తెలుగుకి కొంచెమైనా గౌరవం ఇవ్వండి. వాలా 2 అంటే ఏంటో నాకైతే అర్థం కాలేదు. నిన్న థియేటర్ వెళ్తే టికెట్ కౌంటర్ దగ్గర ఒకతను నేను 1 చూడలేదు, ఇది అర్థం కాదేమో అని బయటికి వెళ్లిపోవడం లైవ్ లో చూశా.
మన నిర్మాతలు చేస్తున్న అవమానం ఇప్పటికి కాదు.పళ్ళి చట్టంబి, కార్మేని సెల్వం, తంగలాన్, వలిమై, వెట్టయాన్, తలైవి, తుడరుమ్, రాయన్, ఎంపురాన్, కంగువ ఇలా ఒకటా రెండా తమిళ - మలయాళ పేర్లని యధాతథంగా పెట్టేసి దీన్నో అలవాటుగా చేసి పారేస్తున్నారు.
సింపుల్ గా ప్యాన్ ఇండియా కాబట్టి, ఒకటే టైటిల్ పెడుతున్నామని బుర్ర లేని కారణం చెప్పవద్దని మనవి. వాలా 2 లాంటివి ఈ క్యాటగిరీలోకి రావు.
తెలుగు ప్రేక్షకుల నుంచి వసూళ్లు తీసుకుంటూ,
తెలుగు జనాల అభిమానాన్ని కోరుకుంటూ,
తెలుగు రాష్ట్రాల థియేటర్లలో షోలు వేసుకుంటూ,
తెలుగు మీడియా మద్దతు వాడుకుంటూ,
తెలుగు పత్రికల్లో ప్రకటనలు ఇస్తూ,
తెలుగులో ఇంటర్వ్యూలు ఇస్తూ,
తెలుగు సినిమాలకు మాత్రం తెలుగు పేర్లు పెట్టకుండా ఉండే మీ విశాల హృదయాలకు శతకోటి నమస్కారాలు.....
@Flipkart@Flipkart The item should get delivered on 7th July, today is 14th July. Still the delivery has not processed from your end. And it's showing out for delivery on 12th July, since 3 days, he is in the way only