Festivals come and go. Good infrastructure must stay.
Sri Pawan Kalyan garu securing an additional ₹100 crore ahead of Godavari Pushkarams is not just about preparing for pilgrims, ₹90 crore will build 111 rural road works covering nearly 141 km, with another ₹10 crore for safe drinking water.
This is the quintessential JanaSena approach: use every opportunity to create permanent value for villages.
Politics should leave behind assets, not just posters.
#PawanKalyanAneNenu
Here we go..!
The OST of #OGUniverse: The Origin of Fire is now out on all major music platforms.
Listen now. Experience firestorm.
https://t.co/SE9eBujiyW
పిఠాపురం ఆడపడుచులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రావణ మాస కానుక
10 వేల మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమలు పంపిణీ
భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లు
భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న నియోజకవర్గ మహిళలు
From rugged terrain to a road that connects people and opportunities !!
Under #AdaviThalliBaata, the BT Road from Nurmatthi Road to Gadigunta in G. Madugula Mandal, Alluri Sitharama Raju District, has been completed over 1.6 km at an estimated cost of ₹1.20 crore under MGNREGS.
A vital step towards stronger rural connectivity, better access and improved opportunities for tribal communities.
Under the leadership of Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan Garu, development is reaching the last mile.
@mvrkteja !! @vbgramgap !! @mopr_goi
22-A భూముల సమస్య పరిష్కారం కోసం జనసేన భారీ నిరసన దీక్ష ప్రారంభం
ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ శ్రీ @JSPshankargoud గారి అధ్యక్షతన 22-A భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోరుతూ నిర్వహిస్తున్న భారీ నిరసన దీక్ష ప్రారంభమైంది.
ఈ నిరసన దీక్షలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#22A #ChaloDharnaChowkHyderabad #JanaSenaTelangana #JSPForTelangana
పిఠాపురం ఆడపడుచులకు శ్రీ @PawanKalyan గారు శ్రావణ మాస కానుక
•10 వేల మంది మహిళలకు చీరలు, పసుపు, కుంకుమలు పంపిణీ
•శ్రీ పురుహూతిక అమ్మవారి సన్నిధిలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
•అమ్మవారికి పట్టువస్త్రాల సమర్పణతో ప్రారంభమైన వరలక్ష్మీ వ్రత మహోత్సవం
•భక్తుల సౌకర్యార్థం పకడ్బందీ ఏర్పాట్లు
•భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న నియోజకవర్గ మహిళలు
పిఠాపురం ప్రజలతో, ముఖ్యంగా నియోజక వర్గంలోని ఆడపడుచులతో తనకున్న అనుబంధాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరోసారి చాటి చెప్పారు. శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నియోజకవర్గంలోని దాదాపు 10 వేల మంది ఆడపడుచులకు చీరలు, పసుపు, కుంకుమలను శ్రావణ మాస కానుకగా అందించారు. పిఠాపురంలోని ప్రముఖ శక్తి పీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆడపడుచుల కోసం సామూహిక వరలక్ష్మీ వ్రతాలను ఘనంగా నిర్వహించారు. వ్రతానికి అవసరమైన పూజా సామగ్రిని ఉచితంగా అందించడంతో పాటు, వేద పండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేలాది మంది మహిళలు భక్తిశ్రద్ధలతో ఈ సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పాల్గొని అమ్మవారిని పూజించారు.
*భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాచరణ*
శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీ పురూహూతిక అమ్మవారి దివ్యక్షేత్రంలో వరలక్ష్మీ వ్రతాలు వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచే పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకుని భక్తిశ్రద్ధలతో వ్రత పూజల్లో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వరలక్ష్మీ దేవిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. తొలుత పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి (బాబు), పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండెం దొరబాబు అమ్మవారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. అనంతరం గణపతి పూజ, కలశ పూజతో పాటు అమ్మవారికి అష్టోత్తర శతనామావళి, వరలక్ష్మీ స్తోత్రాలు, షోడశోపచార పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వరలక్ష్మీ వ్రత మహిమను వివరిస్తూ వ్రతకథను భక్తులకు వినిపించారు. నాలుగు విడతలుగా జరిగిన సామూహిక వరలక్ష్మీ వ్రత పూజల్లో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, ఆలయ మరియు మున్సిపల్ సిబ్బంది, జనసేన పార్టీ వాలంటీర్లు, సమన్వయంతో ఏర్పాట్లు చేశారు. అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందించేందుకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని కూడా అందుబాటులో ఉంచారు.
*ఐదు విడతలుగా వరలక్ష్మీ వ్రతమాచరించిన మహిళలు*
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించేందుకు వేలాది మంది మహిళా భక్తులు తరలిరావడంతో వేద పండితులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మహిళలతో ఐదు విడతలుగా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరింపజేశారు. తొలి విడతలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రెండో విడతను ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించారు. మూడో విడతలో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు, నాలుగో విడతలో ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, ఐదో విడత 10 గంటల నుంచి 11 వరకు వేద పండితులు మహిళలతో వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో నిర్వహింపజేశారు. ఏటా జరిగే విధంగానే సంప్రదాయాన్ని గౌరవిస్తూ సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఆచరించిన ఆడపడుచులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పసుపు, కుంకుమ, చీరలను కానుకగా పంపించారు.
ఈ కానుకలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారు, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు శ్రీ తుమ్మల రామస్వామి గారు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే శ్రీ పెండం దొరబాబు, ఫైవ్ మెన్ కమిటీ సభ్యుడు శ్రీ ఓదూరి కిశోర్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి చల్లా లక్ష్మి, జనసైనికులు, వీరమహిళలు పర్యవేక్షించారు.
హరే కృష్ణ! జై శ్రీ కృష్ణ!
లోకానికి భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు. ఆ పరమాత్ముని ఆశీస్సులు మనందరిపై ఉండాలని, శాంతి సౌభాగ్యాలతో ప్రతి కుటుంబం వెల్లివిరియాలని కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.
#HappyJanmashtami
శిరీష హత్య జరిగిన ఆసుపత్రిని సీజ్ చేయాలి
-గిరిజన బిడ్డను హతమారిస్తే ప్రభుత్వం నిద్రపోతోందా..?
-శిరీష సమాది వద్ద నివాళులు అర్పించిన జనసేన నాయకులు శ్రీ @IAmTanishAlladi#JanaSenaTelangana#JSPForTelangana
• @APDeputyCMO@PawanKalyan facilitates a new school building for tribal students in Pedapadu, Alluri district
• 18L sanctioned after observing the dilapidated condition of the old school
•Expressed their gratitude to #HBDJanaSenaniPawanKalyan on the occasion of his birthday
22-A భూముల సమస్యపై సెప్టెంబర్ 4న జనసేన భారీ నిరసన దీక్ష
“తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆస్తిహక్కులను కాపాడాలి.. 22-A భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి” అనే ప్రధాన డిమాండ్‌తో 22-A భూముల సమస్య పరిష్కారం కోసం సెప్టెంబర్ 4న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద జనసేన ఆధ్వర్యంలో భారీ నిరసన దీక్ష నిర్వహించనున్నారు.
తేది :- సెప్టెంబర్ 4, 2026
సమయం :- ఉదయం 10:00 గంటలకు
వేదిక:- ఇందిరా పార్క్ ధర్నా చౌక్, హైదరాబాద్
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు, 22-A భూముల బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొని, దీక్షను విజయవంతం చేయాలని కోరుతున్నాము.
#22A #ChaloDharnaChowkHyderabad #JanaSenaTelangana #JSPForTelangana