You did a great job @Guttajwala
This is my tribute to all the Mothers who breastfed their own babies and other who couldn’t get this precious gift
పాలిచ్చు తల్లులకు జేజేలు
*******
���ల్లి పాలు అవి పాపకు మేలు
తొలి ఆరు నెలలపాటు అవే చాలు
నూరేళ్ళు కాపాడే కవచాలు
తల్లిపాలు పెంచు బంధాలు
పసుపురంగు ముర్రుపాలు ��షధాలు
నిజమండి లేవసలు దోషాలు
తల్లిపాలు తీపి తాయిలాలు
బిడ్డనోటికవిఎంతో మధురాలు
నిండిఉండు పోషకాలు ఖనిజాలు
తల్లిపాలు చేయు వేల మేలు
చేయకండి అమ్మలార తప్పిదాలు
ఇవ్వకండి మీ పాపకు పోతపాలు
తల్లిపాలు మేలు అమృతాలు
దరిచేరవు పాపాయిని రోగాలు
నిలబెట్టు కోట్లాది ప్రాణాలు
తల్లి పాలు అవి ఉచితాలు
తీర్చు బిడ్డకున్న అన్ని అవసరాలు
భగవంతుడు జీవకోటి కిచ్చువరాలు
తల్లి పాలు చేయు ఎంతొ మేలు
పాలిచ్చు అమ్మలకు జేజేలు
డా॥ శ్రీకాంత్
◦
Happy Birthday to my dear son, K Siddhartha Swaero 🎉🎂
You are our pride and happiness. May your life be filled with success, good health, and endless joy. Keep dreaming big and achieving greater heights.
Wishing you a bright future and a wonderful year ahead, my dear son ❤️
*భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత మహానుభావుడు Dr BR Ambedkar గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. *ఇదే గొప్ప రోజున నా కుమార్తె గౌతమి స్వేరో (లిల్లీ) పుట్టినరోజు రావడం నాకు మరింత గర్వకారణం, ఆనందం.❤️*
*Happy Birthday Lilly*🎈💐🎂
*నా బంగారు కూతురికి జన్మద��న శుభాకాంక్షలు.*
All those in Telangana,
I found this free directory of contact numbers of all govt officials upto mandal level very useful. Above all it’s free and reasonably accurate.
#HeartHealth#fitness
రోజుకు 100000 సార్లు కొట్టుకుంటుంది గుండె నిన్ను కాపాడడానికి
కనీసం 30 నిమిషాలు కూడా నడవలేవా దాని బాగు కోసం
నడక ఎంతో మేలు
అరగంటే చాలు
🎵 🎼 🎶
https://t.co/fcQMPlj325
రేవంత్ రెడ్డి గారు,
మీరు గత @BRSparty@KCRBRSPresident గారి ప్రభుత్వంలో నేను గురుకుల అధికారిగా ఉన్నప్పటి కాలంలో అక్రమాలు జరిగాయన్న నెపంతో మీ ఆదేశాల మేరకు కొందరు అధికారులు ఇప్పుడు ఎన్ని ఆడిట్ పరిశోధనలు చేసి తవ్వకాలు జరిపినా మీకు కనిపించేవి ప���ద విద్యార్థుల విజయ గాథలు మాత్రమే. అంతకు మించి మీకేం దొరకదు. గాంధీ భవన్లో మీ లిల్లీపుట్ నాయకులు కొందరు మాట్లాడుతున్న చిల్లర మాటలు పేద వర్గాల పట్ల మీకున్న అక్కసును తెలియజేస్తున్నాయి.
తరతరాలుగా కొడవల్లు, చీపుర్లు తట్టలు పట్టిన చేతులు, కంప్యూటర్ చిప్ లతో ఆడుకోవడం, కోడింగ్ భాషను నేర్చుకోవడం అన్న గొప్ప కలను కని దాన్ని నిజం చేయాలంటే మొండి ధైర్యం కావాలి. ఈ వర్గాల పట్ల Empathy ఉండాలి. కేసీఆ���్ గారికి ఇవన్నీ మెండుగా ఉన్నాయి కాబట్టే నేను ఈ కలను కాంతి వేగంతో నిజం చేసే ప్రయత్నం చేశాను.
మీ సంకుచిత కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మిమ్మల్ని గైడ్ చేస్తున్న కొందరు మనువాద అధికారులకు ఈ కలలు అర్థం కావాలంటే కనీసం కోటి సంవత్సరాలు పడుతుంది.
అందుకే మీరు మా పిల్లలకు వ్యక్తిత్వ వికా��ం పేరుతో టాయిలెట్ల భాష నేర్పిస్తామంటున్నారు, మేము మరో ప్రపంచానికి అవసరమైన కంప్యూటర్ భాష నేర్పిస్తామంటున్నం.
మళ్లీ చెబుతున్నా, ఎన్ని కోట్లు ఖర్చయినా సరే రాబోయే రోజుల్లో మునుపటి కంటే బాగా ఈ భవిష్యత్ భాష లను నేర్పిస్తాం. 👊
మీరు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, మీ భాషలో- కోసుకొని తిన్నా, నేను నా పంథాను మార్చుకోను. మీరు పత్రికలకు ఇస్తున్న లీకులకు నిరాశపడను.
నేను చివరి వరకు అణచివేతకు గురైన వర్గాలను ఆకాశం అంచుల వైపు నడిపించే ప్రయత్నం చేస్తూనే ఉంటా.
Life is finite. Don’t waste it.
మీకొచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని ఎట్లా వాడుకోవాలన్న విషయాన్ని మీకే వదిలేస్తున్నా.
ధన్యవాదాలు.
@revanth_anumula @TelanganaCMO @BRSparty @KTRBRS
Happy Bhim Deeksha(March 15 to April 14 SWAEROES Holy Month) to every one
ఈ పవిత్ర మాసంలో మీరంతా మరింత జ్ఞానాన్ని సంపాదించి, మరింత ఫిట్నెస్ గా ఉండాలని కోరుకుంటున్నాను.అదేవిధంగా మా https://t.co/CSpEmxQ1FU పోర్టల్ని కూడా సందర్శించండి.
#Swaeroes4u#BhimDeeksha
అందరికీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు 💐💐💐
आप सभी को छत्रपति शिवाजी महाराज की जयंती पर हार्दिक शुभकामनाएँ 💐💐💐
Chatrapati Shivaji was one of the most secular kings of India.
KCR- Unauthorised Political Leader ఆ?
DEO గారు,
This is utter nonsense.
Please mind your language and withdraw your remarks immediately.
KCR is the first CM of Telangana, MLA and Leader of Opposition.
Is it a crime to celebrate his birthday with the students?
Where is it written that only ruling party leaders should celebrate their birthdays with the students?
Your current CM @revanth_anumula sided with the party which looted Telangana during the great Telangana liberation struggle. KCR had put his life at risk to liberate Telangana.
నిజానికి,
రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ గారి ఫోటో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉంచాలి.
ఆయన పుట్టినరోజును అధికారికంగా తెలంగాణ జరుపుకోవాలి.
ఏమాటకామాట..
కేసీఆర్ గారు మలి దశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించకపోతే తెలంగాణ కల నిజమయ్యేదా?
కేసీఆర్ గా��ు పది సంవత్సరాలు తెలంగాణను స్వంత బిడ్డలా పెంచకపోతే తెలంగాణ ఇలా ఉండేదా?
సైబర్ నేరగాళ్ల "డిజిటల్ అరెస్టు" బ్లాక్మెయిల్లకు భయపడకండి!
మీ రక్షణ కోసం, సరైన సమాచారం కొరకు https://t.co/NtXFpRXedZ సందర్శించండి.
https://t.co/JwoF37GPwk
#DigitalSecurity#YouRule#CyberScam
కుంభమేళా కి వెళ్లిన కోట్లాది మంది ప్రజలు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాం.
ఇక్కడ సూచించిన జాగ్రత్తలు పాటించి క్షేమంగా మీ ఇళ్లకు చేరుకోండి.
https://t.co/f8IEx0DsR2
#KumbhMela2025#Stampede#StaySafe#YourRule
Another success story, thanks to @KCRBRSPresident vision.
Yedla Mallesh- born into landless labourers’ family. Joined social welfare schools. From there to yachting in Hussain Sagar under the mentorship of @Suheim of YCH.
From there to Navy Sailing School and back to yachting again to win a gold medal and finally into the prestigious Indian Army.
What a journey!
Make Your Life Simple With #YouRule . For details please visit https://t.co/yF3pRus6Mo
Happy to witness the launching of a citizen services company by some of our alumni today with a focus on providing authentic and updated information on all services people need in everyday life in India.
Hope they transform into a great unicorn company in future. No dream is too big.
Proud of you guys for making our lives simple.❤️
ఇలా చేస్తే పోలీసుల ఆత్మహత్య లను ఆపవచ్చు.
తెలంగాణ లో గత ముప్పయి రోజుల్లోనే ఆరు మంది పోలీసులు తమ విలువైన ప్రాణాలను చేజేతులా నాశనం చేసుకున్నారు. నిన్న కూడా ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నార��. ఈ పరంపర ఇంతటితో ఆగాలి.
ప్రియమైన పోలీసు మిత్రులారా,
గత ముప్పై సంవత్సరాలుగా నేనూ ఆయుధాల మధ్యనే బతుకుతున్నా. సర్వీసులో ఎన్నో చెప్పుకోలేని అవమానాలు, నిరాశలు, సహచరుల అకాల మరణాల్లాంటి ఎన్నో బాధలు ఎదురైనవి. కొన్ని నెలల తరబడి పోస్టింగ్ ఇవ్వకుండా నన్ను ఇంట్లో కూర్చోబెట్టారు కూడా. అయినా కూడా నేను ఎన్నడూ తాగుడుకు బానిస కాలేదు, నాకు ఎన్నడూ చావాలనిపించలేదు. భవిష్యత్తులో కూడా నాకు ఈ ఆలోచన రాదు. ఆ రహస్యం ఏంటో మీకు చెప్పాలని ఉంది. దీని వల్ల మీరు సజీవంగా, మీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయనే చిన్న ఆశ నాకు ఉంది.
నేను ఐపీయస్ అధికారిని ఐనా, నాదీ మీ అందరి లాంటి నేపథ్యమే. మారుమూల ప���రాంతాల్లో చదవడం, మంచి అవకాశాల కోసం నగరాలకు రావడం, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏదో సాధించాలనే పట్టుదల తో రాత్రింబవళ్లు చదవడం, చివరికి విజయం సాధించడం..
తరువాత పోలీసు అకాడమీలో ట్రైనింగ్ ఒక గొప్ప అనుభూతి . అది జీవితానికి ఒక గొప్ప క్రమశిక్షణ ��ు అలవాటు చేసింది. మూడు దశాబ్దాలుగా నాకు వచ్చిన ఈ అరుదైన అవకాశాన్ని (పోలీసు ఉద్యోగం) నిరంతరం ప్రజలకు నాకు చేతనైనంత మేలు చేయడానికే వాడాను. మీరు కూడా అలాగే వాడాలి. ఈ విషయాన్ని చాలా రోజుల తరువాత విక్టర్ ఫ్రాంకెల్ రాసిన ‘అర్థం కోసం అన్వేషణ’ పుస్తకం లో చదివాను. మీరు కూడా చదవండి. మీకు చావాలనిపించదు.
నేను పోలీసు ఉన్నతాధికారి కావడం వల్ల నేను పుట్టి పెరిగిన ఊరు చివర్లో ఉన్న మా కాలనీ ప్రజల��ు, నా స్నేహితులకు, ఒక గుర్తింపు దొరికింది. నేను పోలీసు వాహనంలో మా ఊరికి పోయినప్పుడు మా బస్తీ ప్రజల ఆనందానికి అవధుల్లేవు. మీ అందరికీ ఇలాంటి అనుభవాలే ఎదురై ఉంటయి. మీరందరూ, మీ మీ సమూహాల్లో సెలబ్రిటీలు. మీ గురించి మీ తల్లిదండ్రులు మీకు తెలవకుండా చాలా గొప్పగా ఊర్లో చెప్పుకుంటరు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు మీ కుటుంబాలకు, మీ సమాజానికి సమూహానికి ఒక గొప్ప బలం. మనంతటికి మనం ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఆలోచించండి.
అసలు రోజూ చావులను ఎఫ్ ఐఆర్ లు, పంచనామాలు, పోస్టుమార్టంల రూపంలో చూసే మనకు చావాలన్న ఆలోచన రావడమే విడ్డూరంగా ఉంది! అయినా మనుషుల ప్రాణాలను కాపాడడానికి జీతం తీసుకునే మనం, మన ప్రాణాలు మనమే తీసుకొనుడేంది??
మీకు తెలుసా?
మన వల్ల మనకు తెలియకుండానే ఎన్నో జీవితాలు రోజూ సురక్షితంగా ఉంటాయో? గొప్ప విలువ ఉన్న ఇలాంటి జీవితాన్ని, ఒక పిరికి ఆలోచనతో క��షణికావేశంలో నాశనం చేసుకోకూడదు.
మనం చేసే చిన్న చిన్న తప్పుల గురించి రోజుల తరబడి ఆలోచించే సమయం ఎవరికీ లేదు. తప్పులను డిలీట్ చేసుకొని మనం ముందుకు సాగాల్సిందే. నిజం చెప్పాలంటే ఎవరి బతుకుల్లో వారు బిజీగా ఉన్నారు.
ఆరోగ్యం బాగాలేక పోతే డాక్టర్ దగ్గరికి పోవాలి, మరో మహిళ/పురుషుడు మన జీవితాల్లోకి అక్రమంగా ప్రవేశిస్తే అర్జెంటుగా మన జీవిత భాగస్వామితో ఆ విషయాన్ని నిర్మొహమాటంగా షేర�� చేసుకోవాలి, పరిష్కారం కనుగొనాలి. అంతే గాని అందరికీ తెలుస్తదని భయపడి ప్రాణాలు తీసుకుంటే మీ పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డు మీద పడరా?
నా అనుభవం తో, కొంతమంది నిపుణులు, పోలీసు ఆఫీసర్లతో మాట్లాడి కింది సలహాలను ఇస్తున్నాను. దయచేసి చదవండి-పాటించండి….
1. జీవిత భాగస్వామి ఎంపికలో జాగ్రత్త . డేటింగ్ చెడ్డదేం కాదు. గౌరవంగా ట్రై చేయండి. వరకట్నం ఆపండి. పెళ్లి వ్యాపారం కాదు. మీ కుటుంబం ఫోటోను మీరు పనిచేస్తున్న ప్రదేశంలో ఉంచుకోండి. మీ సెల్ ఫోన్ వాల్ పేపర్ గా మార్చుకోండి.
2. మీరు డ్యూటీ లు బాగా చేయండి, డ్యూటీ అయిపోయిన తరువాత మాత్రం కుటుంబం తో గడపండి, సెల్ ఫోన్ తో కాదు.
3. వీలయినప్పుడల్లా కనీసం రోజుకు గంట సేపు వ్యాయామం చేయండి. పోలీసు అకాడమీ రోజులను గుర్తు చేసుకోండి. బిజీ గా ఉన్నామని మాత్రం తప్పించుకోకండి.
4. బందోబస్తులో ఉన్నపుడు ఖాళీ సమయాన్ని ఫోన్లో బెట్టింగ్, ఈజీ లోన్, చాటింగ్ యాప్ లకు కేటాయించకుండా మంచి పుస్తకాలు చదవండి.
5. దయచేసి ఏదైనా ఒక గేమ్ ను (ఆన్లైన్ కాదు) అలవాటు చేసుకోండి. క్రీడాకారులు ఆత్మహత్యలు చేసుకోరు గమనించండి.
6. బెట్టింగ్, సట్టా, మట్కా, చీప్ లోన్, ఫేక్ క్రిప్టోకరెన్సీ ఇవన్నీ గంజాయి లాంటి వ్యసనాలు. వీటికి దూరంగా ఉండండి.
7. పోలీసులకు ప్రత్యేకంగా అపరిచిత వ్యక్తులతో చాటింగ్ బెడద ఉంటది. అలాగే మన దగ్గరికి నిస్సహాయ పరిస్థితి లో వచ్చిన వ్యక్తుల బాధను అర్థం చేసుకోవాలి, సహాయం చేయాలి కాని వాళ్లతో రిలేషన్స్ కంటిన్యూ చేయకూడదు
8. ఎవరైనా పై అధికారులు సైకోల్లాగా ప్రవర్తిస్తే, సెలవు పెట్టి వెళ్లండి లేదా వేరే ప్రాంతానికి బదిలీ చేయించుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఉన్నత���ధికారులకు ఫిర్యాదు చేయండి
9. మానసిక ఒత్తిడి ఉన్నపుడు కౌన్సిలర్ల వద్దకు వెళ్లి మీ సమస్యలు వారికి చెప్పుకోండి. ఉపశమనం కలుగుతుంది.
10. బాగా డబ్బు సంపాదించే ఆలోచన ఉండడం తప్పు కాదు. మీ కుటుంబ సభ్యులతో ఉద్యోగం లేదా వ్యాపారం చేయించండి. వాళ్లకు మీ రోజువారీ ఉద్యోగంతో, నేరస్తులతో సంబంధం లేకుండా చూసుకోండి.
11. దయచేసి లంచాలకు, మామూళ్లకు(మంత్లీస్), అక్రమ సంపాదనకు దూరంగా ఉండండి. ఆ ఏసీబీ విజిలెన్స్ కేసులనుండి బయటపడాలంటే తీసుకున్న ��ంచం కన్నా వంద రెట్లు ఖర్చవుతుంది. అదెలా జరుగుతుందో మీకందరికీ తెలుసు.
12. సంవత్సరానికి ఒకసారి విపాసన (మెడిటేషన్) లేదా విహారయాత్రలకు కుటుంబంతో వెళ్లండి. మీరు పది రోజులు డ్యూటీలో లేకపోతే కొంపలేం మునగవు.
13. పక్క పోలీసు/ఇతర డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులతో పోల్చుకోకండి. మనశ్శాంతి ఉండదు. కనిపించేదంతా బంగారం కాదు. ఎవరి బాధలు వాళ్లకుంటయి.
14. మీకిష్టమైన వ్యక్తుల పేరు మీద స్వచ్చంద సంస్థలు ఏర్��ాటు చేసి పేద ప్రజలకు సేవ చేయండి.
15. మీ కిష్టమైన మంచి పేరున్న పై అధికారులను(సర్వింగ్/రిటైర్డు) మార్గదర్శులు గా తీసుకోండి. వారిని తరచుగా కలవండి.
పోలీసు ఉన్నతాధికారులకు విన్నపం:
🙏
1. పోలీసు ట్రైనింగ్ లో ఏదో తీవ్రమైన లోపం ఉంది. అవుట్ డోర్ ను కొంత కఠినతరం చేయండి. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఉండేట్లు తయారు చేయండి. కొంతమందికి మందికి సెల్యూట్ కూడా సరిగా రావడం లేదు.
2. పోలీసు కుటుంబాలకు కు ఉచిత కౌన్సిలర్ సౌకర్యం కల్పించండి. సఖీ సెంటర్లు మన కుటుంబాలకు కూడా అవసరం.
3. తరచుగా పండుగల- బందోబస్తు ల తరువాత పోలీసు కుటుంబాలతో బఢాఖ��నా(గెట్ టుగెదర్)లు నిర్వహించండి. మీరు కుటుంబంతో అటెండ్ కాకుండా వాటిని నామ్ కే వాస్తే గా పెడ్తే కింది ఆఫీసర్లు కేవలం షామి��ానా బిల్లులు పట్టుకొస్తరు. వాటిని మరో పరేడ్ లాగా మారుస్తారు.
4. చిన్న చిన్న తప్పులకు ఛార్జ్ మెమోలు, సస్పెన్షన్ లతో ఇబ్బంది పెట్టకండి. దయచేసి కౌన్సిలింగ్ ఇవ్వండి.
5. బెట్టింగ్,లోన్లు, మద్యం, అక్రమ చాటింగ్ కు బానిసలైన ఉద్యోగుల కోసం జిల్లాలో/బెటాలియన్లలో ‘డీ అడిక్షన్ సెంటర్లను’ ఓపెన్ చేయండి.
6. బహుశా ఆదర్శంగా బతుకుతున్న కుటుంబాలకు గుడ్ సర్వీసు ఎంట్రీ, కమెండేషన్ లెటర్, బెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ ద వీక్, మెడల్స్ ఇవ్వవచ్చేమో ఆలోచించండి.
7. ప్రతి పోలీస్ స్టేషన్ లో క్రీడలకు వెసులుబాటు కల్పించండి. ఇది చాలా ముఖ్యం.
8. ఆరోగ్య భద్రత బిల్స్ రెగ్యులర్ గా వచ్చేట్లు చూడండి.
9. సరెండర్ లీవులు టీఏలు రెగ్యులర్ గా చెల్లించండి.
10. పోలీసు ఫైనాన్స్ కార్పోరేషన్ లేదా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చెస్తే ఈజీ లోన్ల బారిన పడరు. ఆలోచించండి.
@TelanganaDGP @TelanganaCOPs
India lost one of its greatest sons, Dr Manmohan Singh, the former prime minister today. But for his wisdom, courage, and dexterity, India would still have been stuck in poverty and license raj. He not only pulled the country back from the brink of an economic collapse, but also laid solid foundations for India’s raise as global power.
Sir,
You created history. None can judge you. Rest in eternal peace.
🙏🙏🙏
Ideas have no borders. Truly thrilled to see #Swaero gaining traction in the Great Plains and on the banks of mighty Ganga river in #UttarPradesh. Thousands of people braved biting cold and stayed awake till 3AM in Tegri Mela in Gajraula of Amroha district to understand how they can change their destiny with this radically new approach.
#PayBack
#SocialJustice
@Swaeroes4u