరింపులు మానండి. రైతులకు వెంటనే సాగునీరు అందించండి. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పండి. హింసాత్మక వ్యాఖ్యలతో ప్రజలను రెచ్చగొట్టడం మానేసి, చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను.
@BRSparty
మహిళా సాధికారతే లక్ష్యంగా పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరకాల నియోజకవర్గంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎమ్మెల్సి @PSReddyTRS గారు.
ఈ సందర్భంగా మహిళలతో మాట్లాడి వారికి అందుతున్న శిక్షణ, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.
హనుమకొండ జిల్లా, పరకాల నియోజకవర్గంలోని రామకృష్ణాపురం, ధర్మారం, వెల్లంపల్లి, అలియాబాద్, పులిగిల్ల, వరికోల్, పరకాల పట్టణం, మల్లక్కపేట, నాగారం, పైడిపల్లి, వెంకటాపూర్ మరియు హైబోతుపల్లి గ్రామాలలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారితో కలిసి సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలతో ముచ్చటించి, వారికి అందుతున్న శిక్షణ, సౌకర్యాలు, ఉపాధి అవకాశాలపై అడిగి తెలుసుకున్నాను. శిక్షణా కేంద్రంలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించాను.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘన్ పూర్ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మోసపూరిత కాంగ్రెస్ ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరడం జరిగింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నవంబర్ 2 న తేదీన యూసఫ్ గూడ డివిజన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి రోడ్ షో నేపథ్యంలో డివిజన్ బూత్ కమిటీ ఇంచార్జీలు, సభ్యులతో సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారు, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారు, బూత్ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#JubileeHillsWithBRS #VoteForCar
@BRSparty సోషల్ మీడియా కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర మాజీ రెడ్కో చైర్మన్ @ysathishreddy గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ @PSReddyTRS గారు.
ఈరోజు తన జన్మదిన సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి వర్యులు శ్రీ @KTRBRS గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్న ఎమ్మెల్సీ @PSReddyTRS గారు.
కేసీఆర్ గారి భాటలో పార్టీ కార్యకర్తలా..భవిష్యత్ తరాలకు భరోసానిచ్చే @KTRBRS సేనలో సైనికుడిగా.. నిరంతరం @BRSparty కి అవిశ్రాంత సేవలందిస్తున్న వరంగల్ జిల్లా ఉద్యమ యువ నాయకుడు, వరికోలు శ్రీమంతుడు ఎమ్మెల్సీ శ్రీ @PSReddyTRS సార్ కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..💐🎉🎂
తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి అధ్యక్షతన జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసుఫ్ గూడ డివిజన్ బూత్ కమిటీ సభ్యుల సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో ఉప ఎన్నికకు సంబంధించి జూబ్లీహిల్స్ లో గులాబీ జెండా ఎగురవేసే దిశగా సభ్యులకు కేటీఆర్ గారు దిశానిర్దేశం చేశారు.
ఏప్రిల్ 27 న వరంగల్ ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైన నేపథ్యంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
నిన్న జరిగిన కేసీఆర్ గారి సభను అడ్డుకోవడం కోసం కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిందో వివరించిన వరంగల్ బీఆర్ఎస్ నాయకులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.
@PSReddyTRS
A powerful tribute through song… celebrating #25Years of @BRSparty and the relentless journey of Sri #KCR garu. His unmatched leadership turned the dream of a separate #Telangana into a historic reality. Happy Silver Jubilee! I dedicate this song to our beloved leader, Sri @KCRBRSPresident garu.
#BRS #KCR @KTRBRS
#SilverJubileeTribute
" తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన వీరయోధుడు , స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు @BRSparty అధినేత @KCRBRSPresident శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#LongLiveKCR 💐💐
ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు !
పార్టీ హామీలపై నిలదీస్తే అరెస్టులు !
పాలనలో లోపాలను గుర్తు చేస్తే కేసులు !
గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలిస్తే కేసులు !
ప్రభుత్వం లాక్కుంటున్న భూములపై ఎదిరిస్తే కేసులు !
ప్రభుత్వం కూల్చుతున్న ఇండ్లకు అడ్డొస్తే కేసులు !
ప్రభుత్వంలోని వ్యవస్థలను వాడుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే కేసులు !
ప్రజలపై కేసులు
ప్రజాప్రతినిధులపై కేసులు
కేసులు .. కేసులు .. కేసులు
కాసులు మీకు - కేసులు మాకు
సూటుకేసులు మీకు .. అరెస్టులు మాకు
మాజీ మంత్రులు మా నాయకులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గార్లతోపాటు మా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,నాయకుల అరెస్ట్ లు అప్రజాస్వామికం..తక్షణం విడుదల చెయ్యాలి...
జాగో తెలంగాణ జాగో
ఆపదలో ఎవరున్నా..
నీడనిచ్చే తెలంగాణ భవన్ 🏛️🌟
వీధి దీపాలు ఆపేసి చీకట్లను సృష్టిద్దామనుకున్న వారి కుట్రలను చేదిస్తూ దేదీప్యమానంగా వెలుగుతున్న మన తెలంగాణ భవన్ 💫✊
@KTRBRS@BRSparty
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన దీక్షాదివస్ కార్యక్రమం.
బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దయెత్తున పాల్గొని ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
#DeekshaDiwas