వాడుక తెలుగుకు కొత్త వెలుగునిచ్చిన విశిష్ట భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారు. ప్రజలు మాట్లాడే భాషకు విద్యా, సాహిత్య రంగాల్లో సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేసిన ఆ మహనీయుని భాషా సేవలు తరతరాలకు స్ఫూర్తి. గిడుగు గారి జయంతిని పురస్కరించుకుని నేడు నిర్వహించుకుంటున్న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.