Tollywood Blockbuster Files - #Varsham
" కుర్రాడు కింగ్ లా ఉన్నాడు...మంచి స్టోరీ సెట్ అయితే ఇండస్ట్రీని ఏలేస్తాడు " ప్రభాస్ ఫస్ట్ మూవీ చూసాక ఇండస్ట్రీ ఒపీనియన్ ఇది. కానీ అందుకు తగ్గ కథ దొరకడంలేదు. చాలామంది డైరెక్టర్స్ వస్తున్నారు పోతున్నారు కానీ సూర్యనారాయణ రాజు గారిని ఒప్పించలేకున్నారు. ఆయనకి ఎంఎస్ రాజు మీద నమ్మకం. అందుకే " మా వాడిని మీకప్పగిస్తున్నా " అనే బాధ్యతని ఎంఎస్ రాజు పెట్టేసారు. ఒక్కడు లాంటి హిట్ కొట్టాక ఆయనకి హీరోల నుండి వెల్లువలా ఆఫర్స్. కానీ ప్రభాస్ బాధ్యతని భుజాన వేసుకున్న ఆయన పరుచూరి బ్రదర్స్ కి స్టోరీ బాధ్యత అప్పగించారు. ఏం కథ రాయాలా అని వారు ఆలోచిస్తున్న టైం లో వారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసే @VeeruPotla1 అదిరిపోయే సీన్ ఒకటి చెప్పాడు. దాంతో స్టోరీ అల్లడం మొదలయింది. రామాయణం స్ఫూర్తి తో రాముడు సీత రావణుడు పాత్రలని బేస్ చేసుకుని ప్రధాన పాత్రలను సృష్టించారు. బ్యాక్డ్రాప్ వర్షం, వేయిస్తంభాల గుడి. ఇప్పటిదాకా ఎవ్వరూ ట్రై చేయలేదు. కృష్ణంరాజు, సూర్యనారాయణ రాజు, ప్రభాస్..అందరికీ స్టోరీ బాగా నచ్చింది. డైరెక్షన్ ఎవరికి ఇవ్వాలి అనుకున్న టైములో బాబీ డైరెక్టర్ శోభన్ ఈ మూవీ గురించి తెలుసుకుని దానికి వర్క్ చేయడానికి ఎంఎస్ రాజు ఆఫీస్ కి వెళ్ళాడు. ఆయనతో మాట్లాడాక శోభనే డైరెక్టర్ అని అనౌన్స్ చేసారు రాజు గారు. అంతా షాక్. ఒక ప్లాప్ డైరెక్టర్ తో ఒక్కడు లాంటి హిట్ కొట్టిన నిర్మాతా? అని. ఇక కాస్టింగ్ స్టార్ట్ అయింది. చెన్నై లో సామి పోస్టర్ , అందులో త్రిషని చూసి ఆమెనే ఫిక్స్ అయ్యారు రాజు గారు. జయం లో విలనిజం చూసి విలన్ గా గోపీచంద్ సెలెక్టెడ్ . 1999 లో ఇదే బ్యానర్ దేవి సినిమా ద్వారా పరిచయం అయిన దేవిశ్రీ ప్రసాద్ కి ఇక్కడ రెండో అవకాశం . 120 ట్యూన్స్ ఇచ్చాడు ఏది బెస్టో తీసుకోమని. టైటిల్ వర్షం. కానీ నేనున్నాను మూవీకి ఆల్రెడీ ఆ టైటిల్ రిజిస్టర్ అయింది. వీఎన్ ఆదిత్య ని అడిగితే టైటిల్ ఇచ్చేసాడు. షూటింగ్ స్టార్ట్ అయింది. అరకు, వైజాగ్, హైదరాబాద్ , తిరుపతి, వరంగల్ లలో 140 వర్కింగ్ డేస్ లో షూటింగ్ పూర్తి . వద్దని ఎంత వారించినా క్వారీ పేలుళ్ల సీన్స్ డూప్ లేకుండా చేసాడు ప్రభాస్. బడ్జెట్ 5 కోట్లు . 2004 సంక్రాంతికి వర్షం రిలీజ్. పక్కనే #Chiranjeevi #Balakrishna #NTR లాంటి మహా మాస్ హీరోలతో పోటీ. కానీ ఫైనల్ విన్నర్ వర్షం . #Prabhas మ్యాన్లీ లుక్స్, వీరత్వం, #Trisha క్యూట్ యాక్టింగ్, గోపీచంద్ విలనిజం, దేవి పాటలు, #Veerupotla రైటింగ్, శోభన్ టేకింగ్, రాజుగారి మేకింగ్ ...అన్నీ హైలైట్సే . 120 ప్రింట్స్ తో రిలీజ్ అయి, 300 ప్రింటులకు చేరుకున్న బ్లాక్ బస్టర్ . ప్రభాస్ కి స్టార్ హోదా, ఫ్యాన్ ఫాలోయింగ్ . టోటల్ గా 18 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసింది. ఆ ఇయర్ టాప్ త్రీ మూవీ.