ఏడాదిలో 4.8 గిగావాట్లు.. గత ఐదేళ్లలో కేవలం 6 మెగావాట్లు ⚡
CII సమ్మిట్‌లో లోకేష్ చెప్పిన పాయింట్స్:
• 2019–24 మధ్య ఏపీలో పాలసీ స్థిరత్వం లేక పరిశ్రమలు ఇబ్బంది పడ్డాయి
• 2024 తర్వాత పాలసీ స్థిరత్వం తెచ్చాం. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి క్లీన్ స్లేట్తో మొదలుపెట్టాం
• ఫలితం: గత ఏడాదిలోనే 4.8 GW రెన్యూవబుల్ ఎనర్జీ. 2019–24 ఐదేళ్లలో కేవలం 6 MW
• సోలార్, పంప్డ్ స్టోరేజ్ లాంటి దీర్ఘకాల పెట్టుబడులకు పాలసీ స్థిరత్వమే కీలకం
మీ అభిప్రాయం కామెంట్ చేయండి 👇
@naralokesh #CIIPartnershipSummit2026 #GreenEnergy #TreeMedia
సిరిసిటీలో మాండలీజ్ ₹1,800 కోట్ల విస్తరణ 🍫
రాష్ట్రంలో కోకో సాగు పెంచేందుకు "ఏపీ కోకో మిషన్", తిరుపతిలో కోకో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతిపాదన. రైతులకు, స్థానిక సప్లై చైన్‌కు కొత్త అవకాశాలు.
అరకు కాఫీని గ్లోబల్ మార్కెట్లకు తీసుకెళ్లడంపైనా చర్చ – సీఎం చంద్రబాబు
కోకో రైతులకు ఇది ఎంత మేలు చేస్తుంది? కామెంట్ చేయండి 👇
@ncbn #CIIPartnershipSummit2026 #ArakuCoffee #TreeMedia
డేటా సెంటర్లు నీళ్లు తాగేస్తాయా? లోకేష్ నంబర్లతో ఆన్సర్ 💡
• గోదావరి నుంచి ఏటా 3,000 TMC నీరు సముద్రంలోకి.. అది బ్రెజిల్ ఏడాది వినియోగంతో సమానం. పోలవరంతో ఆ నీటిని వ్యవసాయం, పరిశ్రమలకు
• విశాఖ గూగుల్ ప్రాజెక్ట్ ఎయిర్-కూల్డ్, రెన్యూవబుల్ ఎనర్జీతో
• అదే గిగావాట్ థర్మల్ ప్లాంట్ డేటా సెంటర్ కంటే 10 రెట్లు ఎక్కువ నీరు వాడుతుంది
• భారత్ డేటా మన గడ్డపైనే ఉండాలి
CII సమ్మిట్‌లో @naralokesh
మీ అభిప్రాయం కామెంట్ చేయండి 👇
#CIIPartnershipSummit2026 #NaraLokesh #TreeMedia
హైదరాబాద్ సీపీగా ఇక సెలవు
గడచిన ఏడాది కాలం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అపురూపమైన ప్రయాణం. చారిత్రక హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సేవ చేసే అవకాశాన్ని కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
అలాగే, హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న శ్రీ మహేష్ భగవత్, ఐపీఎస్ గారికి నా తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు.
ఈ ఏడాది కాలంలో నగర ప్రజలు నాపై, మా పోలీస్ వ్యవస్థపై చూపిన ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. మేము చేపట్టిన ప్రతి సంస్కరణనూ తమ సొంత కార్యక్రమంగా భావించి ఎంతగానో ఆదరించిన ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను.
మత సామరస్యానికి ప్రతీక మన హైదరాబాద్. ప్రజలంతా కలిసిమెలిసి, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి పండుగనూ ఘనంగా జరుపుకున్న తీరు నా మనసును ఎంతగానో కదిలించింది.
ప్రజల క్షేమమే పరమావధిగా మేము అనేక అడుగులు వేశాం. ముఖ్యంగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఆహార కల్తీపై ‘హెచ్-ఫాస్ట్’ ద్వారా ఉక్కుపాదం మోపాం. భారీ ఎత్తున కల్తీ ఆహారాన్ని సీజ్ చేసి, నిందితులను కటకటాల వెనక్కి నెట్టే ప్రయత్నంలో మాకు అండగా నిలిచిన ఫుడ్ సేఫ్టీ అధికారులకు కృతజ్ఞతలు.
మరోవైపు, సైబర్ నేరాల కట్టడి కేవలం పోలీసుల వల్లే కాదని గుర్తించి.. ప్రజల్లో చైతన్యం తెస్తూనే బ్యాంకులు, DoT వంటి విభాగాలను సమన్వయం చేస్తూ దేశవ్యాప్తంగా ‘ఆపరేషన్ ఆక్టోపస్’కు శ్రీకారం చుట్టాం. దీనిపై కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోం సెక్రటరీ గారు ప్రత్యేకంగా స్పందించి.. మన హైదరాబాద్ సిటీ పోలీస్ ఇచ్చిన సలహాలను స్వీకరించి ప్రశంసించడం మనందరికీ దక్కిన గౌరవం.
అలాగే బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా కేసుల దర్యాప్తు కోసం ‘ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్’ను ప్రారంభించి విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాం.
భావితరాల బిడ్డల్లో పోలీసుల పట్ల భయం పోయి, సమాజం పట్ల ఒక ఉన్నతమైన స్ఫూర్తి కలగాలని ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో చేపట్టిన ‘డే విత్ సీపీ’ కార్యక్రమం నాకు ఎంతో ఆత్మసంతృప్తిని మిగిల్చింది.
ఇక నగరవాసులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే జీహెచ్ఎంసీ కమిషనర్, ఇతర అధికారుల సహకారంతో విజయవంతంగా అమలు చేసి ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం కలిగించాం.
మన ఇంట్లోని ఆడబిడ్డల రక్షణను బాధ్యతగా భావించి మహిళల భద్రత కోసం ‘స్పందన’ వాహనాలను అందుబాటులోకి తెచ్చాం.
ఈ విజయాలన్నింటి వెనుక పోలీస్ కుటుంబం పడిన కష్టం దాగుంది. ఉత్తమ పనితీరు కనబరిచిన సిబ్బందిని గుర్తించే ‘ఎక్స్ట్రా మైల్’, వారి ఆరోగ్య రక్షణ కోసం ‘గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’ వంటి కార్యక్రమాలు వారి త్యాగాలకు మేమిచ్చిన చిరు కానుకలు.
శాంతిభద్రతలు, ట్రాఫిక్, CAR, టాస్క్‌ఫోర్స్, CCRB, SB, సీపీ ఆఫీస్, అడ్మిన్ విభాగాలు సహా.. పండుగైనా, పబ్బమైనా తమ సొంత కుటుంబాలను పక్కనపెట్టి రోడ్లపై నిలబడి అహర్నిశలు శ్రమించిన హోంగార్డుల నుంచి అడిషనల్ సీపీల వరకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.
మాకు నిరంతరం మార్గదర్శనం చేసిన డీజీపీ గారికి, ఇతర ఉన్నతాధికారులకు, ప్రతి క్షణం వెన్నంటి నిలిచిన ప్రింట్-ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
రాత్రింబవళ్లు చెమటోడ్చే నా పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాలు ఎల్లప్పుడూ క్షేమంగా, ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
హైదరాబాద్ ప్రజలందరూ సదా సురక్షితంగా, సంతోషంగా, భద్రంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. గుండెనిండా మధుర జ్ఞాపకాలతో.. హైదరాబాద్ సీపీగా ఇక సెలవు తీసుకుంటున్నాను.
జై హింద్!
#ThankYouHyderabad
2035 నాటికి దేశంలోనే హ్యాపీయెస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ 😊
CII సమ్మిట్‌లో ఉపాసన కొణిదెలతో మంత్రి లోకేష్ ముఖాముఖి. ఆరోగ్యం, ఆనందం, మహిళా సాధికారత, కుటుంబ విలువలపై చర్చ.
"ఉద్యోగాలు మాత్రమే చాలవు. యువత ఆరోగ్యంగా, సంతోషంగా, నైపుణ్యంతో, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మొదటి అడుగు మీరే వేయండి" – మంత్రి నారా లోకేష్
మీ అభిప్రాయం కామెంట్ చేయండి 👇
@naralokesh@upasanakonidela #CIIPartnershipSummit2026 #NaraLokesh #TreeMedia
⚓ ఏపీ సముద్ర రవాణా సామర్థ్యం 3 ఏళ్లలో రెట్టింపు – మంత్రి లోకేష్
1,000 కి.మీ.కు పైగా తీరం, ఇప్పటికే ఏటా దాదాపు 10 కోట్ల టన్నుల కార్గో. శ్రీసిటీలో LG ఎలక్ట్రానిక్స్ ₹5,000 కోట్ల ఫ్యాక్టరీ, విశాఖ AI హబ్‌లో గూగుల్ $15 బిలియన్ డేటా సెంటర్ – CII సదస్సులో లోకేష్.
@naralokesh
తీర ప్రాంత యువతకు ఇది ఎంత ఉపయోగం? కామెంట్ చేయండి 👇
#NaraLokesh #InvestInAP #TreeMedia
🤝 CII భాగస్వామ్య సదస్సు నేడు రెండో రోజు – విశాఖ
ముగింపు సభకు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరు కానున్నారు. తొలి రోజు సదస్సులో 303 MoUలు (~₹9.89 లక్షల కోట్లు); జూన్ 2024 నుంచి కలిపి మొత్తం ₹32.49 లక్షల కోట్లు – సీఎం చంద్రబాబు.
@ncbn@naralokesh
ఈ రోజు ఏ పెద్ద ప్రకటన రావాలని కోరుకుంటున్నారు? 👇
#CIIPartnershipSummit #Visakhapatnam #TreeMedia
🚀 వెనుకబడిన రంగాల్లో ముందుకు – సీఎం చంద్రబాబు ఫోకస్
క్రిటికల్ మినరల్స్, స్టీల్, సోలార్, రక్షణ, స్పేస్ స్టేషన్ విజన్, సెమీకండక్టర్లు, లాజిస్టిక్స్, క్వాంటం, గ్రీన్ హైడ్రోజన్, మారిటైమ్ మిషన్లను ఏపీ ప్రాధాన్య రంగాలుగా గుర్తించాం. వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి సాధిస్తాం – CII సదస్సులో సీఎం.
@ncbn
ఇందులో మీ జిల్లాకు ఏ రంగం కావాలి? 👇
#ChandrababuNaidu #InvestInAP #TreeMedia
☀️ శుభోదయం
"నిద్రలో వచ్చేది కల కాదు, నిద్రపోనివ్వనిదే అసలైన కల" – ఏపీజే అబ్దుల్ కలాం
అర్థం: మన లక్ష్యమే మనల్ని రోజూ ముందుకు నడిపించాలి.
మీ రోజు ఎలా మొదలైంది? 👇
#GoodMorning#TeluguQuotes#TreeMedia
🌙 నేటి ముఖ్యాంశాలు | నవంబర్ 12
🔹 విశాఖ CII సదస్సు: రెండున్నరేళ్లలో ₹32.49 లక్షల కోట్ల పెట్టుబడులు – సీఎం చంద్రబాబు
🔹 SLN కాఫీ ఏపీలో ₹3,500 కోట్ల ప్లాంట్, 3,400 ఉద్యోగాలు – మంత్రి లోకేష్
🔹 23 పురపాలికలకు ఎన్నికల నోటిఫికేషన్, నవంబర్ 26న పోలింగ్
🔹 రాప్తాడు బాలిక కోలుకుంటోంది 🙏
🎬 చిరంజీవి 'కాకా' షూటింగ్ నుంచి వస్తుండగా ప్రమాదం, శేఖర్ మాస్టర్ క్షేమం
🎬 ప్రియదర్శి 'ఇడుపు కాయితం' టీజర్ విడుదల, డిసెంబర్ 11న రిలీజ్
#TeluguNews #AndhraPradesh #TreeMedia
🌍 66 దేశాలు, 82 మంది దౌత్యవేత్తలు, 14 మంది విదేశీ మంత్రులు – విశాఖ CII సదస్సు
"సీఎంగా దాదాపు 8 CII భాగస్వామ్య సదస్సులు నిర్వహించాం, ఇది 31వ సదస్సు" – సీఎం చంద్రబాబు. 450 మంది విదేశీ, దాదాపు 1,400 మంది జాతీయ ప్రతినిధులు విశాఖకు వచ్చారు.
@ncbn
విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా? కామెంట్ చేయండి 👇
#CIIPartnershipSummit #Visakhapatnam #TreeMedia
⚡ క్లీన్ ఎనర్జీలో ఏపీని ‘సౌదీ అరేబియా’గా మార్చాలి – మంత్రి లోకేష్
గత ఏడాదిలోనే రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 30% పెరిగింది, 2028 నాటికి డిమాండ్ రెట్టింపు కావచ్చు. సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్‌తో గ్రీన్ ఫ్యూయల్స్ తయారు చేసి ఎగుమతి చేయాలి – CII సదస్సులో లోకేష్.
@naralokesh
మీ ఊరిలో సోలార్ వచ్చిందా? కామెంట్ చేయండి 👇
#CleanEnergy #AndhraPradesh #TreeMedia
🙏 శేఖర్ మాస్టర్ క్షేమం
మెగాస్టార్ చిరంజీవి 'కాకా' సినిమా షూటింగ్ ముగించుకుని వస్తుండగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారును ట్రక్ ఢీకొట్టింది. కారు వెనుక భాగం దెబ్బతింది, లోపల ఉన్నవారు సురక్షితం. ఈ రాత్రే మళ్లీ షూటింగ్‌కు వెళ్తున్నామని ఆయన తెలిపారు.
@Sekharmasteroff@KChiruTweets
#SekharMaster #Chiranjeevi #TreeMedia
🤖 ఏపీలో 2 GW ‘AI ఫ్యాక్టరీ’ – ₹8,000 కోట్లు, 2,000 ఉద్యోగాలు
క్లీన్‌మ్యాక్స్, బ్లాక్‌స్టోన్ మద్దతున్న Neysa కలిసి నెట్-జీరో AI ఫ్యాక్టరీ నిర్మిస్తాయి. CII సదస్సులో APEDBతో MoU, మార్చి 2028 నాటికి ప్రారంభం లక్ష్యం. అనుమతుల నుంచి ప్రారంభం వరకు అండగా ఉంటామన్న మంత్రి లోకేష్.
@naralokesh
AP యువతకు AI ఉద్యోగాలు – మీ అభిప్రాయం కామెంట్ చేయండి 👇
#CIIPartnershipSummit2026 #InvestInAP #TreeMedia