కడపలో నిర్వహించిన భారీ బహిరంగసభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసిన ప్రజానీకానికి పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. @RahulGandhi
కడప జిల్లా ప్రజలు, నా అక్కాచెల్లెమ్మలు, నా అన్నదమ్ముళ్లు, నా అవ్వాతాతలకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.
కడప ఎంపీగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోటీచేస్తుంది. మీ అందరి ఆశీర్వాదం, మీ ప్రేమ, మీ ఓటును రాజశేఖర్ బిడ్డ మీద ఉంచాలని శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మే 13వ తేదీన జరిగే పోలింగ్‌లో ఎంపీ బ్యాలెట్ నమూనాలోని వరుస సంఖ్య '4' మీద 'హస్తం' గుర్తు బటన్ నొక్కి రాజశేఖర్ బిడ్డను ఆశీర్వదిస్తారించాలని అభ్యర్థిస్తున్నాను.
అమ్మ ప్రార్థన, నాన్న ఆశీస్సులు, కడప ప్రజలు నన్ను గెలిపిస్తారనే ధృడమైన విశ్వాసంతో ఉన్నాను.
కడప ప్రజలకు అమ్మ విన్నపం :
వైఎస్సార్‌ను అభిమానించే వారికి, ప్రేమించే వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదరించినట్లే ఇప్పుడు షర్మిలమ్మను కూడా ఆదరించాలని కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్ ముద్దుల బిడ్డ షర్మిలమ్మ కడప ఎంపీగా పోటీ చేస్తుంది. షర్మిలమ్మను కడప ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కి పంపించాలని కోరుతున్నాను.
మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మీకు ఎందుకు రాలేదు జగనన్న?? ఏదైనా ఒక లావాదేవీ కోసం, లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు ఆయన. అలాంటి వ్యక్తి బిడ్డని నేను. ఆయన హృదయానికి దగ్గరగా, ఆయన మాటలు వింటూ హృదయంలో హృదయంలా పెరిగాను. ఆయన ఆశయాల కోసం ఆ రకంగానే మీకు సహాయపడాలని నేను నిస్వార్థంగా త్యాగం చేశాను. మీ గెలుపు కోసం పని చేశాను.
ఇది ప్రజలకోసం ప్రజలతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ కూటమికి, ప్రజలను కాల్చుకుతినే వారిని విభజించి పాలించే బీజేపీ + టీడీపీ + వైసీపీ కూటమికి జరుగుతున్న పోరాటం. ఇందులో బీజేపీ (BJP) అంటే బాబు జగన్ పవన్. హామీలను తుంగలో తొక్కి, అన్ని రంగాల్లో అన్ని వర్గాలను దెబ్బతీసిన బీజేపీ ఒకవైపు, సమానత్వం, లౌకికత్వం, ప్రేమ, సోదరభావాలను మనస్సులో నింపి, అభివృద్ధితో పాటు సంక్షేమం అందించే కాంగ్రెస్ ఇంకొక వైపు. నిర్ణయం మీదే.
నా గెలుపు కోసం.. నన్ను గెలిపించాలని వచ్చిన వివేకం చిన్నాన్న సతీమణి చిన్నమ్మ సౌభాగ్యమ్మ గారికి నా ధన్యవాదాలు. వివేకం చిన్నాన్న నన్ను ఎంపీగా చేయాలని అనుకున్నారు. కానీ అది అప్పట్లో జరగలేదు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది. దానిని మనమందరం సద్వినియోగం చేసుకుని చిన్నాన్న చివరి కోరిక తీర్చాలి. నన్ను ఎంపీగా గెలిపించి రాజన్న రాజ్యం మళ్లీ తీసుకువద్దామని కడప ప్రజలకు పిలుపునిచ్చిన చిన్నమ్మకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.